Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    2—పరిచర్య దినాలు

    కప్నె హెూములోని జాలరి గృహంలో పేతురు అత్తగారు “తీవ్రమైన జ్వరముతో” పడి ఉంది. దాన్ని గురించి “ఆయన యొద్ద మనవి చేసికొనిరి” యసు ఆమె “జ్వరమును గద్దింపగా ఆది ఆమెను విడిచెను”. ఆమె లేచి రక్షకునికి ఆయన శిస్యులకు సేవలు చేసింది. లూకా 4:38, మార్కు 1:30, మత్తయి 8:15.MHTel 15.1

    వార్తవేగంగా వ్యాపించింది. ఆ అద్భుత కార్యం సబ్బాతు రోజున చెయ్యటం జరిగింది. రబ్బీలకు జడిసి ప్రజలు సూర్యాస్తమయం వరకు స్వస్థత పొందటానికి బయటకి రావటానికి వెనకాడారు. అప్పుడు గృహాల నుంచి మార్కెట్లు స్థలాల నుండి సామాన్య ప్రజలు యేసు బస ఉన్న సాదాసీద గృహానికి తోసుకుంటూ వచ్చారు. రోగుల్ని మోసుకు వచ్చారు. కొందరు కర్రల మీద అనుకునో లేక మిత్రుల భుజాల పై అనుకునో రక్షకుని సముఖంలోని తూలుతూ పడి లేస్తూ చేర్చుకున్నారు.MHTel 15.2

    గంటలు తరబడి రోగులు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే స్వస్థత కూర్చు ఆ మహానీయుడు రేపు తమ మధ్య ఉంటాడో లేదో ఎవరికి తెలియదు. ఇలాంటి రోజు కప్నెములో మును పెన్నడూ చూడలేదు. స్వస్థత పొందిన వారు, విముక్తి పొందిన వారి ఆనందోత్సాహస్వరాలతో వాతావరణం నిండింది. జనమూహం వెళ్ళిపోయి సీమోను ఇల్లు నిశ్శబ్దమయ్యే సరికి రాత్రి చాలా గతించింది. ఉత్సాద్రేకాలతో నిండిని సుదీర్ఘ దినం అంతమొందింది. యేసు విశ్రమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా, పట్టణమంతా నిద్రలో మునిగి ఉండగా, రక్షకుడు “పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే” బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్ళి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. మార్కు 1:35MHTel 15.3

    ఉదయాన్నే పేతురు అతడి సహచరులు యేసు వద్దకు వచ్చి కపెర్నహూము ప్రజలు తనను వెదకుతున్నారని చెప్పారు. “ఆయన- నేనితర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని” అనగా విని చాలా ఆశ్చర్యపడ్డారు. లూకా 4:43MHTel 15.4

    అపుడు కపెర్నసమును ఆవరించిన ఉత్సాహ వాతారవణంలో ఆయన మిషన్ (పని) లక్ష్యమే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. కేవలం ఆద్భుతాలు చేసేవాడిగోనో, లేక శారీరక రోగాలు నయం చేసేవాడిగానో ప్రజల దృష్టిని ఆకర్షించటంతో యేసు తృప్తి చెందలేదు. తమ రక్షకుడుగా ప్రజల్ని ఆకర్షించటానికి యేసు ప్రయత్నిస్తున్నాడు.ఆయన లోకస ంబంధమైన రాజ్యాన్ని స్థాపించటానికి రాజుగా వచ్చాడని నమ్మటానికి ప్రజలు అతురతగా ఉండగా,ఆయన వారి మనసుల్ని లౌకిక విషయాల నుండి పౌరలౌకిక విషయాల పైకి తిప్పటానికి ప్రయత్నించాడు. కేవలం ఐహికజయం ఆయన పరిచర్యకు ఆటంకం కలిగిస్తుంది.MHTel 16.1

    జాగరూకత లేని జనసమూహం విస్మయం ఆయన మనసును పాడు చేసింది. జీవితంలో ఆత్మ నిశ్చయం ఆయనకు ఏ కోశానా లేదు. హోదాకి ధనానికి లేక ప్రతిభకు లోకం చూపించే గౌరవంతో దేవుని కుమారునికి నిమిత్తం లేదు. నమ్మకాన్ని లేక గౌరవాన్ని పొందటానికి మనుషులు వినియోగించే ఏ సాధనల్ని యేసు ఉపయోగించలేదు. ఆయన జన్మానికి శతాబ్దాల ముందే ఆయన్ని గురించి ఇలా ప్రవచించడం జరిగింది. “అతడు కేకలు వేయడు అరవడు. తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగినరెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనుప నార వత్తిని ఆర్పుడు. అతడు సత్యముననుసరించి న్యాయముకనుపరచును.” యెషయా 42: 2,3MHTel 16.2

    “అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. “నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందును”. ” నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకురాలేడు. అంత్యదినమును నేను వానిని లేపుదును”యోహాను 3:1415, 12:32,6:44MHTel 16.3

    ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు
    నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు”.
    MHTel 16.4

    యోషయా 42:1

    కాబట్టి బలిష్టులైన జనులు నిన్ను ఘనపరచెదరు
    భీకర జనముల పట్టణస్తులు నీకు భయపడదురు
    ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు
    అన్యుల ఘోషను అణిచివేసితివి”
    MHTel 17.1

    యోషయా 25:4 ”

    MHTel 17.2

    “ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి
    భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి
    దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు
    వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా
    ఈలాగు సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కన్నులు
    తెరచుటకును బంధింప బడిన వారిని చెరసాలలో
    నుండి వెలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించువారిని
    బందీగృమములో నుండి వెలుపలికి తెచ్చుటకును
    యెహోవానగు నేను నీతివిషయములలో నిన్ను పిలిచి
    నీ చేయి పట్టుకొనియున్నాను”.
    MHTel 17.3

    యెషయా 42:5-7

    “వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను
    వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును
    వారి యెదుట చీకటిని వెలుగు గాను వంకర త్రోవలను
    చక్కగానుచేయుదును నేను వారిని విడువక
    ఈ కార్యములు చేయుదును “.
    MHTel 17.4

    16వ వచనం.

    MHTel 17.5

    “సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రమ
    లోని సమస్తమా,ద్వీప ములారా ద్వీప నివాసులారా,
    యెహోవాకు క్రొత్త గీతము పాడుడి ఆరణ్యమును
    దాని పురములను కేదారు నివాస గ్రామ ములను
    బిగ్గరగా పాడవలెను సెల నివాసులు
    సంతోషించుదురు గాక పర్వతముల శిఖరముల నుండి
    వారు కేకలు వేయుదురు గాక ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను
    కొనియాడుదురు గాక ద్వీపములో ఆయన స్తోత్రము
    ప్రచురము చేయు దురుగాక”
    MHTel 17.6

    10-12 వచనాలు

    ” యెహోవా ఆకాశమునకు సమాప్తి చేసియున్నాడు.
    ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి
    భూమి ఆగాధ స్థలములారా, ఆర్బాటము చేయుడి
    పర్వతములారా, ఆరణ్యమా, అందులోని ప్రతి
    వృక్షమా, సంగీత నాదము చేయుడి
    యెహోవా యాకోబును విమోచించును
    ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమెన్న
    తునిగా కనపర్చుకొనును”.
    MHTel 18.1

    యెషయా 44: 23

    స్నానికుడైన యోహాను రక్షకుని సేవ గురించి నిరాశతోను, ఆందోళనతోను కనిపెడుతూ ఎదురు చూస్తే ఈ వర్తమానంతో తన శిష్యులి ద్దరిని హేరోదు చీకటి బిలంలో నుంచి యేసు వద్దకు పంపించాడు, MHTel 18.2

    'రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్ట వాలెనా? మత్తయి 11:3MHTel 18.3

    శిష్యుల ప్రశ్నకు రక్షకుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఆయన నిశ్శబ్దం గురించి ఆలోచిస్తూ నిలబడి ఉండగా, వ్యాధిబాధితులు ఆయన వద్దకు వస్తున్నారు స్వస్థత కూర్చే ఆ ప్రభువు స్వరం చెవిటి చెవిలోకి చొచ్చుకుపోయింది. ఒక్క మాట, చేతితో ఒక్క తాకిడి పగటి వెలుగును, ప్రకృతి దృశ్యాల్ని మిత్రుల ముఖాల్ని, తనకు విముక్తి కలిగించిన ప్రభువు ముఖాన్ని చూడటానికి గుడ్డి కన్నుల్ని తెరిచింది. ఆయన స్వరం మరణిస్తున్న వారి చెవులకు వినిపించగా వారు ఆరోగ్యం శక్తి కలిగి పైకిలేచారు. పక్షవాత బాధితులు దయ్యం పట్టిన వారు ఆయన ఆజ్ఞకు విధేయులయ్యారు. దయ్యాలు వారిని విడిచి వెళ్ళిపోయాయి. వారు ఆయన్ని ఆరాధించారు. రబ్బీలు అపవిత్రులుగా ముద్రవేసి దూరంగా ఉంచిన పేద వ్యవసాయకు లు, శ్రమ జీవులు అయిన చుట్టూ మూగారు. ఆయన వారితో నిత్యజీవపు మాటలు మాట్లాడారు.MHTel 18.4

    ఆ దినం ఇలా గడిచింది. యోహాను శిష్యులు ఇదంతా చూసారు. విన్నారు. చివరగా యేసు వారిని పిలిచి, తాము ఏమి చూసారో ఏమి విన్నారో వాటిని యేహానుకు చెప్పుకొని వారిని ఆదేశించి, ఇంకా ఇలా అన్నాడు,.. “మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు”. 6వ వచనం. శిష్యులు ఆ వర్తమానాన్ని తీసుకువెళ్ళారు. అది సరిపోయింది.MHTel 19.1

    మెస్సీయాని గూర్చిన ఈ ప్రవచనాన్ని యెహాను గుర్తు చేసుకున్నాడు. “దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిసే కించెను. నలిగిన హృదయమును గలవారిని ధృడపర్చుటకును చెరలో నున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ధు:ఖాక్రాంతులనందిరని ఓదార్చుటకును” యెషయా 61:1,2 నజరేయుడైన యేసు వాగ్దానం చెయ్యబడిన వాడు. బాధలను భవిస్తున్న మానవులకు ఆయన పరిచర్యలో ఆయన దైవత్వానికి నిదర్శనం కనిపించింది. మానవుడి స్థాయిక తనను తాను తగ్గించుకోవడంలో ఆయన మహిమ ప్రదర్శింపబడినది.MHTel 19.2

    “దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక ఆపహాసకులు కూర్చుండుచోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువలయోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలిమచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును”. కీర్తనలు 1:1-3MHTel 19.3

    యేసు పనులు ఆయన మెస్సీయా అని ప్రకటించడమే కాదు ఆయన రాజ్యం ఏ రీతిగా స్థాపితం కావాలసి ఉందో కూడా సూచించాయి. ఎడారిలో “బలమైన పెనుగాలి వచ్చెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు ఛిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆగాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగిను గాని ఆ భూకంపము నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరు పెపుట్టెను గాని ఆమెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను” అప్పుడు ఏలీయాకు ఏ సత్యం వచ్చిందో ఆ సత్యమే యోహానుకి తెరవబడింది. 1 రాజులు 19:11-12 అలాగే యేసు తన పనిని చెయ్యాల్సి ఉంది. సింహాసానాల్ని రాజ్యాల్ని కూలదోయ్యటం ద్వారా కాదు, హంగు ఆర్బాటం బహిర్గత ప్రదర్శన ద్వారా కాదు, కాని కృప ఆత్మత్యాగంతో కూడిన జీవితం ద్వారా మనుషుల హృదయాలతో మాట్లాడడం ద్వారా.MHTel 19.4

    దేవుని రాజ్యం వెలపటి హంగు ఆర్బాటంతో రాదు. సున్నితమైన ఆయన వాక్యావేశం ద్వారా, ఆయన ఆత్మ అంతరంగంలో పని చెయ్యటం ద్వారా, ఎవరు జీవమో ఆ ప్రభువుతో ఆత్మ సహవాసం చెయ్యటం ద్వారా అది వస్తుంది. దాని శక్తి అత్యుత్తమ ప్రదర్శన మానవ స్వభావంతో క్రీస్తు ప్రవర్తనలో ప్రత్యక్షమైన పరిపూర్ణతలో కనిపిస్తుంది.MHTel 20.1

    క్రీస్తు అనుచరలు లోకానికి వెలుగై ఉండాలి. అయితే ప్రకాశించటానికి ప్రయత్నించండి అని దేవుడు వారిని ఆదేశించటంలేదు. మెరుగైన మంచితనాన్ని ప్రదర్శించటానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని ఆయన అంగీకరించడు. వారి ఆత్మలు పరలోక సూత్రాలతో బలో పేతం కావాలని ఆయన కోరుతున్నాడు. అప్పుడు వారు తమకులోకంతో ఏర్పడే సంబంధాల్లో తమలో ఉన్న వెలుగును బయలుపర్చుతారు. జీవిత ప్రతీ చర్యలోను వారి నిశ్చల విశ్వసనీయత వెలుగుకు ఓ సాధనమౌతుంది.MHTel 20.2

    దైవ సేవాభివృద్ధికి ఉన్నత సదా, ఖరీదైన సామాగ్రి, వాస్తుశిల్పం, వస్తు సంపన్నత అవసరంలేదు. మనుషులు అభినందించే పేరు ప్రతిష్టలు తెచ్చే కార్యసాధనాలు అవసరం లేదు. అది ఎంత గొప్పదైనా లౌకికడంబం దేవుని దృష్టిలో ఏమి విలువ లేనిది. కనిపించే వాటికన్నా ఐహకిమైన వాటి కన్నా కనిపించని వాటికి, నిత్యమైన వాటికి ఆయన ఎక్కువ విలువనిస్తాడు. కనిపించేది నిత్యమైన దాన్ని వ్యక్తం చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. అతి శ్రేష్టమైన, సుందరమైన కళా సృష్టి, ఆత్మలో పరిశుద్దాత్మ పని ద్వారా రూపుదిద్దుకునే ప్రవర్తనా సౌందర్యానికి సరిసాటి కాదు.MHTel 20.3

    దేవుడు మన లోకానికి తనకుమారుణ్ణి ఇచ్చినపుడు ఆయన మానవులకు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఆ ఐశ్వర్యంతో పోల్చితే లోకం పుట్టింది మొదలు మనుషులు సంపాదించిన ప్రవక్త భాగ్యం ఏమి విలువ లేని దౌతుంది. లోకంలోకివచ్చి నిత్యత్వంలో దాచి ఉంచిన ప్రేమతో ప్రజలమందుక్రీస్తు నిలిచియున్నాడు. ఆయనతో బాంధవ్యం ద్వారా ఇతరులకు బయలుపర్చటానికి అందించటానికి ఈ ఐశ్వర్యాన్ని మనం స్వీకరించాలి.MHTel 21.1

    జీవితాన్ని మార్చటానికి దేవుని కృపకు గల శక్తి ప్రదర్శన ద్వారా పనివాడి సమర్పణ భక్తిని బట్టి దేవుని సేవలో మానవ కృషి విజయవంతమౌతుంది. ఆయన తన ప్రేమ పూరిత ప్రవర్తనను మన ద్వారా ప్రదర్శిస్తాడు. గనుక మన మీద తన ముద్రను వేశాడు. కనుక మనం లోక ప్రజలకన్నా వేరుగా ఉండాలి. రక్షకుడు తన నీతితో మనల్ని కప్పుతాడు.MHTel 21.2

    మనుషుల్ని తన సేవకు ఎంపిక చెయ్యటంలో వారు ఐహిక బ్యాగం, ఐహిక విద్య లేక వాగ్దాటి గలవారా అని దేవుడు అడుగడు. కాని “నేను నా మార్గాలు బోధించటానికి వారు సాత్వికం వినయం కలిగి నడుచు కుంటున్నారా? నేను నా మాటలు వారి నోట పెట్టగలనా? వారు నాకు రాయబారులుగా ఉండగలరా? అని అడుగుతాడు.MHTel 21.3

    ఆత్మ అనే ఆలయంలో తన ఆత్మను ఏ నిష్పత్తిలో పెట్టగలడో ఆ మేరకు దేవుడు ప్రతీ ఆత్మను ఉపయోగించగలుగుతాడు. ఆయనకు అంగీకృతమయ్యే సేవ ఆయన ప్రతిరూపాన్ని ప్రతిబింబించే సేవ మాత్రమే. తన నిత్యమైన చెరగని నియమాలను లోకంలో క్రీస్తు అనుచరులు తమ యోగ్యతా పత్రాలుగా కలిగి ఉండాలి.MHTel 21.4

    “ఆయన తన చేతులతో గొర్రెపిల్లలను పోగుజేస్తాడు”యేసు పట్టణాల వీదుల్లో పరిచర్య చేస్తున్నప్పుడు, జబ్బుగా ఉన్న పిల్లల్ని మరణించటానికి సద్దంగా ఉన్న పిల్లల్ని తమ తల్లులు చేతుల్లో మోసుకువచ్చి ఆయన గుర్తింపు పొందేందుకు జన సమూహాలో నుంచి ముందుకు తోసుకూంటూ వచ్చేవారు...MHTel 21.5

    బలహీనులైన, ఎంతో శ్రమపడి అలసిపోయిన దాదాపు నిరాశ నిస్పృహలకు గురి అయినా కృత నిశ్చయులు, పట్టుదల గలవారు అయిన ఆ తలుల్ని చూడండి. తమ శ్రమలు బాధలు భరిస్తూ వారు రక్షకుణ్ణి వెదకుతుండగా పెరుగుతున్న జనసమూహాల నడుమ క్రీస్తు వారిని చేరటానికి అడుగులు వేస్తూ తదుకు వారి పై ఆయన దృష్టి నిలిచినప్పుడు దయను ప్రేమను వ్యక్తం చేసే ఆయన కళ్ళలోకి చూసినపుడు వారు ఆనంద భాష్పాలుకార్చారు.MHTel 21.6

    ఆ సమూహంలో ఓతల్లిని ప్రత్కేకించి రక్షకుడు అంటాడు.నీకు నేను ఏమి చెయ్యాలనికోరుతున్నావు?”ప్రభువా,నాబిడ్డను స్వస్థపర్చాల్సిందిగా నాప్రార్ధన” అంటూ ఏడుస్తూ ఆ తల్లి తన కోరికను వెల్లడించింది. క్రీస్తు ఆ బిడ్డను ఆమె చేతుల్లో నుండి తీసుకున్నప్పుడు ఆయన స్పర్శకే వ్యాధి మటుమాయమయ్యింది. మరణ చాయ అంతర్ధానమయ్యింది. ఆ బిడ్డ రక్త నాళాళ్ళో ప్రాణన్నిచ్చే విద్యుత్ ప్రవహించింది. కండరాలకు శక్తి చేకూరింది. ఆయన ఆ తల్లితో ఓదార్పు శాంతి కలిగించే మాటలు మాట్లాడాడు. ఆ తరువాత తల్లి అంతే ప్రమాద స్థితిలో ఉన్న తన బిడ్డను విషయం విన్నవించుకున్నది మళ్ళీ యేసు తన జీవశక్తిని ప్రదర్శించాడు. అద్భుత కార్యాలు చేస్తున్న ఆయనకు అందరూ స్తుతి ఘనత చెల్లించారు.MHTel 22.1

    క్రీస్తు జీవిత ప్రభావం గురించి మనం ఎక్కువ మాట్లాడుతుంటాం. ఆయన చేసిన అద్భుత కార్యాల్ని గురించి సూచక క్రియల్ని గురించి మాట్లాడుతుంటాం. అయితే చిన్నవిగా కనిపించే వాటిపై ఆయన చూపించిన శ్రద్ద ఆయన గొప్పతనానికి ఇంకా గొప్ప రుజువు.MHTel 22.2

    చిన్న పిల్లలపై చేతులుంచేందుకు రబ్బీ వద్దకు తీసుకురావటం యూదుల మధ్య ఓ ఆచారం. కాని రక్షకుడి పని చాలా ప్రాముఖ్యం గనుక ఈవిధంగా ఆయనను ఆటంకపర్చకూడదని ఆయన శిస్యులు భావించేవారు. రక్షకుడు దీవించేందుకు తల్లుల తమ చిన్న బిడ్డలను తీసుకువచ్చినప్పుడు శిష్యులు సుముఖత కనపర్చేవారు కాదు. యేసును దర్శించడం వల్ల ఈ బిడ్డలకు ఒనగూరే మేలు ఏమి ఉండదని భావించి వారు వారి రాకను ఆయన ఇష్టపడటలేదు అనుకునేవారు. కాని దేవుని వాక్యం ప్రకారం తమ బిడ్డల్ని తర్బీతు చేసే తల్లుల ఆందోళన భారాన్ని రక్షకుడు అవగాహన చేసుకున్నాడు. ఆతల్లుల ప్రార్థనను ఆయనవిన్నాడు. తన సముఖంలోకి ఆయనే వారిని ఆకర్షిస్తున్నాడు.MHTel 22.3

    ఓ తల్లి తన బిడ్డను తీసుకొని యేసును కలవటానికి బయలుదేరింది. తాను ఎక్కడికి వెళ్తున్నది మార్గంలో ఓ పొరుగు స్త్రీకి చెప్పినప్పుడు తమ బిడ్డల్ని కూడా ఆయన ఆశీర్వదించాలని ఇరుగుపొరుగు తల్లులు ఆశించారు. ఇలా చాలామంది తల్లులు తమ బిడ్డల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. కొందరు పిల్లలు శిశువుల దశనుంచి బాల్యం దశకు చేరుకున్నారు. తల్లుల తమ ఆకాంక్షల్ని వ్యక్తం చేసినపుడు వారు పరికిగా కన్నీటితో చేసిన మనవుల్ని రక్షకుడు సానుభూతితో విన్నాడు. అయితే శిష్యులు వారితో ఎలా వ్యవహరిస్తారో చూడటానికి యేసు వేచి ఉన్నాడు. శిష్యులు వారిని మందలించి ఆయనకు మేలు చేస్తున్నట్లు వారిని పంపివేయటం చూసినపుడు యేసు వారి పొరపాటును వేలెత్తి చూపిస్తూ ఇలా అన్నాడు “చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి, వారినాటంకపర్చవద్దు, దేవుని రాజ్యం ఈలాంటి వారిదే. మార్కు 10:14 చిన్న పిల్లల్ని తన చేతుల్లోకి తీసుకొని, వారి మీద చేతులుంచి, వారి తల్లులు ఏమి కోరి వచ్చారో ఆ దీవెనలు వారికిచ్చాడు.MHTel 23.1

    తల్లులకు ఓదార్పు కలిగింది. క్రీస్తు చెప్పిన మాటలతో వారు బలము దీవెనలు పొంది తమ తమ గృహాలకు తిరిగి వెళ్ళారు. తమ భారాల్ని నూతనోత్సాహంతో భరించటానికి తమ బిడ్డల కోసం నిరీక్షణతో పనిచేయ టానికి వారు ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని పొందారు.MHTel 23.2

    ఆ చిన్న మంద అనంతరము జీవితం మన ముందు తెరవబడితే ,ఆ తల్లుల తమ బిడ్డలకు ఆ నాటి దృశ్యాన్ని జ్ఞాపకం చెయ్యటం రక్షకుని మాటలు వారికి మరలా చెప్పటం మనం చూస్తాం. అంతే కాదు. తరువాత సంవత్సరాల్లో ఈ మాటల స్పురణ ప్రభువు విమోచ మార్గంనుండి తప్పిపోకుండా ఈ బిడ్డల్ని ఎలా కాపాడగలిగిందో కూడా చూస్తాం.MHTel 23.3

    నేటి క్రీస్తు అప్పుడు మనుషుల మధ్య నడిచిన దయామయుడు రక్షకుడు అయిన క్రీస్తే. యూదయలోని చిన్న బిడ్డల్ని తన చేతుల్లోకి తీసుకొని తల్లులకు సహాయంచేసినట్లే నేడు కూడా సహాయం చేసే సహాయకుడు ఆయన. చాలాకాలం కిందటి చిన్న బిడ్డల్ని ఆయన తన రక్తం ద్వారా ఎలా కొన్నాడో నేడు మన కుటుంబాలలోని బిడ్డల్ని కొన్నాడు. ప్రతీ తల్లి హృదయ భారం ఆయనకు తెలుసు. పేదరికంతోను లేమి తోను సతమతమైన తలిలను ఆయన శ్రమలు బాధలు అనుభవిస్తున్న ప్రతీ తల్లి పట్ల సానుభూతి కలిగి ఉంటాడు. ఓ కనానీయ స్త్రీ ఆందోళనను తొలగించటానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన అట్టి సహాయాన్ని నేటి తల్లులుకు చేస్తాడు. నయీననులోని విధవరాలి ఒక్కగాని ఒక కుమారుణ్ణి తిరిగి ఇచ్చిన ఆయన సిలువ మీద వేదనను అనుభవిస్తున్న సమయంలో సైతం తన సొంత తల్లిని గుర్తించుకున్న ఆయన నేడు తల్లుల దు:ఖాన్ని చూసి వేదన చెందుతాడు. దు:ఖిస్తున్న ప్రతీవారినిఅవసరంలో ఉన్న ప్రతి వారిని ఆయన ఓదార్చుతాడు. సహాయం అందిస్తాడు. తల్లులు తమ సమస్యలు ఆందోళనలతో ఆయన వద్దకు రావచ్చు. తమ బిడ్డల సంర క్షణలో వారికి అవసరమైనంత సహాయం లభిస్తుంది తనభాదల్ని రక్షకుని పాదల వద్ద పెట్టడానికి సమ్మతంగా ఉన్న ప్రతీ తల్లికి ద్వారాలు తెరిచే ఉ న్నాయి.“చిన్నబిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపర్చవద్దు” (మార్కు 10:141) అన్న ప్రభువు తాను దీవెంచేందుకు తమ బిడ్డల్ని తన వద్దకు తీసుకురావలసినదిగా ఇంకా తల్లుల్ని ఆహ్వానిస్తునే ఉన్నాడు.MHTel 23.4

    తన దీవెనలు పొందటానికి తల్లులు తన వద్దకు తీసుకువచ్చిన బిడ్డల్లో యేసు తన కృపకు వారసుల్ని తన రాజ్య పౌరుల్ని వారిలో తన నిమిత్తం హతసాక్షులు కానున్న కొందరిని యేసు చేసాడు. ఈ బిడ్డలు ఆయన మాట విని ఆయనను తమ విమోచకుడుగా స్వీకరిస్తారని ఆయనకు తెలుసు. లోక జ్ఞానుల కన్నా కఠిన హృదయులకన్నా వారు ఆయన్ని సిద్ధ మనస్సుతో స్వీకరిస్తారని ఆయనకు తెలుసు. ఆయన వారి స్థాయికి వచ్చి వారికి బోధించాడు. ఆ పరలోక రారాజు చిన్నారుల ప్రశ్నలకు సమాధానా లిచ్చి ముఖ్యమైన తమ పాఠాల్ని వారు గ్రహించేటట్లు వాటిని సులభతరం చేసాడు. వారి మనస్సుల్లో సత్య విత్తనాలు నాటాడు. అనంతర సంవత్సరాల్లో అవి పెరిగినిత్య జీవానికి ఫలాలు ఫలించనున్నాయి.MHTel 24.1

    చిన్నబిడ్డల్ని ఆటంకపర్చవద్దని యేసు చెప్పనప్పుడు అన్ని యుగాల్లోని తన అనుచరులకు యేసు ఉద్దేశించాడు. సంఘ అధికారుల్ని భోధకుల్ని సహాయకుల్ని క్రైస్తవలందరినీ యేసు చిన్న బిడ్లల్ని ఆకర్షిస్తున్నాడు. వారిని “నా యొద్దకు రానియ్యుడి” అంటున్నాడు. మీరు ఆటంకపర్చకపోతే వారు నా వద్దకు వస్తారు అన్నట్లు.MHTel 24.2

    క్రీస్తుకు విరుద్ధమైన మీ ప్రవర్తన వల్ల క్రీస్తును తప్పుగా సూచించకండి, మీ నిరాసక్తత వల్ల కాఠిన్యం వల్ల చిన్న పిల్లల్ని ఆయనకు దూరంగా ఉంచకండి, మీరు ఉన్న పరలోకం తమకు ఆనందాయకమైన స్థలంగా ఉండదనే భావన వారికి కలగటానికి హేతువు కాకండి. మతం పిల్లలకు అర్ధంకాని విషయమన్నట్లు మాట్లాడకండి లేదా చిన్న వయస్సులో వారు క్రీస్తును రక్షకుడుగా స్వీకరించ కూడదన్నట్లు వ్యవహరించకండి. క్రీస్తు మతం సంతోషం ఆనందం లేని మతమన్న దురభిప్రాయాన్ని రక్షకుని వద్దకు రావటంలో జీవితాన్ని ఆనందమయం చేసే సమస్తాన్నీ విడిచి పెట్టాలన్నా దురభిప్రాయాన్ని వారికి కలిగించకండి.MHTel 25.1

    పిల్లల హృదాయల పై పరిశుద్దాత్మ పనిచేస్తున్నప్పుడు ఆయన పరిచర్యకు సహకరించండి. రక్షకుడు తమను పిలుస్తున్నాడని, పుష్పిస్తున్న తమ యౌవన తాజాతనంలో తమను తాము ఆయనకు సమర్పించు కోవడం కన్నా ఆయనకు ఎక్కువ ఆనందాన్ని కలిగించేది మరొకటి లేదని వారికి నేర్పించండి.MHTel 25.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents