Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రార్థన విశేషాధికారం

    ప్రార్థనకు ధ్యానానికి ఆధ్యాత్మికంగా తాజాగా సేదతీరటానికి మనం కూడా సమయాలు ఏర్పాటు చేసుకోవాలి. మనం ప్రార్థన శక్తి సామర్థ్యాల విలువను గ్రహించాల్సినంతగా గ్రహించటంలేదు. ప్రార్థన, విశ్వాసంలోకంలో ఏ శక్తీ సాధించలేని వాటిని సాధిస్తాయి. అన్ని విషయాల్లో మనం ఒకేలా ఉండే పరిస్థితి రెండుసార్లు చోటుచోసుకోటం సాధారణంగా సంభవించదు. మనకు పాత అనుభవం ఎక్కువ సహాయం చెయ్యలేని నూతన దృశ్యాలు నూతన శ్రమల ఎదురవుతుంటాయి. దేవుని వద్ద నుంచి నిత్యమూ వచ్చే వెలుగు మనకు అవసరం.MHTel 452.4

    తన స్వరం కోసం కని పెట్టేవారికి క్రీస్తు నిత్యం వర్తమానాలు పంపుతాడు. గెత్సెమనేలో వేదన రాత్రి నిద్రిస్తున్న శిష్యులు యేసు స్వరాన్ని వినలేదు. దూతల సముఖాన్ని అస్పష్టంగా గ్రహించారు గాని ఆ దృశ్యం శక్తిని మహిమను కోల్పోయారు. తమ ముందున్న భయంకర దృశ్యాలగురించి తమను తమ ఆత్మలను బలపర్చగలివుండే నిదర్శనాలను తమ నిద్రమత్తు మైకం వల్ల గుర్తించలేకపోయారు. అలాగే నేడు దేవుని ఉపదేశం ఎక్కువ అవసరమైన మనుషులు దేవునితో ఆత్మీయత లేనందువల్ల దాన్ని పొందలేకపోతున్నారు.MHTel 453.1

    మనం దినదినం ఎదుర్కునే శోధననలు ప్రార్థనా అవసరాన్ని సూచిస్తున్నాయి. ప్రతీ మార్గంలోను ప్రమాదాలున్నాయి. ఇతరుల్ని దుర్మార్గత నుంచి నాశనం నుంచి కాపాడటానికి ప్రయత్నించే వారు ముఖ్యంగా శోధనకు గురి అవుతారు. దుర్మార్గతతో నిత్య సంబంధంలో తామే భ్రష్టులు కాకుండేందుకు వారు దేవుని పై బలంగా ఆధారపడాల్సిన అవసరం ఉంది. మనుషుల్ని ఉన్నత పరిశుద్ధ స్థలం నుంచి కిందకు నడిపే మెట్లు చిన్నవి మోసకరమైనవి. ఒకరి పరిస్థితిని ఎన్నడూ మార్చలేని తీర్మానాలు ఒక్క క్షణంలో చెయ్యటం జరగవచ్చు. జయించటంలో ఒక్క వైఫల్యం ఆత్మకు కాపుదల లేకుండా చేస్తుంది. పట్టుదలతో ప్రతిఘటించకపోతే ఒక్క దురభ్యాసం బలపడి ఉక్కు గొలుసులా మనిషిని శోధన స్థలాల్లో అనేకులు తమంతట తాముగా ఎందుకు ఉంటారంటే వారు ప్రభువును నిత్యం తమ ముందుంచుకోరు. దేవునితో మన సహవాసం తెగిపోటానికి మనం అనుమతించినప్పుడు మన రక్షణ మన నుంచి మాయమౌతుంది. మీ మంచి ఉద్దేశాలు, కోరికలనీన దుష్టిని తట్టుకోటానికి మీకు శక్తి నివ్వవు. మీరు ప్రార్థన పురుషులు స్త్రీలు కావాలి. మీ మానవులు బలహీనంగా, అప్పుడప్పుడు చేసేవిగా కాక చిత్తశుద్ధితో పట్టుదలతో, ఎడతెగక చేసేవి కావాలి. ప్రార్థన చెయ్యటానికి ఎల్లప్పుడూ మోకరించనవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు రక్షకునితో మాట్లాడటం అలవర్చుకోండి. సహాయం కోసం, వెలుగుకోసం, శక్తి కోసం. జ్ఞానం కోసం హృదయాన్ని నిత్యం పై కెత్తండి. ప్రార్థన మీ ఊపిరి కానివ్వండి.MHTel 453.2

    దేవుని సేవకులుగా మనం వారున్న చోటే వారున్న చీటిలో, వారు దిగజారిన దుర్నీతిలో మనుషుల్ని కలవాలి. కాని మన సూరుడు మనలను ఆయన మీద మనసుల్ని నిలుపుతుండగా మనల్ని చుట్టుముట్టిన దుష్టత మన దుస్తుల పై మరకలు చెయ్యదు. నశించటానికి సిద్ధంగా ఉన్న ఆత్మల్ని రక్షించటానికి పనిచేసేటప్పుడు మనం దేవున్ని మనం విశ్వాసం చేసుకుంటే మనం సిగ్గుపర్చబడం. హృదయంలో క్రీస్తు , జీవితంలో క్రీస్తు ఇదే మనకు క్షేమం. ఆయన సముఖ వాతావరణం మన ఆత్మను దుష్టతపట్ల హేయభావంతో నింపుతుంది. మన స్వభావం ఆయన స్వభావానికి ఎంత థిరంగా ఉండవచ్చుంటే తలంపును గును మనం ఆయనతో ఒకటవుతాం.MHTel 454.1

    బలహీనుడు పాపి అయిన యాకోబు విశ్వాసం ద్వారాను ప్రార్ధన ద్వారాను దేవునితో పోరాడేవాడయ్యాడు. ఈ విధంగా మీరు ఉన్నత పరిశుద్ధ ఉద్దేశం గల, ఉత్తమ జీవితం జీవించే పురుషులు, స్త్రీలు, సత్యం నుంచి, యదార్థత నుంచి, న్యాయం నుంచి ఏ ప్రలోభం వల్ల ఏ కారణం చేత తొలగని పురుషులు స్త్రీలు కాగలరు. అత్యవసర జాగ్రత్తలు, భారాలు, విధులు అందరికీ ఉంటాయి. మీ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటే, మీ భారాలు ఎంత బరువుగా ఉంటే యేసు అవసరం మీకు అంత ఎక్కువగా ఉన్నది.MHTel 454.2

    దేవుని బహిరంగ ఆరాధనను ఆశ్రద్ధ చెయ్యటం తీవ్రమైన పొరపాటు. దైవారాధన తరుణాల్ని తేలికగా తీసుకోకూడదు. రోగులకు పరిచర్య చేసేవారు తరుచు ఈ తరుణాల్ని వినియోగించుకోలేరు. కాని వారు ప్రార్ధన మందిరం నుంచి అనవసరంగా నిలిచపోకూడదు.MHTel 454.3

    ఏ ఐహిక వ్యాపారంలో కన్నా వ్యాధిగ్రస్తులకు పరిచర్య చెయ్యటంలో పనిని సమర్పణ స్వభావంతో ఆత్మ త్యాగ స్పూర్తితో చెయ్యటం పై జయం ఆధారపడి ఉంటుంది. బాధ్యతలు వహించేవారు దేవుని ఆత్మ ప్రభావం క్రింద వ్యవహరించాలి. బాధ్యత గల మీ స్థానం ఇతరులకు స్థానం కాన్న గొప్పది గనుక పరిశుద్దాత్మ సహాయం కోసం దేవుని గూర్చిన జ్ఞానం కోసం ఇతరుల కన్నా మీకు ఎక్కువ ఆతురత ఉండాలి.MHTel 454.4

    మన పనిలో దేవునితో సహవాస ఆచరణాత్మక ఫలితాలకన్నా ఎక్కువ అవసరమైనదే లేదు. రక్షకునిలో మనకు సమాధానం విశ్రాంతి ఉన్నవని మన దైనందిన జీవితాల ద్వారా చూపించాలి. స్వరానికి అది ఒప్పింపచేసే శక్తినిస్తుంది. దేవునితో సహవాసం ప్రపర్తనను జీవితాన్ని ఉత్తమం చేస్తుంది. మనం యేసుతో ఉన్నామని మనుషులు తొలినాటి శిష్యులను గుర్తించినట్లు మనల్ని గుర్తిస్తారు. పనివారికి ఏది ఇవ్వలేని శక్తిని ఇది ఇస్తుంది. ఈ శక్తిని పొందకుండా వారు దేనిని అడ్డు రానివ్వకూడదు.MHTel 455.1

    మనం రెండు రకాల జీవితం జీవించాలి. తలంపు, చర్యతో కూడిన జీవితం, నిశ్శబ్ద ప్రార్ధన. చిత్తశుద్ధితో కూడిన సేవ. దేవునితో సహవాసం ద్వారా పొందిన శక్తి, ఆలోచనకు,MHTel 455.2

    జాగ్రత్త తీసుకోవటానికి మనసును తర్బీతు చెయ్యటానికి, హృదయపూర్వక కృషితో కలిసి వ్యక్తిని దైనందిన విధులకు ఆయత్తం చేసి అన్ని పరిస్థితుల్లోను స్వభావాన్ని ప్రశాంతగా ఉంచుతుంది.MHTel 455.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents