Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నిరక్షణ, ధైర్యం

    ధైర్యం పట్టుదల లేకుండా మనం ఏది చెయ్యలేం. పేదలతోను అధైర్యం చెందినవారితోను నిరీక్షణ కలిగించే మాటలు మాట్లాడండి. వారికి కష్టపరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అవసరమైతే, సహాయం చెయ్యటం ద్వారా మీ ఆసక్తికి నిదర్శనం ఇవ్వండి. అనేక మేళ్ళు పొందినవారు తామే అనేక విషయాల్లో తప్పులు చేస్తామని తమ తప్పుల్ని వేలెత్తి చూపించనప్పుడు తమకు బాధ కలుగుతుందని, తాము ఎలాగుండాలో అన్నదానికి ఓ అంద మైన మాదిరి ఉన్నదని గుర్తుంచుకోవాలి. మందలింపు కన్నా దయ ఎక్కువ సాధిస్తుంది. మీరు ఇతరులకు బోధించటానికి ప్రయత్నించేటప్పుడు. వారు ఉన్నత ప్రమాణాన్ని చేరాలని మీరు అభిలాషిస్తున్నట్లు తమకు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నట్లు వారిని చూడనివ్వండి. వారు కొన్ని విషయాల్లో విఫలులైతే ఖండించటానికి త్వరపడకండి.MHTel 160.3

    పేదవారు ఆవశ్యం నేర్చుకోవాల్సిన సామాన్యత, ఆత్మోపేక్ష పొదుపు పాఠాలు వారికి తరచుగా కష్టంగా, అప్రియంగా కనిపిస్తాయి. లోకం మాదిరి లోకం స్వభావం నిత్యం అహంకారాన్ని, ప్రదర్శన పట్ల మక్కువను, స్వార్ధ కోరికల తృప్తి, దుర్వ్యయం. సోమరితనాల్నీ పెంచి పోషిస్తాయి. ఈ కీడులు వేల ప్రజలను పేదరకిరానికి తెచ్చి మరికొన్ని వేలమందిని భ్రష్టత నుంచి, దౌర్భాగ్య స్థితినుంచి లేవకుండా అణిచివేస్తున్నాయి. ఈ ప్రభావవాల్ని ప్రతిఘటించటానికి క్రైస్తవులు పేదవారిని ప్రోత్సహించాలి.MHTel 161.1

    యేసు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. ఆయన దీనుడుగా జన్మించాడు. పరలోక సౌర్వభౌముడు,. మహిమ రాజు, సకల దూత శ్రేణుల సేనాపతి అయిన ఆయన మానవత్వాన్ని అంగీకరించటానికి తన్నుతాను తగ్గించుకున్నాడు. అంతట ఆయన పేదరికాన్ని దీనత్వాన్ని ఎన్నుకున్నాడు. బీదలకు లేని అవకాశాలు ఆయనకీ లేవు. కఠిన శారీరక శ్రమ, కష్టం లేమి ఆయన దినదినానుభవం ఆయనన్నాడు. “నక్కలకు బొరియులును అకాశ పక్షులకు నివాసములును కలవు ఆని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు”. లూకా 9:58MHTel 161.2

    యేసు మనుషుల మెచ్చుకోళ్ళు లేక ప్రశంసలు కోరలేదు. ఆయన ఓ సైన్యానికి అధిపతి కాడు. ఆయన లోక రాజ్యం దేన్నీ పరిపాలించలేదు. లోకంలోని భాగ్యవంతులు ఘనుల ప్రాపకానికి ఆయన పాకులాడలేదు. జాతి నాయకుల మధ్య స్థానాన్ని కోరలేదు. ఆయన దీనుల మధ్య నివసించాడు. సమాజంలోని కృత్రిమ ఉన్నత స్థానాల్ని ఆయన గుర్తించలేదు. గొప్పకుల జన్మ,భ్యాగం, ప్రతిజ్ఞ, జ్ఞానం, హోదాలను ఆయన లెక్క చెయ్యలేదు.MHTel 161.3

    ఆయన పరలోక యువరాజు, అయినా, ఆయన తన శిష్యుల్ని న్యాయకోవిదుల్లో నుంచి పరిపాకుల్లో నుంచి, శాస్త్రులు లేక పరిసయ్యుల్లో నుండి ఎంపిక చేసుకోలేదు. వారని దాటి వెళ్లాడు. ఎందరికంటే వారు తనను జ్ఞానాన్ని బట్టి హోదాను బట్టి అతిశయించారు. వారు సంప్రదాయంలోను మూఢ నమ్మకాల్లోను స్థిర బుద్ధిగలవారై ఉన్నారు . అన్ని హృదయాలు చదవగల ఆయన భోద వినటానికి సమ్మతంగా ఉన్న దీన జాలరులను ఎంచుకున్నాడు. ఆయన సుంకరులతోను పాపులతోను కలసి భోజనం చేసాడు. సామన్య ప్రజలతో కలసి మెలిసి తిరిగాడు. వారితో కలసి తక్కువ స్థాయిలో ఉండటానికి కాదు కాని తన ఉచ్చరణ ఆచరణ ద్వారా వారికి సరియైన నియమాలు సమర్పించటానిక తమ ఐహికత నుంచి క్షుద్ర స్థితి నుంచి వారి పైకి లేపటానికి.MHTel 161.4

    మనుషుల విలువను తెలుసుకోవటంలో లోకం అనుసరిస్తున్న ప్రమాణాన్ని సరిచెయ్యటానికి యేసు ప్రయత్నించాడు. లోకం పేదరికానికి అతికించన కళాంకాన్ని తుడిచి వెయ్యటానికి ఆయన పేదవాడయ్యాడు. దేవుని రాజ్యానికి వారసులైన బీదల్ని ఆశీర్వదించటం ద్వారా పేదరికం పై ఉన్న తిరస్కారాన్ని దాని నుండి తొలగించాడు. తాన నడిచిన మార్గాన్ని మనకు చూపిస్తూ ఆయన ఇలా అంటున్నాడు; “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షంచుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్న వెంబడింపవలెను. ” 23వ వచనం.MHTel 162.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents