Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    63—దావీదు, గొల్యాతు

    దేవుడు తనను విసర్జించాడని గుర్తించినప్పుడు తననుద్దేశించి ప్రవక్త పలికిన నిందా వాక్యాల శక్తిని గ్రహించినప్పుడు రాజైన సౌలు హృదయంలో తిరుగుబాటు నిస్పృహ చోటుచేసుకున్నాయి. రాజు తలవంచింది. యధార్ధ పశ్చాత్తాపంతో కాదు. తన పాపంనైచ్యాన్ని గూర్చి అతడికి స్పష్టమైన అభిప్రాయం లేదు. తన జీవితాన్ని సరిచేసుకోవాలన్న స్పృహ అతడికి కలుగలేదు. తనను ఇశ్రాయేలీయుల సింహాసనం నుంచి తొలగించటంలోను, రాజ్యాధికారం వారసత్వంగా పొందే హక్కు తన సంతతి ఇక లేకుండా చెయ్యటంలోను దేవుడు తనకు అన్యాయం చేశాడని అస్తమాను బాధపడ్డాడు. తన వంశానికి సంభవించినున్న నాశనం ఎప్పుడు జరుగుతుందోనని నిత్యం ఆందోళన చెందుతూ ఉండేవాడు. శత్రవుల్ని ఎదుర్కొటంలో తాను ప్రదర్శించిన శౌర్యం తన అవిధేయతా పాపాన్ని రద్దు చెయ్యాలిన అతడి మనోభావం. దేవుని గద్దింపును అతడు వినయహృదయంతో స్వీకరించలేదు. అతడిలో అహంభావం పెచ్చరిల్లింది. చివరికి అతడు యుక్తాయుక్త జ్ఞానాన్ని కోల్పోయేంతవరకు వెళ్ళాడు. చక్కని సంగీత వాద్యం పై సున్నితమైన స్వరాలు పలికించే ప్రతిభ గల సంగీత కళాకారుడి సేవలు ఉపయోగించుకుంటే తన మనసుకు శాంతి లభిస్తుందని రాజుకు సలహాదారులు సూచించారు. దేవుని సంకల్పం చొప్పున సితార కళాకారుడు గాదావీదును రాజు ముందు సమావేశపర్చారు. దావీదు సమకూర్చిన సంగీతం ఆశించిన ఫలితాల్నిచ్చింది. సౌలు మనసు పై నల్లటి మేఘంలా నిలిచిన దురాత్మ వెళ్లిపోయింది.PPTel 648.1

    సౌలు ఆ స్థానంలో తన సేవలు అవసరం లేకపోయినప్పుడు దావీదు కొండల్లోని తన మందల వద్దకు తిరిగి వచ్చి తన సామాన్య జీవితాన్ని కొనసాగించేవాడు. అవసరమైనప్పుడల్లా దావీదు రాజు వద్దకు తిరిగి వచ్చి దురాత్మ అతణ్ణి విడిచి వెళ్ళిపోయే వరకు అతడి మనసును శాంతింపజేసేవాడు, దావీదు విషయంలోను అతడి సంగీతం విషయంలోను రాజు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికి ఆ యువ కాపరి అమితానందంతో కొండల్లోని తన మంద వద్దకు తిరిగి వెళ్ళేవాడు.PPTel 648.2

    దావీదు దేవుని దయయందు మనుషుల దయయందు పెంపారుతున్నాడు. దేవుని మార్గం గురించి నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మరింత కృతనిశ్చయుడయ్యాడు. అతడు ఆలోచించటానికి కొత్త ఇతివృత్తాలు లభించాయి. అతడు రాజు ఆస్థానంలో ఉన్నాడు. రాజు బాధ్యతల్ని చూసాడు. సౌలు ఆత్మను వ్యాకులపర్చే శోధనల్ని పసికట్టాడు. ఇశ్రాయేలీయుల మొదటి రాజు ప్రవర్తనలో వ్యవహరణలోను ఉన్న మర్మాలు కొన్నిటిని గ్రహించాడు. రాచరిక వైభవం పై కమ్ముతున్న దు:ఖ మేఘాల నీడల్ని చూసాడు. తమ వ్యక్తిగత జీవితాల్లో సౌలు ఇంటివారు సంతోషంలేని వారిలాగా నివసిస్తున్నట్లు గమనించాడు. ఇవన్నీ ఇశ్రాయేలీయుల రాజుగా అభిషేకం పొందని అతడి హృదయాన్ని ఆందోళనతో నింపాయి. కాని తీవ్ర ఆలోచనలో పడి ఆందోళన చెందుతుండగా సితార చేత బట్టి సర్వశ్రేయోనాకి కర్త అయిన ప్రభువు ధ్యానాన్ని నిలిపే సంగీత స్వరాలు పలికించేవాడు. అంతట భవిష్యత్ ఆకాశాన్ని కమ్మిన నల్లని మేఘాలు పటాపంచలయ్యేవి.PPTel 649.1

    నమ్మటం పై దావీదుకి పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడు. తన కర్తవ్య నిర్వహణ నిమిత్తం మోషేని తర్పీదు చేసిన రీతిగా తాను ఎన్నుకున్న తన ప్రజల్ని నడిపించటానికి దేవుడు యెష్సయి కుమారుణ్ణి తర్పీదు చేస్తున్నాడు. గొర్రెల మందల్ని కాచి సంరక్షించటంలో అతడు ఆ పరలోక కాపరి తన మంద గొర్రెల పట్ల తీసుకునే శ్రద్ధను అభినందించటం నేర్చుకుంటున్నాడు.PPTel 649.2

    దావీదు తన మందల్ని ఎక్కడ మో పేవాడో ఆ ఏకాంత పర్వతాలు లోతైన లోయలు క్రూర మృగాలు మసలే స్థలాలు. యెరాను పక్కడొంకల్లోనుంచి సింహమో ఎలుగుబంటో కొండల్లోని దాని గుహలో నుంచి తీవ్రమైన ఆకలితో బయటికి వచ్చి మందలోపడటం తరుచుగా, జరిగేది. ఆనాటి ఆచారం ప్రకారం దావీదుకున్న ఆయుధాలు వడిసెల, గొల్లవాడి కొంకి కర్రమాత్రమే. అయినా తన మందను పరిరక్షించటంలో తన బలాన్ని ధైర్యాన్ని పిన్న వయసులోనే నిరూపించుకున్నాడు. అనంతరం ఈ సంఘర్షణల్ని వర్ణిస్తూ అతడిలా అన్నాడు. “సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొట్టెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొట్టెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని” 1 మూయేలు17:34, 35, ఈవిషయాల్లో దావీదు అనుభవం అతడి హృదయాన్ని పరీక్షించి అతడిలో సాహసాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంపొందించింది.PPTel 649.3

    సౌలు ఆ స్థానానికి పిలుపు పొందక పూర్వమే దావీదు పరాక్రమ కార్యాలికప్రఖ్యాతి చెందాడు. దావీదుని రాజు దృష్టికి తెచ్చిన అధికారి అతణ్ణి “బహుళూరుడును యుద్ధశాలియు మాట నేర్పరి” అని వర్ణించాడు. “యెహోవా వానికి తోడుగానున్నాడు”. అన్నాడు.PPTel 650.1

    ఇశ్రాయేలీయులు ఫిలప్రియుల పై యుద్ధం ప్రకటించినప్పుడు యెషయి ముగ్గురు కుమారులు సౌలు సైన్యంలో చేరారు. దావీదు ఇంటి వద్దే ఉండిపోయాడు. కొంతకాలం అయిన తరువాత సౌలు యుద్ధ శిబిరాన్ని సందర్శించాటినికి వెళ్ళాడు. అన్నలకి వర్తమానాన్ని బహుమతుల్ని అందజేసి వారు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకు రమ్మని తండ్రి దావీదును ఆదేశించాడు. కాగా యెషయికి తెలియని ఒక ఉన్నత కర్తవ్యం అయిన కాపరికి దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలీయుల సైన్యం ప్రమాదంలో ఉంది. తన ప్రజల్ని రక్షించాల్సిందిగా ఒక దేవదూత దావీదును ఆదేశించాడు.PPTel 650.2

    సైన్యాన్ని సమీపిస్తున్నప్పుడు యుద్ధం ప్రారంభం కాబోతున్న ఘోష వినిపించింది. “వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరచుచు యద్దుమునకు సాగుచుండిరి” ఇశ్రాయేలీయులు ఫిలీప్తీయులు ఎదురెదురుగా మోహరించి ఉన్నారు. దావీదు సైన్యంలోకి పరుగెత్తుకు వెళ్ళి అన్నల్ని కలసి వారికి వందనం చేసాడు. అతడు వారితో మాట్లాడుతుండగా ఫిలీప్తయుల శూరుడు గొల్యాతు వచ్చి దుర్భాషలాడుతూ ఇశ్రాయేలీయుల్ని దూషిస్తూ తనతో ద్వంద్వ యుద్ధం చేయటానికి తమ సైన్యంలో నుండి ఒక యోధుణ్ణి ఎన్నుకొని తన ముందుకి పంపమని సవాలు విసిరాడు. అతడు తన సవాలును పునరుద్ఘాటించాడు. ఇశ్రాయేలీయులందరూ భయకంపితులవటం దావీదు చూసాడు. ఆ ఫిలీప్తీయుడు రోజుకు రోజు అలాగే తిరస్కార వాక్యాలు పలుకుతున్నాడని అతణ్ణి ఎదుర్కొటానికి ఎవరూ ముందుకి రావటం లేదని తెలుసుకున్నప్పుడు దావీదు ఉద్రేకం కట్టలు తెంచుకొంది. సజీవుడైన దేవుని ఘనతను ఆయన ప్రజల పేరును కాపాడాలని అతనిలో ఉత్సాహం ఉద్రేకం పెల్లుబికాయి.PPTel 650.3

    ఇశ్రాయేలీయుల సైన్యం నిరుత్సాహానికి గురైంది. వారి ధైర్యం చెడింది. వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు. “వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు”. సిగ్గుతోను అగ్రహంతోను దావీదు ఈ మాటలతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాడు. “జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు ఎంతటివాడు”?PPTel 650.4

    దావీదు అన్న ఏలీయాబుకి ఈ మాటలు విన్నప్పుడు ఆ యువకుణ్ణి ఉద్వే గంతో నింపుతున్న మనోభావాలేంటో బాగా తెలుసు. కాపరిగా ఉన్నప్పుడు సయితం దావీదు గొప్ప సాహసం, ధైర్యం బలం ప్రదర్శించాడు. సమూయేలు తమ తండ్రి గృహాన్ని దర్శించటం, సడీచప్పుడు లేకుండా వెళ్ళిపోవటం అతడి సందర్శనం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గురించి సహోదరుల మనసుల్లో పలు అనుమానాలు చోటు చేసుకొన్నాయి.PPTel 651.1

    తమకన్నా దావీదు ఎక్కవ ఘనత పొందటం చూసినప్పుడు వారికి అసూయ పుట్టింది,. తమ్ముడిగా అతడిపట్ల తనకుండాల్సిన ప్రేమాభిమానాలు దయా దాక్షిణ్యాలు మాయమయ్యాయి. అతణ్ణి కొరగాని కాపరిగా మాత్రమే వారు పరిగణించారు. ఫిలిప్తీయ యోధుణ్ణి నోరు ముయ్యించటానికి సాహసించి తన పిరికితనానికి మందలింపుగా ఇప్పుడు దావీదు అడిగిన ప్రశ్నను ఏలీయాబు పరిగణించాడు. అగ్రహంతో పెద్దన్న ఇలా అన్నాడు. “నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొట్టెమందలను ఎవరి వశము చేసితివి ? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేరెరుగుదును. యుద్ధముచూచుటకేగదా నీవు వచ్చితివి?” మాట మాత్రము పలికితిని.”PPTel 651.2

    దావీదు అన్న మాటలు రాజు చెవినిపడ్డాయి. రాజు ఆ యువకుణ్ణి తన ముందుకి పిలిచాడు. అతడు చెప్పిన ఈ మాటల్ని సౌలు ఆశ్చర్యంగా విన్నాడు. ‘ఈ ఫిలిత్రేయుని బట్టి యెవని మనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదును”.PPTel 651.3

    తాను ఉద్దేశించిన కార్యం నుంచి దావీదుని మళ్ళించటానికి సౌలు ప్రయత్నించాడు. కాని ఆ యువకుడు చలించలేదు. తండ్రి మందల్ని మేపుతున్నప్పుడు తనకు కలిగిన అనుభవాల్ని గూర్చి చెబుతూ రాజుకు వినయంగా సమాధానమిచ్చాడు. అతడిలా అన్నాడు. “సింహము యొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిప్తీయుని చేతిలో నుంచి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు - పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక” అన్నాడు.PPTel 651.4

    ఫిలిప్తీయ యోధుడి అహంకార పూరిత సవాలును బట్టి ఇశ్రాయేలీయుల సైనికులు నలభై దినాలు భయంతో వణికారు. ఆరుమూరల జానెడు ఎత్తు బ్రహ్మాండమైన దేహం గల అతణ్ణి చూసినప్పుడు వారి గుండె చెదిరింది. అతడి శిరం పై రాగి శిరస్త్రాణం ఉంది. అతడు అయిదువేల తులాల బరువు గల యుద్ధకవచం ధరించాడు. కాళ్ళకు రాగి కవచం ఉంది. కవచం రాగి చిప్పలు చేప పొలుసు మాదిరిగా ఒకదాని మీద ఒకటి అమిర్చవేసింది. ఆ చిప్పల్ని దగ్గరదగ్గరగా అమిర్చి అతికినందున బాణంగాని బళ్ళెపు మొనగాని కవచంలోకి వెళ్ళటానికి తావులేదు. అతడి వీపు మీద రాగి బల్లెం ఉంది. “అతని యీటె క” నేతగాని దోనే అంత పెద్దది. మరియు అతని యీటె కొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను”.PPTel 652.1

    ఇశ్రాయేలీయుల శిబిరం దగ్గరకు వచ్చి ఉదయం సాయంత్రం గొల్యాతు ఈ విధంగా గట్టిగా అరిచేవాడు. “యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిపీయుడనుకానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పర్చుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులమగుదుము నేనతని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుము”. PPTel 652.2

    గొల్యాతు సవాలును అంగీకరించటానికి సౌలు దావీదుకి అనుమ తిచ్చిన ప్పటికి అతడు ఆ సాహసోపేత కర్తవ్య నిర్వహణలో విజయం సాధిస్తాడన్న నమ్మకం రాజుకి లేదు. రాజు యుద్ధ కవచం ఆ యువకుడికి ధరింపజేయవలసిందిగా ఆజ్ఞ జారీ అయ్యింది. అతడి తలమీద బరువైన శిరస్త్రాణం పెట్టారు అతడికి యుద్ధ కవచం తొడిగించారు. రాజు ఖడ్గం పక్క ఒరలో తగలించారు. ఇలా సర్వ సన్నధమై అతడు తన కార్యాచరణకు బయలుదేరాడు. అయితే అతడు కొద్దిసేపటిలోనే తిరిగి వచ్చాడు. ఉత్కంఠతో చూస్తున్న ప్రేక్షకులకు వచ్చిన మొదటి ఆలోచన ఎంటంటే ఆ అసమానుల పోరులో తన ప్రత్యర్ధిని ఎదుర్కొని ప్రాణాపాయం కొని తెచ్చుకోకూడదని దావీదు నిశ్చయించుకొన్నాడని. కాని ఇది ఆ యౌవన శూరుడి ఉద్దేశం కానే కాదు. సౌలు వద్దకు వచ్చినప్పుడు ఈ మాటలు పలుకుతూ బరువైన ఆ యుద్ధ కవచాన్ని తీసివేయటానికి అనుమతించాల్సిందిగా సౌలుని బతిమాలాడు. “ఇవి నాకు వాడుకలేదు. వీటితో నేను వెళ్ళలేను అన్నాడు”. రాజు యుద్ధ కవచాన్ని పక్కన పెట్టి దాని బదులు చేతిలో కర్ర, కాపరి, సంచి, వడిసెల ధరించాడు. ఏటి తరం నుంచి ఐదుసన్నని గులకరాళ్ళు ఏరుకొని వాటిని సంచిలో వేసుకొని చేతిలో వడిసెలతో ఆ ఫిలీప్రియుణ్ని సమీపించాడు. అతడు నిర్భయంగా ముందుకు నడిచి వచ్చాడు. ఇశ్రాయేలీయుల్లో పేరుమోసిన యోధుణ్ణి ఎదుర్కొంటాననుకొన్నాడు. అతడి ఆయుధాన్ని మోసేవాడు అతడి ముందు నడిచివెళ్ళాడు. అతణ్ణి ఆపేశక్తి ఏది లేనట్లు కనిపించింది. అతడు దావీదును సమీపించినప్పుడు తన ముందు నిలిచింది ఒక బాలుడు. ఎందుకంటే దావీదు వయసులో చిన్నవాడు. దావీదు ముఖం ఎర్రగా ఆరోగ్యంతో నిగనిగలాడుతున్నది. యుద్ధ కవచం రక్షణ లేని అతడి దేహం అతడి వేటుకి అనుకూలంగా ప్రదర్శితమై ఉంది. యౌవనంతో శోభిల్లుతున్న ఆ శరీరానికి ఆ ఫిలిప్తీయుడి స్తూలకాయానికి మధ్య పెద్ద వ్యత్యాసముంది,PPTel 652.3

    గొల్యాతుకి ఆశ్చర్యం కలిగింది. ఎంతో కోపం వచ్చింది. “కట్టి తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అన్నాడు. తనకు తెలిసిన దేవతలందరి పేర దావీదు పై భయంకర శాపాలు పెట్టాడు. “నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతును” అని ఎగతాళిగా అరిచాడు.PPTel 653.1

    ఆ ఫిలిప్తీయ యోధుడి ముందు దావీదు బలహీనుడుగా కనపడలేదు. ఒక అడుగు ముందకు వేసి తన ప్రత్యర్దితో దావీదు ఈ మాటలన్నాడు. “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిప్తీయుల యొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని యీ దండు వారందరును తెలిసి కొందురు. యుద్దము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును”.PPTel 653.2

    అతడి స్వరంలో సాహసం ధ్వనించింది. అతడి ముఖంలో విజయం అనందం కనిపిచాయి. స్పష్టమైన మధురమైన ఆ మాటలు గాలిలో ప్రసారమై యుద్దానికి మోహరించి ఉన్న వేలమందికి వినిపించాయి. గొల్యాతు కోపం పరాకాష్ఠకు చేరింది. తలను కాపాడుతున్న శిరస్త్రాణం పైకి నెట్టి ప్రత్యర్థిని మట్టు పెట్టాలని ఆ కోపంలో ముందుకి పరుగెత్తాడు. యెషయి కుమారుడు విరోధిని ఎదుర్కొడానికి ఆయత్తపడుతున్నాడు. “ఆ ఫిలిప్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిప్రియుని నుదుటకొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను”. PPTel 653.3

    రెండు సేనల ప్రజల్లోను విస్మయం వ్యాపించింది. దావీదు హతుడవుతాడన్నది వారి నమ్మకం. కాని అతడి వడిసెలలోని రాయి దూసుకుపోయి తిన్నగ దాని గురిని కొట్టినప్పుడు ప్రత్యర్థి వీరుడు తడబడటం హఠాత్తుగా అంధత్వం మొత్తినట్లు చేతులు చాపి తడుముకోవటం ప్రజలు గమనించారు. ఆ మహాకాయుడు గిరగిర తిరిగి తడబడి నరికిన వృక్షంలా నేలకూలాడు. దావీదు ఒక్క నిమషం కూడా ఆగలేదు. నేలకూలిన ఫిలిప్తీయుడిపై పడి రెండు చేతులతోను గొల్యాతు ఖడ్గాన్ని పట్టుకొన్నాడు. కొద్ది నిమిషాల క్రితమే ఆ ఖడ్గంతోనే దావీదు తల నరికి అతడి మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానని ప్రగల్బాలు పలికాడు గొల్యాతు. ఇప్పుడు దావీదు ఆ ఖడ్గాన్న పైకెత్తాడు. ఆ ప్రగల్బి శిరసు తెగి పడి దొర్లింది. ఇశ్రాయేలీయుల స్కంధావారం నుంచి ఆనందోత్సాహధ్వనులు మిన్నంటాయి. PPTel 654.1

    ఫిలిప్తీయులు భయభ్రాంతులయ్యారు. గందరగోళ పరిస్తితి ఏర్పడి ఫిలిప్తీయుల సైన్యం హుటాహుటిగా తిరుగుముఖం పట్టింది. పారిపోతున్న శత్రువుల్ని తరుముతూ విజయం సాధించిన హెబ్రీయుల విజయోత్సాహాపు కేకలు కొండ శిఖరాల్లో ప్రతిధ్వనులు చేసాయి. వారు “లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిప్తీయులను తరమగా ఫిలిష్తియులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిప్రియుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను”.PPTel 654.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents