Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    64—పలాయితుడైన దావీదు

    గొల్యాతు సంహారం అనంతరం సౌలు దావీదును తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనియ్యకుండా తన వద్దనే ఉంచుకొన్నాడు. “యోనాతాను దావీదులు సోదరులుగా కలసి ఉండటానికి నిబంధన చేసుకొన్నారు. రాకుమారుడు “తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను”. దావీదుకి ప్రాముఖ్యమైన బాధ్యతల్ని రాజు అప్పగించినా అతడు వినయ విధేయతలతో మసలుకొని అటు ప్రజల అభిమానాన్ని ఇటు రాచకుటుంబము అనురాగాన్ని చూరగొన్నాడు.PPTel 655.1

    “దావీదు సౌలు తనను పంపినచోట్ల కెల్లను పోయి సుబుద్ధిగలగి పనిచేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతినిని నియమించెను.” దావీదు ప్రాజ్ఞత విశ్వసనీయత కలిగి వ్యవహరించాడు. అతణ్ణి దేవుడు బహుగా దీవించాడన్నది నిజం. ఇశ్రాయేలీయుల్ని పరిపాలించటానికి తాను అసమర్ధుణ్నిని సౌలు కొన్నిసార్లు గుర్తించేవాడు. దేవుని వద్ద నుండి ఉపదేశం పొందే ఒక వ్యక్తి తనతో కలిసి ఉంటే తన రాజ్యం మరింత భద్రంగా ఉంటుందని సౌలు ఆశించాడు. దేవుడు దావీదు పట్ల దయతో చూపించి అతణ్ణి కాపాడున్నాడు. గనుక తాను యుద్ధానికి వెళ్ళినప్పుడు తనతో దావీదు ఉనికి తనకు రక్షణగా ఉంటుందని సౌలు భావించాడు.PPTel 655.2

    దావీదుకి సౌలుతో సంబంధము ఏర్పడటం దైవ సంకల్పం చొప్పునే జరిగింది. రాజాస్థానంలో దావీదుకున్న స్థానం అతడికి పరిస్థితుల్ని గూర్చిన జ్ఞానాన్ని సమకూర్చింది. ఇది అతడికి భావి ఔన్నత్యానికి సిద్ధబాటు. ప్రజల విశ్వాసాన్ని పొందటానికి అది దోహదపడనుంది. సౌలుతో విరోధం మూలాన తనకు కలిగిన శ్రమలు బాధలు పరిస్థితుల మార్పు అతడు దేవుని మీద ఆధారపడటానికి దారి తీసి అతడు పూర్తిగా దేవుని పై అనుకొనేటట్లు చేయాల్సి ఉన్నాయి. దావీదు యోనాతానుల మధ్య స్నేహం కూడా దేవుని సంకల్పమే. ఇశ్రాయేలీయలు సందర్భంగాను వీటన్నిటిలోను దేవుడు తన ఉద్దేశాల్ని నెరవేర్చుతున్నాడు.PPTel 655.3

    దావీదుతో సౌలు స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదు. సౌలు దావీదులు ఫిలిప్తీయులతో యుద్ధం చేసి తిరిగి వస్తున్న తరుణంలో “స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటి నుండి తంబురతోను, సంభ్రముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి”. “సౌలు వేలకొలదియు” అని ఒక గుంపు గానం చేయగా “దావీదు పదివేల కొలదియు” అని ప్రతిగానం చేసారు. రాజు మనసులో అసూయ రక్కసి ప్రవేశించింది. ఇశ్రాయేలు మహిళల పాటలో తనకన్నా దావీదుకు ఎక్కువ ఘనత కలిగింనదున రాజకు కోపం వచ్చింది. ఆ ఈర్ష్యపూరిత భావాల్ని అణచుకొనే బదులు అతడు తన ప్రవర్తనలోని బలహీనతను బయట పెడుతూ ఇలా అన్నాడు. “వారు దావీదుకు పదివేల కొలదియు అనియు, నాకు వేల కొలది అనియు స్తుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను”.PPTel 655.4

    సౌలు ప్రవర్తనలో గొప్ప లోపమేంటంటే పొగడ్తను ప్రేమించటం, ఈ అవగుణమే అతడి క్రియల్ని ఆలోచనల్ని నియంత్రించిది. అతడు చేసిన ప్రతీకార్యంలో స్తుతికి ఆత్మోన్యతికి ప్రాధాన్యతనిచ్చాడు. తప్పొప్పలకు అతడి ప్రమాణం చౌకబారు ప్రజాభినందనే. ముందు దేవుని మెప్పుకు ప్రయత్నించకుండా ప్రజల్ని మెప్పించటానికే బతికే ఏ వ్యక్తి సమాజానికి క్షేమం కాదు. ప్రజల దృష్టిలో తానే ప్రథముడిగా ఉండాలన్నది సౌలు కోరిక. ఆ మహిళలు స్తుతి గీతం పాడినప్పుడు దావీదు ప్రజల అభిమానాన్ని పొంది తన స్థానంలో రాజ్య పరిపాపాలనను చేస్తాడన్న నమ్మకం అతడిలో స్థిరపడింది.PPTel 656.1

    ఈర్ష్యకు సౌలు తన హృదయ ద్వారాన్ని తెరిచాడు. అది అతడి ఆత్మను విషపూరితం చేసింది. దేవుడు తాను అనుకొన్న దాన్ని చేసి తీరాడని దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తనకు ప్రవక్త సమూయేలు భోధిధించినప్పటికి దేవుని ప్రణాళికల్ని గురించి గాని ఆయన శక్తిని గురించి గాని తనకు ఏమి అవగాహన లేదని రాజు బయలుపర్చుకున్నాడు. ఇశ్రాయేలీయుల రాజు తన చిత్రాన్ని దేవుని చిత్తానికి అడ్డం వేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్న సౌలు తన సొంత స్వభావాన్ని ఏలుకోవటం నేర్చుకోలేదు. తీవ్ర ఉద్రేకంలో కూరుకుపోయేంతవరకు సౌలు తన భావోద్వేగాలే తన సుబుద్దిని అదుపు చేయనిచ్చాడు. కోపంతో చిందులు తొక్కేటప్పుడు తన మాటకు అడ్డు చెప్పటానికి ఏ వ్యక్తి అయినా సాహసిస్తే అతడి ప్రాణాలు తీయటానికి వెనకాడేవాడు కాదు. ఈ ఉన్మాదం నుంచి నిరుత్సాహం, తిరస్కారం, అనుతావస్థితికి అతడి ఆత్మ దిగజారేది..,PPTel 656.2

    దావీదు సితార వాయించటం ఎంతో ఇష్టంగా వినేవాడు. దురాత్మ కొంత సేపు అతన్ని విడిచి వెళ్ళేది. ఒకరోజు దావీదు తన ముందు సితార వాయిస్తూ చక్కని సంగీతం సమకూర్చుతూ గళమెత్తి దేవుని స్తుతిస్తుండగా అతణ్ణి మట్టు పెట్టాలన్న ఉద్దేశంతో సౌలు తన ఈటెను అతడి పైకి విసిరాడు. దేవుడు దాన్ని అడ్డుకొని దావీదును రక్షించాడు. ఉన్మాది అయిన రాజు కోపావేశం నుంచి తప్పించుకొని దావీదు పారిపోయాడు.PPTel 656.3

    దావీదు పై ద్వేషం పెరిగే కొద్ది అతణ్ణి హతమార్చేందుకు అవకాశం కోసం జాగ్రత్తగా కని పెడుతున్నాడు. దైవ సేవకుణ్ని చంపటానికి వేసిన ప్రణాళికలేవి జయప్రదం కాలేదు. తన్ను అదుపు చేస్తున్న దురాత్మకు సౌలు అంకితమైపోయాడు. దావీదు మాత్రం ఆలోచనపరుడు విమోచకుడు అయిన ప్రభువును నమ్ముకొన్నాడు. “యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము” (సామెతలు 9:10) అందువలన తన ముందు పరిపూర్ణుడుగా నడిచేందుకు తోడ్పడమని దావీదు నిత్యం దేవునికి ప్రార్ధన చేసేవాడు.PPTel 657.1

    తన ప్రత్యర్థి ముఖం చూడకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాజు “అతని తన యొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను... ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు. పోవుచు నుండుటచేత వారు అతని ప్రేమిం”చారు. దావీదు సమర్థుడన్న విషయం గ్రహించటంలోను తనకు అప్పగించిన విషయాల్ని జ్ఞానం నైపుణ్యాలతో నిర్వహిస్తాడని గ్రహించటంలోను ప్రజలు వెనుకబడిలేరు. ఆ యువకుడి ఆలోచనలు జ్ఞాన పూరితమైనవి. వాటిని ఆచరించటం క్షేమకరమని నిరూపితమయ్యింది. కొన్నిసార్లు సౌలు తీర్మానాలు విశ్వసనీయమైనవి కావు. అతడి తీర్పులు విజ్ఞతతో కూడినవి కావు PPTel 657.2

    దావీదును నాశనం చెయ్యటానికి అవకాశం సౌలు సర్వదా అప్రమత్తంగా ఉన్నా అతడంటే భయపడేవాడు. ఎందుకంటే ప్రభువు అతడితో ఉన్నాడన్నది అందరికి తెలుసు. దావీదు నిందారహిత జీవితం రాజుకు కోపం పుట్టించింది. దావీదు జీవితం, అతడి సన్నిధి సౌలుకి నింద తెచ్చి పెడుతుంది. వారి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల సౌలు ప్రవర్తన లోపాలు స్పష్టంగా కానవచ్చాయి. PPTel 657.3

    సౌలుకి దు:ఖం తెచ్చి పెట్టింది. దావీదుని అపాయానికి గురి చేసింది. ఆసూయే ప్రవర్తనలోని ఈ దుర్గుణం మన ప్రపంచానికి ఎంత కీడు చేస్తుంది! హేబేలు క్రియలు నీతి క్రియలైనందున దేవుడు అతణ్ణి గౌరవించి కయీను క్రియలు చెడ్డవవటంతో దేవుడతణ్ణి దీవించినందుకు కయీను తన సోదరుడిపట్ల ఎలాంటి వైషమ్యం పెంచుకొన్నాడో అలాంటి వైరుధ్యమే సౌలు హృదయంలోచోటు చేసుకొంది. ఈర్ష్య, గర్వం, కన్న బిడ్డ, హృదయంలో దాన్ని పెంచి పోషిస్తే అది ద్వేషానికి దారి తీసి కక్షకు హత్యలకు కారణమౌతుంది. తనకు ఎన్నడు ఏ హానీ చేయని దావీదుపై కక్ష సాధింపుకు ప్రోత్సహించటంలో సాతాను తన ప్రవర్తన ఎలంటిదో చాటుకొన్నాడు.PPTel 657.4

    తనను అవమానపర్చటానికి సాకుగా అతడిలో ఏదైనా అపశ్రుతి లేక తొందరపాటుతనం దొరుకుతుందేమోనని దావీదు పై సౌలు పకడ్బందీ నిఘా వేసి ఉంచాడు. ఆ యువకుడి ప్రాణం తీసి అదే సమయంలో జాతి ముందు నిరపరాధిగా నిలవాలని అంతవరకు తనకు తృప్తి కలుగదని భావించాడు. సౌలు దావీదు పాదాలకు ఒక ఉచ్చుపన్నాడు. ఫిలిప్తీయుల పై మరింత ఉదృతంగా యుద్ధం చేయవలసిందిగా ప్రోత్సహించాడు. తన శౌర్యానికి ప్రతిఫలంగా దావీదుకి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని సౌలు వాగ్దానం చేసాడు. దీనికి దావీదిచ్చిన సమాధానం ఇది, “రాజునకు అల్లుడగుటకు నేనెంతటివాడను?నా స్థితియైనను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను ఏపాటిది”? యువరాణిని వేరొకడికిచ్చి వివాహం చేయటంలో రాజు తన కుటిల బుద్దిని బయలుపర్చుకొన్నాడు.PPTel 658.1

    సౌలు కడసారి కుమార్తె మీ కాలు దావీదు పై మనసుపడటం తన ప్రత్యర్థి దావీదు పై కుట్ర పన్నటానికి మరొక అవకాశం ఇచ్చింది. తమ జాతి శత్రువుల్లో ఒక నిర్దిష్ట సంఖ్యను ఓడించి సంహరించి ఆ నిదర్శనాన్ని సమర్పించుటమన్న షరతు పై సౌలు మీకాలుని ఇస్తానని వాగ్దానం చేసాడు. “దావీదు ఫిలిప్తీయుల చేతిలో మరణిస్తాడని సౌలు భావించాడు.” కాని తన సేవకుణ్ణి దేవుడు కాపాడాడు. రాజు అల్లుడు కావటానికి యుద్ధంలో నుంచి దావీదు విజయుడుగా తిరిగి వచ్చాడు. “తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి” ఉన్నది. తన కుట్రలు బెడిసికొట్టి తాను నాశనం చేయాలని చూసిన వ్యక్తి అందలి మొక్కనుండటం రాజుకి కోపం పుట్టించింది. తనకన్న మెరుగైనవాడని ప్రభువు చెప్పిన వ్యక్తి తన స్థానే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయాల్సిన వ్యక్తి ఇతడేనన్నది మరింత ధ్రువపడింది. ఇక దాగుడు మూతలకు స్వస్తి చెప్పి తాను బహుగా ద్వేషిస్తున్న దావీదును అంతం చేయాల్సిందిగా యోనాతానుకి ఆస్థాన అధికారులకి ఉత్తర్వులు జారీ చేసాడు.PPTel 658.2

    రాజు దురుద్దేశాన్ని యోనాతాను దావీదుకు తెలియపర్చి ఇశ్రాయేలీయుల విమోచకుడైన దావీదు ప్రాణాన్ని తీయవద్దని తన తండ్రిని కోరేవరకు దాగి ఉండమని యోనాతాను దావీదుతో చెప్పాడు. జాతి ప్రతిష్ఠను దేశ ప్రజల ప్రాణాన్ని కాపాడటంలో దావీదు నిర్వహించిన పాత్రను వివరించి ఇశ్రాయేలీయుల శత్రువుల్ని చెదరగొట్టాటానికి దేవుడు ఉపయోగించిన వ్యక్తిని హతంచెయ్యటం ఘోరమైన అపరాధమౌతుందని యోనాతాను తండ్రికి చెప్పాడు. సౌలు అంతరాత్మ సానుకూలంగా స్పందించింది. అతడి హృదయం మెత్తబడింది. “సౌలు.... యెహోవా జీవము తోడు అతనికి మరణ శిక్ష విధింపమని ప్రమాణము చేసెను”.... దావీదును సౌలు వద్దకు తీసుకు వచ్చారు. గతంలోలాగ దావీదు సౌలు సముఖంలో ఉండి సేవ చేసాడు.PPTel 658.3

    ఇశ్రాయేలీయులికి ఫిలిప్తీయులకి మధ్య మళ్ళీ యుద్ధం ప్రకటితమయ్యింది. ఇశ్రాయేలీయులు సైన్యానికి దావీదు నాయకత్వం వహించాడు.ఇశ్రాయేలీయులు అఖండ విజయం సాధించారు. దేశ ప్రజలంతా దావీదు విజ్ఞతను శౌర్యాన్ని కొనియాడారు. ఇది సౌలులోని గత ద్వేషాగ్ని మీద అజ్యం పోసింది. దావీదురాజు మందు వీణె వాయిస్తూ రాజ ప్రసాదాన్ని చక్కని సంగీతంతో నింపుతుండగా ఉద్వేగానికి లోనై సౌలు దావీదును గోడకు గుచ్చి చంపాలన్న ఉద్దేంతో అతడి మీదికి బళ్ళెం విసిరాడు. అయితే దేవుని దూత ఆ ఆయుధాన్ని పక్కకు మళ్ళించి దావీదును రక్షించాడు. దావీదు అక్కడ నుండి పారిపోయి తన గృహం చేరుకొన్నాడు. సౌలు గూఢచారుల్ని పంపించి ఉదయం బయటకి వస్తున్నప్పుడు అతణ్ణి పట్టుకొని చంపివేయమని ఆదేశించాడు.PPTel 659.1

    తండ్రి కుట్రను మీకాలు దావీదుకు తెలిపి ప్రాణం దక్కించు కోవటానికి పారిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసి కిటికీలో నుంచి కిందికి దింపి తప్పించుటకు పారిపోవటానికి తోడ్పడింది. దావీదు రామాలో ఉన్న సమూయేలు ప్రవక్త వద్దకు వెళ్ళాడు. సమూయేలు రాజు అగ్రహానికి భయపడకుండా పలాయితుడైన దావీదును స్వాగతించాడు. సమూయేలు గృహం ప్రశాంతమైన స్థలం. ఆశాంతి రాజభవనంలో లభించనిది. కొండల నడుమ ఉన్న ఈ స్థలంలో ఘనత వహించిన ఈ దైవ సేవకుడు తన సేవను కొనసాగించాడు. ప్రవక్తల గుంపు ఒకటి సమూయేలుతో కలిసి ఉండేది. వారు దేవుని చిత్తాన్ని జాగ్రత్త అధ్యనయం చేసి సమూయేలు బోధించే విషయాల్ని శ్రద్ధగా వినేవారు. ఈ బోధకుడి వద్ద దావీదు నేర్చుకున్న పాఠాలు ఎంతో వలువైనవి. ఈ పవిత్ర స్థలం పై దాడి చెయ్యటానికి సౌలు తన సేనల్ని ఆదేశించడన్నది దావీదు నమ్మకం.అయితే నిరాశకు గురి అయిన రాజు చీకటి మనసుకు ఏ స్థలము పవిత్రం కాదు. దావీదుకు సమూయేలుతో ఉన్న సంబంధం విషయం రాజుకు ఈర్ష్య కలిగింది. ఇశ్రాయేలు దేశమంతటా దైవ ప్రవక్తగా గౌరవమర్యదాలు పొందుతున్న సమూయేలు తన ప్రత్యర్థి అయిన దావీదు పలుకుబడిని ప్రబలం చేస్తాడేమో నన్న అనుమానం సౌలుని వేధిస్తుంది. దావీదు ఎక్కడున్నాడో రాజు తెలిసుకొన్నప్పుడు అతణ్ణి గిబియాకి తీసుకురమ్మని అధికారుల్ని పంపించాడు. అక్కడ దావీదును అంతం చెయ్యాలన్నది సౌలు ఎత్తగడ. PPTel 659.2

    దావీదును హతమార్చాలన్న ఉద్దేశంతో దూతలు బయలుదేరి వెళ్ళారు. కాని సౌలు కన్నా సమారుడై వారిని నియంత్రించాడు. బిలాము ఇశ్రాయేలీయుల్ని శపించటానికి వెళ్తున్నప్పుడు కనిపించని దూతలు అతణ్ణి కలుసుకొన్నరీతిగా కనిపించని దూతలు వారిని కలుసుకున్నారు. భవిష్యత్తులోని సంభవాలు గురించి ప్రవచనాలు పలుకుతూ యెహోవా మహిమ ఔన్నత్యాన్ని ప్రకటించారు. దేవుడు ఈ విధముగా మానవుడి అగ్రహాన్ని వమ్ము చేసి దుర్మార్గతను నిరోధించటానికి తనకున్న శక్తిని ప్రదర్శించాడు అదే సమయంలో దూతల రక్షణానిచ్చి తన సేవకుడి చుట్టు కంచెవేసి కాపాడాడు.PPTel 660.1

    దావీదుని తన వశంలో ఉంచుకోవలని నిరిక్షిస్తున్న సౌలుకి ఈ వార్త అందింది. దేవుని గద్దింపును మన్నించే బదులు అతడింకా రెచ్చిపోయి ఇతర దూతల్ని పంపాడు. దేవుని ఆత్మ వీరిని కూడా నియంత్రించటంతో వీరు మొదటివారికి మల్లే ప్రవచనాలు పలికారు. రాజు మూడో బృందాన్ని పంపాడు. వారు ప్రవక్తల సమూహంలోకి వచ్చినప్పుడు దేవుని ప్రభావం వారి మీద పడగా వారు ప్రవచించారు. ఇక తానే స్వయంగా వెళ్ళాలని సౌలు నిర్ణయించుకొన్నాడు. అతడి వైరుధ్యం తీవ్రతరమై అదుపు తప్పింది. దావీదుని చంపటానికి ఇక ఆగాల్సిన పనిలేదని భావించాడు. దావీదుకు సమీపంగా వచ్చిన వెంటనే పర్యవసానాలేమైనప్పటికి తన సొంత చేతులతోనే అతణ్ణి చంపాలని తీర్మానించుకొన్నాడు.PPTel 660.2

    ఇలా ఉండగా దారిలో దేవుని దూత అతణ్ణి కలుసుకొని నియంత్రించాడు. అతణ్ణి దేవుని ఆత్మ తన శక్తితో బంధించింది. అతడు దేవునికి ప్రార్ధనలు వల్లిస్తూ మధ్య మధ్య ప్రవచనాలు వచిస్తూ గీతాలు పాడూ ముందుకు సాగాడు. మెస్సీయ వస్తాడని, ఆయన పాప విమోచకుడని ప్రవచించాడు. రామాలోని ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు తన హోదాను సూచించే పై వస్త్రాన్ని తీసివేసి దేవుని ఆత్మ ప్రబావం వల్ల పగలంతా రాత్రంతా సమూయేలు ముందు అతడి విద్యార్ధులముందు పడి వున్నాడు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూడటానికి ప్రజలు గుమిగూడారు. రాజుకు కలిగిన ఈ అనుభవాన్ని గూర్చిన వార్త అన్ని చోట్లకూ పాకింది. ఇలా అతడి పరిపాలన చివరి కాలంలో సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడయ్యాడు అన్న నానుడి వినవచ్చింది.PPTel 660.3

    హింసకుడు మళ్ళీ తన లక్ష్యసాధనలో విఫలుడయ్యాడు. తనతో సమాధానంగా ఉంటానని దావీదుకి సౌలు వాగ్దానం చేసాడు. కాని రాజు పశ్చాత్తాపం విషయమై దావీదుకి నమ్మకం లేదు. ముందు మాదిరిగానే రాజు మనసు మార్చుకోవచ్చునన్న భయంతో తప్పించుకొని పారిపోయాడు. తన హృదయం ఎంతగానో గాయపడింది. తన మిత్రుడు యోనాతానుని మరోసారి చూడాలని ఆకాంక్షించాడు. తాను నిరపరాధినన్న స్పృహతో అతడు రాకుమారుణ్ని కలసి అతిPPTel 661.1

    దీనంగా విజ్ఞాపన చేసాడు. “నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి”? అన్నాడు తన తండ్రి ఉద్దేశంలో మార్పు వచ్చిందని అతడు దావీదుని ఇక చంపాలనుకోవటం లేదని యోనాతాను నమ్మాడు. దావీదుతో యోనాతను ఇలా అన్నాడు, “ఆ మాట నీ వెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయుడు. నా తండ్రి ఇందెందుకు నాకు మరుగు చేయును ”? దేవుని శక్తి అంత విచిత్రంగా ప్రదర్శితమైన తర్వాత కూడా తన తండ్రి దావీదుకి హాని చేస్తాడంటే యోనాతాను నమ్మలేకపోయాడు,. ఎందుకంటే అది దేవుని పై బహిరంగ తిరుగుబాట వుతుంది. దావీదు అది నమ్మలేకపోయాడు. నిర్మల హృదయంతో దావీదు యోనాతానుతో ఇలా అన్నాడు. “యెహోవా జీవముతోడు నీ జీవము తోడు నిజముగా నాకును మరణమునుకును అడుగు మాత్రమున్నది”.PPTel 661.2

    ఇశ్రాయేలులో అమావాస్యనాడు ఒక పవిత్ర పండుగ జరిగేది. దావీదుకి యోనాతానుకి మధ్య సమావేశం జరిగిన మరుసటి రోజు ఈ పండుగ జరిగింది. ఈ పండుగలో ఈ యువకులిద్దరూ రాజు భోజనపు బల్ల వద్ద దర్శనమివ్వాల్సి ఉంది. హాజరు కావటానికి దావీదు భయపడ్డాడు. కనుక అతడు బేత్లహేములోని తన సోదరుల్ని సందర్శించటానికి ఏర్పాటు జరిగింది. తిరిగి వచ్చాక మూడు రోజలు రాజుకి కనపడకుండా విందుల మందిరానికి దగ్గరలో ఉన్న పొలంలో దాగి ఉండాల్సి ఉంది. యెష్సయు కుమారుడు దావీదు ఏమయ్యాడు అని దర్యాప్తు జరిగితే తన తండ్రి ఇంటి వారు అర్పిస్తున్న బలికి హాజరవ్వటానికి ఇంటికి వెళ్ళాడని యోనాతాను చెప్పాల్సి ఉన్నాడు. అతడు లేనందుకు రాజు కోప ప్రదర్శనలేవీ చేయకుండా “మంచిది” అంటే అప్పుడు దావీదు రాజు ఆస్థానానికి తిరిగి రావటంలో ప్రమాదం లేదు. అయితే అతడు లేనందుకు రాజు మండిపడితే అది దావీదు ప్రయానానికి తీర్మానంగా పరిగణించాల్సి ఉంది.PPTel 661.3

    విందు మొదటి రోజు దావీదు లేకపోవటం గురించి రాజు ఏమి అనలేదు. కాని రెండవ రోజు అతడి స్థలం ఖాళీగా ఉండటం చూసిన రాజు ఇలా ప్రశ్నించాడు. “నిన్నయు నేడును యెష్సయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా యోనాతాను దావీదు బేళ్లే హేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పించబోవు చున్నారు. నీవు రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను. గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా మొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమై అతడు భోజనపు బల్ల యొద్దకు రాలేదు” ఈ మాటలు విన్నప్పుడు సౌలు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. దావీదు జీవించి ఉన్నంతకాలము యోనాతాను ఇశ్రాయేలు సింహాసనాన్ని అదిష్టించలేడని చెప్పి అతణ్ణి వెంటనే రప్పించాల్సిందిగా ఆదేశించి తాను దావీదుని చంపాలని సౌలు ప్రకటించాడు. యోనాతాను తన మిత్రుడి కోసం విజ్ఞాపన చేస్తూ ఇలా ప్రశ్నించాడు.“అతడెందుకు మరణ శిక్షనొందవలెను? అతడు ఏమి చేసెను”? ఈ విజ్ఞాపన మరింత అగ్రహాం పుట్టించింది. అంతట దావీదుకి ఉద్దేశించిన బళ్ళేన్ని తన సొంత కొడుకు మీదకి విసిరాడు.PPTel 662.1

    యువరాజుని దు:ఖం అగ్రహం ముప్పిరిగొన్నాయి. రాజు సముఖం నుంచి నిష్క్రమించాడు. ఆ విందుకి ఇక హాజరు కాలేదు. తన పట్ల రాజు ఉద్దేశాల్ని దావీదు తెలుసుకోవటానికి నిర్దిష్టమైన చోటుకి వెళ్తున్న తరుణంలో అతడి హృదయం దు:ఖంతో కుంగిపోయింది. వారు ఒకరి భుజం పై ఒకరు పడి ఎంతో ఇదిగా రోదించారు. రాజు దురావేశం నీడ ఆ యువకులి పై పడింది. వారి దు:ఖం వెలిబుచ్చలేనంత గాఢమైనది. వారు తమ తమ మార్గాల్ని అవలంభించేందుకు విడిపోతున్న తరుణంలో యోనాతానన్న ఈ మాటలు దావీదువిన్నాడు. “యోహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనక మనస్సులో నెమ్మది గలిగి పొమ్ము”. PPTel 662.2

    రాకుమారుడు గిబాయాకు తిరిగి వెళ్ళిపోయాడు. దావీదు అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పట్టణాన్ని చేరుకొన్నాడు. అది కూడా బెన్యామీను గోత్రానికి చెందిన పట్టణమే. గూడారాన్ని షిలోహునుంచి ఈ స్థలానికి తీసుకువెళ్ళారు. ఇక్కడ అహీమెలెకు ప్రధానయాజకుడుగా సేవ చేస్తున్నాడు. ఆశ్రయం కోసం దైవ సేవకుడి వద్దకు కాక మరెక్కడికి వెళ్ళాలో దావీదుకి తెలియలేదు. హడావుడిగా ఒంటరిగాను ఆందోళనతో దు:ఖంతో నిండిన ముఖంతో వచ్చిన దావీదు వంక యాజకుడు ఆశ్చర్యంతో చూసాడు. తాను వచ్చిన పని ఏమిటని యాజకుడు దావీదును ప్రశ్నించాడు. దొరికి పోతానన్న భయం నిత్యమూ దావీదుని వేధిస్తున్నది. గత్యంతరము లేక వంచనకు దిగాడు. రాజు తనను ఒక రహస్య కార్యం నిమిత్తం పంపించాడని అది వెంటనే నిర్వర్తించాల్సిన కార్యమని దావీదు ప్రధాన యాజకుడితో చెప్పాడు. విషయాన్ని దాపరికం లేకుండా దావీదు చెప్పి ఉంటే అతణ్ణి కాపాడటానికి ఏం చెయ్యాలో ఆహీమెలెకుకి తెలిసేది. ప్రాణాపాయ పరిస్థితిలోనూ తన ప్రజలు నిజాయితీగా వ్యవహరించాలని దేవుడు కోరుతున్నాడు. అయిదు రొట్టెలు ఇవ్వమని దావీదు ప్రధాన యాజకుణ్నికోరాడు. ఆ దైవ సేవకుడి వద్ద పరిశుద్ధ రొట్టెలు మినహా వేరే రొట్టెలు లేవు. అయితే దావీదు తన నీతి సూత్రాల్ని గాలికి వదిలి తన ఆకలి తీర్చుకోవటానికి గాను రొట్టెలు సంపాదించాడు.PPTel 662.3

    ఇప్పుడొక క్రొత్త ప్రమాదం ఏర్పడింది. సౌలు పనుల కాపరుల పెద్ద హెబ్రీయుల మత విశ్వాసి అయిన దోయేగు ఆరాధన స్థలంలో ఈ సమయంలో తన మొక్కులు చెల్లించుకొంటున్నాడు. ఇతణ్ణి చూసిన వెంటనే తల దాచుకోవటానికి వేరొక స్థలానికి వెళ్ళిపోవాలని అవసరమైనప్పుడు తన్ను తాను రక్షించుకోవటానికి ఒక అయుధాన్ని సంపాదించాలని దావీదు భావించాడు. ఒక ఖడ్గం ఇవ్వమని అహీమెలెకును అడిగాడు దావీదు. గుడారంలో జ్ఞాపక చిహ్నంగా ఉన్న గొల్యాతు ఖడ్గం తప్ప వేరే ఖడ్గం లేదని యాజకుడు చెప్పాడు. “దానికి సమమైనదొకటియులేదు, నాకిమ్ము” అని దావీదన్నాడు. ఫిలిప్తీయుల యోధుణ్ణి హతమర్చటానికి ఒకప్పుడు తానుపయోగించిన ఖడ్గాన్ని అందుకొన్నప్పుడు అతడి శౌర్యం పునరజ్జీవం పొందింది.PPTel 663.1

    దావీదు గాతు రాజైన ఆకీషు వద్దకు పారిపోయాడు. సౌలు రాజ్యంలో కన్నా తన ప్రజల శత్రువుల నడుమ ఎక్కువ క్షేమం ఉన్నదని దావీదు భావించాడు. అలాగుండగా, కొన్నేళ్ళ కిందట ఫిలిప్తీయుల యోధుడు గొల్యాతును సంహరించిన వాడు దావీదేనని ఆకీషుకి సమాచారం అందింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల శత్రువుల వద్ద తలదాచుకోవాలను కొన్న దావీదు గొప్ప ప్రమాదంలో చిక్కుకొన్నాడు. కాగా పిచ్చివాడిలా నటించి తన శత్రువుల్ని బుట్టలో పెట్టి అక్కడ నుంచి తప్పించుకున్నాడు,PPTel 663.2

    దావీదు చేసిన మొదటి తప్పు నోబులో ఉన్నప్పుడు దేవుని పై నమ్మకం ఉంచకపోవటం. రెండోది ఆకీషుని మోసగించటం. క్రితంలో దావీదు ఉత్తమ గుణలక్షణాల్ని ప్రదర్శించాడు. తన నైతిక యోగ్యత చేత ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అయితే పరీక్ష వచ్చినప్పుడు అతడి గూఢచారిని వంచకుణ్ణి చూసాడు. గొప్ప అవసరం ఏర్పడ్డప్పుడు నిశ్చల విశ్వాస నేత్రంతో దావీదు దేవుని పై దృష్టి నిలిపాడు. ఫిలిప్తీయుల మహాబలుని చిత్తు చేసాడు. దేవుని విశ్వసించాడు. ఆయన పేర ముందుకి వెళ్ళాడు. అయితే అతణ్ణి వేటాడి హింసించి ఆందోళనకు తీవ్ర చింతకు గురి చేయటం వల్ల అతడు తన పరలోక జనకుణ్ణి దాదాపు చూడలేకపోయాడు. ఆయన అతడి దృష్టి నుంచి దాదాపు మాయమయ్యాడు. PPTel 663.3

    అయినా ఈ అనుభవం దావీదుకి జ్ఞానం కలిగించటానికి తోడ్పడింది. తన బలహీనతల్ని దేవుని మీద మోపి నిత్యం ఆయన పై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తించటానికి ఇది దారి తీసింది. గుండె చెదిరిన వారిని ఉత్సాహపర్చతూ బలహీనుల్ని బలో పేతుల్ని చేస్తూ కష్టాలు శ్రమల నుభవిస్తున్న దైవ సేవకులకు ధైర్యాన్ని చేయూతను అందిస్తూ నిరాశనిస్పృహాలకు గురి అయిన ఆత్మల పైకి వచ్చే దైవాత్మ ప్రభావం ఎంత ప్రశస్తమైనది ! తప్పులు చేసే మనపట్ల దయగా వ్యవహరిస్తూ మన కష్టాల్లో ఓర్పును కరుణ కటాక్షాల్ని ప్రదర్శిస్తూ వచ్చే మన దేవుడు ఎంత గొప్పవాడు!PPTel 664.1

    దేవుని బిడ్డల ప్రతీ వైఫల్యానికి వారి విశ్వాసరాహిత్యమే కారణం. ఆత్మను చీకట్లు కమ్మినప్పుడు మనకు వెలుగు, మార్గదర్శకత్వం కావలసి వచ్చినప్పుడు మనం దృష్టి పైకి సారించాలి. చీకటి పైగా వెలుగున్నది. దావీదు ఒక్క ఘడియ సేపు కూడా దేవుని శంకించకుండా ఉండాల్సింది. ఆయన్ను విశ్వసించటానికి అతడికి కారణముంది. అతడు దేవుని వలన అభిషేకం పొందినవాడు. అపాయంలో ఉన్నప్పుడు దేవదూతలు అతణ్ణి పరిరక్షించారు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయటానికి అతడికి సాహసగుణముంది. తానున్న దుస్తితి నుంచి తన మనసును దూరపర్చి దేవుని శక్తిని గూర్చి ఔన్నత్యాన్ని గూర్చి ఆలోచించి ఉంటే మరణ ఛాయ మధ్య సయితం అతడికి సమాధానం లభించేది. ఈ వాగ్దానాన్ని ధృడ విశ్వాసంతో వల్లించగలిగేవాడు. “పర్వతములు తొలగిపోయినను మెట్ట తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు” యెషయా 54:10 PPTel 664.2

    తరుముతున్న సౌలు నుంచి ఆశ్రయం పొందటానికి దావీదు యూదా పర్వతాలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో తల దాచుకొన్నాడు. చిన్న దళంతో పెద్ద సైన్యాన్ని ప్రతిఘటించి నిలుపుకోవటానికి వెసులుబాటు గల స్ధలం అది “అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి”. దావీదుతో తమ బాంధవ్యాన్ని బట్టి సౌలు అహేతుక అనుమానాలు తమను వెతలపాలు చేస్తాయని తెలిసి దావీదు కుటుంబీకుల్లో అభద్రతాభావం కలిగించింది. దేవుడు దావీదును ఇశ్రాయేలీయుల భవిష్యత్ రాజుగా ఎంపిక చేసాడని ప్రజలు సామాన్యంగా అనుకొంటున్న విషయం వారికి ఇప్పుడు తెలిసింది. అసూయ చాపల్యాలకు లోనైన రాజు ఉన్మాదానికి గురి అయ్యే కన్నా పలాయితుడైన గుహల్లో తలదాచుకొంటున్న దావీదుతో ఉండటమే క్షేమమని వారు విశ్వసించారు.PPTel 664.3

    అదుల్లాము గుహలో దావీదు అతడి కుటుంబీకులు ఏకమై సానుభూతి మమాతానురాగాలు పంచుకున్నారు. యెష్సయి కుమారుడు సితారా వాయిస్తూ “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు? ఎంత మనోహరము” అని శ్రావ్యంగా పాడాడు. కీర్తనలు 133:1 సొంత అన్నలే తనను నమ్మకపోవటమన్న చేదు అనుభవం అతడికి కలిగింది. ఇప్పుడు ఆ అరమరికలు పోయి సామరస్యం నెలకొనటం దావీదు హృదయాన్ని అమితానందంతో నింపింది. ఏబయి ఏడో కీర్తనను దావీదు ఇక్కడే రచించాడు.PPTel 665.1

    కొద్దికాలంలోనే సౌలు బలవంతపు వసూళ్ళకు తట్టుకోలేక పారిపోయి వచ్చిన పలువురు దావీదు అనుచరగణంలో చేరారు. అనేకమంది ఇశ్రాయేలీయుల రాజు పై విశ్వాసాన్ని కోల్పోయారు. ఎందుచేతనంటే రాజుని దేవుని ఆత్మ ఇక నడిపించటం లేదని వారు గ్రహించారు. “ఇబ్బంది గలవారందరును” దావీదు వద్దకు వచ్చారు. “అతడు వారికి అధిపతియాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి” దావీదుకి ఇక్కడ చిన్న రాజ్యం ఏర్పడింది. ఇక్కడ క్రమ జీవనం క్రమశిక్షణ ఆచరణలో ఉన్నాయి. ఈ పర్వతాల నడుమ నివాసంలో కూడా అతడికి భద్రత లేదు. ఎందుకంటే తాను తల పెట్టిన ఘాతుకాన్ని రాజు విడిచి పెట్టలేదనటానికి నిదర్శనాలు కోకల్లలుగా అందుతునే ఉన్నాయి. PPTel 665.2

    మోయాబు రాజు వద్ద తన తల్లితండ్రులకు ఆశ్రయం ఏర్పాటు చేసాడు. అనంతరం ఆపాయం పొంచి ఉన్నదని దైవ ప్రవక్త చేసిన హెచ్చరిక మేరకు తాను దాక్కొని ఉన్న స్థలం విడిచి పెట్టి హారేతు అడవిలోకి పారిపోయాడు. దావీదు పొందుతున్న ఈ అనుభవం అసవరమైందీ కాదు. నిష్పలమైందీకాదు. దావీదును విజ్ఞత గల సేనాపతిగాను న్యాయం కనికరం గల రాజుగాను తీర్చదిద్దేందుకు దేవుడు అతడికి క్రమశిక్షణలో పాఠాలు నేర్పిస్తున్నాడు. తన ఉద్వేగపూరిత స్వభావం, గుడ్డి నిరాలోచన కారణంగా ఏ బాధ్యత నిర్వహణకు సౌలు అనర్హుడయ్యాడో దాన్ని నిర్వహించటానికి దావీదు తన చిన్న అనుచర సమూహంతో అవసరమైన శిక్షణను సిద్ధబాటును పొందుతున్నాడు. మనుషులు దేవుని ఉపదేశాన్ని బేఖాతరు చేస్తూ న్యాయంగా జ్ఞానయుక్తంగా వ్యవహరించటానికి దోహదపడే ప్రశాంతతను జ్ఞానాన్ని కలిగి ఉండటం సాధ్యపడదు. మార్గం చూపే దైవ జ్ఞానాన్ని అనుసరించని మానవ జ్ఞానాన్ని నమ్ముకోటమంత భయంకర ఉన్మాదం ఇంకొకటి ఉండదు.PPTel 665.3

    వంచించి దావీదుని అదుల్లా గుహలో బంధించటానికి సౌలు సన్నద్దమౌతున్నాడు. అయితే దావీదు ఆ స్థలాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయాడని తెలుసుకున్న రాజు నిప్పులు చెరిగాడు. దావీడు తప్పించుకు పారిపోవటం రాజుకి అంతుచిక్కని అంతర్యం. తన శిబిరంలో విద్రోహులున్నారని తన రాకను గురించి తన సంకల్పం గురించి వారే యెష్సయి కుమారుడికి తెలిపారని తలంచాడు, PPTel 666.1

    తనపై కుట్ర జరిగిందని తన సలహాదారుల్లో అన్నాడు. విలువైన బహుమానాలు, గౌరవ ప్రదమైన హోదాలతో ప్రలోభపెట్టి తమలో ఎవరు దావీదుతో స్నేహం బంధాలు కలిగి ఉన్నారో చెప్పమని కోరాడు. ఏదోమియుడైన దోయేగా వార్తను అందించాడని తేలింది. హాయేగా దురాశకు లోనై, తన పాపాల విషయంలో తనను గద్దించినందుకు యాజకుడు అహీమెలెకు మీద కోపంతో, ఆ దైవ సేవకుడిపై రాజు కోపాన్ని రగిలించేందుకు గాను దావీదు అతడు దర్శించటాన్ని రాజుకి కోపం పుట్టించేలా నివేదించాడు. అతడి మాటలు సౌలు మనసులో భావోద్రేకాలు రెచ్చ గొట్టాయి. ఉగ్రుడై సౌలు యాజకుడి కుటుంబమంతా నిర్మూలం కావలసినదిగా అదేశించాడు. భయంకరమైన ఆ దేశం వెంటనే అమలయ్యింది. అహీమెలెకు ఒక్కడ్నే కాదు అతడి తండ్రి ఇంటివారందరిన్నీ “ఏఫోదు ధరించుకొనిన యెనుబడి అయిదుగురిని” రాజు ఆజ్ఞమేరకు దొయేగ ఆరోజు సంహరించాడు.PPTel 666.2

    “మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి అడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దబములనేమి గొట్టెలనేమి అన్నిటిని కత్తివాత చేత హతము చేసెను” సాతాను నియంత్రణ కింద ఉన్న సౌలు చేయగలిగింది ఇది. అమాలేకీయుల దుర్మార్గత సంపూర్ణమైంది. వారిని పూర్తిగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తాను ఎంతో దయగలవాణ్ణిని భావించి దేవుని ఆజ్ఞను అమలుపర్చకుండా నాశనానికి దేవుడు ప్రత్యేకించిన వాటిని అతడు నాశనం చేయకుండా మినహాయించాడు. ఇప్పుడైతే దేవుని ఆజ్ఞ లేకుండా సాతాను నడుపుదల కింద అతడు ప్రభువు యాజకుల్ని సంహరించి నోబు పట్టణవాసుల మీదికి నాశనం తెచ్చాడు. దేవుని నడుపుదలను తోసిపుచ్చిన మావన హృదయం దుష్టత్వం అలాంటిది.PPTel 666.3

    ఈక్రియ ఇశ్రాయేలీయులందరిలో భీతి పుట్టించింది. తాము ఎన్నుకొన్న రాజే ఈ అఘాయిత్యం చేసాడు. దేవుని విశ్వసించని రాజుల ఒరవడి ననుసరించి సౌలు ఈ అకృత్యాన్ని చేసాడు. మందసం వారితో ఉంది. అయితే ఎవరి ద్వారా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకొనేవారో ఆ యాజకుల్ని కత్తితో చంపారు. తరువాత జరుగనున్నదేంటి ?PPTel 667.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents