Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుని ప్రణాళికలు ఉత్తమం

    మన ప్రణాళికలు ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికలు కావు. దావీదు విషయంలో మన ఉద్దేశాలను విసర్జించటం మనకు ఆయన సేవకు మంచిదని ఆయన చూడవచ్చు. కాని ఒక విషయంలో మనకు సందేహం అవసరం లేదు. ఆయన మహిమకు తమను తాము, తమకున్న సమస్తాన్నీ సమర్పించుకునే వారిని ఆశీర్వదించి తన సేవాభివృద్ధికి ఉపయోగించు కుంటున్నద నిశ్చయం. వారి కోరికల్ని అనుమతించకపోవటం ఉత్తమమని ఆయన చూస్తే ఆ తిరస్కారానికి ప్రతిగా మరొక సేవను వారికి అప్పగించటం ద్వారా తన ప్రేమకు నిదర్శనాలకు ఆయన ఇస్తాడు.MHTel 416.2

    మనల్ని మనకన్నా బాగా అవహగాహన చేసుకున్నా ఆయన మనపట్ల తన ప్రేమ ఆసక్తుల మూలంగా మన స్వార్ధాశల తృప్తిని నిరాకరిస్తాడు. మనం చెయ్యాల్సిన గృహ విధులు పవిత్రమైనవి. మనం వాటిని దాటపోవటం ఆయన అనుమతించడు. తరుచు ఈ విధులు మనల్ని ఉ న్నత బాధ్యతకు సిద్ధం చెయ్యటానికి శిక్షణనిస్తాయి. మన విషయంలో దేవుని ప్రణాళికలు విజయవంతమయ్యేందుకు తరుచు మన ప్రణాళికలు విఫలమౌతాయి.MHTel 416.3

    మనం దేవుని కోసం నిజమైన త్యాగం చెయ్యటానికి పిలుపు పొందం. తనకు అర్పించాల్సిందిగా మనల్ని ఆయన కోరే అనేక విషయాలను విడిచి పెట్టడంలో పరలోక మార్గములో మనకు అడ్డు వచ్చే వాటినే విడిచి పెడతాం. మంచి విషయాల్ని త్యాగం చెయ్యటానికి పిలుపు పొందినపుడు సయితం. ఆవిధముగా మన మేలుకొరకు దేవుడు పనిచేస్తున్నాడని మనం నమ్మాలి.MHTel 416.4

    ఇక్కడ మనల్ని హైరాన పెట్టిన, నిరాశకు గురిచేసిన మర్మాలు భవిష్యత్తులోని నిత్యకాలంలో తేటతెల్లమౌతాయి. జవాబులు రాని మన ప్రార్ధనలు, ఆశాభంగానికి గురి అయిన మన నిరీక్షణలు, మన గొప్ప దీవెనల్లో కొన్ని అని మనం అప్పుడు తెలుసుకుంటాం.MHTel 417.1

    మనం నిర్వహించాల్సిన విధి ఎంత దీనమైనదైనా దేవుని సేవలో భాగం కనుక అది పవిత్ర విధిగా భావించాలి. మన అనుదిన ప్రార్ధన ఇలా ఉండాలి, “దేవా నా శక్తి మేరకు చెయ్యటానికి నాకు తోడ్పడు, నా పనిని మెరుగుగా చెయ్యటం నాకు నేర్పించు. నాకు శక్తిని సంతోషాన్ని ఇయు. రక్షకుని ప్రేమానురాగాల సేవా భావాన్ని నా సేవలో ప్రతిబింబించటానికి నాకు తోడ్పడు”.MHTel 417.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents