Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    భవిష్యత్తుకు ప్రణాళికలు

    అనేక మంది భవిష్యత్తుకు ఖచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకోలేరు. వారి జీవితం అస్థిరమైనది. వారు పరిస్థితుల పర్యవసానాల్ని గ్రహించలేరు. ఇది వారిని తరుచు ఆందోళనలతో ఆశాంతితో నింపుతుంది. ఈ లోకంలో దేవుని పిల్లలు జీవితం యాత్రిక జీవితమని గుర్తుంచుకోవాలి. మన జీవితాలకు ప్రణాళికలు రచించుకోవటానికి మనకు వివేకంలేదు. మన భవిష్యత్తును మనం తీర్చి దిద్దుకోలేం. “అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను “. హెబ్రీ 11:8MHTel 421.3

    “దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యధార్ధముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. ‘కీర్తనలు 84:11MHTel 421.4

    భూమి పై తన జీవితంలో క్రీస్తు తన జీవితానికి ప్రణాళికల్ని తయారు చేసుకోలేదు. తన కోసం దేవుని ప్రణాళికల్ని, అంగీకరించాడు. అనుదినం తండ్రి తన ప్రణాళికల్ని బహిర్గతం చేసాడు. మన జీవితాలు దేవుని చిత్తం నడుపుదల ప్రకారం సాగేటట్లు అలాగే మనం ఆయన పై ఆధారపడాలి. మన మార్గాల్ని ఆయనకు అంకితం చేసుకున్నప్పుడు ఆయన మన పాదాల్ని నడిపిస్తాడు.MHTel 422.1

    ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళిక రచించుకోవటంలో అనేకమంది పూర్తిగా విఫలం చెందుతారు. మీ భవిష్యత్తుకు దేవున్నే ప్రణాళిక తయరు చెయ్యనివ్వండి. చిన్న పిల్లలారా ఆయన నడుపుదలపై విశ్వాసముంచుడి. ఆయన “తన భక్తుల పాదములను తొట్రిల్లకుండ.... కాపాడును”. 1 సమూయేలు 2:9 వీరు ఆది నుంచి అంతం చూడటానికి సమ్మతంగా ఉండి దేవుని తోటి పనివారుగా తాము నెరవేర్చుతున్న ఉద్దేశం తాలూకు మహిమను గ్రహించగలిగితే దేవుని బిడ్డల్ని తాము ఎంచకున్న మార్గంలో తప్ప వేరే మార్గంలో దేవుడు ఎన్నడూ నడిపించడు.MHTel 422.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents