Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వ్యక్తిగత పరిచర్య

    రక్షణ సువార్తను ప్రకటించడానికి ఏ తరుణాన్ని క్రీస్తు నిర్లక్ష్యం చేయ్యలేదు. ఆ సమరయ స్త్రీతో ఆయన అన్న మాటల్ని వినండి. ఆమె నీళ్ళు చేదుకోటానికి వచ్చే సరికి ఆయన యూకోబు బావి పక్కన కూర్చుని ఉన్నాడు. “నాకు దాహమునకి మిమ్ముని” అడిగి ఆమెకు ఆశ్చర్యం కలిగించాడు. ఆయన చల్లని నీళ్ళు కోరాడు. అంతేకాదు. ఆమెకు జీవ జలం ఇవ్వటానికి ఓ మార్గం తెరవాలని ఆశించాడు. “ఆ సమరయ స్త్రీ --యూదుడనైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు” నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు.ఆయన నీకు జీవజలమిచ్చును..ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చునీళ్ళు త్రాగువాడెవ్వడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును.” అని యేసు సమాధానమిచ్చాడు. యెహాను 4:7-14.MHTel 13.3

    ఈ ఒక్క స్త్రీ విషయంలో క్రీస్తు ఎంత ఆశక్తి చూపించాడు! ఆయన మాటలు ఎంత మనఃపూర్వకంగా, ఎంత శక్తివంతంగా ఉన్నాయి! ఆ స్త్రీ ఆ మాటలు విన్నప్పుడు తనకుండ అక్కడ విడిచి పెట్టి, పట్టణంలోకి వెళ్ళి “మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన క్రీస్తు కాడా? అని తన స్నేహితులతో చెప్పింది. “అ సమయంలో అనేకులు ఆయనయండు విశ్వాసముంచిరి” అని మనం చదవగలం. 29-39 వచనాలు, అప్పటి నుండి గడిచిన సంవత్సరాల్లో ఈ మాటలు చూపించిన ప్రభావం ఎలాంటిదో ఎవరు అంచానవెయ్యగలరు.MHTel 14.1

    సత్యాన్ని స్వీకరించటానికి హృదయాలు ఎక్కడ సంసిద్ధంగా ఉంటాయో అక్కడ ఉపదేశమివ్వటానికి క్రీస్తు సిద్ధంగా ఉంటాడు. హృదయాల్ని చదవగలతండ్రిని ఆయన వారికి బయలుపర్చి ఆయనకు అంగీకారమైన సేవ ఏమిటో దాన్ని ప్రత్యక్షపర్చుతాడు. అలాంటి వారికి ఆయన ఉపమా నాల ద్వారా బోధించాడు. బావి వద్ద స్త్రీతో అన్నట్లు వారి ఆయన “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను” అంటాడు.MHTel 14.2

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents