Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉపోద్ఘాతం

    ఇది బైబిలు చరిత్రాంశాల్ని చర్చిస్తున్న పుస్తకం. ఇవి కొత్త అంశాలేమీ కావు. కాకపోతే కార్యనికి మూలాన్ని బయలుపర్చుతూ కొన్ని ఉద్యమాలకు అవశ్యకతలను చూపూతు, బైబిల్లో క్లుప్తంగా పేర్కొన్న కొన్ని విషయాలన్ని విశదీకరిస్తూ కొత్త అర్ధాన్ని చేకూర్చేటట్లుగా వాటిని అందించటం జరగుతున్నది అ అంశాలు. ఈరకంగా స్పష్టతను ప్రాముఖ్యాన్ని సంతరించుకొని నూతన ప్రభావాన్ని ప్రసరిస్తున్నాయి. సాతాను జిత్తుల్ని బయలు పెట్టి తుదకు అతడి శక్తిని తుదముట్టించటానికి మనుషుల హృదయ బలహీనతను దృష్టికి తెచ్చి దుష్టత్వంలో పోరాటంలో గెలవటానికి వారికి శక్తి ఎలా లభిస్తుందో చూపించటానికి దేవుని ప్రవర్తనను, ఉద్దేశాల్ని పూర్తిగా గ్రహించటానికి లేఖన దాఖలాల పై మంచి అవగాహన కలిగించేందుకు దోహదపడతాయి. తన వాక్యంలోని సత్యాల్ని మానవులకు తెలియపర్చటమన్న దైవోద్దేశానికి ఇది అనుగుణంగా ఉన్నది. ఈ ప్రత్యక్షతల్ని లేఖనాలతో పోల్చి పరీక్షించిన మీదట ఏ సాధనం ద్వారా దేవుడు ఉపదేశమిచ్చాడో ఆ సాధనానే ఉపయోగించి నేడు కూడా దేవుడు మానవులకు ఉపదేశం ఇస్తాడని తెలుసుకుంటాం.PPTel 8.1

    మానవడు ఆదిలో పరిశుద్దుడుగా, నిరపరాదధిగా ఉన్నప్పటిలా దేవుని వద్ద నుంచి వ్యక్తిగతంగా ఉపదేశం పొందటం ఇప్పుడు లేకపోయినా, పరలోక ఉ పదేశకుడు లేకుండా దేవుడు అతణ్ణి విడిచిపెట్టలేదు. తన ప్రతినిధి అయిన పరిశు దాదత్మ రూపంలో ఆయన ఉపదేశకుణ్ని ఏర్పాటు చేసాడు. దేవుని చేత వెలిగించబడటమన్న అధిక్యత క్రీస్తు అనుచరులకు ఉన్నట్లు వారు “వెలిగించబడి” పరిశుద్దాత్మలో పాలిరారై” నట్లు పౌలు చెబుతున్నాడు. హెబ్రీ 10:32,6:4 యోహాను కూడా ఇలా అంటున్నాడు.“అయితే మీరు పరిశుద్దుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు” 1 యోహాను 2:20 శిష్యుల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవటానికి క్రీస్తు సిద్ధంగా ఉన్న సమయంలో ఆదరణకర్తగా సర్వసత్యంలోకి నడిపించే మార్గదర్శకుడిగా పరిశుద్దాత్మను పంపుతామని శిష్యులకు వాగ్దానం చేసాడు. యోహాను 14:16, 26.PPTel 8.2

    సంఘపరంగా ఈ వాగ్దానం ఎలా నెరవేరనున్నదో చూపించటానికి ఆత్మవరాలు సంక్షేమాభివృద్ధి కోసం ఉపదేశం కోసం కాలాంతం వరకు అనుగ్రహించబడ్డాయని తన రెండు పత్రికల్లో అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. 1 కొరింథీ 12, ఎఫెసీ 4:8-13, మత్తయి 28:20 అంతేకాదు, చివరి దినాల్లోPPTel 8.3

    ప్రత్యేకమైన పరిశుద్దాత్మ కుమ్మరింపు జరుగుతుందని, క్రీస్తు రాకడ సమయంలో ఉన్న సంఘం తన చివరి అనుభవంలో “యేసును గూర్చిన సాక్ష్యము” అనగా ప్రవచన సారం కలిగి ఉంటుందని అనేక స్పష్టమైన ప్రవచనాలు చెబుతున్నాయి. అ.కా 2:17-20, 30, 1 కొరింథీ 1:7, ప్రకటన 19:10 తన ప్రజల పట్ల దేవుని శ్రద్ధకూ ఆయన ప్రేమకూ ఈ సత్యాల్లో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సంఘం చివరి దినాల శ్రమల్లో ప్రవేశించేటప్పుడు తన సామాన్య వ్యవహారాల్లోనే గాక తన అసాధారణ పద్ధతుల్లోను ఆదరణకర్తగా ఉపదేశకుడుగా, మార్గ దర్శకుడుగా పరిశుద్దాత్మ సమక్షం సంఘానికి అవసరమౌతుంది. క్రితం కన్నా ఎక్కువగా అవసరమౌతుంది.PPTel 9.1

    మనుషుల మనసుల్నీ అవగాహనను ఉత్తేజపర్చి వారికి మార్గనిర్దేశం చేసేందుకు వారి హృదయాల్లో పరిశుద్దాత్మ పనిచేయటానికి లేఖనాలు ఎన్నో మార్గాల్ని సూచిస్తున్నాయి. దర్శనాలూ, కలలూ నీటిలోనివే, ఈ రకంగా దేవుడింకా మనుషులతో మాట్లాడగలుగుతాడు. ఈ విషయంలో ఆయన వాగ్దానం ఇది : “నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును” సంఖ్య 12:6 ఈవిధంగానే బిలాముకు అతీంద్రియజ్ఞానం కలిగింది. అతను ఇలా అంటున్నాడు. “బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చి దేవోక్తి. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవ వాక్కులను వినువాని వర్త, అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను”. సంఖ్యా 24:15, 16PPTel 9.2

    మానవ కృపకాలావధిలో సంఘంలో ఆత్మ ప్రత్యక్షత చోటు చేసుకోవటం ప్రభువు ఎంతమట్టుకు ఉద్దేశించాడో అన్న దాని పై లేఖన సాక్ష్యాన్ని పరిశోధించటం ఆశక్తిపరంగా ఉంటుంది. రక్షణ ప్రణాళికను రూపొందించిన తరువాత, మనం చూస్తున్న విధంగా, తన కుమారుడని ద్వారాను పరిశుద్ధ దూతల ద్వారాను దేవుడు మానవులతో ఇంకా మాట్లాడగలుగుతున్నాడు. మోషేతో మాట్లాడినట్లు, కొన్నిసార్లు మనుషులతో ఆయన ముఖాముఖీ మాట్లాడాడు. కాని, తరుచుగా కలలు దర్శనాల ద్వారా ఆయన మాట్లాడాడు. అలా దేవుడు మాట్లాడటానికి పరిశుద్ధ దాఖలాల్లో అన్ని యుగాల్లో ఎన్నో నిదర్శనాలున్నాయి. అదాము నుంచి ఏడో వాడైన హానోకు ప్రవచన స్పూర్తితో క్రీస్తు మహాశక్తి మహిమలతో రెండోసారి వస్తాడని కనిపెడుతూ ఇలా అన్నాడు. “ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను” యూదా 14, “మనుష్యులు పరిశుద్దాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగాPPTel 9.3

    పలికిరి” 2 పేతురు 1:21 ప్రజల ఆధ్యాత్మిక క్షీణించనందు వల్ల కొన్నిసార్లు ప్రవచన స్వరం దాదాపు మాయమైనట్లు కనిపిస్తే అది సంఘం అనుభవంలోను శకం నుంచి శకానికి జరిగే మార్పులోను తీవ్ర సంక్షోభాన్ని సూచించింది. క్రీస్తు నరావతారయుగం వచ్చినపుడు బాప్తిస్మమిచ్చే యోహాను తండ్రి పరిశుద్దాత్మతో నిండినవాడై ప్రవచించాడు. లూకా 1:67 ప్రభువును చూసేంత వరకు తనకు మరణం రాదని సుమెయోనుకు ఆత్మావేశం ద్వారా తెలిసింది. తల్లితండ్రులు యేసును ప్రతిష్టించేందుకు దేవాలాయానికి తీసుకువెళ్ళినప్పుడు సుమెయోను ఆత్మవశుడై, దేవాలయానికి వెళ్ళి యేసుని చేతుల్లోకి తీసుకొని ఆయనను గూర్చి ప్రవచిస్తూ ఆయనను దీవించాడు. ప్రవక్త అన్న అదే సమయంలో దేవాలయంలోకి వచ్చి విమోచన కాంక్షిస్తూ యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఆయనను గూర్చి మాట్లాడింది లూకా 2:26,36.PPTel 10.1

    క్రీస్తు అనుచరుల సువార్త ప్రకటన సేవకు తోడుగా చోటు చేసుకొన్న పరిశు ద్దాత్మ కుమ్మరింపును ప్రవక్త ఈ మాటల్లో ప్రవచించాడు. “తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులును మీకుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవనలు దర్శనములు చూతురు. ఈ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను, అనగా రక్తమును,అగ్నిని, దూపస్థంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాధికము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును” యోవేలు 2:28-31,.PPTel 10.2

    పెంతెకొస్తునాడు చోటు చేసుకున్న అద్భుత ఘటనల్ని విశదంచేస్తూ పేతురు ఈ ప్రవచనాన్ని ఉటంకించాడు. అగ్నిజ్వాలల వంటి నాలుకలు ప్రతీ శిష్యుడి మీద వాలగా వారు పరిశుద్దాత్మతో నిండి ఇతర భాషల్లో మాట్లాడారు. మద్యంతో మత్తిల్లారంటూ అపహాసకులు వారిని విమర్శించినప్పుడు పేతురు ఇలా బదులు పలికాడు. “వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతియిదే”. అప్పుడు యోవేలు ప్రవచనాన్ని ఉటంకించాడు. “తరువాత అన్న మాటలు బదులు” అంత్యదినములందు” అన్న పదబంధం మాత్రం పెట్టి “అంత్య దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను” అనేటట్లు మార్చాడు.PPTel 10.3

    ఆత్మ కుమ్మరింపుకు సంబంధించిన ఈ ప్రవచన భాగం మాత్రమే ఆ దినాన నెరవేరిందనటానికి ఇది నిదర్శనం. ఎందుకంటే కలలుకనే ముసలివాళ్ళు. దర్శనాలు చేస్తూ ప్రవచించే యువకులు, యువతులు అక్కడ లేరు. రక్తాన్ని గూర్చి అగ్ని ధూమ, స్థంభాల్ని గూర్చిన మహాత్కార్యాలు లేవు. అప్పుడు చంద్రుడు రక్తవర్ణం కాలేదు. సూర్యుడు తేజోహీనుడవ్వలేదు. అయినా ఆనాడు అక్కడ జరిగింది యోవేలు ప్రవచనం నెరవేర్పు, పరిశుద్దాత్మ కుమ్మరింపుకు సంబంధించిన ఈ ప్రవచనం భాగం ఆ ఒక్క ప్రత్యక్షతతోనే అంతంకాలేదనటానికి కూడా ఇది నిదర్శనం. కారణమేమిటంటే, ఆ దినం మొదలు ప్రభువు మహాదినం వచ్చేవరుకూ ఉన్న కాలానికి సంబంధించింది ఈ ప్రవచనం.PPTel 11.1

    అయితే పెంతెకొస్తు దినం యోవేలు ప్రవచనాన్నే కాక ఇతర ప్రవచనాల్ని కూడా నెరవేర్చింది. సిలువ మరణానికి ముందు శిష్యులతో ఆయన అఖరిసారిగా మాట్లాడినప్పుడు క్రీస్తు అన్న ఈ మాటల్నీ నెరవేర్చింది. “నేను తండ్రిని వేడుకొం దును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకనుగ్రహించును” యోహాను 14:16,17. “ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు బోధించును” 26 వచనం “అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” యోహాను 16:13, సమాధి నుండి లేచిన తర్వాత క్రీస్తు తన శిష్యులతో ఈ మాటలన్నాడు “ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసింది మీ మీదికి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడి” లూకా 24:49PPTel 11.2

    పెంతెకోస్తునాడు శిష్యులు ఈ విధముగా పై నుంచి శక్తిని పొందారు. కాని క్రీస్తు చేసిన ఈ వాగ్దానం, యోవేలు ప్రవచనంలాగే,ఆ సందర్భానికి పరిమితం కాలేదు. ఎందుకనంటే తమతో ఎల్లప్పుడూ ఉంటానని లోకాంతం వరకు కూడా ఉంటానని ఇదే వాగ్దానాన్ని వేరే రూపంలో వారికిచ్చాడు. ఆయన ఇలా అంటున్నాడు. “వారు బయలుదేరి వాక్యము అంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరగుచు వచ్చిన సూచన క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను” మార్కు 16:20 పెంతెకోస్తు దినాన వారు చూసిన ఆత్మ ప్రత్యక్షత నిత్యము కొనసాగుతుందని పేతురు వారికి చెప్పాడు. మారు మనస్సు పొందిన యూదులు “మేమేమి చేతుము? అని అపొస్తలుల్ని అడుగగా పేతురు ఈ విధముగా సమాధానం చెప్పాడు. “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణPPTel 11.3

    నిమిత్తము ప్రతీవాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందును” అ.కా 2:37-39 మనుషులు క్రీస్తు క్షమాపూరిత ప్రేమను అంగీకరించటానికి కృపకాలం కొనసాగినంతకాలం పరిశుద్దాత్మ పరిచర్య సంఘములో కొనసాగుంతుందని ఇలా సూచిస్తున్నది.PPTel 12.1

    ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కొరింథీయులకు రాసిన ఉత్తరంలో పౌలు ఈ అంశము పై తన వాదనను ఆ సంఘం ముందుంచాడు. పౌలు ఇలా అంటున్నాడు. (1 కొరింథీ 12:1) “మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టములేదు”. ఈ అంశము ఎంతో ప్రాముఖ్యమైనదని దాన్ని క్రైస్తవ సంఘం అవగాహన చేసుకోవటం అవసరమని అతను భావించాడు. ఆత్మ ఒక్కటే అయినా కృపావరాలు నానావిధాలని చెప్పి వాటి వైవిద్యాన్ని వివరించిన అనంతరం వివిధ విధులతో, వివిధ వరాలతో సంఘం ఎలా వ్యవస్థీకృతమయ్యిందో వివరించటానికి పౌలు వివిధ అవయువాలు వాటి వాటి విధులు నిర్వరిస్తూ అన్ని కలసి ఐక్యంగా పనిచేస్తూ ఎలా ఏకత్వాన్ని సాధ్యపర్చుతాయో అలాగే సంఘములోని ఆయా విభాగాల ద్వారా పనిచేస్తూ సంఘాన్ని సంపూర్ణ సామరస్యం గల మత వ్యవస్థగా పరిశుద్దాత్మ తీర్చిదిద్దాల్సి ఉన్నాడు. ఆ తరువాత పౌలు ఇలా అంటున్నాడు. “మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాటలాడు వారిగాను నియమించెను”.PPTel 12.2

    దేవుడు కొందరిని సంఘములో “నియమించెను” అన్నమాటల్లో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంఘములో కృపావరాలు కనపించటానికి మార్గం సుగమనం అయ్యింది అనటంకన్నా ఎక్కువ అర్ధం ఇమిడి ఉన్నది. ఇది సూచిస్తున్నదేంటంటే, కృపావరాలు సంఘం యధార్థ ఆధ్యాత్మిక స్వభావంలో నిత్యభాగంగా కొనసాగాలని ఇవి సంఘములో క్రియాశీలం కాకపోతే సంఘం పరిస్థితి ప్రమాదం వల్లో, వ్యాధి వల్లో కొన్ని అవయవాలు కోల్పోయిన మానవ శరీరం పరిస్తితిని పోలీ ఉంటుందని ఒకసంఘములో ఏర్పాటైనప్పుడు వాటిని లాంఛనంగాPPTel 12.3

    తొలగించేవరుకూ ఈ వరాలు కొనసాగాలి. ఇకపోతే ఇవి ఎన్నడైనా తొలగించబడ్డ దాఖలాలు ఎక్కడాలేదు. అయిదేళ్ళ తరువాత అవే వరాల గురించి కొరింథీయులకి రాస్తూ లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తూ ఆ లక్ష్యం సిద్ధించేవరకూ అవి కొనసాగాలని ఆ అపొస్తలులడే పరోక్షంగా సూచించాడు. ఆయన ఇలా అంటున్నాడు (ఎఫెసీ 4:8, 11-13 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మను ష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.పరిశుద్ధులు సంపూర్ణు లగు నట్లు, క్రీస్తు శరరీము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయనకొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను,కొందరిని సువార్తికు లనుగాను, కొందరినికాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను”.PPTel 13.1

    ఇక్కడ ఉద్దేశించిన ఐక్యస్థితికి సంఘం అపొస్తలులయుగంలో చేరుకోలేదు. ఆయుగం ముగిసిన కొద్దికాలనికే సంఘాన్ని ఆధ్యాత్మిక భ్రష్టత ఆవరించింది. ఆ క్షీణదశ కొనసాగిన కాలంలో సంఘం క్రీస్తులోని ఈ పరిపూర్ణత్వానికి, విశ్వాసపరమైన ఐక్యస్థితికి చేరుకోలేకపోయింది. సువార్త సంస్కరణల్నిటిలో సంపూర్ణులై, మనుషకుమారుని, రాకకు ఎదురు చూసే ప్రజల్ని చివరి కృపావర్తమానం ప్రతీ జాతిలోనుంచి ప్రతి అబద్ద వ్యవస్తలో నుంచి పోగు చేసేవరకూ ఆ ఐక్య స్థితికి సంఘం చేరుకోవటం జరగదు. నిజానికి, సంఘం, ఓదార్పు కోసం, మార్గదర్శకత్వం కోసం, ప్రోత్సాహం సంరక్షణ కోసం ఏర్పాటైన ప్రతీ సాధనం సంఘానికి అవసరమయ్యే సమయం ఏదైనా ఉంటే అది చివరి దినాల్లో కలిగే శ్రమలనడుమే అనాలి. అనుభవం ద్వారాను శిక్షణ ద్వారాను దుష్టకార్యాల్లో పరిపూర్ణత్వం సాధించిన ముష్కరులు సాధ్యమైతే ఎంపికైన వారిని సైతం తమ మోసాలతో పడగొట్టటానికి ప్రయత్నిస్తారు. కనుక ఆత్మ కుమ్మరింపును గూర్చిన ప్రవచనాలు చివరి దినాల్లోని సంఘానికి మేలు చేయటానికి అనుగ్రహించబడ్డాయనటం సమంజసం.PPTel 13.2

    ఆత్మ వరాలు కేవలం అపొస్తలులు యుగానికే పరిమితమైనవని, సువార్త సేవను ప్రారంభించటానికి మాత్రమే అవి అప్పుడు ఏర్పాటయ్యాయని, సువార్త స్థాపితమయ్యింది. గనుక ఆత్మ వరాల అవసరం ఇక ఉండదని అందుచేత అవి త్వరలో సంఘంలోనుంచి తొలగించబడటం తరువాయి అని క్రైస్తవ లోకంలో ప్రస్తుతం ప్రచురమవుతున్న సాహిత్యం బోధిస్తున్నది. అయితే “ధర్మ విరోధ సంబంధమైన మర్మము” క్రియ చేయటం మొదలు పెట్టిందని. తాన వెళ్ళిపోయిన తరువాత తమ మధ్యకు క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించి మందను పాడు చేస్తాయని, విశ్వాసుల్ని తమ చుట్టూ పోగు చేసుకోవటానికి తప్పుడు బోధ బోధించే వ్యక్తులుPPTel 13.3

    బయలెళ్తారని పౌలు ఆనాటి క్రైస్తవుల్ని హెచ్చరించాడు. అ.కా 20:29,30 కనుక, ఈ పాపాల నుంచి సంఘాన్ని కాపాడటానికి ఉద్దేశించి సంఘములో ఉంచిన ఆత్మ వరాలు వాటి నిర్ణీత కార్యాన్ని ముగించాయి గనుక అవి ఇక తొలగించబడ్డాయనటం సరికాదు. ఎందుకంటే, ఈ పరిస్థితుల్లో వాటి ఉనికి, సహాయం అపొస్తలులు కార్యరంగంలో ఉన్నవాటి కన్నా ఇప్పుడు మరింత అవసరం.PPTel 14.1

    పౌలు కొరింథీయులికి రాసిన ఉత్తరంలో ఇంకొక వాక్యం ఉన్నది. అది వరాలు తాత్కలికమన్న జన సామాన్య అభిప్రాయాల్ని ఖండిస్తున్నది. అది క్రైస్తవుడి అపరిపూర్ణ స్థితికి, తుదకు క్రైస్తవుడు చేరనున్న మహిమకరమైన అమర్త్య స్థితికి మధ్య గల వ్యత్యాసాన్ని సూచిస్తున్న వాక్యం 1 కొరింథి 13. ఆయన ఇలా అంటున్నాడు. (9,10 వచనాలు) “మనము కొంతమట్టుకు ఎరుగుదుము. కొంతమట్టుకు ప్రవచించు చున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును” ప్రస్తుత బలహీన అపరిపూర్ణ పరిస్థితిని స్పష్టమైన దృష్టి, పరిపక్వత, బలంతో నిండిన యౌవన దశతో సరిపోల్చుతున్నాడు. ప్రస్తుతమున్న ఈ అపరిపూర్ణ స్థితిలో అవసరమైన వాటిగా ఆత్మ వరాల్ని పేర్కొంటూ పరిపూర్ణ స్థితి వచ్చిననప్పుడు వాటి అగత్యం ఉండదని అంటున్నాడు. ఆయన ఈ మాటలంటున్నాడు (12వ వచనం) “ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగి యున్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును”. అనంతరం, ఆ నిత్యపరిపూర్ణ స్థితికి సమంజసమైన సుగుణాలు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అని పేర్కొంటూ “ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ” అంటున్నాడు.PPTel 14.2

    ఎనిమిదో వచనంలోని భావాన్ని ఇది వివరిస్తున్నది. “ప్రేమ శాశ్వతకా లముండును” అంటే దైవకృపాభరితమైన ప్రేమ నిత్యము నిలుస్తుంది. అంది మానవుడి భవిష్యత్తుకి మహిమ కిరీటం. కాని “ప్రవచనములైనను నిరర్థకములగును”. అంటే ప్రచవనాల అవసరంలేని సమయం వస్తున్నది. సంఘానికి తోడ్పడే సాధనంగా ప్రవచనవరం ఉపయుక్తం కాదు. “భాషలైనను నిలిచిపోవును” అనగా, భాషలు మాట్లాడే వరం నిరుపయోగమౌతుంది. “జ్ఞానమైనను నిరర్థకముగును” అనగా ఆ నిత్యలోకంలో మనం పొందనున్న పరిపూర్ణజ్ఞానం ప్రత్యేక ఆత్మ వరాల్లో ఒకటిగా కలిగే జ్ఞానాన్ని నిరర్థకం చేస్తుంది. పోతే, ఇక వాటి అవసరం లేదు గనుక వరాలు అపొస్తలుల యుగంతోనే ఆగిపోయాయన్న వాదనను మనం ఆమోదిస్తే సంఘ చరిత్రలో అపొస్తలులయుగం బలహీనతలు చిన్న పిల్లలPPTel 14.3

    చేష్టలతో నిండిన యుగమని, అప్పుడు సమస్తం అద్దంలోనుంచి మసక మసకగా మాత్రమే చూడగలిగామని, కాని దాని తరువాత వచ్చిన యుగం, మందను పాడు చేయటానికి మందలోకి క్రూరమైనతోడేళ్ళు ప్రవేశించాల్సి ఉన్న యుగం, విశ్వాసుల్ని తమ పక్కకు తిప్పుకొనేందుకు తప్పుడు బోధలు బోధించటానికి సంఘంలో సైతం కొందరు లేవాల్సి ఉన్న యుగం సంపూర్ణ సత్యం సంపూర్ణజ్ఞానం ఉన్న యుగమని ఆ యుగంలోనే అపొస్తలుల అసంపూర్ణ అపరిపక్వ జ్ఞానం గతించపోయిందని అంగీకరించటమవుతుంది.PPTel 15.1

    పరిపూర్ణ స్తితి కలిగినప్పుడే వరాలు ఆగిపోతాయన్న విషయం జ్ఞాపక ముంచుకోవాలి. ఆ స్థితి వచ్చినపుడు అది వచ్చింది గనుక వాటి అవసరం ఇక ఉండదు. అయితే ఆధ్యాత్మికత విషయంలో అపొస్తలుల యుగం దాని తరువాత వచ్చిన ఏయుగానికి తీసిపోయిందికాదని ఆలోచనాపరులు అంగీకరిస్తారు. ఆనాడు ఆత్మవరాలు అగత్యమైతే ఇప్పుడవి తప్పనిసరిగా అవసరమౌతాయి.PPTel 15.2

    కొరింథీయులకి, ఎఫెసీయులికి రాసిన ఉత్తరాల్లో “కాపరులు”, “బోధకులు”, “ఉపకారములు చేయవారు”, “ప్రభుత్వము చేయువారు” సంఘములో ఏర్పాటైన “వరములు”గా పౌలు వివరించాడు. ఈ వరాలు ఇంకా సంఘంలో కొనసాగుతున్నట్లు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే తక్కిన వాటిని అనగా విశ్వాసాన్ని స్వస్థ పర్చటాన్ని ప్రవచించటాన్ని ఎందుకు అంగీకరించకూడదు? ఆదిలో వరాలన్ని సంఘములో సమానంగా ఏర్పాటై ఉండగా గిరిగీసి ఈ వరాలు సంఘములో లేవని చెప్పటానికి సమర్థులెవరు? |PPTel 15.3

    చివరి దినాల్లో వరాల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పే ప్రవచనంగా ప్రకటన 12 :17 వ్యవహరించబడుతున్నది. దాని సాక్ష్యాన్ని పరిశీలిస్తే ఈ అభిప్రాయం ధృడపడుతుంది. ఈ వచనం స్త్రీ సంతానంలో “శేషించిన” వారి గురించి ప్రస్తావిస్తున్నది. స్త్రీ సంఘానికి గుర్తుకాగా, ఆమె సంతానం ఏకాలంలోనైనా సంఘానికి సంబంధించిన వ్యక్తిగత సభ్యులు. ఆమె సంతానములో “శేషించినవారు” అంటే క్రైస్తవ సంతతిలో చివరి తరం వారు లేదా క్రీస్తు రెండో రాకడ సమయంలో భూమి పై జీవించి ఉన్నవారు. వీరు “దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమమును గైకొను” వారని ఆ వచనం చెబుతున్నది. “యేసును గూర్చిన సాక్ష్యము” ప్రవచన సారము అని ప్రకటన 19:10 విశదం చేస్తున్నది. ఆత్మ వరాల్లో దీన్ని “ప్రవచన వరము”గా అవగాహన చేసుకోవాలి. 1 కొరింథీ 12:9,10PPTel 15.4

    సంఘంలో వరాలు ఏర్పాటవ్వటమంటే ప్రతీ వ్యక్తికి అవి ఉండాలని కాదు. ఈ అంశముపై అపొస్తలుడిలా అంటున్నాడు(1 కొరింథీ 12:29“అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? ఉద్దేశించిన జవాబు కాదు అని. అందరూ కాలేరు కాగా దేవుని చిత్త ప్రకారం వరాలు సభ్యులకు పంపిణీ అవుతాయి.1 కొరింథీ 12:7, 11. అయినా వీరు సంఘానికి దేవుడిచ్చిన వరాలుగా వ్యవహరించటం కద్దు. సంఘములో ఒక్క సభ్యుడికి, ఒక వరమున్నప్పటికి అది సంఘమలో ఉన్న వరము లేదా సంఘానికున్న వరము అని చెప్పవచ్చు. కనుక చివరి తరం యేసును గూర్చిన సాక్ష్యం లేదా ప్రవచనం కలిగి ఉండాల్సి ఉన్నది. అది వారికున్నది కూడా.PPTel 16.1

    చివరి దినాల్లో దృష్టిలో ఉంచుకొని రాసినట్లు కనబడుతున్న ఇంకో లేఖన భాగం ఇదే అంశాన్ని మన దృష్టికి తెస్తున్నది. అది 1 థెస్స 5వ అధ్యాయం, అపొస్తలుడు ఈ మాటలతో అ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. “సహొదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును” 4వ వచనంలో ఇలా అంటున్నాడు. “ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు”. తరువాత ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆయా సలహాలు ఇస్తున్నాడు. అందులో ఇవి కొన్ని “ఆత్మను అర్పకుడి. ప్రవచించు టను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” 23వ వచనంలో “ప్రవచించుట”తో సంబంధమున్న వీరి నిమిత్తమే ప్రభువు రాకడ వరకు వారిని పరిశుద్ధ పర్చి కాపాడాల్సిందని ప్రార్ధన చేస్తున్నాడు.PPTel 16.2

    వీటిని పరిగణలోనికి తీసుకొని సంఘములో చివరి దినాల్లో ప్రవచనం వరం ప్రదర్శితమవుతుందని దాని మూలంగా ఎక్కువ సత్యాన్ని సమయానుకులమైన ఉపదేశాన్ని పొందుతామని నమ్మటం సమంజసమేగదా? అపొస్తలుని నిబంధన ప్రకారం సమస్తాన్ని పరీక్షించాలి. “సమస్తమును పరిక్షించి మేలైన దానిని చేపట్టుడి”. రక్షకుని ప్రమాణం ప్రకారం పరీక్షించాలి, “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు” ప్రవచన వరం ప్రత్యక్షత విషయంలో ఈ ప్రమాణం ప్రకారం పరీక్షించి బైబిలు దేవుని వాక్యమని, సంఘం క్రీస్తు శరీరం అని క్రీస్తు దానిని శిరస్సు అని విశ్వసించేవారందరికి ఈ పుస్తకాన్ని సిఫార్సు చేస్తున్నాంPPTel 16.3

    - యు. స్మిత్

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents