Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    70—దావీదు రాజ్య పరిపాలన

    ఇశ్రాయేలు సింహాసనం తనకు స్థిరమైన వెంటనే తన రాజధాని స్థాపనకు మెరుగైన స్థలం కోసం దావీదు అన్వేషణ ప్రారంభించాడు. దేశ భవిష్యత్ రాజధాని నగర నిర్మాణానికి హెబ్రోనుకు ఇరవైమైళ్ళ దూరంలో ఒక స్థలాన్ని ఎంపిక చేయటం జరిగింది,. యెహోషువ నాయకత్వంతో ఇశ్రాయేలీయులు యోర్దానుని దాటకపూర్వం దాన్ని షాలేమని పిలిచేవారు. దీనికి దగ్గరలోనే అబ్రహాము దేవుని పట్ల తన విశ్వసనీయతను నిరూపించుకున్నాడు. దావీదు పట్టాభిషేకానికి ఎనిమిది వందల సంవత్సరాలు పూర్వం అది సర్వోన్నత దేవుని యాజకుడు మెల్కీ సెదెకును నివాస స్థలం. దేశంలో అది కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది. దాని చుట్టూ కొండలుండటం వల్ల స్వాభావిక రక్షణ చక్కని పర్యావరణ సమకూరాయి. బెన్యామీను యూదాల మధ్య సరిహద్దుల్లో ఉండటం మూలాన అది ఎఫ్రాయిముకు దగ్గరలో ఉండి ఇతర గోత్రాల ప్రజలు సులువుగా వచ్చి పోవటానికి అనువుగా ఉంది.PPTel 714.1

    ఈ స్థలాన్ని సంపాదించటానికి గాను ఇంకా మిగిలియున్న కొంతమంది కనానీయుల్ని హెబ్రీయులు తరిమి వేయాల్సి ఉంది. వారికి సీయోను మెరియా పర్వతాలపై కోట వుంది. ఈ కోట పేరు యోబూసు, దానిలో నివసించిన ప్రజలు యెబూసీయులు. యెబూసు కోటను శతాబ్దాలుగా దుర్బేధ్యమైన కోటగా పరిగణించటం జరిగింది. కాని యోవాబు నేతృత్వంలో హెబ్రీయులు దాన్ని ముట్టడించి పట్టుకున్నారు. యోవాబు ప్రదర్శించిన శౌర్యాన్ని బట్టి అతణ్ణి ఇశ్రాయేలీయుల సేనాధిపతిగా నియమించారు. యోబుసు ఇప్పుడు దేశానికి ముఖ్య పట్టణమయ్యింది. దాని అన్య పేరును యెరూషలేముగా మార్చారు. PPTel 714.2

    మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ధనిక పట్టణమైన తూరు రాజు హీరాము ఇశ్రాయేలు రాజుతో మైత్రి కోరి యెరూషలేములో రాజభవనం నిర్మించటానికి దావీదుకు సహాయం చేసాడు. తూరునుంచి రాయబారుల్ని వారితో పాటు భవన శిల్పుల్ని పనివారిని పంపాడు. ఖరీదైన కలప, దేవదారు మానులు తదితర విలువైన సామాగ్రితో నిండిన వాహానాల్ని పంపాడు.PPTel 714.3

    దావీదు నాయకత్వంలో ఇశ్రాయేలు పటిష్టం కావటం, యోబూసు కోటను స్వాధీనపర్చుకోటం, తూరు రాజు హీరాముతో మైత్రీ ఒప్పందం కూర్చుకోవంటం పిలీప్తీయుల్లో వ్యతిరేకతను పుట్టించాయి. యెరూషలేము నుంచి కొద్ది దూరంలో ఉన్న రెఫాయీము లోయలో దిగి వారు మళ్ళీ ఇశ్రాయేలీయుల పై దండెత్తారు., దేవుని ఆదేశం కోసం కనిపెట్టేందుకు దావీదు తన సైనికులతో కలసి సీయోను కోటకు వెళ్ళాడు. “దావీదు నేను ఫిలీప్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతునా? అని యెహోవా యొద్ద విచారించినప్పుడు - పొమ్ము, నిస్సందేహముగా వారిని నీచేతికప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను”.PPTel 714.4

    దావీదు వెంటనే శత్రువులపై దండెత్తి ఓడించి వారిని నాశనం చేసాడు. తమకు జయం చేకూర్చుతాయని వారు తెచ్చుకున్న దేవుళ్ళ విగ్రహాల్ని వారి వద్ద నుంచి తీసుకున్నాడు. తమ ఓటమి పరాభవం భరించలేక మరింత పెద్ద సేనను సమకూర్చుకొని ఫిలిప్తీయులు యుద్ధానికి మళ్ళీ వచ్చారు. ఫిలీప్తీయులు మరల వచ్చి “రెఫాయీము లోయలో” వ్యాపించారు. దావీదు మళ్ళీ ప్రభువుని సంప్రదించగా నేనున్నాను అనువాడైన ఆ మహాదేవుడే ఇశ్రాయేలు సైన్యం నాయకత్వం వహించాడు.PPTel 715.1

    దేవుడు దావీదును ఇలా ఆదేశించాడు. “నీవు వెళ్ళవద్దు, చుట్టు తిరిగిపోయి కంబళిచెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిప్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెను”. సౌలుకు మళ్లీ దావీదుకూడా తన సొంత మార్గాన్ని ఎంపిక చేసుకొని ఉంటే అతడికి విజయం లభించేది కాదు. కాని దావీదు ప్రభువు అదేశానుసారంగా వ్యవహరించాడు. దావీదు “ఫిలిప్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతము” చేసాడు. “కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధిమాయెను. యెహెూవా అతని భయము అన్యజనులందరికి కలుగజేసెను”. 1 దినవృ 14:16,17.PPTel 715.2

    ఇప్పుడు తన సింహాసనం సుస్థిరమై విదేశ శత్రుభయం తొలగిపోయింది. గనుక దేవుని పరిశుద్ద మందసాన్ని యెరూషలేముకి తీసుకురావాలన్న తన వాంఛితాన్ని నెరవేర్చటం పై దావీదు దృష్టి పెట్టాడు. అక్కడికి తొమ్మిది మైళ్ళ దూరంలోని కిర్యత్యారీములో మందసం అనేక సంవత్సరాలుగా ఉంది. అయితే దేశరాజధానిలో దేవుని సముఖానికి చిహ్నమైన మందసం ఉండటం సమంజసం,. మందసం వచ్చిన సందర్భాన్ని గొప్ప ఆనందోత్సాహాలు ఉత్సవ స్ఫూర్తి ప్రదర్శనల సమయంగా ఏర్పాటు చెయ్యాలన్న ఉద్దేశంతో ఇశ్రాయేలు దేశం అయా ప్రాంతాల నుంచి ముప్పయి వేల మంది ప్రముఖ వ్యక్తుల్ని దావీదు ఆహ్వానించాడు. ప్రజలు ఆ పిలుపుకు ఉత్సాహంగా స్పందించాడు. ప్రధాన యాజకుడు పరిశుద్ధ హోదాల్లోని అతడి సహచరులు, ప్రధానులు, గోత్రాల్లోని పలువురు ముఖ్యులు కిర్యత్యారీములో సమావేశమయ్యారు. దావీదు ముఖం పై పరిశుద్దాత్సాహాం తాండవించింది. మందసాన్ని అబీనాదాబు ఇంటిలో నుండి బైటికి తీసుకువచ్చి కొత్తగా చేసిన ఎండ్లబండిలో పెట్టారు బండి వెంటనే అబీనాదాలు కుమారులిద్దరిని పంపారు.PPTel 715.3

    ఉత్సాహంతో కేకలు వేస్తూ సంతోషగానం చేస్తూ వేలాది మంది వారితో గళం కులపుతూ వారి వెనుక నడిచారు. “దావీదు ఇశ్రాయేలీయు లందరును.. సితారాను స్వరమండలమునుల మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి”. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి విజయ దృశ్యాన్ని తిలకించి చాలాకాల మయ్యింది, బ్రాహ్మాండమైన ఆ ఊరేగింపు కొండలపక్కనుంచి లోయల్లో నుంచి నడిచి పరిశుద్ద పట్టణం దిశగా సాగింది.PPTel 716.1

    అయితే “వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలుజారి నందున ఉజ్జా చేయి ఆపి దేవుని మందసమును పట్టుకొనగా యెహెూవా కోపము ఉజ్జ మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆక్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను”. సందడిగా ఉత్సాహంగా ముందుకి సాగుతున్న జన సందోహం పై హఠాత్తుగా భయం విరుచుకుపడింది. దావీదు దిగ్ర్భాంతి చెంది ఆందోళనకు గురి అయ్యాడు. మనసులో దేవుని న్యాయశీలతను ప్రశ్నించాడు. అతడు మందసాన్ని దైవ సముఖానికి ప్రతీకగా గౌరవించటానికి ప్రయత్నిస్నున్నాడు. అలాగైనప్పుడు ఉత్సాహానందాలు వెల్లివిరియాల్సిన సందర్భాన్ని దు:ఖం సంతాపాల సమయంగా మార్చటానికి ఈ భయానక తీర్ప రావటమెందుకు ? మందసాన్ని తనకు దగ్గరగా ఉంచుకోవటం క్షేమం కాదని భావించి అది ఉన్నచోటనే దాన్ని ఉంచాలని దావీదు యోచించాడు. అందుకు గిత్తియుడైన ఓబేదెదోము ఇంట్లో దానికో స్థలం ఏర్పాటు చేశాడు.PPTel 716.2

    ఉజ్జ మరణం అతి స్పష్టంగా ఉన్న ఆజ్ఞను ఉల్లఘించినందుకు దేవుడు పంపిన తీర్పు. మందసం రవాణాను గూర్చి దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షమైన ఉపదేశం ఇచ్చాడే. ఆహరోను సంతతికి చెందిన యాజకులు తప్ప మరెవరూ మందసాన్ని ముట్టుకోవటంగాని తెరచి ఉన్నప్పుడు దాన్ని చూడటంగాని చేయటం నిషిద్ధం. దేవుని ఆదేశం ఇది. “కహాతీయులు దాని మోయరావలెను. అయితే వారు చావకయుండునుట్ల పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు”. సంఖ్యా 4:15 యాజకులు మందసాన్ని కప్పాల్సి ఉన్నారు. అప్పుడు కహాతీయులు మందసంPPTel 716.3

    రెండు పక్కలా అమర్చిన ఉంగరాల్లో దూర్చిన మోత కర్రలతో దాన్ని ఎత్తాల్సి ఉంది. మోత కర్రల్ని ఆ ఉంగరాల్లోనే ఉంచేవారు.గూడారపు తెరలు, పలకలు స్థంభాలకు బాద్యులైన గెరోనీయులు మెరారీయులకి వారికిచ్చిన వస్తువుల రవాణా నిమిత్తం వారికి బండ్లు, ఎడ్లు ఇచ్చారు. “కహాతీయుల కియ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలము సేవ వారిది., తమభుజముల మీద మోయుటయే వారి పని గనుక వారి వాహనములను నియమింపలేదు. ” సంఖ్యా 7:9 కిర్యత్యారీము నుంచి మందసం తేవటంలో ఇలా దేవుని ఆదేశాల ప్రత్యక్షమైన, క్షమించకూడని ఉల్లంఘన జరిగింది.PPTel 717.1

    దావీదు తండ్రి ప్రజలు ఒక పవిత్ర కార్యం నిర్వహించేందుకు సమావేశమయ్యారు. ఆపనిలో ఉద్రేకంగా ఉత్సాహంగా నిమగ్నులై ఉన్నారు. అయితే తన ఆదేశానుసారంగా వారు ఆకార్యాన్ని నిర్వహించలేదు. గనుక ప్రభువు దాన్ని అంగీకరించలేదు. దైవ ధర్మశాస్త్ర జ్ఞానం లేని ఫిలిప్తీయులు మందసాన్ని ఇశ్రాయేలీయులకి పంపివేసేటప్పుడు దాన్ని ఒక బండిలో పెట్టి పంపారు. వారి ప్రయత్నాన్ని ప్రభువు అంగీకరించాడు. అయితే ఈ విషయాలన్నిటిలోను దేవుని చిత్తాన్ని గూర్చి స్పష్టమైన ఉపదేశాలు ఇశ్రాయేలీయులు చేతుల్లోనే ఉన్నవి. వాటి నిర్లక్ష్యం ద్వారా వారు దేవుని అగౌరవ పర్చారు. ఉజ్జా విషయంలో మరెక్కువ దోషం అతడి దురభిమానం. ధర్మశాస్త్ర ఉల్లంఘన ధర్మశాస్త్రం పరిశుద్ధమైందన తన స్పృహను తగ్గించింది. తనలో క్షమాపణ పొందని పాపాలుండటంతో దైవ నిషేధాన్ని లెక్కచేయకుండా దైవ సన్నిధికి ప్రతీక అయిన మందసాన్ని పట్టుకున్నాడు. పాక్షిక విధేయత, తన ఆజ్ఞల విషయంలో ఆషామాషీ వ్యవహరణ దేవునికి సమ్మతం కాదు. తన ధర్మశాసనాల్ని నిష్టగా ఆచరించటం ప్రాముఖ్యమని ఇశ్రాయేలీయులకి నేర్పటానికి ఉజ్జా పైకి దేవుడు ఆ తీర్పును పంపాడు. ఇలా ప్రజల్ని పశ్చాత్తాపానికి నడిపించటం ద్వారా ఒక్కడి మరణం వేలమంది పై తీర్పు పడకుండా నివారించింది,PPTel 717.2

    దేవుని దృష్టిలో తన హృదయం సవ్యంగా మనోభావంతో ఉజ్జా మీద వేటును దృష్టిలో ఉంచుకొని దావీదు మందసమంటే భయపడ్డాడు. తనలోని ఏదో ఒక పాపం తన మీదికి దేవుని తీర్పును తెస్తుందని భయపడ్డాడు. లోలోన భయం ఉన్నప్పటికి విదేయులికి అది దేవుని అనుగ్రహ వాగ్దానంగా భావించి ఓబేదెదోము అ పరిశుద్ద మందసాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఇశ్రాయేలీయులందరి దృష్టి ఈ గిత్తియుడి మీద అతడి కుటుంబము మీద నిలిచింది. మందసం వారికేం చేయనుందో అని అందరూ ఆసక్తిగా కని పెడుతున్నారు. “యెహోవా ఓబెదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను”.PPTel 717.3

    దేవుని మందలింపు దావీదు విషయంలో దాని పని అది చేసింది. దైవ ధర్మశాస్త్రం పరిశుద్ధమైందని దాన్ని నిష్టగా ఆచరించటం అవసరమని గతంలో ఎన్నటికన్నా మరెక్కువగా దావీదు గుర్తించాడు. ఓబెదెదోము పట్ల దేవుని అనుగ్రహం మందసం వల్ల తనకు తన ప్రజలకు గొప్ప దీవెనలు చేకూరతాయన్న ఆశాభవాన్ని దావీదులో రేకెత్తించింది.PPTel 718.1

    మూడుమాసాల అనంతరము మందసాన్ని తేవటానికి మరో ప్రయత్నం చేయాలని దావీదు భావించాడు. ప్రభువిచ్చిన ఆదేశాన్ని తు.చ. తప్పకుండా ఆచరించటానికి ఈసారి జాగ్రత్త వహించాడు. మళ్లీ దేశంలోని ముఖ్యమైన వ్యక్తుల్ని సమావేశపర్చాడు. ఆ గిత్తీయుడి ఇంటి చుట్టూ గొప్ప జన సందోహం పోగుపడింది. పరిశుద్ధ భయంతోను శ్రద్ధతోను దైవ నిర్దేశిత వ్యక్తుల భుజాల పై మందసాన్ని పెట్టారు. ప్రజలంతా వరసులో పడ్డారు.ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు మళ్ళీ ఎందుకు సాగింది. ప్రజల హృదయాలు భయంతో వణుకుతున్నాయి. ఏమి జరుగుతుందోనని అరడుగులు పడ్డాకు ఆగమంటూసూచించే బూర మోగింది. దావీదు ఆదేశాల మేరకు “ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు” వధించబడాల్సి ఉంది. ఉత్సాహద్వనులు పోయి భయం వణుకు ప్రారంభమయ్యాయి. రాజు తన వస్త్రాల్ని పక్కన పెట్టి యాజకులు ధరించే సామన్యమైన ఏఫోదు ధరించాడు. అతడు యాజకధర్మాలు నిర్వర్తిస్నున్నాడని ఈ క్రియ ద్వారా సూచించటం లేదు. ఎందుకంటే ఏఫోదును యాజకులేగాక ఇతరులు కూడా కొన్నిసార్లు ధరించేవారు అయితే ఈ పరిశుద్ధ సేవ సందర్భముగా అతడు తన ప్రజలతో దేవుని ముందు సమానుడుగా వ్యవహరిస్తున్నాడు అంతే. ఆరోజున యెహోవాను ఆరాధించటం జరగాలి ఆయనే పూజకు అర్హుడు.PPTel 718.2

    మళ్ళీ బ్రహ్మాండమైన ఆ ఉత్సహ జనసమూహం కదిలింది. సితారతో, కొమ్ముతో, బూరతో తాళాలతో కూడిన సంగీతం వేలాది మంది గొంతెత్తి పాడే పాటలతో మిళితమై ఆకాశంలోకి ఎగిసింది. పాట లయ ననురించి ఆనందోత్సాహాలతో నిండి, “దావీదు... యెహోవా సన్నిధిని నాట్యమాడు చుండెను”.PPTel 718.3

    భక్తి ప్రధానమైన ఆనందముతో దావీదు దేవుని ముందు నాట్యం చేయ్యటాన్ని నవీన డాన్సును ఫ్యాషన్ గా మార్చిన వినోద ప్రేమికులు సమర్ధించటానికి ప్రయత్నిస్తారు. ఇందులో అలాంటి వాదనకు తావులేదు. ఈ రోజుల్లో డ్యాన్సింగ్ బుద్దిహీనతతో కూడిన మధ్యరాత్రి వినోదంగా తయారయ్యింది. ఆరోగ్యం నైతిక వర్తన వినోదానికి బలి అవుతున్నాయి. వినోద మందిరాల్లో కులికేవారి దృష్టిలోను ఆలోచనలోను దేవుడండడు. వారి సమావేశాల్లో ప్రార్థనకు స్తుతిగానానికి స్థానం ఉండదు. ఈ పరీక్ష నిర్ణయాత్మకం కావాలి. పరిశుద్ద అంశాల పట్ల ఆసక్తిని సన్నగిల్ల జేసి దైవ సేనలోని ఆనందాన్ని హరించే వినోదాలకు క్రైస్తవులు దూరంగా ఉండాలి. మందసాన్ని తీసుకువెళ్ళేటప్పుడు దేవునికి స్తుతిగానం చేస్తూ చేసిన నాట్యానికి విచ్చిన్న కరమైన నవీన నాట్యానికి మధ్య అస్సలు పోలికే లేదు. అది దేవుని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన పరిశద్దు నామాన్ని ఘనపర్చటానికి తోడ్పడితే ఇది మనుషులు దేవుని మరిచిపోవటానిక ఆయనను అగౌరవపర్చటానికి సాతాను చేతిలో ఒక సాధానంగా పరిణమిస్తుంది.PPTel 718.4

    తమ అదృశ్యరాజు పవిత్ర చిహ్నమైన మందసం వెంట నడుస్తూ ఆ విజయోత్సవ జన సమూహం రాజధానిని సమీపించింది. అంతట హఠాత్తుగా పాట ఎత్తుకొని గోడమీద నిలిచి కావలికాస్తున్న వారిని పరిశుద్ద పట్టణ ద్వారాలు తెరువవలసిందిగా ఆపాటలో డిమాండు చేసారు : PPTel 719.1

    “గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి
    మహిమగల రాజు ప్రవేశించునుట్ల పురాతనమైన
    తలుపులారా, మిమ్ము లేవనెత్తికొనుడి”
    గాయక బృందం సంగీతకారులు ఇలా
    జవాబుచ్చిరు:
    మహిమగల యీ రాజు ఎవడు?”
    వేరొక బృందం నుంచి వచ్చిన జవాబు ఇది :
    “బలశౌర్యములు గల యెహోవా ”
    యుద్దశూరుడైన యెహోవా ”
    వందలాది స్వరాలు కలసి ఈ విజయగీతం పాడాయి :
    “గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి,
    పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు
    మిమ్మును లేవనెత్తికొనుడి”.
    PPTel 719.2

    మళ్ళీ ఈ ఆనందాయకమైన ప్రశ్న వినవచ్చింది. “మహిమ గల రాజు ఎవడు”? “విస్తారమైన జనులు శబ్దము” లాంటి స్వరముతో ఆ ప్రజా సమూహం ఇచ్చిన జవాబు ఇది : PPTel 720.1

    “సైన్యములకధిపతియగు యెహోవా యే
    ఆయన యీ మహిమగల రాజు”.
    PPTel 720.2

    కీర్తనలు 24:7-10

    అప్పుడు ద్వారాలు తెరిచారు. ఊరేగింపుగా వచ్చిన జనులు లోపల ప్రవేశించి మందసాన్ని దానికి ఏర్పాటు చేసిన గూడాంరలో పెట్టారు. ఆ పరిశుద్ద మందసం ముందు బలులు నిమిత్తం బలిపీఠాలు నిర్మించారు. ఇశ్రాయేలీయుల స్తోత్రాలు విన్నపాలతో కలసి సమాధానబలి, దహనబలి పొగ మేఘం వంటి ధూపం వాసన పరలోకానికి ఎగసింది. ఆరాధన సమాప్తమైన తర్వాత స్వయాన రాజే ఆశీర్వచనాలు పలికాడు. అనంతరము ప్రజలకు బహుమతులు, ఆహారం, ద్రాక్షరసం పంచటానికి రాజు ఏర్పాట్లు చేసాడు.PPTel 720.3

    దావీదు రాజ్యపాలనకు నాంది పలికిన ఈ ఆరాధనంలో ఈ ఉత్సవంలో అన్ని గోత్రాల ప్రజలు పాలుపొందారు. దావీదుని దేవుని ఆత్మ ఆవేశపర్చాడు. అస్తమిస్తున్న సూర్యుడి అరుణకిరణాల పరిశుద్ధకాంతిలో గూడారం ప్రకాశిస్తున్న తరుణంలో దైవ సన్నిధికి ప్రతీక అయిన మందసం ఇశ్రాయేలు సింహాసనానికి ఇప్పుడు ఎంతో దగ్గరైనందుకు దావీదు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆలా ఆలోచిస్తూ దావీదు “తన ఇంటివారిని దీవించుటకు” రాజ భవవానికి తిరిగి వచ్చాడు. ఉత్సహించటమన్న విషయాన్ని దావీదులా కాక వేరే కోణంలో చూసిన వ్యక్తి ఒకామె ఉన్నది. “యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలుకుమార్తెయుగు మీకాలు కిటికీలో దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపర్చెను.” ఆవేశంతో నిండిన మీకాలు దావీదు ఇంటికి వచ్చేవరకు నిలువలేక బయటికి వెళ్ళి అతణ్ణి కలసి భర్త తనను సున్నితంగా పలుకరిస్తున్న తరుణంలో అతడి పై కటువైన మాటల వర్షం కుండపోతలా కురిపించింది.PPTel 720.4

    “హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్ధుడొకడు తన బట్టను విప్పి వేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసి యెంత ఘనముగా కనబడితివి!”PPTel 720.5

    మీకాలు కించపర్చింది. దైవారాధననే అని దావీదు భావించాడు. అందుకు ఇలా సూటిగా సమాధానమిచ్చాడు. “నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులకు తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరుచుకొనిన యెహోవా సన్నిధి నేనాలగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట అడితిని. ఇంతకంటే మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడైన నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడనగుదును”. దావీదు మందలింపుకు దేవుడు తన మందలింపును జోడించాడు. తన గర్వం అహంకారం కారణంగా మీకాలు “మరణమువరకు... పిల్లను కనకయుండెను”. PPTel 721.1

    మందసాన్ని, యెరూషలేముకి తీసుకువచ్చే సందర్భగా జరిగిన గంభీర కార్యక్రమాలు ఇశ్రాయేలు ప్రజల మనసుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి గూడార సేవలో ప్రజలు ఆసక్తిని రేకెత్తించాయి. యెహోవా పట్ల నూతనంగా భక్తి శ్రద్ధల్ని రగిలించాయి. ఈ అభిప్రాయాల్ని ఆసక్తుల్ని పట్టిష్టపర్చటానికి దావీదు శ్రాయక్తుల కృషి చేసాడు. దైవారాధనలో పాట అంతర్భాగ మయ్యింది. గూడార సేవలో యాజకుల వినియోగార్థంగానే కాక సాంవత్సరిక పండుగలికి చేసే ప్రయాణాల్లోను ఆ పండగల్లో బలిపీఠం వద్దనూ పాడేందుకు ఉపయుక్తమైన కీర్తనల్లి దావీదు రచించాడు. ఈ రీతిగా ప్రజలపై పడిన ఆధ్యాత్మిక ప్రభావ ఫలితంగా దేశం విగ్రహారధన నుంచి బయటపడింది. చుట్టుపట్ల ఉన్న అనేక జాతుల ప్రజలు ఇశ్రాయేలీయుల ప్రగతిని చూసి తన ప్రజల పక్షంగా అంత గొప్ప కార్యాలు చేస్తున్న ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి అనుకూల వైఖరి ప్రదర్శించాడు. PPTel 721.2

    మో షే నిర్మంచిన గూడారం మందసం మినహా దాని సేవలకు సంబంధించినదంతా ఇంకా గిబియోనులోనే ఉంది. యెరూషలేమును జాతీయ మతకేంద్రముగా తీర్చిదిద్దాలన్నది దావీదు ఉద్దేశం. తనకోసం రాజ భవానాన్ని నిర్మించుకున్నాడు. కనుక దేవుని మందసం గూడారంలో ఉండటం భావ్యం కాదని తలంచాడు. తమ రాజైన యెహోవా సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు నివసించేందుకు వారికి దేవుడిచ్చిన గొప్ప గౌరవాన్ని అధిక్యతను అభినందించే రీతిలో ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మించాలని దావీదు నిశ్చయించుకొన్నాడు. తన ఉద్దేశాన్ని దావీదు ప్రవక్త అయిన నాతానుకి తెలుపగా దావీదును ప్రోత్సాహిస్తూ అతడిలా అన్నాడు. ” యెహోవా నీకు తోడుగానున్నాడు. నీకు తోచినదంతయు నెరవేర్చుము”.PPTel 721.3

    అయితే ఆ రాత్రే దావీదును ఉద్దేశించి ఒక వర్తమానం దేవుని వద్ద నుంచి నాతానుకి వచ్చింది. దేవునికి మందిరాన్ని నిర్మించే ఆధిక్యత దావీదుకి ఉండదని అయితే తనకు తన సంతతి వారికి ఇశ్రాయేలు దేశానికి దేవుని కృపా ప్రసన్నత ఉంటుందని ఆ వర్తమానం తెలిపింది,. “సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవవిచ్చునదేమనదా - గొట్టెల కాపులోనున్న నిన్ను గొట్టెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవుచోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువుల నందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనముల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధిగల జనులు ఇకను వారిని కష్ట పెట్టక యుండునట్లుగా” చేస్తాను.PPTel 722.1

    తనకు మందిరం నిర్మించాలని దావీదు ఆశించాడు గనుక అతడికి ఈ వాగ్దానం చేసాడు దేవుడు. ” యెహోవా నగు నేను నీకు తెలియజేయున దేమనగా నేను నీకు సంతానము కలుగజేసెదను...... నీ గర్భమునుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతినికి స్థిరపరచెదను. అతడు నా నామ మనతకొరకు ఒక మందిరముకట్టించును. అతని సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదెను”.PPTel 722.2

    మందిర నిర్మాణ ఆధిక్యత దావీదుకి దక్కకపోవటానికి దేవుడు ఈ కారణం ఇచ్చాడు : “నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించినవాడవు; నీవు నా నామమునకు మందిరము కట్టంపకూడదు.. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానముగా నుండును; చుట్టు ఉండు అతని శత్రువులందరిని నేనుతోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సోలోమెను అను పేరు పెట్టబడును. అతనిదినములలో ఇశ్రాయేలీయులకు సమాధానము విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునుకు ఒక మందిరమును కట్టించును”. 1 దిన వృ 22:8-10PPTel 722.3

    తన హృదయం ఎంతగానో ఆశించిన కార్యాన్ని నిరాకరిస్తూ దేవుడు పంపిన వర్తమానాన్ని దావీదు కృతజ్ఞత నిండిన మనసుతో అంగీకరించాడు. ‘నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను? నాకుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్దతిని బట్టి, బహు కాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు”. అప్పుడతడు దేవునితో నిబంధన నవీకరించుకొన్నాడు.PPTel 722.4

    తాను తల పెట్టిన కార్యం తనకు గొప్ప గౌరవం తన ప్రభుత్వానికి గొప్ప ప్రతిష్ట తెచ్చి పెడతాయని దావీదుకు తెలుసు. కాని దావీదు తన చిత్రాన్ని దేవుని చిత్తం ఆధిపత్యానికి అప్పగించాడు. కృతజ్ఞ చిత్తంతో ఇలా తన్ను తాను సమర్పించుకోవటం క్రైస్తవుల విషయంలో సయితం ఆరుదైన విషయమే. వయసు పైబడి బలం క్షీణిస్తున్న దశలో ఉన్నవారిలో ఎందరు తమ సామర్ధ్యానికి మించినప్పటికి తాము ఆశించిన గొప్ప కార్యాన్ని సాధించాలని ఆశతో ఎదరు చూస్తు ఉంటారు ! దావీదుతో దేవుని ప్రవక్త చెప్పిన రీతిగా; తాము అంతగా ఆశిస్తున్న కార్యం తమకు నియుక్తమయ్యింది. కాదని దేవుని కృపా సాధనాలు వారితో చెప్పవచ్చు. ఆ కార్యాన్ని ఇతరులు నిర్వహించటానికి వారు మార్గం సుగమం చేయాల్సి ఉన్నారు. అయితే దైవాదేశానికి విధేయులై వ్యవహరించే బదులు అనేకమంది దాన్ని అనుమానంగా తిరస్కారంగా భావిస్తారు. తాము చేయాలని ఆశించిన ఆ కార్యాన్ని చేయలేకపోతే ఇంకేమి చేయరు. అనేకమంది తమ శక్తికి మించిన భాధ్యతల్ని నెత్తిన పట్టుకొని మోసేందుకు గట్టిగా ప్రయత్నించి తమకు అలవికానివి సాధించటానికి వ్యర్ధంగా కృషి చేస్తూ తాము చేయగలగిన పనిని చెయ్యకుండా విడిచి పెడతారు.వారి నుండి ఈ సహకారం కొరవడినందు వల్ల ఇంతకన్న గొప్ప పనికి ఆటంకం కలుగుతుంది.PPTel 723.1

    యోనాతానుతో తాను చేసిన నిబందనలో శత్రువుల నుంచి తనకు విశ్రాంతి కలిగినప్పుడు సౌలు కుటుంబీకులకు దయ చూపుతానని వాగ్దానంచేసాడు. దావీదు. తాను వృద్ధి చెందుతున్న కాలంలో నిబంధనను గుర్తు చేసుకొని రాజు ఇలా విచారణ చేసాడు. “నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైన నొకడు శేషించియున్నాడా?” చిన్నప్పటి నుండి కుంటివాడు యోనాతాను కుమారుడ అయిన మెషీబో షెతు ఉన్నాడని విన్నాడు. యెఱ్ఱయులు వద్ద ఫిలీప్తీయుల చేతిలో సౌలు ఓడిపోయిన సమయంలో ఈ బాలుణ్ణి చూసే స్త్రీ ఆ బాలుడితో పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా అతణ్ణి జారవిడవటం మూలన అతణ్ణి జీవితాంతం అవిటివాణ్ణి చేసింది, ఇప్పుడు యువకుడైన మెషీభో షెతును దావీదు తన ఆస్థానానికి పిలిపించి గొప్ప దయతో అతణ్ణి అంగీకరించాడు. తన కుటుంబ పోషణ నిమిత్తం సౌలు వ్యక్తిగత ఆస్తులు అతడికి పునరుద్ధరించాడు. కాగా యోనాతాను కుమారుడు రాజ గృహంలో రాజు భోజనబల్ల వద్ద నిత్య అతిధి అయ్యాడు. అయితే దావీదు శత్రువుల ప్రోత్సాహంతో మెబైబో షేతు దావీదుని సింహాసనాన్ని అపహరించిన వానిగా పరిగణించి అతడి పట్ల ద్వేషం పెంచుకొన్నాడు. కాని తనను ఔదార్యంతో స్వీకరించటం తన పట్ల దయగా వ్యవహరించటం ఆ యువకుడి వైఖరిలో పరివర్తన తెచ్చాయి. దావీదుతో అనుబంధం పెరిగింది తన తండ్రి యోనాతానులాగే మెషీబోషెతు దేవుడు ఎన్నుకొన్న రాజు ఆయన దావీదుకు నమ్మకంగా పలికాడు.PPTel 723.2

    ఇశ్రాయేలు సింహాసనం మీద దావీదు స్థిరపడిన తర్వాత చాలాకాలం దేశంలో శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. ఇశ్రాయేలు దేశం బలాన్ని ఐక్యతను చూసి వారి జోలికి పోకుండా ఉండటం విజ్ఞత అని చుట్టు ఉన్న దేశాలు గుర్తించాయి. దేవ వ్యవస్థీకరణ నిర్మాణ కృషిలో తలమునకలై దావీదు తీవ్ర సైనిక చర్యలకు పూనుకోలేదు. అయితే చివరిగా దావీదు ఇశ్రాయేలీయుల పాత శత్రువులైన పిలిప్తీయులు మోయాబీయుల్తో యుద్ధం చేసి వారిని ఓడించి వారిని తనకింద సామంత రాజులుగా ఉంచాడు.PPTel 724.1

    అంతట చుట్టు వున్న దేశాలు ఏకమై దావీదు రాజ్యానికి వ్యతిరేకంగా ఒక సంకీర్నాన్ని ఏర్పాటు చేసాయి. ఈ సంకీర్ణం నుంచి దావీదు గొప్ప యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. వారి పై గొప్ప విజయాలు సాధించి అనేక దేశాల్ని జయించిన తన రాజ్యాన్ని విస్తరించుకొన్నాడు. దావీదు ఆదిపత్యం పెరగటంతో అతడి పై ఈర్ష్యవల్ల ఏర్పడ్డ కూటమి ఈ సంకీర్ణం. దీని అవిర్భావానికి దావీదు నుంచి ఎలాంటి కవ్వింపూ లేదు. దీనికి దారి తీసిన పరిస్థితులు ఇవి : PPTel 724.2

    అమ్మోనియులు రాజైన నాహాషు మరణ వార్త యెరూషలేముకు వచ్చింది. సౌలు కోపోద్రేకానికి గురై పారిపోతున్న దావీదుకి నాహోషు దయ చూపించాడు. తన కష్ట సమయంలో తన పట్ల దయ చూపించినందుకు కృతజ్ఞతా సూచకంగా దూతలతో సాను భూతి సందేశాన్ని నాహాషు కుమారుడు ఆమ్మోను రాజ్యవారసుడు అయిన హామానుకు దావీదు పంపాడు. “దావీదు - హానూను తండ్రియైన నాహోషునాకు చేసిన ఉపకారమునకు నేను హానూననకు ప్రత్యుపకారము చేతును ” అనుకొన్నాడు.PPTel 724.3

    కాగా ఆ సదుద్దేశాన్ని వారు అపార్థం చేసుకొన్నారు. ఆమ్మోనీయులు నిజమైన దేవుని ద్వేషించారు. ఇశ్రాయేలీయుపట్ల బద్ద శత్రుత్వం పూనారు. దావీదు పట్ల నా హెూషు కనపర్చిన దయ ఇశ్రాయేలీయు రాజైన సౌలుపట్ల తనకున్న తీవ్ర ద్వేషంనుంచి పుట్టిందే. దావీదు పంపిన వర్తమానాన్ని హానూను సలహాదారులు అపార్థం చేసుకొన్నారు. “నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్పువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు శతాబ్ది వెనుక అమ్మోనియలు యాబేష్ఠిలాదు ప్రజల్ని చుట్టుముట్టినప్పుడు వారు ఆమ్మోనీయులతో శాంతి నిబంధన చేసుకోవాలని కోరగా నా హెూషు అందుకు క్రూరమైన షరతు విధించటం వెనుక ఈ సలహాదారుల హస్తమే ఉన్నది. వారి కుడి కన్నులు పోగొట్టుకొటమన్నదే ఆక్రూరమైన షరతు. తమ క్రూర పథకాన్ని ఇశ్రాయేలీయుల రాజు భగ్నం చేసి తాము ఆ ప్రజల్ని మట్టికరపించి వికలాంగుల్ని చేయకుండా ఎలా కాపాడాడో వారికింకా స్పష్టంగా జ్ఞాపకముంది. ఇశ్రాయేలీయుల పట్ల వారికి అదే విద్వేషం కొనసాగుతున్నది. దావీదు పంపిన వర్తమానంలోని ఉదార స్పూర్తిని వారు గ్రహించలేకపోయారు. సాతాను మానవుల మనసుల్ని నియంత్రించి అసూయ అనుమానాల్ని రెచ్చగొడతాడు. అందును బట్టి సదుద్దేశాల్ని అపార్ధం చేసుకొనే స్వభావం ఏర్పడుతుంది. తన సలహాదారుల మాటలు విని హానూను దావీదు దూతల్ని వేగులని ఆనుమానించి వారిని ద్వేహషించి దూషించి పంపాడు.PPTel 724.4

    ఆమ్మోనీయులు అసలు ఉద్దేశాల్ని దావీదుకు బయలు పర్చేందుకోసం వారు తమ దుస్తంత్రాన్ని అమలుపర్చటానికి దేవుడు అనుమతించాడు. నమ్మక ద్రోహులైన ఈ అన్య ప్రజలతో ఇశ్రాయేలీయులు జట్టు కట్టటం దేవుని చిత్తం కానే కాదు. PPTel 725.1

    ఈ రోజుల్లో లాగే పూర్వం కూడా రాయబారి హోదా పవిత్రతను సంతరించుకొన్నది. జాతుల నడుమ ఆచరణలో ఉన్న సార్వత్రిక చట్టం వ్యక్తిపరమైన దౌర్జన్యం నుంచి లేదా అవమానం నుంచి రక్షణ కల్పించింది. తన సౌర్వభౌముడికి ప్రతినిధిగా నిలిచే రాయబారికి ఏదైనా అమర్యాద జరిగితే దానికి తక్షణ ప్రతిక్రియ జరిగేది. తాము ఇశ్రాయేలీయుల్ని అవమానించినందుకు వారి తీవ్ర స్పందన ఎదుర్కొవాల్సి ఉంటుందని గుర్తించిన ఆమ్మోనీయులు యుద్ధానికి సన్నద్దులయ్యారు. “అమ్మోనీయులు దావీదుకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలిసినప్పుడు హానూనును ఆమ్మోనీయులను అరామ్నహరాయీము నుండయు సిరియా మయాకనుండియు, సోబా నుండియు రథములను గుఱ్ఱపు రౌతులను రెండు వేల మణుగుల వెండి ఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి. ముప్పది రెండు వేల రథములతో వచ్చునట్లు.. కుదుర్చుకొనిరి... ఆమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి”. 1 దిన వృ 19:6,7.PPTel 725.2

    అది మిక్కిలి భయంకరమైన కూటమి. యూఫ్రటీసు నదికి మధ్యధరా సముద్రానికి మధ్య ఉన్న భూభాగంలోని ప్రజలు ఆమ్మోనీయుల కూటమిలో చేరారు. కనాను ఉత్తరాన్ని తూర్పున శత్రు సేనలు చుట్టుముట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని తుడిచి వేయటానికి సంఘటితమయ్యాయి.PPTel 726.1

    హెబ్రీయులు తమ దేశం పై దాడి జరిగేవరకు ఆగలేదు. యోవాబు నాయకత్వంలో ఇశ్రాయేలు సేనలు యోర్దాను నది దాటి ఆమ్మోనీయుల రాజధాని దిశగా సాగిపోయాయి. తన సైన్యాన్ని యుద్ధరంగానికి నడిపించేటప్పుడు హెబ్రీయుల సేనాపతి సైనికుల్ని యుద్దానికి ఇలా ఉద్రేకపర్చాడు. “ధైర్యము కలిగియుండుము. మనము మనజనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక”. 1 దిన వృ 19:13. మిత్రపక్షాల సంయుక్త సేన మొదటి పోరులోనే పరాజాయం పాలయ్యింది. అయినా వారింకా ఓటమిని అంగీకరించలేదు. మరుసటి సంవత్సరము యుద్ధానికి మళ్ళీ సన్నద్ధమయ్యారు. సిరియా రాజు పెద్ద సైన్యాన్ని సమీకరించుకొని ఇశ్రాయేలీయులికి బెదురు పుట్టించాడు. ఈ యుద్ధ పర్యవసానం ప్రాముఖ్యాన్ని గుర్తించిన దావీదు స్వయంగా తాను రంగ ప్రవేశం చేసాడు. దేవుని దీవెన తోడుకాగా శత్రు సేలపై గొప్ప విజయాన్ని సాధించాడు. దానితో లెబానోను నుంచి యూఫ్రటీసు వరకూ ఉన్న సిరియన్లు యుద్ధం విరమించుకోవటమే గాక ఇశ్రాయేలుకు సామంతులు అయ్యారు. ఆమ్మోనీయలు విషయంలో మాత్రం దావీదు యుద్ధాన్ని తీవ్రంగా సాగించి వారి దుర్గాల్ని వారి సర్వదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు.PPTel 726.2

    దేశాన్ని సర్వనాశనం చేసేటట్లు కనిపించిన గడ్డు పరిస్థితులు దేవుని నడుపుదల ద్వారా దేశం అపూర్వ ఔన్నత్యం సాధించటానికి సాధనాలయ్యాయి. అద్భుతమైన తన విమోచనను స్మరణకు తెచ్చుకొంటూ దావీదు ఇలా గానం చేశాడు : PPTel 726.3

    “యెహోవా జీవము గలవాడు
    నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోత్రార్హుడు
    నారక్షణ కర్తమయిన దేవుడు బహుగా స్తుతి
    నొందును గాక ఆయన నా నిమిత్తము ప్రతి దండన చేయు దేవుడు
    జనములను నాకు లోబరచువాడు ఆయనే
    ఆయన నాశత్రువుల చేతిలో నుండి నన్ను విడి
    పించును
    నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు
    బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి
    నీవు నన్ను విడిపించుదువు
    అందువలన యెహోవా అన్య జనులలో నేన నిన్ను
    ఘనపరచెదను
    నీ నామకీర్తన గానము చేసెదను
    నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ
    జేయువాడవు.
    అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును
    నిత్యము కనికరము చూపువాడువు ”
    PPTel 726.4

    కీర్తనలు 18:46-50

    దేవుడే తమ బలం దేవుడే తమ విమోచకుడు అన్న భావనను తన
    కీర్తనల్నిటిలోను దావీదు తన ప్రజలకు అందిస్తున్నాడు.
    “ఏ రాజును సేనా బలముచేత రక్షింపబడదు
    ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు
    రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు
    అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింప జాలదు”

    కీర్తనలు 33:16-17

    “దేవా నీవే రారాజువు యాకోబునకు పూర్ణరక్షణ
    కలుగ నాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను
    అణిచి వేయుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారికి మేము తొక్కి వేయుదుము
    నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను
    రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును
    రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించి వారిని సిగ్గుపరుచు
    PPTel 727.1

    వాడవు నీవే” కీర్తనలు 44:4-7

    “కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను
    బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా
    నామమును బట్టి అతిశయపడుదుము”
    PPTel 728.1

    కీర్తనలు 20:7

    దేవుడు అబ్రాహామునకు చేసిన, మో షేకు పునరుద్ఘాటించిన వాగ్దానంలోని విస్తీర్ణతను అనగా “ఐగుప్తునది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశము” (అది 15:18) నీకిస్తాను అన్న వాగ్దానం పేర్కొన్న విస్తీర్ణతను ఇశ్రాయేలు రాజ్యం ఇప్పుడు సాధించింది. ఇశ్రాయేలు శక్తిమంతమైన రాజ్యమైంది. చుట్టుపట్ల ఉన్న రాజ్యాలు దాన్ని గౌరవించాయి. దానికి భయపడ్డాయి. తన దేశంలోనే దావీదు అధికారం గొప్పదయ్యింది. దావీదు ప్రజల అభిమానానురాగాల్ని విశ్వసనీయతను పొందగలిగాడు.దావీదు దేవుని ఘనపర్చాడు. దేవుడు ఇప్పుడతణ్ణి గౌరవ పాత్రుణ్ని చేస్తున్నాడు.PPTel 728.2

    అభివృద్ధి మాటునే అపాయం దాగి ఉంది. విజయ పథంలో ముందంజ వేస్తున్న తరుణంలోనే దావీదు గొప్ప ప్రమాదానికి గురి అయ్యాడు. అవమానకరమైన పరాజయం పాలయ్యాడు.PPTel 728.3