Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    42—పునరుద్ఘాటించబడ్డ ధర్మశాస్త్రం

    కనాను స్వాధీనానాకి నియమితమైన సమయం వచ్చిందని ప్రభువు మో షేకి తెలియజేశాడు. వృద్దుడైన ఆ ప్రవక్త యోర్దాను నదికీ, కనానుకీ ఎదురుగా ఉన్న కొండమీద నుంచి తన ప్రజలు వారసత్వంగా పొందనున్న కనాను వంక ఆశగా చూశాడు. కాదేషులో తన పాపం ఫలితంగా తనకు పడ్డ శిక్ష రద్దుకావటం సాధ్యమా? చిత్తశుద్ధితో ప్రభువుని ఇలా వేడుకొన్నాడు, ” ఆకాశమందేగాని, భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను ఆ లెబానోనును చూచునట్లు దయచేయుము” ద్వితి. 3:24-29.PPTel 459.1

    ఆయన సమాధానం ఇది, “చాలును: ఇక ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్టాకొండ యెక్కి కన్నులెత్తి పడమటి వైపున ఉత్తరవైపును, దక్షిణవైపును, తూర్పు వైపును తేరి చూడుము”.PPTel 459.2

    ఒక పలుకు పలకకుండా మొ షే దేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఇప్పుడు తన ఆందోళనంతా ఇశ్రాయేలీయుల నిమిత్తం. వారి క్షేమాభివృద్ధి విషయం తాను తీసుకొన్న శ్రద్ధ ఎవరు తీసుకొంటారు? నిండు మనసుతో ఇలా ప్రార్థించాడు, “యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొట్టేలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము. అతడు వారి యెదుట వచ్చును పోవుచునుండి వారికి నాయకుడుగా నుండుటకు సమర్థుడై యుండవలెను” సంఖ్యా 27:15-17.PPTel 459.3

    తన సేవకుడి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆయన ఇచ్చిన జవాబు ఇది, “నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతని మీద నీ చెయ్యి యుంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను, సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము”18-20 వచనాలు. యెహోషువ మోషే సహచరుడుగా చాలా కాలంగా ఉన్నాడు. జ్ఞానం, సామర్థ్యం, విశ్వాసంగల అతడు మోషే వారసుడుగా ఎంపిక అయ్యాడు.PPTel 459.4

    మో షే యెహోషువ మీద చేతులుంచటం ఆ మీదట అతి గంభీరమైన ఆజ్ఞ ఇవ్వటం ద్వారా యెహోషువను ఇశ్రాయేలీయుల నాయకుడుగా నియమించాడు. అతడు ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామి అయ్యాడు. యెహోషువను గురించి ప్రభువు పలికిన ఈ మాటల మోషే ద్వారా ఇశ్రాయేలీయుల సమాజానికి వచ్చాయి, “యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను” 21-23 వచనాలు.PPTel 460.1

    ఇశ్రాయేలీయుల నాయకుడుగా పదవీ బాధ్యతలు విరమించకముందు ఐగుప్తు నుంచి వారి విమోచన చరిత్రను, అరణ్య ప్రయాణాన్ని, సీనాయి కొండపై నుంచి దేవుడు పలికిన ధర్మశాస్త్రాన్ని వారికి సింహావలోకనం చేయల్సిందిగా దేవుడు మోషేను ఆదేశించాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రస్తుత సమాజంలోని బహుకొద్దిమంది మాత్రమే దాని ప్రాముఖ్యాన్ని గ్రహించగలిగిన వయసులో ఉన్నారు. కొద్ది కాలంలోనే వారు యోర్దానును దాటి వాగ్దత్త దేశాన్ని స్వాధీనపర్చు కోనున్న నేపథ్యంలో తన ధర్మశాస్త్ర విధుల్ని వారి ముందు పెట్టి తమ పురోభివృద్ధి ఆ విధులకు వారు లోబడి నివసించటం మీద ఆధారపడి ఉంటుందని విశదం చేశాడు.PPTel 460.2

    తన చివరి హెచ్చరికలు హితవాక్యులు పలకటానికి మోషే ప్రజల ముందు నిలబడ్డాడు. అతడి ముఖం పరిశుద్ద కాంతితో ప్రకాశించింది. అతడి తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. అతడు నిటారుగా నిలబడి ఉన్నాడు. తన దేహారోగ్యాన్ని, దారుఢ్యాన్ని అతడి ముఖం ప్రతిబింభించింది. దృష్టి స్పష్టంగా ఉంది. అది ప్రాముఖ్యమైన సమయం. సర్వశక్తిగల తమ సంరక్షకుడు కాపుకర్త ప్రేమను, కరుణను తీవ్ర మనోభావంతో ఇలా వర్ణించాడు:PPTel 460.3

    “దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశముయొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా? యెహోవా ఐగుప్తులో మీ కన్నుల యెదుట చేసిన వాటిన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను, మహత్కార్యాలతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొనయత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరియొక దేవుడు లేడనియు నీవు తెలిసి కొనునట్లు అది నీకు చూపబడెను”.PPTel 460.4

    “మీరు సర్వ జనములకంటె విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా? అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక, యెహోవా బహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించెను. కాబటి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడుననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయు టకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను”. ద్వితి. 7:7-9.PPTel 461.1

    తమ కష్టాలన్నిటికి తానే కారణమని మో షేని నిందించటానికి ఇశ్రాయేలీయులు గతంలో స్థిరమయ్యారు. అతణ్ని అహంకారం, అత్యాశ లేదా స్వార్థం అదుపు చేశాయన్న వారి అనుమానం ఇప్పుడు తొలగిపోయింది. ఇప్పుడు అతడు చెబుతున్న మాటలు శ్రద్ధగా విని విశ్వసించారు. తమ దోషాల్ని తమ పితరుల అతిక్రమాల్ని మోషే వారి ముందు పెట్టాడు. తమ దీర్ఘ అరణ్య సంచారం గురించి వారు తరుచుగా సహనం కోల్పోయి తిరుగుబాటు చేశారు. కాని కనాను స్వాధీనంలో ఈ ఆలస్యానికి ప్రభువు కారణం కాదు. వారిని వాగ్దాత్త దేశంలోకి వెంటనే తీసుకురానందుకు, అలా ప్రజల్ని నడిపించటంలో తన మహాశక్తిని సకల జాతుల ముందు ప్రదర్శశించనందుకు, వారికన్నా ప్రభువే ఎక్కువ వేదన చెందాడు. దేవునిపట్ల తమ అవిశ్వాసం గర్వం అప నమ్మకం వల్ల వారు కనానులో ప్రవేశించటానికి సిద్ధంగా లేరు. ఆయన ఎలాంటి ప్రజలకు ప్రభువో ఆ ప్రత్యేక ప్రజల్ని సూచించే స్థితిలో వారు లేరు. ఎందుచేతనంటే ఆయన పవిత్ర ప్రవర్తన, మంచితనం, ఔదార్యం వారిలో లేవు. తమ తండ్రులు విశ్వాసమూలంగా దేవుని ఆజ్ఞల్ని పాటించి ఆయన తీర్పుల్ని అనుసరించి ఆయన నిబంధనల ప్రకారం నడుచుకొని ఉంటే వారు ఎప్పుడో కనానులో స్థిరపడి సంతోషానందాలతో పరిశుద్ధ జనాంగంగా వృద్ధి చెందేవారు. ఆ మంచి దేశంలో వారి ప్రవేశం విషయంలో జరిగిన ఆలస్యం చుట్టపల్ల ఉన్న జాతుల ముందు దేవునికి అగౌరవాన్ని ఆయన మహిమకు లోటును తెచ్చింది.PPTel 461.2

    దైవ ధర్మశాస్త్ర స్వభావాన్ని విలువను ఎరిగిన మోషే తమకున్న జ్ఞానయుక్తమైన, నీతివంతమైన, దయాపూర్వకమైన నిబంధనలు ఏ యితర ప్రజలకూ లేవని హెబ్రీయులకు హామీ యిచ్చాడు. “నా దేవుడైన యెహోవా నాకా జ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరించవలసిన కట్టడలను, విధులను మీకు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరించవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నింటిని మీరు గైకొని ఆచరింపవలెను. వాటిని గూర్చి వినుజనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. అదే మీకు వివేకము, వారు చూచి - నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేకములు గల జనమని చెప్పుకొందురు.”PPTel 462.1

    “నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని” నిలిచిన దినానికి మోషే వారి గమనాన్ని తిప్పాడు. హెబ్రీ ప్రజలకు ఈ సవాలు విసిరాడు. ” మనము ఆయనకు మొఱ్ఱ పెట్టినప్పుడెల్లా మనదేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో నన్ను కట్టడలను, నీతి విధులును గల గొప్ప జనమేది?” ఇశ్రాయేలీయులకి వచ్చిన సవాలు ఈనాడు పునరావృతం కావచ్చు. దేవుడు తన ప్రాచీన ప్రజలకిచ్చిన నిబంధనలు ఈనాడు లోకంలో ఉన్న ఏ నాగరిక జాతి అనుసరిస్తున్న నిబంధనలకన్నా ఎంత జ్ఞానయుతమైనవి. మెరుగైనవి మానవీయమైనవి! లోక రాజ్యా ల చట్టాలు భ్రష్ట హృదయపు బలహీనతల్ని ఆవేశకావేశాల్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే దైవ నిబంధనలు దేవుని ముద్రను ప్రదర్శిస్తున్నాయి. “యెహోవా! మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తనకు స్వకీయజనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ యినుప కొలిమలో నుండి మిమ్మును రప్పించెను” అన్నాడు మో షే. ఏదేశంలో వారు త్వరలో ప్రవేశించనున్నారో, దైవ ధర్మశాస్త్రానికి విధేయత షరతు పై ఏ దేశం వారి సొంతం కానున్నదో ఆ కనానును వారికి ఈ విధంగా వర్ణించాడు మో షే. ఆ మంచి దేశంలో తాము అనుభవించనున్న మేళ్లని తమకు హృదయరంజకంగా వర్ణించిన వ్యక్తి తమ పాప ఫలితంగా ఆ స్వాస్థాన్ని తమతో పంచుకోలేకపోవటాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నప్పుడు ఈ మాటలు ఇశ్రాయేలీయుల హృదయాలకు ఎంతటి వేదన కలిగించి ఉండవచ్చు:PPTel 462.2

    “నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రశేశ పెట్టును”. “మీరు స్వాధీన పరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిదికాదు. అక్కడ నీవు విత్తనులు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వర్షము త్రాగును. అది నీటి వాగులును, లోయలలో నుండియు, కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్టును గల దేశము. ఒలీవ నూనెయు, తేనెయుగల దేశము. కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్లు గల దేశము. దాని కొండలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.” “అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండును.” ద్వితి 8:7-9: 11:10-12.PPTel 462.3

    “నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశ పెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు నింపి మంచి ద్రవ్యములచేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వుకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటక ద్రాక్ష తోటలను, ఒలీన తోటలను, నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు...యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్త పడుము”. “మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను” మరచిపోకుండ ” మీరు జాగ్రత్త పడవలెను... ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునైయున్నాడు”.“మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురు”.PPTel 463.1

    ధర్మశాస్త్ర బహిరంగ వివరణ అనంతరం మోషే దేవుడు తనకిచ్చిన ధర్మశాసనాలు, కట్టడలు, తీర్పులు, బలి అర్పణల వ్యవస్థకు సంబంధించిన నిబంధనల క్రోడికరణను పూర్తి చేశాడు. ఈ నియమ నిబంధనలన గ్రంథానికి అధికారుల్ని బాధ్యులుగా నియమించాడు. భద్రతకోసం ఆ గ్రంథాన్ని మందసంలో ఏ పక్కన ఉంచాడు. అయినా ప్రజలు దేవుని నుంచి తొలగిపోతారేమోనని ఆ మహానాయకుడు ఆందోళన చెందాడు. వాటికి విధేయులై నివసించటం వల్ల తమకు ఒనగూడే ఆశీర్వాదాల్ని, వాటిని ఉల్లంఘిచటం వల్ల తాము పొందే శాపాన్ని అతి గంభీరమైన ఉద్వేగ భరితమైన ఉపన్యాసంలో మోషే వారికి వివరించాడు.PPTel 463.2

    “నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడచుకొనిన యెడల” “నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు”, నీ గర్భ ఫలము, నీ భూ ఫలము, నీ పశుమందలు ... నీ గంపయు, నీ పిండి పిసుకు నీ తొట్టియు దీపింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు: వెలుపలికి వెళ్లనప్పుడు దీవింపబడుదువు, నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును.... నీ కొట్లలోను, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.”PPTel 464.1

    “నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాసనములన్నియు నీకు సంభవించును”. “యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై యుందువు’ “దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను, నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు, రాతివియునైన అన్య దేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు. నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలగుజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణ భయము కలిగి యుండును. నీవు రేయింబగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువాటి చేతను ఉదయమున అయ్యో యెప్పుడు సాయంకాల మగునా అనియు, సాయంకాలమున - అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు”.PPTel 464.2

    పరిశుద్దాత్మమ ఆవేశం వల్ల దివ్యదృష్టితో భావి యుగాల్ని వీక్షిస్తూ ఇశ్రాయేలీయుల అంతిమ పతనాన్ని, రోమా సైన్యం చేతుల్లో యెరూషలేము నాశనాన్ని గూర్చిన భయానక దృశాల్ని మోషే చిత్రించాడు. “యెహోవా దూరమైయున్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను, యౌవనస్థులను కటాక్షింపని జనమును గెద్ద యెగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించెదను”.PPTel 464.3

    శతాబ్దాల అనంతరం టైటస్ యెరూషలేమును ముట్టడించిన సమయంలో చోటు చేసుకొన్న విధ్వంసం, బాధ, ఆవేదనల్ని స్పష్టంగా చిత్రించాడు: “నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను, నీ పొలముల ఫలములను వారు తినివేతురు... మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రకారములు గల నీ కోటలు పడువరకు నీ దేశమంతటను, గ్రామములన్నింటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదు. అప్పుడు ముట్టడిలోను, నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు, నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు”. “మీలో మృదుత్వము చేతను, అతి సుకూరము కలిగి మృదుత్వము చేతను, అతి సుకూరము చేతను నేలమీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడుమని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారుని యెడల నైనను తన కుమార్తె యెడల నైనను కటాక్షము చూపకపోవును”.PPTel 464.4

    మోషే తన ప్రసంగాన్ని ఈ మాటలతో ముగించాడు: “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ యెదుట ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుషునకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును, నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తకొనునట్లును కోరుకొనుండి”. ద్వితి. 30:19,20.PPTel 465.1

    ఈ సత్యాలు వారి మనసుల్లో నుంచి చెరిగిపోకుండా నిలిచేందుకుగాను ఆ మహానేత వాటిని పరిశుద్ధ గేయంగా రచించాడు. ఈ గేయం చారిత్రకమే కాదు ప్రవచనికంకూడా. గతంలో దేవుడు తన ప్రజలకు చేసిన మహత్కార్యాల్ని వివరిస్తూ భవిష్యత్తులో జరుగనున్న గొప్ప సంభవాల్ని గురించి, క్రీస్తు మహిమతో రెండోసారి వచ్చినప్పుడు విశ్వాసుల అంతిమ విజయం గురించి అది ప్రవచించింది. ఈ చరిత్రాత్మక గేయాన్ని కంఠస్థం చేసి తమ పిల్లలకు, పిల్లల పిల్లలకు నేర్పించాల్సిందిగా ప్రజల్ని ఆదేశించాడు. ప్రజలు దైవారాధనకు సమావేశమైనప్పుడు, తమ దినవారీ పనుల్లో ఉన్నప్పుడు దీన్ని వల్లించుకోవాల్సి ఉన్నారు. ఈ గేయాన్ని పిల్లలు ఎన్నడూ మరవకుండేందుకు ఆ మాటల్ని వారి హృదయాల్లో నాటింపజేసే బాధ్యత తల్లిదండ్రులది.PPTel 465.2

    ఇశ్రాయేలీయులు - విశేషార్థకంగా - దేవుని ధర్మశాస్త్రానికి కావలివారూ, సంరక్షకులు కాబట్టి దాని సూత్రాల ప్రాధాన్యం వాటి ఆచరణ, ప్రాముఖ్యం వారు గుర్తించటం వారి ద్వారా వారి పిల్లలు గుర్తించటం ముఖ్యం. తన కట్టడాల గురించి ప్రభువు ఇలా ఆజ్ఞాపించాడు, “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును, త్రోవను నడచునప్పుడును, పండుకొనునప్పుడును, లేచుచున్నప్పుడును,వాటిని గూర్చి మాటలాడవలెను.... నీ యింట ద్వారా బంధముల మీదను, నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను”.PPTel 465.3

    “మన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములు, కట్టడాలు, విధులు ఏవని” ముందుకాలంలో తమ బిడ్డలు వారిని ప్రశ్నించినప్పుడు వారు తమతో దేవుడు ఎలా వ్యవహరించాడో, తన ధర్మ శాసనాల్ని ఆచరించేందుకుగాను తమను ఎలా దాస్యం నుంచి విడిపించాడో ఆ చరిత్రను వారికి విశదీకరిస్తూ తల్లిదండ్రులు ఇలా నివేదించాల్సి ఉన్నారు. “మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడాలన్నిటిని గైకొనవలెనని మనకాజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొను నప్పుడు మనకు నీతి కలుదగును”.PPTel 466.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents