Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    14—సొదొమ నాశనం

    యోర్దాను లోయలోని పట్టణాలన్నిటిలోను సొదొమ మిక్కిలి సుందరమైన పట్టణం. అది మైదానంలోని పట్టణం. భూసారం విషయంలోను సౌందర్యంలోను “యెహోవా తోటవలె” ఉన్నది. ఇది ఉష్ణమండల వనసంపద గల ప్రదేశం. ఇక్కడ సంవత్సరం పొడుగునా సువాసన వెదజల్లే రకరకాల పువ్వులున్నాయి. పొలాలు సమృద్ధిగా పండిన పంటలతో నిండి ఉన్నాయి. చుట్టూ ఉన్న కొండల పై గొర్రెల మందలూ, పశువుల మందలూ మేస్తున్నాయి. మైదానంలో ఉన్న ఈ సుందర పట్టణం కళలు, వాణిజ్యంతో భాగ్యవంతమయ్యింది. ఆ పట్టణ రాజ భవనాలు తూర్పు దేశాల సంపదలతో అలరారుతున్నాయి. ఆ పట్టణ విపణి వీధులకు ఒంటెల బారులపై సరకులు వచ్చేవి. ఎక్కువ శ్రమలేకుండా జీవితావసర వస్తువుల సరఫరా జరిగేది. అలా ఏడాది పొడుగునా ఆ పట్టణ జీవితం ఒక పండుగల ఉండేది.PPTel 146.1

    సొదొమలో వింతలు, వినోదాల్లో తేలి ఆడటం, తినటం, తాగటం ఎక్కడకు వెళ్లే అక్కడ దర్శనమిచ్చాయి. అతి నీచమైన అతిక్రూరమైన ఆవేశాకలు, ఉద్వేగాలకు అడ్డు అదుపు లేకపోయింది. ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని బాహాటంగా తిరస్కరించి దౌర్జన్యాలు దుండగాలు చేయటంలో ఆనందించారు. జలప్రళయానికి ముందు నివసించిన ప్రజల జీవితాలు తమ ముందున్నా, వారిని నాశనం చేయటంలో దేవుడు తన ఆగ్రహాన్ని ఎలా బయలు పర్చాడో తమకు బాగా తెలిసినా వారు కూడా అదే దుర్మార్గాన్ని అనుసరించారు, అదే దుర్వర్తనను కొనసాగించారు. PPTel 146.2

    లోతు సొదొమకు వెళ్లిన రోజుల్లో దుర్నీతి విశ్వవ్యాప్తం కాలేదు. కృపగల దేవుడు దుర్నీతి చీకటిలో కాంతి కిరణాలు ప్రకాశించటానికి అనుమతించాడు. ఏలామీయులు చెరపట్టిన వారిని అబ్రాహాము విడిపించినప్పుడు ప్రజల గమనం నిజమైన విశ్వాసం పైకి ఆకర్షితమయ్యింది. అబ్రాహాము సొదొమ ప్రజలకు అపరిచితుడు కాదు. అతడు కనిపించని దేవున్ని సేవిచటాన్ని వారు వెక్కిరించారు. అయితే తన సైన్యం కంటే ఎంతో బలమైన సైన్యంపై అబ్రాహాము విజయం సాధించటం, ఖైదీల విషయంలోను, కొల్లధనం విషయంలోను అతడు చూపించిన ఔదార్యం ప్రజల అభినందనల్ని ప్రశంసల్ని అందుకొన్నది. అతడి దక్షతను, శౌర్యాన్ని అందరూ ప్రశంసించిన అతడి విజయానికి కారణం దైవశక్తే అని నమ్మినవారు లేరు. అతడి మతం శక్తిమంతం అనటానికి తన స్వార్థరహిత స్వభావం మరో నిదర్శనం. తన ధైర్యసాహసాల ద్వారా విశ్వసనీయత ద్వారా అతడు తన మతాన్ని ఘనపర్చాడు.బ్రాహామును ఆశీర్వదించటం ద్వారా యెహోవాయే అబ్రాహాము శక్తికి అతడి విజయానికి కారకుడని మెల్కీ సెదెకు గుర్తించాడు. “అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి - ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను”. ఆది కాండము 14:19, 20. తన కృప వాత్సల్యాన్నిబట్టి దేవుడు ఆ ప్రజలతో మాట్లాతాడు. అయితే ఆ ప్రజలు క్రితంలోలాగే కాంతి కిరణాల్ని విసర్జించారు.PPTel 146.3

    సొదొమకు చివరి రాత్రి వస్తున్నది. అప్పటికే ప్రతీకార మేఘాలు ఆ పట్టణం పై తమ నీడల్ని నిలుపుతున్నాయి. మనుషులు వాటిని గ్రహించలేదు. దూతలు తమ విధ్వంసక కార్యాచరణ నిమిత్తం ఆ పట్టణాన్ని సమీపిస్తుంగా మనుషులు క్షేమాభివృద్ధిని గూర్చి, విలాసాల్ని గూర్చి కలలు కంటున్నారు. సాయంత్రం చక్కగా ప్రశాంతంగా ఉంది. అస్తమిస్తున్న సూర్యుడి అరుణ కిరణాల్లో ప్రకృతి దృశ్యం మనోహరంగా ఉన్నది. సాయంత్రం చల్లగా వీస్తున్న పిల్లగాలులు పురవాసుల్ని బైటికి ఆహ్వానించాయి. జెల్సారాయుళ్లు ఉత్సాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఆనందిస్తున్నారు.PPTel 147.1

    సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో లోతు సొదొమ పట్టణం ద్వారం వద్ద కూర్చొని ఉండగా ఇద్దరు పరదేశులు ఆ పట్టణాన్ని సమీపించారు. సామాన్య బాటసారుల్లా కనిపించే ఆ యిద్దరిలో దేవుని తీర్పులు అందించే దూతల్ని ఎవరూ చూడలేకపోయారు. ఆ దుష్ట జనసమూహాలు ఈ పరలోక రాయబారులతో తాము వ్యవహరిస్తున్న రీతినిబట్టి తమ పట్టణానికి ఆ రాత్రే నాశనం తెచ్చి పెట్టిన దుర్మార్గత పరాకాష్ఠకు చేరుకుంటుందని గ్రహించలేకపోయారు. కాగా పరదేశులపట్ల దయ, సానుభూతులు చూపించి వారిని తన గృహానికి ఆహ్వానించిన వ్యక్తి ఒకడున్నాడు. వారెవరన్నది లోతుకు అస్సలు తెలియదు. కాని మర్యాద, అతిథి సత్కారం అతడికి స్వాభావికంగా వచ్చిన సద్గుణాలు. అవి అతడి మతంలో భాగం. వాటిని లోతు అబ్రాహామును చూసి నేర్చుకున్నాడు. మర్యాదగా మెలగటం నేర్చుకొని ఉండకపోతే తాను కూడా ఆ పట్టణ వాసులతో పాటు నాశనమై ఉండేవాడే. పరదేశులకు తలుపు తెరవకపోవటం ద్వారా తమకు దీవెనలు, నిరీక్షణ, సమాధానం అందించే దైవ రాయబారికి అనేక గృహాలు ప్రవేశం నిరాకరిస్తుండటం శోచనీయం.PPTel 147.2

    మనిషి జీవితంలో ప్రతీకార్యం అది ఎంత చిన్నదైనా మేలుకో కీడుకో దోహదం చేస్తుంది. అతి చిన్న విధిని నిర్వహించటంలో మనం చూపే నమ్మకం లేదా అశ్రద్ధ జీవితంలో అతి శ్రేష్ఠమైన దీవెనలకు లేదా అతి ఘోర విపత్తులకు ద్వారం తెరవవచ్చు. చిన్న చిన్న పనులే ప్రవర్తన కొలమానాలు. మనం అనుదినం ఆత్మో పేక్షతో నిరాడంబరంతో, సిద్దమనసుతో నిర్వహించే కార్యాలే దేవుడు మనల్ని చూసి మెప్పుకోలుగా నవ్వేటట్లు చేస్తాయి. మనం మనకోసమే కాక ఇతరులకోసం జీవించాలి. స్వార్థ ప్రయోజనం మరిచిపోయి పరుల్ని ప్రేమించటం పరులకు ఉపకారం చేయటం అలవర్చుకొన్నప్పుడే మన జీవితం దీవెనగా పరిణమిస్తుంది. చిన్న చిన్న చేయూతలు, ప్రాముఖ్యంకాని చిన్న మర్యాదలు కలిసి జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వీటిని అశ్రద్ధ చేయటంవల్ల కలిగే దౌర్భాగ్యం అంత ఇంత కాదు.PPTel 147.3

    సొదొమ పట్టణంలో పరదేశులు ఎదుర్కొనే అత్యాచారాలు ఎరిగిన లోతు వారిని ఆ అత్యాచారాల నుండి పరిరక్షించటం తన విధ్యుక్త ధర్మమని భావించి వారిని ప్రవేశంలోనే కలుసుకొని తన యింట ఆతిథ్యానికి ఆహ్వానించేవాడు. ఆ బాటసారులు వస్తున్న సమయంలో అతడు గుమ్మంవద్ద కూర్చొని ఉన్నాడు. వారిని చూసిన వెంటనే వారిని కలవటానికి లేచాడు. మర్యాదగా వంగి ఇలా అన్నాడు, “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాల్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును”. అతడి ఆతిథ్యాన్ని తిరస్కరిస్తూ ఇలా అన్నారు, “ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదము”. ఈ రకంగా సమాధానం ఇవ్వటంలో వారి ఉద్దేశాలు రెండు :PPTel 148.1

    లోతు నిజాయితీని పరీక్షించటం, సొదొమ మనుషుల ప్రవర్తనను ఎరగనట్లు నటించి రాత్రి వీధిలో ఉండటం క్షేమమని తాము భావిస్తున్నట్లు కనిపించటం. వారిచ్చిన సమాధానం ఆ దుర్మార్గుల దయాదాక్షిణ్యాలకు వారిని విడిచి పెట్టకూడదని లోతు మరింత కృతనిశ్చయుడు కావటానికి దారితీసింది. తన ఆహ్వానాన్ని అంగీకరించేంతవరకూ లోతు వారిని వత్తిడి చేసి తన ఇంటికి తీసుకువెళ్లాడు. చుట్టుమార్గాన ఆ పరదేశుల్ని తన గృహానికి తీసుకువెళ్లటం ద్వారా పట్టణ ద్వారం వద్ద ఉన్న దుండగులకు తన ఉద్దేశాన్ని మరుగుపర్చాడు. కాని వారు వెనకాడటం జాప్యం చేయటం ఇతడు పదే పదే వారిని బతిమాలటం దుష్టుల దృష్టిని ఆకర్షించాయి. ఆ రాత్రి వారు నిద్రపోకముందు ఒక దుండగుల మూక లోతు ఇంటిని చుట్టుముట్టారు. అది పెద్ద మూక. అందులో యువకులేంటి పెద్దవారేంటి అందరూ అతి నీచమైన కామోద్రేకాలతో రెచ్చిపోయారు. ఆ పరదేశులు ఆ పట్టణ ప్రజల ప్రవర్తన గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. ఆ పరదేశుల్ని బయటికి పంపమంటూ ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు ఆ రాత్రివేళ తన ఇంటిలో నుంచి బయటికి వెళ్లవద్దని లోతు వారిని హెచ్చరించాడు.PPTel 148.2

    పెచ్చరిల్లి వారు దౌర్జన్యానికి దిగితే ఇంటిని పగులగొట్టవచ్చునని గ్రహించి వారిని శాంతపరచటానికి లోతు బయటికి వెళ్లాడు. “అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి” అన్నాడు లోతు. పొరుగువారు అన్న అర్థంతో వారిని “అన్నలారా” అని సంబోధించి సమాధానపర్చటానికి, తమ దురుద్దేశాల గురించి వారు సిగ్గుపడేటట్లు చేయటానికి లోతు ప్రయత్నించాడు. కాని అతడి మాటలు అగ్నిపై ఆజ్యం పోసినట్లయ్యింది. వారి ఆగ్రహం తుఫానులా రేగింది. తమ పై తన్ను తాను స్వయంగా నియమించుకొన్న తీర్పరి అంటూ ఎగతాళి చేస్తూ అతడి అతిథులతో మరింత కఠినంగా వ్యవహరిస్తామని బెదిరించారు. వారు అతడి మీదికి తోసుకువచ్చారు. దేవదూతలు అతణ్ణి కాపాడి ఉండకపోతే వారతణ్ణి ముక్కముక్కలుగా చీల్చేవారే. దూతలు “తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపువేసిరి”. అనంతరం జరిగిన సంఘటనలు లోతు ఆశ్రయమిచ్చిన అతిథులు ఎవరో బయలుపర్చాయి. “అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ యింటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి”. తమ హృదయ కాఠిన్యంవల్ల వారికి రెండు రకాల గుడ్డితనం కలిగింది. అదేగాని లేకుండా ఉంటే తమ పై పడ్డ దేవుని వేటు వారికి భయం పుట్టించి తమ దుర్మార్గం నుంచి వారిని మళ్లించి ఉండేది. ఆ చివరి రాత్రి పాపాలు వారు క్రితం చేసిన పాపాలకన్నా ఘోరమైనవి కావు. అయితే సుదీర్ఘకాలంగా అలక్ష్యం చేసిన కృప వారి పక్షంగా విజ్ఞాపన చేయటం మానేసింది. సొదొమ నివాసులు దేవుని సహనం హద్దుల్ని అతిక్రమించారు. “దేవుని కృపకు ఉగ్రతకు మధ్యగల అదృశ్య హద్దును” అతిక్రమించారు. సిద్దీము లోయలో ప్రభువు ఉగ్రత రగుల్కోనున్నది. PPTel 149.1

    దేవదూతలు తమరాక ఉద్దేశాన్ని లోతుకు తెలియపర్చారు. “మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి; వారిని గూర్చిన మొర యెహోవాసన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పం పెను” అన్నారు. తాను ఏ పరదేశుల్ని కాపాడటానికి ప్రయత్నించాడో వారిప్పుడు తనను తనతో పాటు ఆ భ్రష్ట పట్టణం నుంచి పారిపోవటానికి సిద్ధంగా ఉన్న తన కుటుంబ సభ్యుల్ని కాపాడ్తామని లోతుకి వాగ్దానం చేశారు. బైట ఉన్న అల్లరి మూక తలుపు కనిపించక విసిగి వెళ్లిపోయారు. అపాయాన్ని గూర్చి తన పిల్లలకు హెచ్చరించటానికి లోతు తలుపు వేసుకొని బైటకు వెళ్లాడు. దూతలు చెప్పిన మాటలు వారితో చెప్పి “లెండి, ఈ చోటు విడిచి పెట్టి రండి; యెహోవా ఆ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడు” అన్నాడు. అతడు వారికి ఎగతాళి చేస్తున్నవాడిలా కనిపించాడు. అవి చాదస్తపు భయాలని నవ్వారు. తన కూతుళ్లు కూడా వారి భర్తల ప్రభావానికి లోనవ్వటంతో తామున్నతావు సురక్షితమైనదని భావించారు. ప్రమాద సూచనలేవీ వారికి కనిపించలేదు. సమస్తం ముందున్నట్లే ఉన్నది. వారికి విస్తారమైన సంపద ఉన్నది. తమ సుందర సొదొమ పట్టణం నాశనమౌతుందంటే వారు నమ్మలేకపోయారు. లోతు విచారంగా ఇంటికి తిరిగివచ్చి తన విఫలయత్నం గురించి చెప్పాడు.PPTel 149.2

    తాను లేచి తన భార్యను ఇంకా తన ఇంటిలోనే ఉన్న తన ఇద్దరి కుమార్తెల్ని తీసుకొని ఆ పట్టణం విడిచి వెళ్లిపోమని లోతును దూతలు ఆదేశించారు. కాని లోతు జాప్యం చేస్తున్నాడు. రోజు రోజుకి జరుగుతున్న అత్యాచారాలు దురంతాలు చూసి లోతు ఎంతో నొచ్చుకొంటున్నా ఆ పట్టణంలో ప్రబలుతున్న దుర్మార్గం గురించి అతడికి వాస్తవికాభిప్రాయం లేదు. పాపాన్ని అదుపుచేయటానికి దేవుని భయానక తీర్పుల అవసరాన్ని అతడు గుర్తించలేదు. లోతు పిల్లల్లో కొందరు సొదొమను విడిచి పెట్టడానికి సుముఖంగా లేరు. వారు లేకుండా సొదొమను విడిచి పెట్టనని అతడి భార్య తెగేసి చెప్పింది. లోకంలో తనకు మిక్కిలి ప్రియమైన బిడ్డల్ని విడిచి పెట్టడమన్నది అతడు భరించలేని తలంపు. అన్ని వసతులతో, సకల విలాసాలతో నిండిన తన గృహాన్ని, తన జీవితమంతా పరిశ్రమించి సంపాదించిన ఆస్తిని విడిచి పెట్టి ఏమీలేని సంచారిగా లోకంలోకి వెళ్లటమంటే మాటలుకాదు. దు:ఖం వల్ల అవాక్కై వెళ్లటానికి ఇష్టంలేక అతడు జాప్యం చేస్తున్నాడు. దేవదూతలే తనతో ఉండి ఉండకపోతే తన కుటుంబం అంతా సొదొమ నాశనంలో నశించి ఉందురు. దైవ రాయబారులు లోతును అతడి భార్యను అతడి కుమార్తెలను చేయి పట్టుకొని పట్టణం వెలుపలికి నడిపించారు.PPTel 150.1

    వారిని అక్కడ విడిచి పెట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి తిరిగి వెళ్లారు. ఇంకొకరు - అబ్రాహాము ఎవరిముందు విజ్ఞాపన చేశాడో ఆయన - లోతు దగ్గర నిలిచాడు. ఆ మైదానంలోని పట్టణాలన్నిటిలోను పదిమంది నీతిమంతులు కూడా లేరు. కాని అబ్రాహాము ప్రార్థన ఫలితంగా దేవునికి భయపడ్డ ఆ ఒక్క నీతిమంతుణ్ని నావనం చేయకుండా దేవుడు కాపాడాడు. “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్ము” అని దూతలు ఆదేశించారు. ఇప్పుడు వెనుకాడటం గాని ఆలస్యం చేయటంగాని ప్రాణాంతకం. తమ ప్రియమైన పట్టణాన్ని ఒక్కసారి కనులెత్తి చూడటానికిగాని తమ చక్కని గృహాన్ని వదిలేస్తున్నందుకు ఒక కన్నీటి బొట్టు కార్చటానికిగాని ఒక్కక్షణం తామసించటం వారి ప్రాణాలకి ముప్పు. ఆ కాందిశీకులు ఆ ప్రాంతం నుంచి తప్పించుకొనేంతవరకు మాత్రమే దేవుని తీర్పు తుఫాను ప్రారంభం నిలిచి ఉంది.PPTel 150.2

    కాని భయభ్రాంతుడై తికమకపడున్న లోతు దేవుడు నిర్దేశించిన చోటుకు వెళ్లే అక్కడ అపాయం సంభవించి మరణిస్తానేమో అన్నభయంతో మరోచోటికి వెళ్లనిమ్మని విజ్ఞాపన చేశాడు. ఆ దుర్మార్గ పట్టణంలో అవిశ్వాసుల మధ్య జీవిస్తున్న లోతు విశ్వాసం సన్నగిల్లింది. శాంతి సమాధానాల ప్రభువు తన పక్కనే ఉన్నాడు. అయినా తనపట్ల అంత గొప్ప ప్రేమ కలిగి తనను సంరక్షిస్తున్న దేవుడు తనను ఇక సంరక్షించడన్నట్లు అతడు తన సొంత ప్రాణం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అతడు ఆ పరలోక రాయబారిని పూర్తిగా నమ్మి సందేహించకుండా ప్రశ్నించకుండా తన్నుతాను ప్రభువుకి అప్పగించుకోవాల్సింది. కాని అనేకుల మాదిరిగా అతడు తన భవిష్యత్తును తానే రూపొందించుకోవటానికి ప్రయత్నించాడు. “ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్న వూరు అది చిన్నది, నన్నక్కడికి తప్పించు కొనిపోనిమ్ము. అది చిన్నదిగదా, నేను బ్రతుకుదును”. ఇక్కడ పేర్కొన్న పట్టణం బెలా. తర్వాత దానికి సోయరు అన్న పేరు వచ్చింది. అది సొదొమకు కొంచెం దూరంలో ఉంది. సొదొమలాగే అదీ దుర్మార్గ పట్టణం, నాశనం చేయటానికి దేవుడు ఉద్దేశించిన పట్టణం. అయితే దాన్ని నాశనం చేయవద్దని లోతు విజ్ఞాపన చేశాడు. ప్రభువు అతడి మనవిని అంగీకరించాడు. అతడికి ప్రభువిలా సమాధాన మిచ్చాడు, “ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని” తప్పులు చేస్తున్నప్పటికీ తాను సృష్టించిన మనుషుల పట్ల దేవునికి ఎంత ప్రేమ!PPTel 151.1

    అగ్ని తుఫాన్ని కొద్ది క్షణాలు మాత్రమే అదుపుచేయటం జరుగుతుంది. గనుక వారు తొందరగా అక్కడనుంచి తప్పించుకోవాలని మళ్లీ ఆదేశించటం జరిగింది. కాందిశీకుల్లో ఒక వ్యక్తి నాశనమౌతుతున్న పట్టణం వంక చూడటానికి ఆలస్యం చేసినప్పుడు ఆమె శిలా విగ్రహంగా మారి దేవుని తీర్పుకు సాక్షిగా నిలుస్తుందన్న దేవదూత హెచ్చరికను ఆచరించటంలో వెనకాడకుండా వెంటనే కొండల్లోకి పారిపోయి ఉంటే లోతు భార్య కూడా అక్కడనుంచి తప్పించుకోగలిగి ఉండేది. తనను నాశనానికి నడిపించిన పాపం నుంచి లోతు ఆదర్శ ప్రభావం ఆమెను కాపాడి ఉండేది. కాని అతడి సందేహం, PPTel 151.2

    జాప్యం దేవుని హెచ్చరికను ఆమె తేలికగా పరిగణించేటట్లు చేసింది. ఆమె శరీరం మైదానంలో ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం సొదొమకు అంటి పెట్టుకుని ఉన్నది. అది సొదొమతోనే నశించింది. దేవుని తీర్పులవల్ల తన సంపద నాశనమైనందుకు, తన బిడ్డలు సొదొమలో నాశనమైనందుకు ఆమె దేవుని పై తిరుగుబాటు చేసింది. ఆ దుష్ట పట్టణం నుంచి తప్పించుకోవటానికి పరిగణన పొందటం గొప్ప ఆధిక్యతే అయిన ప్పటికీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తి నాశనం కావటానికి అక్కడ విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి రావటం తనకు జరిగిన అన్యాయమని ఆమె భావించింది. నాశనం కాకుండా తప్పించుకోవటానికి కలిగిన అవకాశాన్ని ఆనందంగా అంగీకరించేబదులు దేవుని హెచ్చరికను తోసిపుచ్చినవారు జీవిస్తున్న జీవితాన్ని ఆకాంక్షిస్తూ వెనక్కు తిరిగి చూసింది. తాను జీవించటానికి అర్హురాలు కాదని ఆమె పాపం వ్యక్తపర్చింది. ఎందుకంటే ప్రాణ రక్షణ విషయంలో ఆమెకు ఏకోశానా కృతజ్ఞత లేదు.PPTel 151.3

    మన రక్షణ నిమిత్తం దేవుడు కృపతో చేసే ఏర్పాటుల్ని చులకనగా పరిగణించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. “నా జీవిత భాగస్వామి నా బిడ్డలు రక్షణ పొందకపోతే నాకు రక్షణ అవసరంలేదు” అనే క్రైస్తవులున్నారు. తమకు ప్రియమైన వారు లేకుండా తమకు పరలోకం పరలోకంగా ఉండదని వారు తలుస్తారు. అయితే ఈ అభిప్రాయం గలవారు దేవుడు తమపట్ల కనపర్చుతున్న కృప కనికరాల దృష్ట్యా ఆయనతో తమ సంబంధం విషయంలో సరైన అభిప్రాయం కలిగి ఉన్నారా? తమ సృష్టికర్త, విమోచకుడు అయిన క్రీస్తు సేవకు తాము బలమైన ప్రేమ, గౌరవం బంధాలతో బంధింపబడి ఉన్న సంగతి వారు మర్చిపోతున్నారా? కృప పొందటానికి ఆహ్వానం అందరికీ ఉన్నది. మన మిత్రులు రక్షకుని ప్రేమను నిరాకరించారు. గనుక మనంకూడా ఆయనకు దూరంగా వెళ్లిపోదామా?PPTel 152.1

    ఆత్మవిమోచన ఎంతో ప్రశస్తమైనది. మన రక్షణ నిమిత్తం క్రీస్తు గొప్ప మూల్యం చెల్లించాడు. ఈ అపూర్వ త్యాగాన్ని అభినందించేవారు లేదా ఒక ఆత్మ విలువను గ్రహించగలిగేవారు ఎవరూ దాన్ని తృణీకరించరు. ఆయన న్యాయమైన హక్కుల్ని ఇతరులు అలక్ష్యం చేస్తుండటమే మరింత భక్తిగా నిష్టగా నివసించటానికి మనల్ని మేల్కొపాలి. అప్పుడు స్వయంగా మనం దేవుని ఘనపర్చి మన ప్రభావ పరిధిలో ఉన్నవారందరిని ఆయన ప్రేమను అంగీకరించటానికి నడిపించగలుగుతాం. “లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను”ఉదయ కిరణాలు మైదాన పట్టణానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చేటట్లు కనిపించాయి. వీధుల్లో రద్దీ పెరిగింది. వ్యాపారం నిమిత్తం వినోదాల నిమిత్తం మనుషులు ఇటూ అటూ వస్తూ వెళ్తూ ఉన్నారు. లోతు అల్లుళ్లు ముసలాయన భయాలు గురించి అతడు చేస్తున్న హెచ్చరికల గురించి ఎగతాళి చేస్తూ నవ్వుకొంటున్నారు. మబ్బులేని ఆకాశంలో నుంచి ఉరుము వచ్చినట్లు హఠాత్తుగా తుఫాను రేగింది. ప్రభువు ఆ పట్టణాలమీద, మైదానంలోని పంటలు పైరుల మీద ఆకాశం నుంచి గంధకాన్ని, అగ్నిని కురిపించాడు. మైదాన పట్టణాల రాజభవనాలు, దేవాలయాలు, వెలగల గృహాలు, తోటలు, ద్రాక్ష తోటలు, వినోదాల్లో తేలి ఆడూ అంతకుముందు రాత్రే దైవ రాయబారుల్ని అవమానపర్చిన జనసమూహాలు, అందరూ అగ్నికి ఆహుతి అయ్యారు. ఆ మంటల పొగ బ్రహ్మాండమైన కొలిమినుంచి లేచిన పొగల్లే పైకి లేచింది. అందమైన సిద్దీము లోయ మనుషుల్లేని శ్మశానమయ్యింది. ఆ స్థలం ఇళ్లు కట్టడం గాని జన నివాసంగాని ఉండని స్థలంగా మారింది. అది అతిక్రమాలకు తప్పక వచ్చే దేవుని తీర్పుకు తరతరాలుగా సాక్షిగా నిలుస్తుంది.PPTel 152.2

    మైదాన పట్టణాల్ని దగ్ధం చేసిన మంటలు వాటి హెచ్చరిక కాంతిని మన కాలానికి కూడా ప్రసరింపజేస్తున్నాయి. కృపగల దేవుడు పాపి విషయంలో దీర్ఘకాలం సహనం చూపినప్పటికీ మనుషులు పాపం చేస్తూ పోవటానికి లేదు. పాపానికి ఒక హద్దు ఉన్నది. మనుషులు దాన్ని దాటిపోకూడదు. వారు దాన్ని అధిగమించినప్పుడు దేవుని కృప ఆగిపోతుంది. దేవుని తీర్పులు ప్రారంభమౌతాయి.PPTel 153.1

    సొదొమ గొమొర్రాల నాశనానికి దారితీసిన పాపాలకన్నా ఘోరమైన పాపాలున్నాయని లోక రక్షకుడు యేసంటున్నాడు. సువార్త మారుమనసు పొందమంటూ పాపుల్ని ఆహ్వానించటం విని దాన్ని అంగీకరించనివారు దేవునిముందు సిద్దీము లోయ నివాసులకన్నా ఎక్కువ అపరాధులుగా నిలబడ్డారు. దేవునికి భయపడున్నట్లు ఆయన ఆజ్ఞలు గైకొంటున్నట్లు చెప్పుకొంటూ తమ ప్రవర్తనలోను దినదిన వ్యవహారాల్లోను క్రీస్తును ఉపేక్షించేవారు ఇంకా ఘోరమైన పాపులు. రక్షకుని హెచ్చరిక దృష్ట్యా, భయంకర పాపాలకు పాల్పడే వారికే గాక దేవుడు పంపే సత్యాన్ని, ఆధిక్యతల్ని చులకనగా చూసేవారు సొదొమ నివాసులికి కలిగిన శిక్షను ఒక గంభీర హెచ్చరికగా పరిగణించాలి.PPTel 153.2

    ఎఫెసులోని సంఘంతో సత్యసాక్షి ఇలా అన్నాడు, “అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొందితేనేసరి,PPTel 153.3

    లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపమును దాని చోటనుండి తీసివేతును” ప్రకటన 2:4, 5. తాను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ప్రేమకు క్షమాపణకు మన ప్రతిస్పందనకోసం బాధలోవున్న ఒక అవిధేయ బిడ్డను క్షమించటంలో లోకంలో ఒక తండ్రి లేక తల్లి కనపర్చే ప్రేమకన్నా గాఢమైన ప్రేమతో రక్షకుడు కనిపెడ్తూ ఉంటాడు. “మీరు నా తట్టు తిరగినయెడల నేను మీ తట్టు తిరుగుదును”అంటూ దారితప్పి తిరుగుతున్నది వారిని ఆయన పిలుస్తున్నాడు. మలాకీ 3:7. తప్పు చేస్తున్న వ్యక్తి తనను కనికరంతో ప్రేమతో పిలుస్తున్న స్వరాన్ని పదేపదే తోసిపుచ్చుతుంటే చివరికి అతణ్ణి చీకటిలో విడిచి పెట్టడం జరుగుతుంది. దైవకృపను దీర్ఘకాలం తృణీకరిస్తూ వస్తున్న హృదయం పాపం చేసి చేసి కఠినమై దేవుని కృప ప్రభావానికి తావీయదు. అతడు “విగ్రహములతో కలిసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము” అని ఎవరిగురించి రక్షకుడు చివరిగా అంటాడో అతడి పరిస్థితి బహు భయంకరమైనది. హోయేష 4:17. క్రీస్తు ప్రేమను ఎరిగినప్పటికి పాపలోకంలోని సుఖభోగాలు ఎన్నుకొనే ప్రజల పరిస్థితి మైదానంలోని పట్టణాల పరిస్థితి కన్నా ఎంతో ఘోరంగా ఉంటుంది ఆ తీర్పుదినాన్న.PPTel 153.4

    దేవుని కృపను తృణీకరిస్తున్న మీరు పరలోక గ్రంథాల్లో మీ పేరుకి ఎదురుగా దొంతర దొంతరగా దాఖలవుతున్న దోషాలగురించి ఆలోచించండి. ఎందుకంటే రాజ్యాల భక్తిహీనతను గూర్చి, కుటుంబాల భక్తిహీనతను గూర్చి, వ్యక్తుల భక్తి హీనతనుగూర్చి పరలోకంలో రికార్డులున్నాయి. ఘటనల దాఖలాలు సాగుతున్నప్పుడు, పశ్చాత్తాపానికి పిలుపులు వస్తున్నప్పుడు, క్షమాపణకు ఇంకా తరుణం ఉన్నప్పుడు దేవుని ఓర్పు దీర్ఘకాలం కొనసాగవచ్చు. ఆత్మ తన తీర్మానాన్ని చేసుకొన్నప్పుడు, తాను చేసుకొన్న ఎంపికబట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్ధారించబడప్పుడు దాఖలాలు పూర్తికావటానికి సమయం వస్తుంది. అప్పుడు అమలుకు సూచన వస్తుంది.PPTel 154.1

    నేటి మత ప్రపంచ ఆందోళనకరంగా ఉన్నది. దేవుని కృపను చులకన చేయటం జరుగుతుంది. వేలాదిమంది దైవ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నారు. వారు “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు”చున్నారు మత్తయి 15:9. మనదేశంలో అనేక సంఘాల్లో నాస్తికత ప్రబలుతున్నది. అది సామాన్య నాస్తికత కాదు. అది క్రైస్తవమతం దుస్తులు వేసుకొని దైవావేశంవల్ల కలిగిన బైబిలు పై విశ్వాసాన్ని నాశనం చేసే నాస్తిక మతం. ప్రగాఢ భక్తి ఆత్మ సమర్పణ స్థానాన్ని అర్థం లేని ఆచారం ఆక్రమిస్తుంది. ఫలితంగా మతభ్రష్టత, సుఖలాలసత పెరుగుతున్నాయి. క్రీస్తు ఇలా అన్నాడు, “లోతు దినములలో జరిగినట్టును జరుగును... ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును” లూకా 17:28, 30. రోజు రోజు చోటు చేసుకొంటున్న ఘటనలు ఈ మాటల నెరవేర్పును ధ్రువపర్చుతున్నాయి. ఈ ప్రపంచం నాశనం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. త్వరలోనే దేవుని తీర్పులు లోకం పైకి రానున్నాయి. పాపమూ, పాపులూ దగ్ధం కానున్నారు. PPTel 154.2

    మన రక్షకుడిలా అన్నాడు : “మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తువలనను ఐహిక విచారుల వలననూ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీమీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించువారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును” -- ఎవరి ఆశలు, ఆసక్తులు లోకం మీద కేంద్రీకృతమవుతాయో వారిమీదికి. “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని యెదుట నిలువబడుటకు వక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి”. లూకా 21:34-36.PPTel 155.1

    సొదొమ నాశనానికి ముందు దేవుడు లోతుకి ఒక వర్తమానం పంపాడు. “నా ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము. ఈ మైదానములు ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్ము. యెరూషలేము నాశనానికి ముందు క్రీస్తు శిష్యులు ఇదే హెచ్చరిక స్వరాన్ని విన్నారు : “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను” లూకా 21:20, 21. వారు తమకున్న వాటిలో దేనినీ తీసుకువెళ్లటానికి ఆగకూడదు. తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పారిపోవాలి.PPTel 155.2

    బైటికి రావటం, దుష్టుల మధ్యనుంచి విడిపోటం, ప్రాణం కాపాడుకోటానికి పారిపోటం జరిగింది. నోవాహు దినాల్లో కూడా ఇదే జరిగింది. లోతు విషయంలోనూ జరిగిందిదే. యెరూషలేము నాశనానికి ముందు శిష్యుల విషయంలో జరిగింది ఇదే. బబులోన్ను గూర్చిన దర్శనంలో, చివరి దినాల్లో మత ప్రపంచంలో ప్రబలే దుర్నీతి మత భ్రష్టత ప్రవక్త అయిన యోహానుకి ఇలా ప్రకటితమయ్యా యి : “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దానిని విడిచిరండి” ప్రకటన 18:4. నోవహు దినాల్లోలాగ లోతు దినాల్లోలాగ పాపంనుంచి పాపులనుంచి ఖచ్చితమైన వేర్పాటు అవసరం. దేవునికీ లోకానికీ మధ్య రాజీ అన్నది లేదు. లోక సంబంధమైన సంపదలకోసం వెనక్కి తిరిగి చూట్టానికి లేదు. “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు”, మత్తయి 6:24.PPTel 155.3

    సిద్దీము లోయలోని ప్రజలకు మల్లే ప్రజలు మంచిరోజులు గురించి శాంతి సమాధానాలు గురించి కలలు కంటున్నారు. “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము” అన్నది దేవదూతలిచ్చిన హెచ్చరిక. అయితే ఇతర స్వరాలు కూడా వినిపించాయి. “ఆందోళన చెందాల్సిన పనిలేదు. భయపడటానికి అసలు కారణమే లేదు”. అపరాధికి నాశనం త్వరితంగా వస్తుందని దేవుడు హెచ్చరిస్తుంటే ప్రజలు “శాంతి సంక్షేమాలు” అంటూ కేకలు వేస్తున్నారు. తమ నాశనానికి ముందు రాత్రి మైదానంలోని పట్టణాలు వినోదాల్లో తేలి ఆడూ దేవుని దూతలు చేసిన హెచ్చరికను చులకను చేసి ఎగతాళి చేశారు. అయితే ఆ అపహాసకులు ఆ మంటల్లో కాలి నాశనమయ్యారు. సొదొమ ప్రజలకు ఆ రాత్రే తలుపు మూసుకొంది. దేవున్ని ఎల్లప్పుడూ అపహసించటం సాగదు. “యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయు టకును, పాపులకు బత్తిగా దానిలో నుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును”. యెషయా 13:9. లోకంలో ఎక్కువమంది దేవుని కృపను నిరాకరించి గొప్పనాశనానికి గురి అవుతారు. కాని హెచ్చరికను వినిపించుకొనేవారు “మహోన్నతుని చాటున “నివశిస్తూ “సర్వశక్తుని నీడను” విశ్రమిస్తారు.” ఆయన సత్యమే వారికి కేడెము, డాలు. వీరికి ఈ వాగ్దానం ఉన్నది, “దీర్ఘాయువుచేత అతనిని తృప్తి పరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను” కీర్తనలు 91:1, 4, 16.PPTel 156.1

    సోయరులో కొద్దికాలం మాత్రమే లోతు నివసించాడు. సొదొమలో లాగే అక్కడ కూడా దుష్టత్వం ప్రబలింది. ఆ పట్టణం కూడా నాశనమవుతుందేమోనన్న భయంతో లోతు అక్కడ నివసించలేదు. కొద్దికాలంలోనే దేవుని ఉద్దేశానుసారం సోయరు కూడా నాశనం అయ్యింది. లోతు కొండలకు వెళ్లిపోయి అక్కడ ఒక లోయలో నివసించాడు. ఏ వసతులు, సదుపాయాల కోసం తన కుటుంబాన్ని ఆ దుర్మార్గ పట్టణ ప్రభావానికి బలిచేయటానికి లోతు సాహసించాడో అవేవీ అక్కడ లేవు. అయినా సొదొమ శాపం ఇక్కడ కూడా అతణ్ని వెంటాడింది. తన కుమార్తెల నీచ ప్రవర్తన సొదొమలో వారి వారి దుష్ట సంబంధాల ఫలం. ఆ పట్టణం తాలూకు నైతిక దుష్టత్వం వారి ప్రవర్తనలో అంతర్భాగమయ్యింది. అందువల్ల వారు మంచికి చెడుకు మధ్య తేడాను భ్రమించలేకపోయారు. లోతు సంతతివారు మోయా బీయులు, అమ్మోనీయులు. వీరు బహు దుష్టులు, విగ్రహారాధకులైన జాతులు, దేవుని పై తిరుగుబాటు చేసి ఆయన బిడ్డలకు బద్ధ విరోధులైన ప్రజలు.PPTel 156.2

    అబ్రాహాము జీవితానికి లోతు జీవితానికి మధ్య ఎంత పెద్ద వ్యత్యాసం! ఒకప్పుడు వారిద్దరూ కలసి మెలసి ఉన్నవారు. ఒకే బలిపీఠం వద్ద దేవుని ఆరాధించినవారు. తమ యాత్రిక గుడారాలు ఒకరిపక్క ఒకరు వేసుకొని నివసించినవారు.ఇప్పుడు వారి మధ్య దూరం ఎంత పెరిగింది! విలాస జీవితం కోసం లాభార్జనకోసం లోతు సొదొమను ఎంపిక చేసుకొన్నాడు. అబ్రాహాము బలిపీఠాన్ని అక్కడ సజీవ దేవునికి జరిగే అనుదిన బలి అర్పణల్ని విడిచి పెట్టి తన బిడ్డలు దుర్మార్గులు, విగ్రహారాధకులు అయిన ప్రజలతో కలసిమెలసి ఉండటానికి సమ్మతించాడు. అయినా హృదయంలో దేవుని భయం ఉంచుకున్నాడు. ఎందుచేతనంటే లేఖనాలు అతణ్ని “నీతిమంతుడు” అంటున్నాయి. ప్రతీరోజూ తనకు వినిపంచే దుర్భాషలు, జరుగుతున్న దౌర్జన్యాలు, బలాత్కారాలు వీటిని ఆపటానికి తనకు శక్తి లేకపోవటం అతడికి వేదన కలిగించాయి. “అగ్నిలోనుండి తీసిన కొరివివలె” అతణ్ని దేవుడు కాపాడాడు. (జెకర్యా 3:2). అయినా తనకున్నదంతా పోయింది. భార్యను బిడ్డల్ని కోల్పోయాడు. జంతువుల్లా గుహల్లో నివసిస్తున్నాడు. ముసలితనం వచ్చింది, చెడ్డ పేరు సంపాదించాడు. లోతు ప్రపంచానికిచ్చింది నీతి ప్రజల్ని కాదు, దేవుని విరోధుల్ని దైవ ప్రజలతో పోరాడేవార్ని. తమ దుర్మార్గత పాత్ర నిండిన తర్వాత నాశనానికి నియమితులైనవారు అయిన ఆ రెండు విగ్రహారాధక జాతుల్ని ఒక్క అవివేక చర్య ఎంత భయంకర పర్యవసానాలకు గురిచేసింది!PPTel 157.1

    జ్ఞాని ఇలా అంటున్నాడు “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచి పెట్టుము” “లోభి తన యింటివారిని బాధ పెట్టును. లంచమును అసహ్యించుకొనువాడు బ్రతుకును.” సామెతలు 23:4, 15:27. అపోస్తలుడైన పౌలు ఈ హెచ్చరిక చేస్తున్నాడు, “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు” 1 తిమోతి 6:9.PPTel 157.2

    లోతు సొదొమలో ప్రవేశించినపుపడు దుర్మార్గతకు దూరంగా ఉండాలని తన కుటుంబం తనతోపాటు దేవుని వెంబడించాలని ఆజ్ఞాపించాలని ఉద్దేశించాడు.కాని అలా చేయలేకపోయాడు. తనను చుట్టిముట్టివున్న దుష్ప్రభావాలు అతడి వ్యక్తిగత విశ్వాసాన్ని బలహీనపర్చాయి. సొదొమ ప్రజలతో లోతు పిల్లలు అనుబంధం కొంతమేరకు లోతు ఆసక్తుల్ని పెనవేసుకుంది. దాని ఫలితం మన కళ్లముందే ఉంది. అనేకమంది ఇలాంటి తప్పిదాన్నే ఇంకా చేస్తున్నారు. గృహాన్ని ఎంపిక చేసుకొనేటప్పుడు అనేకులు లౌకికమైన లాభాలకోసం చూస్తారేగాని తమను తమ కుటుంబాల శ్రేయస్సును పరిగణించరు. వారు సుందరమైన సారవంతమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొంటారు లేదా అన్ని హంగులూ ఉన్న నగరానికి వెళ్లి ఇంకా ఎక్కువ సంపాదించా లని చూస్తారు. కాకపోతే వారి పిల్లలు అనేక శోధనల నడుమ పెరుగుతారు. వారు చేసే స్నేహాలు భక్తి పెరగటానికి సత్ప్రవర్తన వృద్ధి చెందటానికి తరచూ అనుకూలంగా ఉండవు. నైతిక బలహీనత, అవిశ్వాసం, మత విషయాల సందర్భంగా ఉపేక్ష, పెరిగే వాతావరణం, తల్లిదండ్రుల అధికారాన్ని దేవుని అధికారాన్ని వ్యతిరేకించే వారి సాదృశ్యాలు యువతముందు నిత్యమూ ఉంటాయి. అనేకమంది యువజనులు నాస్తి కులతోను అవిశ్వాసులతోను అనుబంధం పెంచుకొని శత్రువలతో చేతులు కలుపుతారు. PPTel 157.3

    గృహం ఏర్పాటు చేసుకోవటంలో మన బిడ్డలచుట్టూ మన చుట్టూ ఉండే నైతిక, ఆధ్యాత్మిక ప్రభావాల్ని మనం మొట్టమొదటగా పరిగణలోనికి తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. తాము కోరుకొనే పరిసరాలు అనేకులకు లభించకపోవటంతో కష్ట పరిస్థితులు ఏర్పడవచ్చు. క్రీస్తు కృపను నమ్ముకొని మెళకువగా ఉండి ప్రార్థన చేసే మనం విధిని నిర్వహించాల్సి వచ్చినప్పుడల్లా నీతిగా నిలబడటానికి మనకు దేవుడు శక్తినిస్తాడు. కాగా క్రైస్తవ ప్రవర్తన నిర్మాణానికి దోహదపడని ప్రభావాలకు అనవసరంగా మనల్ని మనం లోనుచేసుకోకూడదు. లోకాశలు, అవిశ్వాసం వాతావరణంలోకి ఇష్టపూర్వకంగా మనం వెళ్లినప్పుడు మనం దేవుని దు:ఖపర్చి మన గృహాల నుంచి పరిశుద్ధ దూతల్ని తరిమివేస్తాం. తమ బిడ్డలకోసం ధనాన్ని లోకసంబంధమైన ప్రతిష్ఠను సంపాదించేవారు ఈ సంపాదనలన్నీ గొప్ప నష్టమని చివరికి తెలుసుకొంటారు. అనేకమంది లోతుకు మల్లే తమ బిడ్డలు నాశనంకావటం, ప్రాణాలతో బైటపడటం చూస్తారు. జీవితమంతా వారు చేసిన శ్రమ వ్యర్థమవుతుంది. వారి జీవితం దు:ఖంతో పరాజయంతో అంతమొందుతుంది. వారు జ్ఞానయుక్తంగా వ్యవహరించి ఉంటే వారి బిడ్డలకు లోక సంబంధమైన అభివృద్ధి అంతగా లేకపోయినా నిత్యజీవ ఆస్తికి వారికి హక్కు లభించి ఉండేది.PPTel 158.1

    దేవుడు వాగ్దానం చేసిన వారసత్వం ఈ లోక సంబంధమైంది కాదు. అబ్రాహాముకి లోకంలో “పాదము పట్టునంత భూమి” కూడా లేదు. అ.కా. 7:5.అతడికి గొప్ప సంపద ఉంది. దాన్ని దేవుని మహిమార్థ ప్రజల ఉపకారం నిమిత్తం ఉపయోగించాడు. అబ్రాహాము ఈ లోకాన్ని తన గృహంగా పరిగణించలేదు. కనాను దేశాన్ని తనకు నిత్య ఆస్తిగా ఇస్తానని వాగ్దానం చేస్తూ విగ్రహారాధకులైన తన ప్రజల్ని విడిచి రమ్మని అతణ్ణి దేవుడు పిలిచాడు. అయినా అతడుగాని అతడి కొడుకు గాని అతడి కొడుకు కొడుకుగాని దాన్ని పొందలేదు. మరణించిన తన ఆప్తుల సమాధికి స్థలం కనానీయుల వద్దనుంచి అబ్రాహాము కొనాల్సి వచ్చింది. వాగ్దత్త దేశంలో అబ్రహాముకున్న ఆస్తి అంతా మెక్బేలా గుహలోని రాతి సమాధి మాత్రమే.PPTel 158.2

    అయినా దేవుని మాట నిరర్థకం కాలేదు. యూదు ప్రజలు కనానును స్వాధీనం పర్చుకోవటంతో కూడా ఆ మాట నెరవేర్పు జరుగలేదు. “అబ్రాహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను” గలతి 3:16. అబ్రాహాము కూడా ఆ వారసత్వాన్ని పంచుకోవాల్సి ఉన్నాడు. దైవ వాగ్దానాలు నెరవేర్పులో జాప్యం జరుగుతున్నట్లు కనిపించవచ్చు. ఎందుచేతనంటే “ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి” ‘2 పేరతు 3:8).అది ఆలస్యం చేస్తున్నట్లు కనిపించవచ్చు. కాని నిర్ణీతకాలం వచ్చినప్పుడు అది “సమాప్తమగుటకై ఆత్రుతపడుచున్నది” హబక్కూకు 2:3. అబ్రాహాముకి అతడి సంతతికి దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యం కనాను దేశానికే పరిమితం కాలేదు. అందులో ఈ భూమి అంతా ఇమిడి ఉంది. దీన్ని అపోస్తలుడిలా వివరిస్తున్నాడు, “అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదుగాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను” రోమా 4:13. దేవుడు అబ్రాహాముకి చేసిన వాగ్దానాలు క్రీస్తు ద్వారా నెరవేరాయని బైబిలు స్పష్టంగా బోధిస్తుంది. క్రీస్తుకు చెందిన వారందరూ “అబ్రాహాము యొక్క సంతానమైయుండి” “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యమునకు” అనగా పాప శాపము నుంచి విముక్తి పొందిన భూమికి వారసులవుతారు. గలతీ 3:29, 1 పేతురు 1:4. ఎందుకంటే “ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశు దులకు చెందును”. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు” దానియేలు 7:27; కీర్తనలు 37:11.PPTel 159.1

    అక్షయమైన ఈ స్వాస్థ్యం గురించి అబ్రాహాముకి దేవుడు అవగాహన కలిగించాడు. ఈ నిరీక్షణతో అతడు తృప్తి చెందాడు. “విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై యున్నాడో పునాదులుగల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను” హెబ్రి 11:9, 10.PPTel 159.2

    అబ్రాహాము సంతతి విషయం లేఖనం ఇలా చెబుతున్నది, “వీరందరు ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, దూరము నుండి చూచి వందనము చెప్పి తాము భూమిమీద పరదేశులమును, యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి” 13వ వచనం. “మరి శ్రేష్ఠమైన దేశము, అనగా పరలోక సంబంధమైన దేశము” కావాలని ఆశిస్తున్నట్లయితే ఇక్కడ మనం యాత్రికులు పరదేశులుగా నివసించాలి. 16వ వచనం. అబ్రాహాము సంతానమైనవారు “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో” ఆ పట్టణాన్ని అన్వేషిస్తారు.PPTel 159.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents