Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జబ్బుగా ఉన్న పిల్ల సంరక్షణ

    అనేక సందర్భాల్లో పిల్లలు జబ్బు పడటానికి యాజమాన్య సంబంధమైన పొరపాట్లు కారణం కావచ్చు. తినటం విషయంలో క్రమం లేకపోవటం, చలిగా ఉన్న సాయంత్రం బట్టలు సరిగా ధరించకపోవటం, ఆరోగ్యవంతమైన రక్తప్రసరణకు చురుకైన వ్యాయామం లేకపోవటం లేక రక్తం శుద్ధంగా ఉంచటానికి సమృద్దిగా గాలి లేకపోవటం సమస్యకు కారణం కావచ్చు. అస్వస్తతకు కారణం తెలుసుకోవటానికి తల్లితండ్రులు అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో పరిస్థితులను సరిదిద్దాలి.MHTel 331.2

    జబ్బుగా ఉన్నవారి సంరక్షణ, వ్యాధి నివారణ, చికిత్స సయితం నేర్చుకోగల శక్తి తల్లితండ్రులందరికి ఉంది. ముఖ్యంగా తన కుటుంబములో సామన్యమైన అస్వస్తతలు సంభవించినపుడు ఏమి చెయ్యాలో తల్లి తెలుసుకోవాలి. అస్వస్తతగా ఉన్న తన బిడ్డకు ఎలా పరిచర్య చెయ్యాలో ఆమెకు తెలియాలి. తెలియన చేతులకు అప్పగించలేని ఆ సేవలు చెయ్యటానికి తన ప్రేమ తన అంతర్ దృష్టి ఆమెను సమర్ధురాలిని చెప్పాయి.MHTel 331.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents