Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    4. వ్యాధి గ్రస్తుల సంరక్షణ

    15—వ్యాధిగ్రస్తుల సంరక్షణ

    రోగుల గదిలో

    వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేసేవారు ఆరోగ్య సూత్రానలు జాగ్రత్తగా అనుసరించటం ప్రాముఖ్యమని గ్రహించాలి. ఈ సూత్రాలను విధేయత రోగుల గదిలో కన్నా మరెక్కడా ఎక్కువ అవసరం ఉండదు. రోగులకు పరిచర్య చేసేవారు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటంపై ఇక్కడ ఎంతో ఆధారపడి ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉన్న రోగుల సందర్భాల్లో చిన్న అశ్రద్ధ. రోగి ప్రత్యేక అవసరాలు లేక ప్రమాదాల విషయంలో చిన్న ఏసురుపాటు, భయం, ఉద్రేకం లేక అసహనం, సానుభూతి కొరవడటం అవి చోటు చేసుకోకుండా ఉండి ఉంటే కోలుకోవలసిన రోగి చావు బతకుల మధ్య సమతూకాన్ని మార్చి సమాధికి పంపవచ్చు.MHTel 182.1

    ఓ నర్సు సమర్ధత చాలావరకు శారీరక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. తన ఆరోగ్యం ఎంత మెరుగుగా ఉంటే రోగులకు పరిచర్య చెయ్యటంలోని శ్రమను ఆమె అంత మెరుగుగా తట్టుకొని అంత విజయ వంతముగా తమ విధులను నిర్వర్తించగలుగుతుంది. రోగులను చూసుకునేవారు ఆహారం, పారిశుద్యం, స్వచ్ఛమైన గాలి, వ్యాయామం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అటువంటి జాగ్రత్తే కుటుంబం తీసుకుంటే తమ మీద ఉన్న అదనపు భారాన్ని భరించటానికి తమను తాము వ్యాధి భారిన పడకుండా కాపాడుకోవటానికి వారికి తోడ్పడుతుంది.MHTel 182.2

    ” యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందు దురు. వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు”. యెషయా 40:31MHTel 182.3

    వ్యాధి తీవ్రంగా ఉండి రాత్రి పగలు ఓ నర్సు సేవలు అవసరమైన ప్పుడు ఆ పనిని ఇద్దరు నర్సులు పంచుకోవటం మంచిది. ఒకరు పని చేస్తున్నప్పుడు ఒకరు విశ్రాంతి తీసుకోవటానికి, ఆరుబయట వ్యాయమం చెయ్య టానికి ఇది తోడ్పడుతుంది. రోగుల గదిలో సమృద్ధిగా తాజా గాలి సరఫరా లేని సందర్భాల్లో ఇది చాలా ప్రాముఖ్యం. తాజా గాలి ప్రాముఖ్యం తెలియ నందు వల్ల కొన్నిసార్లు కిటికీలు తలుపులు మూసి గాలిని బంధించటం జరుగుతుంది. రోగి ప్రాణానికి అతడికి సేవచేసే సహాయకుల ప్రాణానికి ఇది ప్రమాదకరం.MHTel 182.4

    సరియైన ముందు జాగ్రత్తలు పాటిస్తే అంటు వ్యాధులు కాని వ్యాదులు ఇతరులకు సోకడానిక అస్కారము లేదు. అలవాట్లు సరియైననై ఉండనివ్వండి. ఆ మీదట పరిశభ్రత స్థిరమైన వాయు ప్రసరణ ద్వారా రోగుల గదిని విష పదార్థాలకు తావు లేకుండా చెయ్యండి అటువంటి పరిస్థితుల కింద రోగులు కోలుకోవటం, అనేక సందార్భాల్లో సహయకులు గాని కుటుంబ సభ్యులు గాని వ్యాదికి గురి కాకుండటం సాధ్యపడుతుంది.MHTel 183.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents