Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బిడ్డ ఆహారం

    శిశువుకు ఉత్తమహారం ప్రకృతి ఇచ్చే ఆహారం. దీన్ని బిడ్డకు అనవసరంగా దూరం చెయ్యకూడదు. సౌక్యం కోసమో లేక సాంఘిక ఆంనదం కోసమో తన పసిబిడ్డకు స్తన్యమిచ్చే సున్నితమైన పని నుంచి స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నించే తల్లి హృదయం లేనదనాలి.MHTel 329.2

    తన బిడ్డకు ఇంకా స్త్రీ పాలివ్వటానికి అనుమతించే తల్లి దాని పర్యవసానమేమిటో బాగా ఆలోచించాలి. ఆ స్త్రీ తాను పాలిచ్చే బిడ్డకు తన సొంత స్వభావాన్ని మానసిక గుణాల్ని కొద్దిగా నో గొప్పగానో అందిస్తుంది.MHTel 329.3

    పిల్లల్ని సరియైన ఆహారపు అలవాట్లతో తర్బీతు చెయ్యటం ప్రాముఖ్యమని నొక్కి చెప్పాలి. తాము జీవించటానికి తినాలని తినటానికి కాదని చిన్నారులు నేర్చుకోవటం ఎంతైనా అవసరం. శిక్షణ తల్లి చేతుల్లో ఉండే శిశువుతో ఆరంభం కావాలి. నియమిత సమయం సమయాల ప్రకారం బిడ్డ పెద్దయ్యే కొద్ది తక్కువసార్లు ఆహరమివ్వాలి. స్వీటులు గాని తను జీర్ణించుకోలేని పెద్దవాళ్ళ ఆహారంగాని బిడ్డకు ఇవ్వకూడదు. శిశు వులకు ఆహారం ఇవ్వటంలో జాగరూకత, నిర్దిష్ట సమయాన్ని పాటించటం, ఆరోగ్యాన్ని వృద్ధి పర్చటం, తద్వరా వారిని నెమ్మదిగాను, మంచి స్వభావంతోను ఉంచటమే గాక అనంతర కాలంలో వారికి దీవెనగా ఉండే అలవాట్లకు పునాది కూడా వేస్తుంది.MHTel 329.4

    “బాలుడు నడుపవలసిన త్రోవను వానికి నేర్పుడి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు”. సామెతలు 22:6MHTel 329.5

    పిల్లల బాల్యం నుంచి బయటపడేటప్పుడు వారి రుచులు తిండి విషయాల్లో గొప్ప శ్రద్ధ ఇంకా తీసుకోవాలి. తరుచు వారి కోరింది ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా ఎప్పుడనుకుంటే అప్పుడు తినటానికి తల్లితండ్రులు అనుమతిస్తుంటారు. అనారోగ్యకరమైన తినుబండారాల కోసం తరుచు వ్యయమయ్యే శ్రమ ద్రవ్యం మిక్కిలి ఆనందాన్నిచ్చేది తినటమేనని అదే జీవిత అత్యున్నత లక్ష్యమని తలంచటానికి యువతను నడిపిస్తాయి. ఈ అలవాటు ఫలితం తిండిబోతుతనం. దాని తరువాత వ్యాధివస్తుంది. దాని వెనుక మోసపూరితమైన మందులవాడకం ప్రారంభమౌతుంది.MHTel 330.1

    తల్లితండ్రులు తమ బిడ్డలు ఆహార వాంఛలను తర్బీతు చెయ్యాలి. వారు అనారోగ్యకరమైన ఆహార పదార్ధాల్ని అనుమతించకూడదు. కాని భోజనాన్ని నియంత్రించే ప్రయత్నంలో మనం పిల్లల్ని రుచిలేని ఆహారాన్ని తినమనిగాని అవసరాన్ని మించి తినమనిగా పిల్లల్ని ఆదేశించటంలో తప్పు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు హక్కులు ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాయిష్టాలు సహేతుకంగా ఉంటే వాటిని గౌరవించాలి.MHTel 330.2

    బోభనం చెయ్యటంలో నియమిత సమయాలు శ్రద్ధగా పాటించాలి. భోజనాలకు మధ్య తీపి వస్తువులు పప్పులు, పండ్లు, లేక ఎలాంటి భోజనము తినకూడదు. భోజన వేళళ్ళో క్రమం పాటించకపోతే అది జీర్ణవయవాల ఆరోగ్య స్రుతిని నాశనం చేస్తుంది. అది ఆరోగ్యాన్ని ఆనందాన్ని పాడు చేస్తుంది. అప్పుడు పిల్లలు భోజనానికి బల్ల వద్ద కూర్చునప్పుడు ఆరోగ్యకరమైన భోజనాన్ని ఇష్టపడరు. వారి ఆకలి తమకు హాని కలిగించే ఆహార పదార్థాల్ని కోరుతుంది.MHTel 330.3

    ఆరోగ్యానికి ఉల్లాసకరమైన స్వభావానికి హాని చేసే బిడ్డల కోర్కెలను చెల్లించే తల్లులు మొలకలెత్తి దుష్పలితాలు ఫలించే విత్తనాల్ని నాటుతున్నారు. ఆహార వాంఛలు చిన్న పిల్లల పెరుగుదలతో పాటు పెరుగాతాయి. మానసిక శక్తి శారీరక శక్తి రెండూ బలి అవుతాయి ఈ పనిచేసే తల్లులు తాము విత్తన విత్తనం పంటను కన్నీటితో కోస్తారు. తమ బిడ్డలు మనసు విషయంలోను ప్రవర్తన విషయంలోను సమాజంలో గాని గృహంలో గాని ఉదాత్తంగా వ్యవహరించటానికి అసమర్ధులుగా పెరగటం చూస్తారు. అనారోగ్యకరమైన ఆహార ప్రభావం వల్ల ఆధ్మాత్మిక మానసిక, శారీరక శక్తులు దెబ్బతింటాయి. మనస్సాక్షి మొద్దుబారుతుంది. మంచి అభిప్రాయాలకు సులువుగా లొంగే తత్వానికి హాని కలుగుతుంది.MHTel 330.4

    పిల్లలకు తమ ఆకలిని నియంత్రించుకుని ఆరోగ్య దృష్టితో తినాలిని నేర్పించాల్సి ఉండగా, తమకు హాని కలిగించేదాన్నే తాము ఉపేక్షిస్తున్నారని వారికి స్పష్టం చెయ్యాలి. మేలైనది ఏమైతే ఉన్నదో దాని కోసం వారు హానికరమైన దాన్ని విడిచి పెడతారు. దేవుడు పుష్కలంగా అనుగ్రహించిన మంచి పదార్థాల సరఫరాతో నిండిన బల్ల స్వాగతించే విధముగా దాన్ని ఆకర్షణీయం చెయ్యండి. భోజన సమాయాన్ని సంతోషానందాల సమయం చెయ్యండి. దేవుని వరాల్ని అనుభవిస్తూ ఆనందిస్తుండగా వాటిని ఇస్తున్న ఆయనకు కృతజ్ఞతలు తెలిపి స్తుతి చెల్లిద్దాం. .MHTel 331.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents