Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    66—సౌలు మరణం

    ఇశ్రాయేలీయులు ఫిలీప్రియుల మధ్య మళ్ళీ యుద్ధం ప్రకటితమయ్యింది. “ఫిలీప్తీయులు దండెత్తి వచ్చి షూనేము యెఱ్ఱయేలు మైదానం ఉత్తరపు అంచున ఉన్నది. ఆ మైదానం దక్షిణపు అంచున గిల్బోవ పర్వతం వద్ద ఫిలిప్తీయులకి కొన్ని మైళ్ల దూరంలో సౌలు అతడి సైన్యం తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఈమైదానంలోనే గిద్యోను తన మూడువందల మంది యోధులతో మిద్యాను సైన్యాన్ని పలాయనం చిత్తగింపజేసాడు. కాగా ఇశ్రాయేలు విమోచకుణ్ణి ఉత్తేజపర్చిన స్పూర్తి వేరు ఇప్పుడు రాజును ప్రేరేపిస్తున్న స్పూర్తి వేరు. యాకోబు యొక్క మహాశక్తి గల దేవుని పై విశ్వాసంతో గిద్యోను మందుకు వెళ్ళాడు. కాగా దేవుడు తనను విడిచి పెట్టినందున సౌలు ఏకాకి అయ్యాడు. భద్రంలేని వాడయ్యాడు. కన్నులెత్తి ఫిలీప్తీయ బలగాల్ని తిలికించినప్పుడు “మనస్సునందు భయకంపము” పుట్టింది అతడికి.PPTel 683.1

    దావీదు అతడి బలగాలు ఫిలీప్తీయులికి మద్దుతు ఇస్తున్నట్లు తెలుసుకొన్నాడు. తనకు జరిగిన అన్యాయానికి యెషయి కుమారుడు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకొంటాడని సౌలు భావించాడు. దేవుడు ఎంపిక చేసుకొన్న వాడిని నిర్మూలించటానికి అతణ్ని ముందకు నెట్టిన అహేతుక ఉద్రేకమే జాతిని అంత గొప్ప ప్రమాదంలోకి నెట్టింది. దావీదును తరుమటంలో తలమునకలై సౌలు దేశభద్రతను నిర్లక్ష్యం చేసాడు. భద్రత కొరవడ్డ పరిస్థితిని అలుసుగా తీసుకొని ఫిలీప్రియులు దేశం నడిబొడ్డుకు చొచ్చుకు వచ్చారు. దావీదును వేటాడి నిర్మూలించటానికి తన సర్వశక్తి ధారపోయటానికి సౌలును ప్రోత్సహించిన సాతాను అదే సమయంలో సౌలును నాశనం చేసి దైవ ప్రజల్ని తుదముట్టించటానికి ఫిలిప్తీయుల్ని ఆవేశపర్చాడు. ఇదే విధానాన్ని ఈ ప్రధాన శత్రువు ఎంత తరచుగా ఉపయోగిస్తున్నాడు! సంఘములో ఈర్ష్యా విభేదల నెగళ్ళు ఎగదొయ్యటానికి ఒక భక్తిహీనుణ్ని ప్రోత్సహించి ఆ తర్వాత దైవ ప్రజల్లో చోటు చేసుకున్న విభేదాల్ని అసరా చేసుకొని వారిని నాశనం చేయటానికి తన ప్రతినిధుల్ని ఉసికొలుపుతాడు.PPTel 683.2

    మరుసటి ఉదయం సౌలు ఫిలీప్తీయులతో యుద్ధం చేయాల్సి ఉంది. రానున్న నాశనం క్రీనీడలు అతడి చుట్టూ కమ్ముతున్నాయి. సహాయం కోసం దిశానిర్దేశం కోసం పరితపించాడు. దేవుని నడుపుదలను వ్యర్ధంగా అన్వేషించాడు. ” యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను”. చిత్తశుద్ధితోను, దీన మనసుతోను తన వద్దకు వచ్చిన వారి నెవర్నీ ప్రభువు తోసి పుచ్చలేదు. అయితే సౌలుకి జవాబివ్వకుండా అతణ్ణి ప్రభువు ఎందుకు విసర్జించినట్లు? దేవుని చిత్తమేమిటో తెలుసుకోవటానికి ఏర్పాటైన పద్దతుల్ని, ప్రయోజనాల్ని తన దుషతాల మూలంగా రాజు పొగొట్టుకున్నాడు. సమూయేలు సలహాల్ని సౌలు తోసిపుచ్చాడు. దేవుడు ఎంచుకున్న దావీదుని ప్రవాసిని చేసాడు. దేవుని యాజకుల్ని సంహరించాడు. తాను ఏర్పాటు చేసిన ఉత్తర ప్రత్యుత్తర సాధనాల్ని మూసివేసిన అతడి విజ్ఞప్తికి దేవుడు స్పందించటం సాధ్యమా? కృపకు మూలమైన ఆత్మను పాపం చేసి తరిమివేసాడు. కలల ద్వారా, దేవుని వద్ద నుంచి ప్రత్యక్షతల ద్వారా అతడు జవాబు పొందటం జరిగే పనా? సౌలు పశ్చాత్తాపం పొంది దీన మనసుతో దేవుని తట్లు తిరిగలేదు. అతడు కోరుకొంటున్నది పాపక్షమాపణ, దేవునితో సమాధానం కాదు గాని తన శత్రువుల చేతిలో నుంచి విడుదల, అతడు దేవునికి దూరం కావటం తన మంకుతనం తిరుగుబాటు వల్ల తాను చేజేతుల చేసుకొన్నదే. పశ్చాత్తాపం మారుమనస్సు ద్వారా తప్ప తిరిగి వచ్చే మార్గం వేరొకటి లేదు. మానసిక క్షోభతో నిరాశతో సతమతమవుతున్న రాజు ఇతర మార్గాల్లో సాయం పొందటానికి నడుం బిగించాడు.PPTel 683.3

    “అప్పుడు సౌలు -నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక స్త్రీనికనుగొనుడి. నేను పోయి దాని చేత విచారణ చేతును” అన్నాడు. ప్రేత విద్య స్వభావ స్వరూపం గురించి సౌలుకి మంచి పరిజ్ఞానముంది, ప్రభువు దాన్ని ప్రత్యేకించి నిషేధించాడు. ఈ అపవిత్రత కళను చేపట్టిన వారికి మరణ దండన అమలయ్యేది. సమూయేలు బతికి ఉన్నకాలంలో భూతాలతో సంప్రదించే వారందరికి సౌలు మరణ దండన శాసించాడు. కాని ఇప్పుడు నిస్సహాయ స్థితిలో వున్న సౌలు తాను హేయ కార్యంగా ఒకప్పుడు ప్రకటించిన పనినే చేయటానికి పూనుకున్నాడు.PPTel 684.1

    దయ్యాల వద్ద విచారణ చేసే ఒక స్త్రీ రహస్యంగా ఎన్డరులో నివసిస్తున్నట్లు రాజుకు తెలిసింది. తన ఉద్దేశాల్ని నెరవేర్చుకోవటానికి ఈ స్త్రీ సాతాను నియంత్రణకు లొంగి ఉండటానికి సాతానుతో నిబంధన చేసుకొంది. అందుకు ప్రతిఫలంగా సాతాను ఆమెకు అద్భుతాలు చేసే శక్తినిచ్చాడు ఆమెకు రహాస్యల్ని బయలుపర్చాడు.PPTel 684.2

    మారువేషం ధరించి ఇద్దరు సేవకుల్ని వెంట పెట్టుకొని రాత్రిపూట సౌలు ఆసోదెగత్త ఇంటికి బయలుదేరాడు. అది దయనీయ దృశ్యం! ఇశ్రాయేలీయుల రాజుని సాతాను తన బందీగా తీసుకువెళ్ళం! దేవుని ఆత్మ తాలూకు పరిశుద్ధ ప్రభావాల్ని ప్రతిఘటిస్తూ తన సొంత మార్గాన్నే అవలంభించటానికి నిశ్చయించుకొన్న వ్యక్తి నడిచే మార్గం కన్న భయంకరమైన చీకటి మార్గం ఇంకొకటి ఎక్కడుంది! నియంతలందరిలోకి అతి భంయకరమైన నియంత స్వీయ సంతృప్తి. దీనికి లొంగే బానిసత్వం కన్న ఘోరమైన బానిసత్వం ఏది ! దేవుని పై నమ్మకం, ఆయన చిత్తానికి విధేయత - ఇవి సౌలు ఇశ్రాయేలీయుల పై రాజుగా ఉండేందుకు షరతులు. తన పరిపాలన కాలమంతా సౌలు ఈ షరతుల్ని నెవరేర్చి ఉన్నట్లయితే అతడి రాజ్యం సుస్తిరంగా ఉండేది. దేవుడు అతడికి మర్గాదర్శకుడుగా ఉండేవాడు. సర్వశక్తుడు అతడికి కవచంగా ఉండేవాడు. సౌలు విషయంలో దేవుడు దీర్ఘకాలం సహనం చూపించాడు. అతడి తిరుగుబాటు. మొండితనం అతడి ఆత్మలోని దైవ స్వరాన్ని అణిచివేసినప్పటికి పశ్చాత్తాపానికి ఇంకా అవకాశం ఉంది. కాని తనకు అపాయకరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు దేవుని విడిచి పెట్టి సహాయం కోసం సాతాను కూటమిని ఆశ్రయించినప్పుడు సృష్టికర్తతో తనకున్న బంధాన్ని తెంచుకున్నాడు. అతడు కొన్ని సంవత్సరాలుగా నియంత్రించి నాశనం అంచుకు తీసుకువచ్చింది.PPTel 684.3

    రాత్రి చీకటిలో సౌలు అతడి సహచరులు మైదానం దాటివెళ్ళారు ఫిలీప్తీయుల సేనల కంటపండకుండా వారిని దాటి పర్వత ప్రాంతం దాటి ఎన్డరు మాంత్రికురాలు ఒంటరి గృహం చేరుకున్నారు. భూత విద్యలో ఆరితేరిన ఆ స్త్రీ తన అపవిత్ర మంత్రాన్ని ఉచ్చరించుకోవటానికి ఇక్కడ రహస్యంగా నివసిస్తున్నది. మారువేషం ధరించినా సౌలు గంభీర దేహం, రాజ ఠీవి అతడు సామాన్య సైనికడు కాదని చాటుతున్నాయి. తన సందర్శకుడు సౌలుని ఆస్త్రీ అనుమానిచింది. అతడు ఇచ్చిన విలువైన బహుమతులు ఆమె అనుమానానికి బలం చేకూర్చాయి.“నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువానిని రప్పించుము” అన్న అతడి మనవికి ఆ స్త్రీ సమాధానం ఇచ్చింది. “ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా? కర్ణ పిశాచిము గలవారిని, చిల్లింగివారిని అతడు దేశములో నిర్మూలము చేసెను గదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియెగ్గి నాకు మరణమేల రప్పింతువు”? అంతట “సౌలు యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష యెంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేసాడు. “నీతో మాటలాడుటకై నేనెవని రప్పించవలెను”అని ఆ స్త్రీ అడుగగా అతడు “సమూయేలును”అని బదులు పలికాడు.PPTel 685.1

    తన మంత్రాలు ఉచ్చరించిన అనంతరము ఆమె ఇలా అన్నది, “దేవదూతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచు చున్నాను... దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసి కొని సాగిలపడి నమస్కారము చేసెను”. ఆ సోదెగత్తె మంత్ర తంత్రాలకు స్పందిస్తూ పైకి వచ్చింది దేవుని పరిశుద్ద ప్రకవ సమూయేలు కాదు. ఆ దురాత్మల ఆవాసంలో సమూయేలు లేడు. ఆ అతిలోక ఆకారాన్ని సృష్టించింది సాతాను శక్తే. ఆరణ్యంలో క్రీస్తును శోధించినపుడు ఎంత సునాయాసంగా వెలుగు దూత రూపాన్ని భరించగలిగాడో అంతే సునాయాసంగా అతడు ఇప్పుడు సమూయేలు రూపాన్ని ధరించగలిగాడు.PPTel 685.2

    తన మంత్రోచ్చారణ అనంతరము ఆ స్త్రీ పలికిన మొట్టమొదటి మాటలు రాజునుద్దేశించి పలికినవి,. “నీవు సౌలువే ; నీవు నన్నెందుకు మోసపుచ్చితివి”? ప్రవక్త రూపం ధరించివచ్చిన దురాత్మ చేసిన మొదటి కార్యం. ఈ దూరాత్మ స్త్రీతో రహస్యంగా మాటలాడి సౌలు ఆమెను మోసగించటం గురించి హెచ్చరించటం . సౌలుకి ఆ కపట ప్రవక్త ఇచ్చిన వర్తమానం ఇది. “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలునడుగగా సౌలు - నేను బహు శ్రమలలో నున్నాను; ఫిలిప్తీయులు నా మీదికి యుద్ధమును రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమియు సెలవియ్యక యున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను”. PPTel 686.1

    సమూయేలు బతికి ఉన్నప్పుడు సౌలు అతడి సలహాల్ని తృణీకరించాడు. అతడి మందలిపుల్ని ద్వేషించాడు. అయితే ఇప్పుడు దు:ఖం విపత్తు సంభవించగా తన ఏకైక ఆశాకిరణం ప్రవక్త మార్గదర్శకత్వేమని నమ్మాడు. పరలోక రాయబారితో సంప్రదించటానికి పాతాళదూత చేయూతను వ్యర్థంగా ఆశించాడు! సౌలు సాతానుకి సంపూర్తిగా లొంగిపోయాడు. దు:ఖాన్ని నాశనాన్ని కల్గించటం ఒక్కటే ఎవరికి అమితానందం సమకూర్చుతుందో ఆ సాతాను అసంతోషంగా ఉన్న రాజును సర్వనాశనం చెయ్యటానికి శాయశక్తుల కృషి చేసాడు. హృదయ భారంతో సౌలు చేసిన విజ్ఞప్తికి సమాధానంగా కపట సమూయేలు నోటివెంట ఈ వర్తమానం వచ్చింది:PPTel 686.2

    ” యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాచి నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయుల దండును ఫిలీప్తీయులచేతికి అప్పగించును”.PPTel 686.3

    తాను తిరుగుబాటు చేసిన కాలమంతా సౌలుని సాతాను పొగడి మోసం చేస్తూ వచ్చాడు. పాపాన్ని ప్రాముఖ్యం లేని అల్ప విషయంగా చిత్రించటం, అతిక్రమ మార్గాన్ని ఆకర్షణీయంగా కనపర్చటం, ప్రభువు హెచ్చరికల్ని బెదిరింపుల్ని విస్మరింపచెయ్యటం ఇదే సాతాను పని. సౌలు సమూయేలు హెచ్చరికల్ని గద్దింపుల్ని బేఖాతరు చెయ్యటాన్ని సమర్ధించుకోవటానికి సాతాను తన ఇంద్రజాల ప్రభావం వల్ల అతణ్ణి నడిపించాడు. ఇప్పుడు తగు ప్రమాద స్థితిలో ఉండగా అతడికి ఎదరు తిరిగి తన ఘోరపాపాన్ని అతడి ముందు పెట్టి తనకు తెగువ పుట్టించుడం కోసం ఆ ఘోర పాపానికి నిష్కృతి లేదని అతికి నూరిపోశాడు. అతడి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి ఆలోచనను గందరగోళపర్చి అతణ్ణి నిస్పృహకు ఆత్మవినాశనానికి నడిపించటానికి తిరుగులేని సాధనం ఇదే.PPTel 687.1

    ఆహారం తీసుకోకపోవటంతో సౌలులో బలహీనత చోటు చేసుకుంది. భయందోళనలకు లోనైయ్యడు. మనస్సాక్షి మందలిస్తున్నది. ఆ భయంకర ప్రవచన వాక్యం చెవినపడ్డప్పుడు గాలివానకు ఊగిసలాడే వృక్షంలా అతడిదేహం ఇటూ అటూ ఊగి నేలపై సాగిలపడింది.PPTel 687.2

    ఆ మాంత్రికురాలు ఆందోళన చెందింది. ఆమె ముందు ఇశ్రాయేలు రాజు మరణించివాడివలె పడి ఉన్నాడు. తన నివాసంలో అతడు మరణిస్తే పర్యవసానంగా తనకేమి సంభవిస్తుందోనని భయపడింది. తాను రాజు కోరికను గౌరవించటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టానని కనుక ఇప్పుడు అతడు తన ప్రాణం నిలుపుకొనేందుకు గాను తన మాటల విని పైకి లేచి ఆహారం భుజింపమని ఆమె అతణ్ణి బతిమాలింది. తన అనుచరులు కూడా ఆమెతో గళం కలిపినందు వల్ల చివరికి రాజు అంగీకరించాడు. ఆ స్త్రీ బలిసిన దూడను వధించి పులియని పిండితో రొట్టెలు చేసి హడావుడిగా భోజనం తయారు చేసి అతడికి వడ్డించింది. అది ఎంత విచిత్ర దృశ్యం! కొద్ది క్షణాల క్రితమే నాశనాన్ని గూర్చిన మాటలు ఏమాంత్రికురాలి గుహలో వినిపించాయో అందులోనే సాతాను దూత సమక్షంలో ఇశ్రాయేలు రాజుగా అభిషేకం పొందిన సౌలు ప్రాణాంతక యుద్ధానికి సిద్ధబాటులో భాగంగా భోజనానికి కూర్చున్న దృశ్యమిది.PPTel 687.3

    యుద్ధానికి సిద్ధపడేందుకు గాను అతడు తెల్లవారకముందే ఇశ్రాయేలీయుల స్కంధావారాన్ని చేరుకున్నాడు. ఆ చీకటి శక్తిని సంప్రదించటం ద్వారా సౌలు పూర్తిగా నాశనమాయ్యడు. భీకర నిస్పృహతో సతమతమవుతున్న అతడు సైన్యానికి స్పూర్తి నందించలేకపోయాడు. శక్తికి మూలమైన దేవునికి దూరమైన అతడు సైనికుల్ని తమ సహాయకుడైన ప్రభువు వద్దకు నడిపించలేకపోయాడు. ఈరకంగా కీడును గూర్చిన ప్రవచనం నెరవేరింది.PPTel 687.4

    ఇశ్రాయేలీయుల సేవలు ఫిలిప్తీయుల సేనలు షూనేము మైదానంలో గిల్బోవ పర్వత లోయలో అమీతుమీ తేల్చుకొనే యుదంలో నిమగ్నమై ఉన్నాయి. ఏన్దరు గుహలోని ఆ భయంకర దీశ్యం సౌలు ఆశల్ని ఆడియాసలు చేసినప్పటికి సౌలు తన సింహాసనాన్ని తన రాజ్యాన్ని నిలపుకోవటానికి వీరోచితంగా యుద్ధం చేసాడు. అయినా ఫలితం దక్కలేదు. “అంతలో ఫిలీప్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిప్తీయుల యెదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతము వరకు ఫిలీప్తీయుల వారిని హతము” చేసారు. శూరులైన రాకుమారులు రాజు పక్కనే మరణించారు. విలుకాండ్రు సౌలు మీదికి దూసుకు వెళ్ళారు. తన చుట్టూ తన సైనికులు కూలటం, యువ రాజులైన తన కుమారులు తన కళ్ళముందే శత్రు ఖడ్గానికి బలికావటం సౌలు చూశాడు. గాయపడి పోరాడే స్థితిలో గాని పారిపోయే స్థితిలో గాని లేడు. తప్పించుకోవటం అసాధ్యం. తాను బతికుండగా ఫిలిప్తీయుల బంది కావటానికి ఇష్టం లేక తన ఆయుద వాహకుణ్ణి “నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుము” అని ఆజ్ఞపించాడు. ప్రభువు వలన అభిషేకం పొందిన తనను చంపటానికి అతడు నిరాకరించినప్పుడు సౌలు తన సొంత ఖడ్గం మీద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు.PPTel 688.1

    ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఈ విధంగా మరణించి ఆత్మహత్య దోషం మీద వేసుకున్నాడు. సౌలు జీవితంలో పరాజితుడయ్యాడు. అపఖ్యాతి నిస్పృలతో చరిత్రలో మిగిలిపోయాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా అతడు తన దుర్మార్గ చిత్తాన్నే అనుసరించాడు.PPTel 688.2

    పరాజయ వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించి భయోత్పాతం సృష్టించిది. ప్రజలు నగరాలు విడిచి పెట్టి పారిపోయారు. వాటిని ఫిలిప్తీయులు నిర్భయంగా స్వాధీనపర్చుకున్నారు. దేవునితో నిమిత్తం లేకుండా సౌలు నిర్వహించిన రాజ్య పరిపాలన ఇశ్రాయేలు ప్రజల్ని దాదాపు నాశనం చేసింది.PPTel 688.3

    యుద్ధం అయిపోయిన మరుసటి రోజు హతుల్ని దోచుకోవటానికి ఫిలిప్తీయులు యుద్ధరంగంలో పడి వున్న దేహాల్ని తనిఖీ చేస్తున్న సమయంలో సౌలు అతడి ముగ్గురు కుమారుల దేహాల్ని కనుగొన్నారు. వారు తమ విజయాన్ని సంపూర్ణ చేసేందుకు గాను సౌలుతల నరికి అతడి కవచాన్ని ఊడదీశారు. అనంతరము రక్తం కారుతున్న శిరస్సుని, కవచాన్ని విజయ చిహ్నాలుగా “తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై” ఫిలీప్తీయుల దేశానికి పంపారు. అతడి ఆయుధాన్ని ‘అప్లోరోతు దేవుని గుడిలో” ఉంచి అతడి శిరసు దాగోను గుడిలో తగిలించారు. ఈ రీతిగా వారు ఈ విజయ గౌరవన్ని ఈ అబద్ద దేవతలకు అపాదించి యెహోవా నామాన్ని అగౌరవ పర్చారు. సౌలు అతడి కుమారుల మృతదేహాల్ని గిల్బోవ పర్వతానికి యోర్దాను నదికి దగ్గరలో ఉన్న బేతాను పట్టణానికి ఈడ్చుకు వెళ్లారు. పక్షకులికి ఆహారంగా వాటిని ఇక్కడ గొలుసులతో వేలాడగట్టారు. తన పరిపాలన ఉత్సాహంగా ఉద్రేకంగా సాగిన ఆరంభ సంవత్సరాల్లో సౌలు తమ పట్టణాన్ని విమోచించటాన్ని గుర్తుంచుకొన్న యాబేఫిలాదు ప్రజలు రాజు దేహాన్ని, అతడి కుమారుల దేహాల్ని కాపాడి వాటిని సమస్త మర్యాదలతో సమాధి చేయటం ద్వారా తమ కృతజ్ఞతల్ని ప్రదర్శించుకొన్నారు. రాత్రిపూట యోర్దాను నదిని దాటి వారు “సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను, బేతాను పట్టణపు గోడల మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములు దీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింది పాతి పెట్టి యేడు దినముల ఉపవాసముండిరి” నలభై సంవత్సరాల క్రితం సౌలు చేసిన ఉదాత్త కార్యం అతడికి, అతడి కుమారునికి అపజయం, పరాభవం జరిగిన తరుణంలో దయ,కనికరాలు గల హస్తాల ద్వారా సమాధి జరగటానికి దోహదం చేసింది.PPTel 688.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents