Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    62—దావీదు అభిషేకం

    “మహారాజు పట్టణం”అయిన యెరూషలేముకు దక్షిణంగా కొన్ని మైళ్ళ దూరంలో ఉంది బెళ్లే హేము. అక్కడ పశువుల తొట్టెలో పుట్టిన శిశువుగా క్రీస్తు తూర్పు జ్ఞానుల పూజలందుకోవటానికి వెయ్యేళ్ళు ముందు యెషయి కుమారుడైన దావీదు జన్మించాడు. రక్షకుని జన్మకు ఎన్నో శతాబ్దాలుముందే బాలుడు దావీదు బెళ్లే హేము చుట్టూ ఉన్న కొండల పై తండ్రి గొర్రెల మందల్ని మేపాడు. కాపరి అయిన ఆ సామాన్య బాలుడు పాటలు రాసి పాడుకునేవాడు. సితార వాయస్తూ తన మధుర గళమెత్తి పాడేవాడు. దేవుడు దావీదును ఎంపిక చేసుకొని గొర్రెల మందలతో తన ఏకాంత జీవితంలో ఆ బాలుణ్ణి భవష్యత్తులో తన పనికి ఆయత్తపర్చు తున్నాడు.PPTel 643.1

    ఇలా గొర్రెల కాపరిగా దావీదు తన సాధారణ జీవితం జీవిస్తుండగా దేవుడైన యెహోవా అతణ్ణి గురించి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. “అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దు:ఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బేల్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.. నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలిపశువును వదించుటుకై వచ్చితినని చెప్పి యెషయిను బల్యర్పణమునకు పిలుపుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లో హేమునకు వెళ్ళెను.PPTel 643.2

    ఆ ఊరి పెద్దలు అతని సమాధానముగానే వచ్చితిని”అన్నాడు. బలి అర్పణకు హాజరు కావటానికిచ్చిన ఆహ్వానాన్ని ఆ పెద్దలు అంగీకరించారు. సమూయేలు యెషయిని అతడి కుమారుల్ని కూడా ఆహ్వానించాడు. బలిపీఠాన్ని నిర్మించారు. బలిపశువు సిద్ధంగా ఉంది. అందరికన్నా చిన్నవాడు దావీడు తప్ప యెప్పయి కుటుంబ సభ్యులందరూ హజరయ్యారు. కాపలా లేకుండా గొర్రెల్ని విడిచి పెట్టటం క్షేమం కాదు. గనుక దావీదుని గొర్రెల వెంట ఉంచారు.PPTel 643.3

    బలి అర్పణ ముగిసిన తరువాత అర్పణ విందులో పాలు పొందక ముందు సమూయేలు యెషయి కుమారుల పరీక్షను మొదలు పెట్టాడు. జ్యేష్ఠుడు ఏలియాబు తక్కినవారికన్నా ఆకృతిలోను అందంలోను దాదాపుగా సౌలులా ఉన్నాడు. అతడి సుందరాకారం. శరీర శౌష్టవం. ప్రవక్తను ఆకట్టుకున్నాయి. రాచకళా కాంతుల్ని పుణికి పుచ్చుకున్న అతణ్ణి చూసి సమూయేలు “సౌలుకి వారసుడుగా దేవుడు ఎంపిక చేసిన వాడు ఇతడే” అని భావిస్తూ అతణ్ణి అభిషేకించేందుకు దేవుని ఆజ్ఞ కోసం ఎదరు చూస్తున్నాడు. అయితే యెహోవా బాహ్యాకారాన్ని పరిగణించలేదు. ఏలీయాబు దేవునికి భయపడ్డవాడు కాదు. అతణ్ణి రాజు చేస్తే దురహంకారముతో నిండి ప్రజల్ని కఠినంగా పరిపాలించేవాడు. “అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టువాని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని తోసి వేసియున్నాను. మనుష్యులు పై రూపును లక్ష్య పెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును” అన్నది సమూయేలుకి ప్రభువిచ్చిన సందేశం. పై రూపాన్ని బట్టి కాదు మనుషుల్ని దేవుడంగీకరించేది. వివేకం ప్రవర్తనలో బహిర్గతమయ్యే ఔన్నత్యం. ధర్మశీలత ఇవే మనిషి వాస్తవిక సౌందార్యాన్ని వెలువరించేవి. మన లోపలి విలువ, అనగా ఉత్కృష్ట హృదయం సైన్యాలకు అధిపతి అయిన యెహోవా మనల్ని అంగీకరించటానికి ఆధారమవుతుంది. మన తీర్పు విషయంలో ప్రాధాన్యం గల ఈ సత్యాన్ని ఎంతో తీవ్రంగా పరిగణించాలి !PPTel 644.1

    ముఖ సౌందర్యం మీద బాహ్యాకారం మీద అనుకొనే పరిగణన ఎంత వ్యర్థమైనదో సౌలు పొరపాటు మనకు భోదిస్తున్నది. దేవుని ప్రత్యేక జ్ఞానం లేకుండా హృదయ రహస్యాల్ని లేదా దేవుని ఆలోచనల్ని గ్రహించటానికి మన వివేకం ఎంత అసమర్థమో మనం చూస్తున్నాం. తన ప్రజల విషయంలో దేవుని ఆలోచనలు మార్గాలు హద్దులు గల మానవ మనసు గ్రహించలేనివి. కాగా మానవదుష్టత్వం వల్ల దేవుని ప్రణాళికలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు దేవుని బిడ్డలు ఆయన చిత్తానికనుగుణంగా నడుచుకున్నట్లయితే వారు ఏ స్థానానికి అర్హులో దాన్ని అక్రమించటానికి, వారికి దేవుడు ఏ పనిని అప్పగించాడో దాన్ని ముగించటానికి శక్తి పొందుతారన్నది నిస్సందేహం. సమూయేలు నిర్వర్తిస్తున్న పరీక్షలో భాగంగా ఏలీయాబు అర్పణకు హాజరైన అతడి అరుగురు సోదరులూ ప్రవక్త ముందునుంచి నడిచి వెళ్ళారు. వారిలో ఏ ఒక్కణ్నీ దేవుడు ఎంపిక చెయ్యలేదు. తీవ్ర ఉత్కంఠంతో ఆ యువకుల్లో ఆఖరివాణ్ని సమూయేలు పలకిరించాడు. అతడిలో ఆందోళన గందరగోళం చోటు చేసుకున్నాయి. “నీ కుమారులందరు ఇక్కడున్నారా”? అని సమూయేలు ప్రశ్నించగా “ఇంకను కడసారి వాడున్నాడు.. అయితే వాడు గొట్టెలను కాయుచున్నాడు” అని తండ్రి బదులిచ్చాడు. అతణ్ణి పిలిపించమని ఆదేశించి “అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుము” అని సమూయేలు అన్నాడు.PPTel 644.2

    ప్రవక్త బేళ్లే హేముకు విచ్చేసినట్లు తనకోసం కబురంపినట్లు దూత తెలపగా ఒంటరిగా ఉన్న ఆ కాపరి బెదిరిపోయాడు. ఇశ్రాయేలీయుల ప్రవక్త న్యాయాధిపతి అయిన సమూయేలు నన్ను చూడాలనటం ఏంటి? అని ప్రశ్నించాడు. కాని ఆ పిలుపుకు స్పందించి వెంటనే బయలుదేరాడు. “అతడు ఎఱ్ఱనివాడు చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునైయుండెను” అందగాడు, మగసిరిగలవాడు అయిన ఆ సాధారణ కాపరి బాలుడి పై సమూయేలు దృష్టి సారిస్తుండగా దేవుని స్వరం ప్రవక్తతో ఇలా అంది. “నేను కోరుకున్న వాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుము” తన సామన్య కాపరి వృత్తిలో దావీదు సాహసవంతుడుగా నమ్మకమైన సేవకుడుగా నిరూపించుకొన్నాడు. దేవుడు అతణ్ణి ఇప్పుడు తన ప్రజలకు నాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. “సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని -సహోదరుల యెదుట (మార్జిను -సహోదరులలో నుంచి)వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ- దావీదు మీదికి బలముగా వచ్చెను” ప్రవక్త దైవ నియోగిత కర్తవ్యాన్ని పూర్తి చేసి తేలికైన హృదయంతో రామాకు తిరిగి వెళ్ళాడు.PPTel 645.1

    తాను ఎందుకు వచ్చింది సమూయేలు యెష్సయి కుటుంబముతో సహా ఎవ్వరికి చెప్పలేదు. దావీదు అభిషేకం రహస్యంగా జరిగింది. తన కోసం తనముందు ఉన్నతమైన ఉజ్వలమయిన భవిష్యత్తు వేచి ఉన్నదని అతడు గ్రహించటానికి అదొక సూచిక. మున్ముందు తనకు రానున్న రకరకాల అనుభవాలు అపాయాల నడుమ దేవునికి నమ్మకంగా నిలిచి తన మనుగడ ద్వారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి అతణ్ణి ఈ జ్ఞానం ఆవేశపర్చవచ్చు.PPTel 645.2

    దావీదుకు జరిగిన గొప్ప సన్మానంలో అతడిలో అతిశయం పుట్టించలేదు. తాను సమున్నత స్థానాన్ని అక్రమించబోతున్నప్పటికి తన పనిలో యధావిదిగా కొనసాగుతున్నాడు. ప్రభువు తన ప్రణాళికల్ని తాననుకొన్న రీతిలలోను సమయంలోను అమలుజరి పేవారకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కాపరి బాలుడు అభిషేకానికి ముందులాగే వినయంతో విధేయతతో తిరిగి వచ్చి కొండల నడుమ తన గొర్రెల కాపలా పనిని కొనసాగించాడు. అయితే ఇప్పుడు నూతన ఉత్సాహంతో గీతరచన చేసి వాటిని తన సితారపై వాయించాడు. రకరకాల సొగసులతో ప్రకృతి దృశ్యం అతడి ముందు విప్పారింది. పండ్లగుత్తులతో వేలాడుతున్న తీగెలు సూర్యకాంతికి మెరుగులు దిద్దుతున్నాయి. పచ్చని ఆకులతో నిండిన అడివి వృక్షాలు గాలికి తలలు ఊపుతున్నాయి. సూర్యుడు అవకాశాన్ని ఊషకాంతితో నింపుతూ ఉదయించటం అతడు చూసాడు. ఉదయిస్తున్న సూర్యుడు తన విడిదిలో నుంచి బయటికి వస్తున్న పెళ్ళికొడుకులా, PPTel 645.3

    పరుగు పందెల్లో పరుగెత్తటానికి ఉత్సాహపడుతున్న బలవంతుడిలా వస్తున్నాడు. అకాశన్నంటుతున్న పర్వత శిఖరాలు కనిపిస్తున్నాయి. అల్లంత దూరాన మోయాబు కొండలు రాతిగోడల్లే ఉన్నాయి. వీటన్నిటికి పైన నీలి ఆకాశం విస్తరించి ఉన్నది. ఆ పైన దేవుడున్నాడు. ఆబాలుడు ఆయన్ని చూడలేడు. కాని ఆయన ప్రకృతి ఆయన స్తోత్రంతో నిండి ఉన్నది. పగటి, వెలుగు, అడువులు, పర్వతాలు, మైదానాలు, సెలయేళ్ళు శ్రేష్టమైన ప్రతీ ఈవి సంపూర్ణమైన ప్రతీ వరం ఇచ్చే తండ్రిని వీక్షించటానికి మనసును పైకి లేపాయి,. సృష్టికర్త శీలం ఔన్నత్యాన్ని గూర్చి దినదినమూ కనిపిస్తున్న కార్యాలు యువ కవి హృదయాన్ని భక్తి భావంతోను ఆనందంతోను నింపాయి దేవుని గురించి ఆయన కార్యాల గురించిన ధ్యానంలో దావీదు మానసిక శక్తులు తన జీవిత కర్తవ్య నిర్వహణకు వృద్ధి చెంది బలో పేతమయ్యాయి. రోజుకి రోజు దేవునితో అతడికి సన్నిహిత అనుబంధం ఏర్పడింది. తన కవితకు తాజా ఇతివృత్తాల కోసం తన వీణెకు మధుర సంగీతం సమకూర్చేందుకోసం బాలదావీదు మనసు అనునిత్యం విషయము పరిశోధన చేసేది. దావీదు తన గళమెత్తి మధురంగా పాడుతంటే పరలోక దూతల గానానికి పరవశించి ప్రతిస్పందిస్తున్నవో అన్నట్లు కొండల్లో నుంచి ఆ గానం ప్రతిధ్వనించేంది.PPTel 646.1

    ఆ ఏకాంతపు కొండలనడుమ సంవత్సరాలుగా శ్రమిస్తూ సల్పిన సంచారం ఫలితాల్ని ఎవరు విలువకట్టగలరు ? ప్రకృతితోను దేవునితోను సహవాసం, గొర్రెల మందల ఆలన, పాలన గొర్రెల్ని రక్షించటంలోని ప్రమాదాలు, తన పేద జీవనంలోని దు:ఖాలు సంతోషాలు దావీదు ప్రవర్తనను తీర్చిదిద్ది తన భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేయటమే గాక ఇశ్రాయేలీయుల మధుర కవి కీర్తనల ద్వారా భావియుగాలన్నిటిలో దైవ ప్రజల హృదయాల్లో ప్రేమను విశ్వాసాన్ని రగిలించి వారిని ప్రేమామయుడైన ప్రభువుకు దగ్గరగా తేవాల్సి ఉన్నాయి.PPTel 646.2

    దావీదు నవయౌవనంలో ఉన్నాడు. అందగాడు, బలసంపన్నుడు, లోకంలో ఉత్తమ వ్యక్తులతో సమానంగా ఉన్నత స్థానాన్ని అధిష్టించటానికి సిద్ధపడుతున్నాడు. అతడు తన వరాల్ని వరాలిచ్చే దేవుని మహిమను కొనియాడటానికి ఉపయోగించాడు. దైవ చింతనలోను దైవ ధ్యానంలోను అతడు గడిపిన ఘడియలు అతడికి వివేకాన్ని భక్తిని సమకూర్చాయి. అవి అతణ్ణి దేవునికి దేవ దూతలకీ ప్రీతి పాత్రుణ్ణి చేసాయి. సృష్టికర్త సంపూర్ణత్వాన్ని గూర్చి ధ్యానించుటం వల్ల దేవుని గూర్చి నిస్పష్టమైన అభిప్రాయాలు అతడి మనసులోకి వచ్చాయి. గ్రాహ్యంకాని అంశాలపై అవగాహన కలిగింది. చిక్కులు విడిపోయాయి. అందోళనలు మటుమాయమయ్యాయి. ప్రతీ నూనత సత్యకిరణం అమితానందాన్నిచ్చింది. రక్షకుని పట్ల భక్తిని ఆయనకు మహిమను వ్యక్తం చేస్తూ మరింత మధురమైన గీతాలు వెలవడ్డాయి. తనను చలింపజేసిన ప్రేమ, తనను కుంగదీసిన దు:ఖాలు తనకు కలిగిన విజయాలు అన్నీ అతడి తీవ్రమైన ఆలోచనకు అంశాలే. తన జీవితంలో అన్ని సందర్భాల్లోను దేవుని కృపను వీక్షించినపుడు అతడి హృదయం ప్రగాఢ భక్తి కృతజ్ఞలతో స్పందించింది. అతడి గళం మరింత మధుర గానంతో స్తుతించింది. అతడి సితార ఎంతో ఉత్సాహంగా మోగింది. ఈ కాపరి బాలుడు బలాన్ని జ్ఞానాన్ని పొందుతూ వృద్దిగాంచాడు. ఎందుకంటే దేవుని ఆత్మ అతడికి తోడుగా ఉన్నాడు.PPTel 646.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents