Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

పితరులు ప్రవక్తలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    53—తొలిదినాల న్యాయాధిపతులు

    కనానులో స్థిరపడిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆదేశాన్ని పూర్తిగా స్వాధీన పర్చుకొనే ప్రయత్నాలు చేయలేదు. అప్పటికే తమ వశంలోకి వచ్చిన భూభాగంతో తృప్తి చెందడంతో వారి ఉత్సాహం సన్నగిల్లింది. ఇక యుద్ధం కొనసాగలేదు. “ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత కనానీయులచేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు” న్యాయాధిపతులు 1:28.PPTel 544.1

    తాను ఇశ్రాయేలీయులికి చేసిన వాగ్దానాల్ని ప్రభువు నెరవేర్చాడు. కనానీయుల అధికారాన్ని అంతం చేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు యెహోషువ ఆదేశాన్ని పంచి పెట్టాడు. దేవుని మీద నమ్మకముంచి కనానీయుల చేతుల్లో నుంచి ఆదేశాన్ని తీసుకోటమే వారు చేయాల్సి ఉన్న పని. దీన్ని వారు చేయలేకపోయారు. కనానీయు లతో ఒప్పందం కుదుర్చుకోటం వల్ల వారు ప్రత్యక్షంగా దేవుని ఆజ్ఞను మీరి తద్వారా దేవుడు ఏ షరతు మీద కనాన్ని తమకిస్తానని వాగ్దానం చేశాడో ఆ షరతును నెరవేర్చ లేకపోయారు.PPTel 544.2

    సీనాయి వద్ద దేవుడు తమతో మాట్లాడినప్పటి నుంచి విగ్రహారాధన గురించి వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆజ్ఞల ప్రకటన జరిగిన వెనువెంటనే కనాను జాతుల్ని గురించి మోషే ద్వారా దేవుడు ఈ వర్తమానం పంపించాడు, “వారి దేవతలకు సాగిలపడకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను” నిర్గమ 23:24, 25. వారు దేవునికి విధేయులై నివసించినంతకాలం తమ శత్రువుల పై వారికి జయం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. “నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుట నుండి పారిపోవునట్లు చేసెదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ యెదుట నుండి హివ్వీయులను కనానీయులను హితీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్నాదీనపరచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ యెదుట నుండి వెళ్ళగొట్టుదును... ఆ దేశ నివాసులను నీ చేతికప్పగించెదను. నీవు నీ యెదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితో నైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును”. నిర్గమ 23:27-33. తన మరణానికి ముందు మోషే ఈ ఆదేశాల్ని పునరుద్ఘాటించాడు. యెహోషువ కూడా వాటిని పునరుద్ఘాటించాడు.PPTel 544.3

    నైతిక దుష్టత్వం వరదల్లే పొంగి లోకాన్ని ముంచి వేయకుండా బ్రహ్మాండమైన అడ్డుకట్టగా నిలవటానికి దేవుడు తన ప్రజల్ని కనానులో ఉంచాడు. ఇశ్రాయేలీ యులు ఆయనకు నమ్మకంగా నిలిచినట్లయితే వారు విజయం వెంట విజయం సంపాదిస్తూ సాగాలన్నదే దేవుని సంకల్పం. కనాను కన్నా శక్తిమంతమైన దేశాల్ని వారి వశం చేయాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన వాగ్దానం ఇది, “మీరు చేయవలెనని నేను మీకాజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ యెదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు, మీ దేవుడైన యెహోవా మీరు అడుగు పెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును” ద్వితి. 11:22-25.PPTel 545.1

    ఉన్నతమైన తమ భవితవ్యాన్ని లెక్క చేయకుండా వారు సుఖభోగాల్ని స్వార్థ ప్రయోజనాల్ని ఎన్నుకొన్నారు. ఆ దేశాన్ని జయించి సంపూర్తిగా స్వాదీనపర్చుకోటాన్ని అశ్రద్ధ చేశారు. అనేక తరాల పర్యంతం విగ్రహారాధకులైన ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారు వారిని బాధలకు గురిచేశారు. ప్రవక్త ముందే చెప్పినట్లు ఆ విగ్రహా రాధకులు వారికి “కనులలో ముండ్లుగా”ను “ప్రక్కలలో శూలములుగా”ను ఉన్నారు. సంఖ్యా 33:55.PPTel 545.2

    ఇశ్రాయేలీయులు “అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి” కీర్తనలు 106:35. కనానీయుల్ని వివాహం చేసుకొన్నారు. దానితో విగ్రహారాధన జాఢ్యంలా దేశమంతా వ్యాపించింది. “వారి విగ్రహాములకు పూజ చేసిరి. అది వారి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము, అనగా తమకుమారులు రక్తము ఒలికించి... ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను... కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను” కీర్తన 106:36-40.PPTel 545.3

    యెహోషువ ఉపదేశాన్ని ఆచరించిన తరం ప్రజలు ఉన్నంతకాలం విగ్రహారాధన వృద్ధి చెందలేదు. కాని ఆ తల్లిదండ్రులే తమ బిడ్డలు భ్రష్టులు కావటానికి బాటలు పరిచారు. కనానులో స్థిరపడ్డ ఇశ్రాయేలీయులు దేవుడు విధించిన ఆంక్షల్ని బేఖాతరు చేయటం దుర్మార్గతకు విత్తనాలు నాటింది. దాని దుష్పలితాలు కొన్ని తరాలవరకూ కొనసాగుతూ వచ్చాయి. హెబ్రీయుల సామాన్య జీవన విధానం వారికి శారీరారోగ్యాన్ని చేకూర్చింది. కాని అన్యులతో సహవాసం వల్ల తిండిబోతుతనం, కామం వంటి ప్రవృత్తులు క్రమేపి బలపడి శారీరక మానసిక శక్తి సామర్థ్యాల్ని బలహీనపర్చాయి. ఇశ్రాయేలీయులు తమ పాపాల వలన దేవునికి దూరమయ్యారు. వారిలో ఇక ఆయన శక్తి లేకపోటంతో తమ శత్రువుల ముందు నిలువలేకపోయారు. దేవుని సహాయంతో ఏ జాతుల్ని జయించగలిగి ఉండేవారో ఆ జాతుల ప్రజలకే వారు ఈ రకంగా లొంగి ఉంటూ మనుగడ సాగించారు. వారు “ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి”. ” గొట్టేలవలె ఆయన తన ప్రజలను తోడుకొనిపోయెను” “వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహాములను పెట్టుకొని ఆయనకు దోషము కలుగుజేసిరి” అందుచేత ప్రభువు “షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారము... విడిచి పెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దానాని విరోధులచేతికి అప్పగించెను”. న్యా యాధిపతులు 2:12 కీర్తనలు 78:52, 58, 60,61. అయినా తన ప్రజల్ని ఆయన పూర్తిగా విడిచి పెట్టలేదు. యెహోవాకు నమ్మకంగా నిలిచిన వారు ఎల్లప్పుడూ కొందరు మిగిలి ఉన్నారు. విగ్రహారాదనను రూపుమాపి ఇశ్రాయేలీయుల్ని తమ శత్రువుల చేతుల్లో నుంచి విడిపించటానికి అప్పుడప్పుడు నమ్మకమైన శూరులైన మనుషుల్ని ప్రభువు లేవదీశాడు. కాగా విమోచకుడు మరణించి అతడి ఆధిపత్యం ప్రజలకు ఇకలేనప్పుడు వారు మళ్ళీ క్రమక్రమంగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయే వారు. ఈ రీతిగా భ్రష్టత చోటు చేసుకోటం, శిక్ష కలగటం, పాపపు ఒప్పుకోలు ఆ మీదట విడుదల జరగటం పదే పదే సంభవించేది.PPTel 546.1

    మెసొపొతమియ రాజు, మోయాబు రాజు వారి తర్వాత ఫిలిప్తీయులు, సీసెరా నాయకత్వం కింద హాసోరు కనానీయులు దపదఫాలుగా ఇశ్రాయేలీయులకు హింసకులయ్యారు. తమ ప్రజల విడుదల నిమిత్తం ఒత్నీయేలు, షమ్లరు, ఏహూదు, దెబోరా బారాకులను దేవుడు లేపాడు. మళ్ళీ “ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ... వారిని మిద్యానీయులకప్పగించెను”. యోర్దానుకి తూర్పున ఉన్న ఇశ్రాయేలీయుల పట్ల వారి యజమానులు అప్పటి వరకూ ఎక్కువ కఠినంగా వ్యవహరించలేదు. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వీరే ప్రధాన బాధితులు.PPTel 546.2

    కనానుకి దక్షిణాన ఉన్న అమాలేకీయుల తూర్పు సరిహద్దు వద్ద దానికి పై నున్న ఎడారిలోను ఉన్న మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు అలుపెరుగని శత్రువులు. ఇశ్రాయేలీయులు మోషే దినాల్లో విద్యానీయుల్ని దాదాపు నాశనం చేశారు. కాని అప్పటి నుంచి వారు సంఖ్యాపరంగా బాగా వృద్ధిచెందారు. శక్తిమంతమైన ప్రజలుగా రూపొందారు. ప్రతీకార దాహంతో తపించిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులికి దేవుని కాపుదల లేదు గనుక ప్రతీకారం తీర్చుకొనే అవకాశం వచ్చింది. యోయోనుకు తూర్పున ఉన్న వాళ్ళేకాదు ఆ దేశంలోని వారంతా వారి ఆగ్రహానికి గురి అయ్యారు. క్రూరమైన భయంకరమైన ఆ అరణ్య ప్రజలు తమ గొర్రెలు మేకల మందలతోను పశువుల మందలతోను “మిడతల దండు” లా వచ్చారు( న్యాయాధిపతులు 6:5, ఆర&.వి). జనాల్ని మింగే జాఢ్యంలాగ వారు యోర్దాను మొదలుకొని ఫిలిప్తీయుల మైదానం దాకా వ్యాపించారు. పంటలు పండే సమయానికి వచ్చి భూ ఫలాల్లో చివరిది అయిపోయేవరకూ ఉండిపోయారు. పొలాల ఫలసాయాన్ని హరించారు. ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. అప్పుడు తిరిగి ఎడారిలోకి వెళ్ళిపోయారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలీయులు తమ గృహాలు విడిచి పెట్టి తల దాచుకోవటానకి ప్రాకారాలు పట్టణాల్లో గుమిగూడారు. పర్వత శ్రేణుల్లోని గుహాల్లోను రహస్య స్థలాల్లోను దాగుకొన్నారు. ఈ హింస ఏడేళ్ళు కొనసాగింది. అప్పుడు ఆ ప్రజలు దేవుని మందలింపును చెవిని పెట్టి తమ పాపాల్ని ఒప్పుకోగా దేవుడు వారికో సహాయకుణ్ని లేవదీశాడు.PPTel 547.1

    యోవాసు కుమారుడై గిద్యోను మన షే గోత్రానికి చెందినవాడు. ఈ కుటుంబం ఏవిభాగానికి చెందిందో అది నాయకత్వపరంగా ఏమంత ప్రాధాన్యం గలది కాదు. కాకపోతే యోవాసు కుటుంబం సాహసానికి నీతి నిజాయితీలకు పేరుగాంచింది. వీరులైన అతడి కుమారుల గురించి ఇలా ఉంది, “వారందరును రాజ కుమారులను పోలియుండిరి” మిద్యానీయులతో పోరాటాల్లో ఒక్కడు తప్ప అందరూ మరణించారు. మిగిలిన ఆ ఒక్కడూ ఆ దోపిడీ దారుల గుండెల్లో కంపరం పుట్టించాడు. తన ప్రజల్ని విడిపించాల్సిందిగా గిద్యోనుకి దేవుడు పిలుపునిచ్చాడు. ఆ సమయంలో గిద్యోను గోధుమలు దుళ్ళగొట్టుకొంటున్నాడు. కొన్ని గోధుమ పనల్నే దాచుకొన్నాడు. గోధుమల్ని సాధారణంగా దుళ్ళగొట్టుకొనే కళ్ళంలో దుళ్ళగోట్టుకోటానికి ధైర్యం లేక గానుగ పక్క ఓ స్థలాన్ని ఎంపిక చేసుకొన్నాడు. ద్రాక్షా పళ్ళ కాలం ఇంకా చాలా దూరంలో ఉండటంతో ద్రాక్షా తోటల్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. రహస్యంగా చడిచప్పుడూ లేకుండా పనిచేసుకొంటూ అతడు ఇశ్రాయేలీయుల పరిస్థితి గురించి తలంచాడు. తన ప్రజల్ని ఆ దాస్యం నుంచి విడిపించటమెలా అని ఆలోచిస్తున్నాడు.PPTel 547.2

    ఆకస్మాత్తుగా “యెహోవా దూత” కనపడి “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడు” అన్నాడు.PPTel 548.1

    “చిత్తము నా యేలిన వాడా యెహోవా మాకు తోడై యుండిన యెడల ఇదంతయు మాకేల సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచి పెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెను” అని బదులు పలికాడు.PPTel 548.2

    ఆ పరలోక రాయబారి ఈ విధంగా సమాదానం ఇచ్చాడు, “బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే”.PPTel 548.3

    తనతో మాట్లాడున్నది గతంలో ఇశ్రాయేలీయుల పక్షంగా పనిచేసిన నిబంధన దూతేనని తెలుసుకోటానికి గాను ఒక సూచన ప్రదర్శించమని గిద్యోను కోరాడు. అబ్రాహాముతో మాట్లాడిన దేవదూతలు తన ఆతిథ్యం కోసం వేచి ఉండాల్సిందిగా ఇప్పుడు గిద్యోను కోరాడు. అంతట హడావుడిగా తన గుడారంలోకి వెళ్ళి తనకున్న బహుకొద్ది మేక పిల్లల్లో ఒకదాన్ని వధించి దాని మాంసాన్ని పొంగని రొట్టెల్ని భోజనానికి సిద్ధం చేసి తెచ్చి వాటిని ఆయన ముందు పెట్టాడు. అయితే “ఆ మాంసమును పొంగని భక్ష్యములన పట్టుకొని రాతిమీద పెట్టి - నీళ్ళు పోయమని” దూత అతడితో చెప్పాడు. దూత చెప్పినట్లు గిద్యోను చేశాడు. గిద్యోను కోరిన సూచనను దేవుడు అప్పుడిచ్చాడు. దూత తన చేతిలో ఉన్న కర్రతో ఆ మాంసాన్ని పొంగని రొట్టెన్ని తాకగా ఆ రాతిలో నుంచి అగ్ని పుట్టి ఆ అర్పణను దహించి వేసింది. అనంతరం ఆ దూత మాయమయ్యాడు.PPTel 548.4

    గిద్యోను తండ్రి యోవాసు ప్రజల మత భ్రష్టతలో పాలు పంచుకొన్నవాడే, తాను నివాసమున్న ఒఫాలో అతడు బయలు దేవతకు పెద్ద బలి పీఠం నిర్మించాడు. ఆ పట్టణ ప్రజలు అక్కడ ఆ దేవతను పూజించేవారు. దీన్ని ధ్వంసం చేసి తన అర్పణ ఎక్కడైతే దహించబడిందో ఆ రాతి మీద యెహోవాకు బలిపీఠానికే పరిమితమయ్యింది.. అయినా ఈ ఆచార సంబంధిత సేవను ఎవరు నెలకొల్పారో ఆ బలులూ అర్పణలూ ఎవర్ని సూచించాయో ఆ ప్రభువుకి దానికి సంబంధించిన నిబంధనల్ని మార్చే అధికారమూ ఉంది. ఇశ్రాయేలీయుల విముక్తికి పూర్వం, బయలు దేవత పూజకు వ్యతిరేకంగా గంభీర ప్రదర్శన జరగాల్సి ఉంది. తన ప్రజల తరుపున శత్రువులతో యుద్ధానికి వెళ్ళకముందు గిద్యోను విగ్రహారాధనపై సమరం ప్రకటించాల్సి ఉంది.PPTel 548.5

    దైవా దేశాన్ని గిద్యోను నమ్మకంగా అమలు పర్చాడు. బహిరంగ ప్రయత్నానికి ప్రతివుటన ఉంటుందని ఎరిగి ఆ కార్యాన్ని గిద్యోను గోప్యంగా నిర్వరించాడు. సేవకుల సహకారంతో ఆ పనిని రాత్రిపూట పూర్తి చేశాడు.PPTel 549.1

    మరుసటి ఉదయం బయలు పూజల నిమిత్తం వెళ్ళిన ఒఫ్రాప్రజల అగ్రహం అంతింతకాదు. దేవదూత గిద్యోనుని సందర్శించటాన్ని విన్న యెవాసు కుమారుడి పక్షంగా నిలబడి ఉండకపోతే ఆ ప్రజలు గిద్యోన్ని చంపేసేవారు. అందుకు యోవాషు ఇలా అన్నాడు, “మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షంచుదురా? వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను, ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక వాడు దేవతయైనందున తన పక్షమున తానే వాదించవచ్చును”. బయలు తన బలిపీఠాన్ని తానే కాపాడుకోలేపోతే అతణ్ని పూజించేవారిని కాపాడ్డాడని ఎలా నమ్మగలం?PPTel 549.2

    గిద్యోనుపట్ల దౌర్జన్యపూరిత ఆలోచనలన్నీ మటుమాయ మయ్యాయి. అతడు యుద్ధ శంకం పూరించినప్పుడు అతడి ద్వజం కింద చేరటంలో ఒఫ్రా మనుషులు ప్రథములు. మన షేలోని తన సొంత గోత్రానికి ఆ షేరు జెబూలూను నఫ్తాలి గోత్రాలకు దూతల్ని పంపగా అందరూ గిద్యోను పిలుపును అంగీకరించారు.PPTel 549.3

    ఈ పనికి దేవుడు తనను పిలిచాడనటానికి ఆయన తనతో ఉంటాడనటానికి ఇంకా బలమైన నిదర్శనం కనిపించే వరకు ఇశ్రాయేలు సైన్యానికి నేతృత్వవహించటానికి గిద్యోనుకి ధైర్యం చాలలేదు. అతడిలా ప్రార్థంచాడు,, “నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమును గొట్టెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొట్టే బొచ్చు మీద మాత్రమే మంచుపడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందును” ఉదయాన చూడగా చుట్టూ ఉన్న నేలంతా పొడిగా ఉండగా గొబైబొచ్చు మాత్రమే తడిగా ఉంది. ఇప్పుడు ఒక సందేహం ఉత్పన్నమయ్యింది.. ఎందుచేతనంటే గాలిలో తేమ ఉంటే దాన్ని గొట్టె బొచ్చు పీల్చుకోటం సహజం. కనుక ఆ పరీక్ష నిర్ణయాత్మకం కాకపోవచ్చు. అందుచేత తాను ఆచితూచి అడుగులు వేయటం ప్రభువుకి ఆగ్రహం రప్పించకపోతే ఆ గుర్తుల్ని తారుమారు చేయాల్సిందిగా ఆయన్ను వేడుకొన్నాడు. గిద్యోను కోరికను దేవుడు మన్నించాడు.PPTel 549.4

    ఇలా ఉద్రేకం ఉత్సాహం పొందిన గిద్యోను ముట్టడిదారుల్ని ఎదుర్కోటానికి తన సైన్యాన్ని నడిపించాడు. “మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెఱ్ఱయేలు మైదానములో” దిగారు. గిద్యోను నాయకత్వం కింద ఉన్న సైనికులు ముప్పయి రెండువేల మంది మాత్రమే. అయితే తమ ముందు విస్తారమైన శత్రు సైన్యం మోహరించి ఉండగా గిద్యోనుకు దేవుని వద్ద నుంచి ఈ సందేశం వచ్చింది, “నీతోనున్న జనులు ఎక్కువమంది. నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు - నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసెననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణకు చున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండవిడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుము” అపాయాన్ని శ్రమల్ని ఎదుర్కోటానికి విముఖులైన వారు లేదా ఎవరి లోకాశలు దైవ సేవ చేయకుండా తమను అడ్డుకొంటాయో వారు ఇశ్రాయేలీయుల సైన్యానికి బలం చేకూర్చేవారు కాదు. వారి ఉనికి బలహీనతకు కారణంగా పరిణమిస్తుంది.PPTel 550.1

    ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళకముందు సైన్యమంతటికి ఈ ప్రకటన చేయాలన్నది వారి చట్టం, “క్రొత్తగా ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్షతోట వేసి యింక దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రధానము చేసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయిన యెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరగి వెళ్ళవచ్చును.” అధికారులు ప్రజలతో ఇంకా ఇలా మాట్లాడాల్సి ఉన్నారు, “ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్ళవలెను” ద్వితీ 20:5-8.PPTel 550.2

    శత్రు సైన్యంతో పోల్చినప్పుడు తన సైనికులు బహు కొద్ది మంది గనుక గిద్యోను ఆ సర్వసాధారణ ప్రకటనను చేయలేదు. తన సైనికులు ఎక్కువ మంది అన్నప్పుడు అతడికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రజల మనస్సుల్లోని అహంభావాన్ని అపనమ్మకాన్ని దేవుడు గమనించాడు. గిద్యోను చేసిన విజ్ఞప్తులికి చలించివారు సైన్యంలో చేరారు. అయితే మిద్యానీయుల సేనల్ని చూసినప్పుడు పలువురు భయకంపితులయ్యారు. అయినా ఇశ్రాయేలీలయులు విజయం సాధిస్తే ఆ ప్రజలే ఆ విజయం తమదే గాని దేవునిది కాదనేవారే.PPTel 551.1

    గిద్యోను ప్రభువు ఆదేశాన్ని ఆచరించాడు. మూడింట రెండొంతుల సైనికులు ఇళ్ళకు వెళ్ళిపోటం చూసిన గిద్యోను ఆవేదన చెందాడు. మళ్ళీ అతడికి ఈ దైవ వర్తమానం వచ్చింది. “ఈ జనులింక ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేయుము. అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను”. ప్రజలు వెంటనే శత్రువు మీదికి వెళ్తారన్న ఉద్దేశంతో వారిని నీటి వద్దకు నడిపించటం జరిగింది. కొంతమంది దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని కుక్క గతుకునట్లు గబగబ తాగుతూ వెళ్ళగా దాదాపు అందరూ మోకాళ్ళ మీద నిలిచి ప్రవహాంలోని నీళ్ళను తాపీగా తాగారు. పదివేల మందిలోను దోసిళ్లతో నీళ్ళు తీసుకొని తాగినవారు మూడు వందలమంది మాత్రమే ఎంపికైనవారు వీరే. తక్కినవారంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.PPTel 551.2

    తరచు అతి సామాన్య విషయాల ద్వారా ప్రవర్తన బయలు పడుతుంది. ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో ఎవరు తమ కోర్కెలు నెరవేర్చుకోటానికి ప్రయత్నిస్తారో వారు అత్యవసర పరిస్థితిలో విశ్వసించదగిన వ్యక్తులు కారు. సోమరులకు స్వార్థాశలు గలవారికి దేవుని సేవలో స్థానం లేదు. కర్తవ్య నిర్వహణలో తమ సొంత కోరికల్ని అడ్డురానియ్యని ఆ కొద్దిమందినే దేవుడు ఎంపిక చేసుకొన్నాడు. ఎంపికయిన ఆ మూడు వందలమంది ధైర్యశాలురు ఆత్మ నిగ్రహం గలవారు మాత్రమే కాదు వారు గొప్ప విశ్వాసం గల వ్యక్తుల. విగ్రహారాధన మాలిన్యం లేని వ్యక్తులు. దేవుడు వారిని నడిపించి వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగించగలిగాడు. జయం సంఖ్యమీద ఆధారపడి ఉండదు. దేవుడు తక్కువమంది ద్వారాను ఎక్కువ మంది ద్వారాను విజయం చేకూర్చగలడు. తన్ను సేవించే ప్రజల ప్రవర్తనే దేవుని మహిమ పర్చుతుంది గాని వారి గొప్ప సంఖ్యకానే కాదు.PPTel 551.3

    దాడి చేయటానికి వచ్చినవారు శిబిరం వేసిన లోయ పక్క కొండమీదే ఇశ్రాయేలీయులు ఉన్నారు. “మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న యిసుక రేణువులవలె లెక్క లేనివై యుండెను” న్యాయాధిపతులు 7:12. ఉదయం జరుగనన్ను యుద్ధం గురించి ఆలోచించినప్పుడు గిద్యోనుకి గుండెల్లో దడపుట్టింది. అయితే రాత్రి వేళ ప్రభువు గిద్యోనుతో మాట్లాడి తన సేవకుడైన పూరాను తీసికొని మిద్యానీయుల శిబిరంలోకి వెళ్ళమని అక్కడ వారి సంభాషణ వింటే తనకు ఉద్రేకం కలుగుతుందని చెప్పాడు. గిద్యోను వెళ్ళాడు. చీకటిలో నిశ్శబ్దంగా వేచి ఉండి ఒక సైనికుడు తన కలను మిత్రుడుకి ఇలా చెప్పటం విన్నాడు, “యవల రొట్టె ఒకటి మిధ్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెను”. ఎవరికీ కనిపించకుండా వింటున్న గిద్యోను హృదయాన్ని రంజింపజేసే ఈ మాటలతో అవతలివాడు బదులు పలికాడు, “అది ఇశ్రాయేలీయు డైన యోవాసు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతను తన చేతికి అప్పగింప బోవుచున్నాడు”. ఆ మిద్యానీయ పరదేశులనోట తనతో మాట్లాడున్న దేవుని గొంతును గిద్యోను గుర్తించాడు. తాను ఆధిపత్యం వహిస్తున్న ఆ కొద్దిమంది సైనికుల వద్దకు తిరిగి వచ్చి గిద్యోను ఇలా అన్నాడు, “లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు”. |PPTel 552.1

    దేవుడు దాడి ప్రణాళికను సూచించగా గిద్యోను దాన్ని వెంటనే అమలు పర్చాడు. ఆ మూడు వందలమందినీ మూడు గుంపులుగా విభజించాడు. ఒక బూర, ఒక మట్టికుండలో దాచి ఉంచిన దివిటీ ప్రతీ సైనికుడికీ ఇచ్చాడు. వేర్వేరు దిక్కుల నుంచి మిద్యానీయ శిబిరానికి వచ్చేందుకు అనువుగా వారు తమ స్థానాల్లో నిలిచారు. మధ్యరాత్రిలో గిద్యోను సమర శంకం వినిపించినప్పుడు ఆ మూడు విభాగాలు తమ తమ బూరలు ఊది పిదప తమ కుండలు బద్దలు కొట్టి భగభగ మండుతున్న తమ దివిటీలు ప్రదర్శిస్తూ “యెహోవా ఖడ్గము” అన్న భయంకర యుద్ధ నినాదంతో శత్రు సైన్యం మీదికి దూసుకు వెళ్ళారు.PPTel 552.2

    నిద్రమత్తులో ఉన్న సైన్యం మేల్కొంది. అన్ని పక్కల భగభగమండుతున్న దివిటీలు కనిపించాయి. అన్ని దిక్కుల్నుంచీ బూర ధ్వని ముట్టడిదారులు కేకలు వినిపించాయి. విస్తారమైన సేన తమను ముట్టడించినందని భావించి మిద్యానీయులు బెంబేలెత్తారు. భయంతో కేకలు వేస్తూ పారిపోయారు తమ సేనల్నే శత్రునేనలుగా అపార్థం చేసుకొని ఒకరినొకరు చంపుకొన్నారు. విజయ వార్త వ్యాపించగా తమ గృహాలకు వెళ్ళిపోయిన వేలాదిమంది సైనికులు తిరిగి వచ్చి పారిపోతున్న శత్రువుల్ని తరుముతున్న సైనికులతో తరిమారు. యోర్దాను నది అవతల పక్క ఉన్న తమ భూభాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో మిధ్యానీయులు యోర్దాను దిశగా వెళ్తున్నారు. గిద్యోను ఎఫ్రాయిము గోత్రానికి దూతల్ని పంపి పారిపోతున్న శత్రువుల్ని దక్షిణ రేవుల వద్ద ఆపుచేయాల్సిందిగా కోరాడు. “అలసటగానున్నను శత్రువులను తరము” తున్న మూడు వందలమందితో గిద్యోను యోర్దాను దాటి వారిని పట్టుకొన్నాడు. ఆ సర్వ సేనకు నాయకులుగా ఉన్న జెబుహు సల్మున్నా అనే ఆ ఇద్దరు రాజులు పదిహేను వేలమంది సైనికులతో తప్పించుకొని పారిపోతుండగా గిద్యోను వారిని పట్టుకొన్నాడు. వారి బలగాలు చెల్లాచెదురయ్యాయి. వారి నాయకుల్ని గిద్యోను పట్టుకొని హతమార్చాడు.PPTel 553.1

    ప్రముఖమైన ఈ ఓటమిలో లక్షా ఇరవై వేల మంది శత్రు సైనికులు మరణించారు. మిద్యానీయుల అధికారం అంతమయ్యింది. ఇక వారు ఇశ్రాయేలీయుల మీద ఎన్నటికీ దాడిచేయలేని స్థితికి వచ్చారు. ఇశ్రాయేలీయుల దేవుడు మళ్ళీ తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడన్న వార్త శరవేగంగా వ్యాపించింది. సాహసికులు యుద్ధశూరులు అయిన మిద్యానీయుల అధికారాన్ని సామాన్య సాధనాలు ఎలా అంతం చేశాయో చుట్టుపట్ల రాజ్యాలు తెలుసుకొన్నప్పుడు వారికి కలిగిన భయం వర్ణనాతీతం.PPTel 553.2

    మిద్యానీయుల్ని నాశనం చేయటానికి దేవుడు ఎంపిక చేసిన నాయకుడు ఇశ్రాయేలీయుల సమాజంలో అగ్రస్థానాన్ని ఆక్రమించివాడు కాదు. అతడు అధికారి గాని యాజకుడు గాని లేదా లేవీయుడుగాని కాదు. తన తండ్రి ఇంట తాను మిక్కిలి అల్పుడనని భావించాడు. కాకపోతే దేవుడు అతనిలో ధైర్యశాలిని నిజాయితీ పరుణ్ని చూశాడు. అతడు తన్నుతాను నమ్ముకోలేదు. దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తన సేవకు ఎల్లప్పుడూ గొప్ప ప్రతిభ పాటవాలున్న వారినే ఎన్నుకొంటాడు. “ఘనతకు ముందు వినయముండును” సామెతలు 15:33. తాము అసంపూర్ణులమన్న స్పృహ ఎవరికుటుందో ఎవరు తమ నాయకుడుగాను తమ శక్తికి మూలంగాను ఆయనను విశ్వసించి ఆయన పై ఆధారపడి ఉంటారో వారి ద్వారా దేవుడు శక్తిమంతంగా పనిచేయగలుగుతాడు. తన బలాన్ని వారి బలహీనతకు జతపర్చి వారిని వివేకవంతుల్ని చేస్తాడు.PPTel 553.3

    తన ప్రజలు సాత్వికులై ఉంటే వారి నిమిత్తం దేవుడు మరెన్నో ఘన కార్యాలు చేయగలడు. అయితే గొప్ప బాధ్యతను నిర్వహించేటప్పుడు లేక గొప్ప విజయం సాధిస్తున్నప్పుడు ఆత్మ విశ్వాసంతో విర్రవీగని వారు దేవుని మీద ఆనుకోటం విస్మరించనివారు ఉండటం అరుదు. తన సేవ నిమిత్తం మనుషుల్ని ఎంపిక చేసేటప్పుడు గొప్పవారు ప్రతిభావంతులు మేధావులు అని ప్రపంచం సన్నుతించే వ్యక్తుల్ని దేవుడు పక్కన పెట్టటానికి కారణం ఇదే. వారు గర్వం స్వయం సమృద్ధితో నిండిన వ్యక్తులు. దేవుని నడుపుదల లేకుండానే తమంతట తాము వ్యవహరించ గలమని వారి భావన.PPTel 554.1

    శత్రువుల బలాన్ని వమ్ము చేయటానికి యెహోషువ సైన్యం యెరికో చుట్టూ తిరుగుతూ బూరలు ఊదటం, గిద్యోను చిన్న సేన మిద్యానీయ జనసమూహాన్ని చుట్టుముట్టి బూరలు ఊదటం అన్న సామాన్య కార్యం దేవుని శక్తి చేత కార్యసాధక మయ్యింది. దేవుని శక్తి జ్ఞానాల్ని పక్కన పెట్టి మానవులు రూపొందించగల అత్యున్నత వ్యవస్థ ఏదైనా నిరుపయోగం కాగా దేవుడు నిర్దేశించిన అతి సామాన్య పద్దతుల్ని వినయంతో విశ్వాసంతో అనుసరించినప్పుడు అవి ఘన విజయం చేకూర్చుతాయి. కనానీయులతో సాగిన యుద్ధాల్లో దేవుని పై నమ్మకం ఆయన చిత్తానికి విధేయత గిద్యోను యెహోషువలకు ఎంత అవసరమయ్యా యో క్రైస్తవుడికి తన ఆధ్యాత్మిక సమరంలో అవి అంతే అవసరమవుతాయి. ఇశ్రాయేలీయుల పక్షంగా తన శక్తిని పదేపదే ప్రదర్శించటం ద్వారా తనపై విశ్వాసముంచటానికి దేవుడు వారిని నడిపించాడు. ప్రతీ అత్యవసర పరిస్థితిలోను తన సహాయాన్ని విశ్వాసంతో యాచించటానికి వారిని నడిపించాడు. అలాగే నేడు కూడా బలహీన సాధనాల్లో పనిచేసే గొప్ప కార్యాలు సాధించటానికి తన ప్రజలతో కలసి పాటు పడటానికి ఆయన సన్నద్ధంగా ఉన్నాడు. పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని శక్తిని మనం ఎప్పుడు కోర్తామా అని పరలోక నివాసులందరూ ఎదురు చూస్తున్నారు. మన దేవుడు “మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తి”గల వాడు. ఎఫెసీ 3:20.PPTel 554.2

    తన దేశ శత్రువుల్ని వెంటాడటం ముగించుకొని గిద్యోను తిరిగి వచ్చాడు. వచ్చీ రావటంతోనే సహపౌరుల విమర్శల్ని ఆరోపణల్ని ఎదుర్కొన్నాడు. తన పిలుపు మేరకు ఇశ్రాయేలీయులందరూ సంఘటితమై మిద్యానీయులపై దాడికి సమావేశం కాగా ఎఫ్రాయిము గోత్రం వెనుక ఉండిపోయింది. అది ప్రమాదకర కార్యమని వారు పరిగణించారు. గిద్యోను ప్రత్యేక ఆదేశం పంపలేదు గనుక దాన్ని సాకుగా తీసుకొని వారు తమ సహోదరులతో కలసి వెళ్ళలేదు. ఇశ్రాయేలీయుల విజయవార్త వినిపించగానే తమకు అందులో పాలులేనందుకు ఎఫ్రాయి మీయులు అసూయపడ్డారు. మిద్యానీయుల నిర్మూలన అనంతరం గిద్యోను ఆదేశానుసారం ఎఫ్రాయిమీయులు యోర్దాను రేవుల్ని స్వాధీనపర్చుకొని మిద్యానీయులు పారిపోకుండా వార్ని అడ్డుకొన్నారు. ఈ రకంగా శత్రువులు పెద్ద సంఖ్యలో హతమయ్యారు. వారిలో ఓరేబు జెయేబులనే ఇద్దరు అధిపతులున్నారు. ఇలా ఎఫ్రాయిము గోత్రం వారు యుద్ధం అనంతరకృషిలో చేయూతనిచ్చి విజయం సంపూర్తి కావటానికి దోహదపడ్డారు. అయినప్పటికీ గిద్యోను తన సొంత ఆలోచనలు తీర్మానాలను అనుసరించినట్లు ఎఫ్రాయిమీయులు అతడి పట్ల కోపంగా అసూయగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల విజయంలో దేవుని హస్తాన్ని వారు గుర్తించలేదు. తమ విడుదలలో దేవుని శక్తిని ఆయన కృపను వారు అభినందించలేదు. ఆయన ప్రత్యేక సాధనాలుగా ఎంపిక కావటానికి వారు అనర్హులని ఈ కార్యమే చాటి చెబుతుంది.PPTel 554.3

    విజయ చిహ్నాలతో తిరిగి వచ్చి ఆగ్రహంతో “నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదు?” అని గిద్యోనును నిలదీశారు.PPTel 555.1

    అందుకు గిద్యోను ఇలా బదులిచ్చాడు, “మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్లకోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా?” PPTel 555.2

    ఈ ఈర్ష్యాస్వభావాన్ని సులువుగా పెంచి పెద్దది చేయవచ్చు. అది చేస్తే పెద్ద పోరాటం రక్తపాతం చోటు చేసుకొనేది. అయితే గిద్యోను మృదువుగా ఇచ్చిన సమాధానం ఎఫ్రాయిము వారి కోపాన్ని చల్లార్చింది. వారు తమ గృహాలకు సమాధానంగా తిరిగి వెళ్ళారు. సిద్ధాంతం వచ్చేసరికి రాజీలేని దృఢత్వం, గలవాడు యుద్ధంలో “పరాక్రమముగల బలాఢ్యుడు” అయిన గిద్యోను ఎంతో అరుదుగా కనిపించే వినయ స్వభావం ప్రదర్శించాడు.PPTel 555.3

    మిద్యానీయుల ఈతి బాధల నుంచి తమను విడిపించినందుకు కృతజ్ఞులైన ప్రజలు గిద్యోను తమపై రాజుగా ఉండాలని సింహాసంన తన బిడ్డలకు వారసత్వంగా సంక్రమించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన దైవపరిపాలన సూత్రాలకు విరుద్ధం. ఇశ్రాయేలీయులకు రాజు దేవుడే! ఒక మానవుణ్ని సింహాసనం మీద పెట్టటమంటే సర్వాధికారి అయిన ప్రభువుగా దేవున్ని అంగీకరించకపోటమన్న మాట. ఈ వాస్తవాన్ని గిద్యోను గుర్తించాడు. అతడి ఉద్దేశాలు ఎంత యధార్థమైనవో ఎంత సమున్నతమైనవో అతడిచ్చిన ఈ సమాధానమే బయలు పర్చుతుంది, “నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవాయే మిమ్మును ఏలును”.PPTel 556.1

    కాని గిద్యోను వేరే పొరపాటుకి బలైపోయాడు. ఆ పొరపాటు తన వంశాన్నీ ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేసింది. గొప్ప పోరాటం వెనుక వచ్చే నిష్క్రియా కాలం ప్రమాదభరితమైన కాలం. అది పోరాట కాలం కన్నా ప్రమాదకరమైంది. గిద్యోను ఈ అపాయాన్నే ఎదుర్కొన్నాడు. ఇప్పటి వరకూ దేవుడు తనకిచ్చిన ఆదేశాల్ని నెవరవేర్చటంతో సంతృప్తి పొందాడు. కాగా ఇప్పుడు దేవుని మార్గనిర్దేశం కోసం వేచి ఉండే బదులు సొంత ప్రణాళికలు రూపొందించుకోటం మొదలు పెట్టాడు. దేవుని సైన్యాలు అఖండ విజయాలు సాధించినప్పుడు దేవుని పనిని కూలదోయ టానికి సాతాను రెట్టింపు పట్టుదలతో కృషి చేస్తాడు. ఈ రకంగానే గిద్యోదు మనసుకి ఆలోచనలు ప్రణాళికలు సమర్పించటం జరిగింది. వాటి మూలంగా గిద్యోను ఇశ్రాయేలీయుల్ని తప్పుదారి పట్టించాడు.PPTel 556.2

    తనకు దేవదూత కనిపించిన రాతి మీద బలి అర్పించాల్సిందిగా ఆదేశం పొందాడు. గనుక తాను యాజక సేవలకు నియుక్తుడనయ్యానని గిద్యోన భావించాడు. దైవామోదం కోసం నిరీక్షించకుండా ఉచితమైన స్థలం ఏర్పాటుకు, గుడారంలో జరిగే ఆరాధన వ్యవస్థ దీటైన ఆరాధన పద్ధతిని నెలకొల్పాలని నిర్ధారించుకొన్నాడు. ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా ఉండటంతో గిద్యోను ప్రణాళిక అమలుకు ప్రతి బంధకాలు కనిపించలేదు. మిద్యానీయుల నుంచి తీసుకన్నా బంగారు పోగులన్నీ దోపుడు సొమ్ములో తన భాగంగా తనకీయాల్సిందిగా గిద్యోను కోరగా వాటిని ఇవ్వటం జరిగింది. మిద్యాను ప్రధానుల దుస్తులతో పాటు ఇంకా కొన్ని విలువైన వస్తువుల్ని ప్రజలు పోగు జేశారు. ఇలా పోగుజేసిన వస్తువులతో ప్రధాన యాజకుడు ధరించే వాటికి మల్లే కనిపించే ఏఫోదును పతకాన్ని తయారు చేశాడు. తాను చేసిన కార్యం అతికి అతడి కుటుంబానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఉచ్చుగా మారింది. ఆ ఆనధికార ఆరాధన చివరికి అనేకమంది ప్రభువుని విడిచి పెట్టి విగ్రహారాధకు లవ్వటానికి దారి తీసింది. గిద్యోను మరణించిన తర్వాత తన కుటుంబీకులతో సహా అనేకమంది మత భ్రష్టులయ్యారు. ఒకప్పుడు ఏ వ్యక్తి తమ విగ్రహాల్ని కూలదోశాడో ఆ వ్యక్తే ప్రజల్ని దేవునికి దూరం చేసినవాడయ్యాడు.PPTel 556.3

    తమ మాటలు, క్రియలు ప్రసరించే ప్రగాడ ప్రభావాన్ని గుర్తెరిగే వారు చాలా తక్కువమంది. తల్లిదండ్రుల దోషాలు వారు మరణించిన చాలా కాలం తర్వాత కూడా పిల్లల్లోను వారి పిల్లల్లోను వాటి దుష్పలితాల్ని కనపర్చటం తరచు జరుగు తుంటుంది. ప్రతివారూ ఇతరుల మీద తమ ప్రభావాన్ని ప్రసరిస్తుంటారు. తమ ప్రభావానికి వారే బాధ్యులు. మాటలు క్రియల ప్రభావం బలమైనది. ఇక్కడ మన జీవితం తాలూకు ప్రభావం ఎలాంటిదో రానున్న నిత్య భవిష్యత్కాలమే వెల్లడి చేయనుంది. మన మాటలు క్రియలు కలిగించే అభిప్రాయాలు మేలుగానో కీడుగానో మన మీదకే తిరిగి వస్తాయి. ఈ భావన జీవితానికి ప్రగాఢ గంభీరతను చేకూర్చుతుంది. సర్వజ్ఞాని అయిన దేవుడు మనల్ని నడిపించాల్సిందిగా ప్రార్థన చేయటానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి. PPTel 557.1

    అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు తప్పుదారి పట్టించవచ్చు. జ్ఞానులు పొరపడవచ్చు. బలవంతులు తూలిపడవచ్చు. పై నుంచి వచ్చే వెలుగు నిత్యం మన మార్గాన్ని వెలుగుతో నింపటం అవసరం. “నా వెంబడి రండి” అన్న ఆ ప్రభువును అనుసరించి నడవటంలోనే మనకు క్షేమముంది.PPTel 557.2

    గిద్యోను మరణం దరిమిల “ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని యింటి వారికి ఉపకారము చేయకపోయరి”. ఇశ్రాయేలీయులు తమ న్యాయాధిపతి విమోచకుడు అయిన గిద్యోను చేసిన ఉప కారాన్ని విస్మరించి అతడి కుమారుడు అబీమెలకును తమ రాజుగా అంగీకరించారు. అబీమెలెకు తన అధికారాన్ని నిలుపుకొనేందుకు ఒక్కణ్ని మినహా గిద్యోను న్యాయసమ్మతమైన పిల్లలందరిని సంహరించాడు. దైవ భీతిని విడచి పెట్టిన మనుషులు అనతికాలంలోనే నీతి మార్గం నుంచి తప్పుకొంటారు. గౌరవ మర్యాదలకు విలువనివ్వరు. గిద్యోనుకుమల్లే దేవుని కృపను అభినందించటానికి దారితీస్తుంది. గిద్యోను కుటుంబం పట్ల ఇశ్రాయేలీయులు అతిక్రూరంగా ప్రవర్తించారు. దేవుని పట్ల తీవ్ర కృతఘ్నత ప్రదర్శించిన ఆ ప్రజలు ఆ విధంగా గాక ఇంకెలా ప్రవర్తిస్తారు?PPTel 557.3

    అబీమెలెకు మరణించిన తర్వాత దేవునికి భయపడిన న్యాయాధిపతులు కొంతకాలం పరిపాలించారు. వారు విగ్రహారాధనను కొంతమట్టుకు కట్టడి చేశారు. కాని కొద్దికాలంలోనే ప్రజలు తమ చుట్టుపక్కల ఉన్న అన్యుల ఆచారాల్ని అనుసరించటం మొదలు పెట్టారు. ఉత్తరాన ఉన్న గోత్రాల్లో చాలామంది సిరియనులు సిదోనీయులు దేవతలను పూజించారు. నైరుతి దిక్కున ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఫిలిప్తీయుల విగ్రాహాలు, తూర్పున ఇశ్రాయేలీయుల్ని మోయాబీయులు అమ్మోనీయుల దేవతలు ఆకట్టుకొన్నారు. మత భ్రష్టత వెంటనే వచ్చింది. తూర్పున ఉన్న గోత్రాల్ని అమ్మోనీయులు జయించారు. యోర్దాను నది దాటి యూద ఎఫ్రాయిము గోత్రాల భూభాగాల్ని స్వాధీనం చేసుకోన్నారు. పశ్చిమాన ఉన్న గోత్రాల మీదికి ఫిలిప్తీయులు దండెత్తి వారి పట్టణాల్ని కాల్చివేసి ప్రజల్ని దోచుకున్నారు. ఇశ్రాయేలీయులు మళ్ళీ శత్రువుల చేతిలో పడ్డట్లు కనిపించింది.PPTel 558.1

    తాము ఎవరిని విడిచి పెట్టి అవమానించారో ఆ ప్రభువు సాయాన్నే ప్రజలు మళ్ళీ కోరారు. అప్పుడు వారు “మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము.. మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని యెహోవాకు మొఱ్ఱ” పెట్టారు. ఆ దు:ఖం నిజమైన పశ్చాత్తాపం కాదు. తమ పాపాల వల్ల శ్రమలనుభవిస్తున్నందుకు తప్ప, దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినందుకు కాదు వారు దు:ఖపడింది. నిజమైన పశ్చాత్తాపం పాపం చేసినందుకు దు:ఖించటం మాత్రమే కాదు. అందులో ఇంకా ఎక్కువే ఇమిడి ఉన్నది. పశ్చాత్తాపమంటే పాపం నుంచి పూర్తిగా వైదొలగటం.PPTel 558.2

    ఒక ప్రవక్త ద్వారా దేవుడు వారికీ సమాధానం ఇచ్చాడు, “ఐగుప్తీయుల వశములో నుండియు, అమోరీయుల వశములో నుండియు, అమ్మోనీయుల వశములో నుండియు, ఫిలిప్తీయుల వశములో నుండియు మాత్రముగాక సీదోనియులును అమాలేకీయులును మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను, పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొట్ట పెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో”.PPTel 558.3

    భయం పుట్టించే ఈ మాటలు మనసును మరోసన్నివేశం పై నిలుపుతున్నాయి. అదే అంతిమ తీర్పుదినం. దేవుని కృపను నిరాకరించేవారు ఆ దినాన ఆయన తీర్పును ఎదుర్కొంటారు. దేవుడు తమకిచ్చిన సమయం, ద్రవ్యం, ప్రతిభవంటి వరాల్ని లోక దేవతల సేవలకు వెచ్చించటం గురించి ఆ న్యాయస్థానం ముందు వారు లెక్క అప్పజెప్పాల్సి ఉన్నారు. వారు నిజంగా తమను ప్రేమించే మిత్రుణ్ని విసర్జించారు. అనుకూల మార్గాలు అనుసరించటానికి, లోక వినోదాల్లో తేలి ఆడటానికి దేవున్ని విడిచి పెట్టారు. ముందు ఏదో ఒక రోజు తిరిగి దేవుని వద్దకు రావాలని ఉద్దేశించారు. కాని భోగాలు మోసాలతో నిండిన లోకం వారిని ఆకటు కొన్నది. పనికిరాని వినోదాలు, అహంభావపూరిత వస్త్రధారణ, తినటం తాగటంఇవి మనుషుల్ని పాషాణాలుగా మార్చి అంతరాత్మ నోరు నోక్కేశాయి. అందువల్ల సత్యం గొంతు వినిపంచలేదు. విధి నిర్వహణను పట్టించుకోలేదు. అనంత విలువలున్న అంశాల్ని చులకన చేయటం వల్ల మానవుల కోసం ఎంతో త్యాగం చేసిన మహానీయుడైన క్రీస్తు కోసం త్యాగం చెయ్యాలన్న ఆకాంక్ష మనసుల్లోంచి మటుమాయమయ్యింది. కాగా వారు ఏమి విత్తారో కోతకాలంలో ఆ పంటనే కోస్తారు.PPTel 559.1

    ప్రభువిలా అంటున్నాడు. “నేను పిలువగా మీరు వినకపోతిరి. నాచేయి చాపగా ఎవురును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధయేమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడక పోతిరి... భయము మీ మీదికి తుఫానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దు:ఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొఱ్ఱ పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తర మియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్య మాయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట వారికిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలముననుభవించెదరు” “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును” సామెతలు 1:24-31,33.PPTel 559.2

    ఇశ్రాయేలీయులు దేవుని ముందు ఇప్పుడు విదేయులయ్యారు. “యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను” తొలగించారు. ప్రేమతో నిండిన ప్రభువు హృదయం నొచ్చుకొన్నది’. “ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను”. మన దేవుడు ఎంత కృపామయుడు, ఎంత దీర్ఘశాంతం గలవాడు. తమను ఆయనకు దూరం చేసిన పాపాన్ని తన ప్రజలు విడిచి పెట్టినప్పుడు ఆయన వారి విన్నపాల్ని విని వెంటనే వారిని ఆదుకోటానికి పూనుకొన్నాడు.PPTel 559.3

    దేవుడు యెఫ్తా అనే ఓ విమోచకుణ్ని లేపాడు. అతడు గిలాదు వాడు. యె అమ్మోనీయులతో యుద్ధం చేసి వారి అధికారాన్ని అంతం చేశాడు. ఈ కాలంలో ఇశ్రాయేలీయులు పద్దెనిమిదేళ్ళు తమ శత్రువుల చేతిలో అనేక బాధలనుభవించారు. అయినా ఆ శ్రమల మూలంగా నేర్చుకొన్న పాఠాన్ని వారు మళ్ళీ మర్చిపోయారు.PPTel 560.1

    తన ప్రజలు తమ పాత దుర్మార్గ జీవితాన్ని తిరిగి మొదలు పెట్టటంతో తమ శత్రువులు ఫిలిపీయుల చేతిలో శ్రమలనుభవించటానికి దేవుడు వారిని అప్పగించాడు. ఫిలిప్తీయులు వారిని అనేక సంవత్సరములు రాచిరంపాన పెట్టారు. కొన్నిసార్లు ఆ క్రూర ప్రజలు వారిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొనే వారు. ఇశ్రాయేలీయులు ఈ విగ్రహారాధకులతో మమేకమై వారి వినోదల్లోను పూజపున స్కారాల్లోను పాలుపంచుకొని వారి జీవన స్రవంతిలో కలిసిపోయారు. అనంతరం ఇశ్రాయేలీయుల మిత్రులుగా చెప్పుకొన్న వీరు వారికి బద్ద శత్రువులై వారిని నాశనం చేయటానికి ప్రయత్నించారు.PPTel 560.2

    ఇశ్రాయేలీయుల మాదిరిగానే క్రైస్తవులు తరచు లౌకిక ప్రభావానికి లొంగి భక్తిహీనుల స్నేహం నిలుపుకోటానికి లౌకిక సిద్ధాంతాల్ని ఆచారాల్ని ఆచరిస్తారు. అయితే స్నేహితులుగా చెప్పుకొంటున్న వీరు మిక్కిలి ప్రమాదకరమైన శత్రువులని చివరికి తేలుతుంది. దైవ ప్రజలకు లోకానికి మధ్య పొత్తు ఎన్నటికీ కుదరదని బైబిలు విస్పష్టం చేస్తున్నది. “సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి” 1 యోహాను 3:13. “లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీ కంటే ముందుగా నన్ను ద్వేషించెను” అంటున్నాడు మన రక్షకుడు. యోహాను 15:18. దైవ ప్రజల్ని దేవునికి దూరం చేసే ధ్వేయంతో స్నేహం నటించే భక్తి హీనుల్ని సాతాను తన సాధనాలుగా ఉపయోగిస్తారు. వారి మీద నుంచి దేవుని కాపుదల తొలగిపోయిన తర్వాత సాతాను తన దుష్టదూతల్ని పంపి వారిని నాశనం చేస్తాడు.PPTel 560.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents