Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును

    ” కప్నె హెూము స్త్రీ విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని ముట్టుకోవటం ద్వారా స్వస్థత పొందిన తరువాత తాను పొందిన దీవెనను అమె గుర్తించాలని యేసు కోరాడు. సువార్త ఇచ్చే వరాలు చాటుమాటుగా సంపాదించ కూడదు లేక రహస్యంగా అనుభవించకూడదు.MHTel 72.1

    “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు” యెషయా 43:12MHTel 72.2

    ఆయన నమ్మదగినవాడని మన ఒప్పుకోలు క్రీస్తును లోకానికి వెల్లడించటానికి దేవుడు ఎంపిక చేసుకున్న సాధనం. పూర్వం పరిశుద్దుల ద్వారా వెల్లడైన ఆయన కృపను మనం గుర్తించాలి. కాని మరింత శక్తిమంతమైనది. మన సొంత అనుభవాన్ని గూర్చిన సాక్ష్యం మనలో ఓ దివ్య శక్తి పనిచెయ్యటానికి కనపర్చుతున్నప్పుడు మనం దేవునికి సాక్షులం. ప్రతీ వ్యక్తి జీవితం ఇతరుల జీవితంకన్నా విలక్షణమైనది. మన స్తుతి మన వ్యక్తిగత లక్షణాలతో ఎగసి తనకు చేరాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కృపా మహిమల స్తుతికి క్రీస్తును పోలిన జీవితం మద్దతు ఉన్నప్పుడు ఈ ప్రసక్త గుర్తింపులు ఆత్మల రక్షణకు ప్రతిఘటించలేని శక్తి కలిగి ఉంటుంది,MHTel 72.3

    దేవుని ప్రతీ వరాన్ని జ్ఞాపకముంచుకోవటం మనకు మేలు. ఎక్కువ కోరి ఎక్కువ పొందటానికి ఈ విధంగా విశ్వాసం బలపడుతుంది. ఇతరుల విశ్వాసం గురించి అనుభవాల గురించిన కథనాలు చదవటంనుంచి కన్నా దేవుని నుంచి మనంతట మనమే పొందే చిన్న దీవెననుంచి మనకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. దేవుని కృపకు స్పందించే ఆత్మ నీటి సదుపాయం ఉన్న తోటలా వర్ధిల్లుతుంది. అతడి ఆరోగ్యం వేగిరంగా చిగురిస్తుంది. అతడి వెలుగు చీకటిలో ఉదయస్తుంది. అతడిపై దేవుని మహిమ ప్రకాశిస్తుంది.MHTel 72.4

    “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్ధన చేసెదను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించడాను ”MHTel 73.1

    నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంతకాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యెహోవా యందు సంతోషిం చెదను”.MHTel 73.2

    “యెహోవాపరాక్రమకార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు?MHTel 73.3

    యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయ మందు సంతోషించెదరుగాక”MHTel 73.4

    “నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిం చునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగానా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవు లతో నానోరు నిన్ను గూర్చిగానము చేయుచున్నది కాగా నా జీవిత కాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించె దను నీ నామము ను బట్టి నాచేతులెత్తెదను నీవు నాకు సహయకుడ వైయుంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను ”MHTel 73.5

    “నేను దేవుని యందు నమ్మిక యుంచియున్నాను నేను భయ పడను నరులు నన్నేమి చేయ గలరు? దేవా, నీవు మరణములో నుండి నాప్రాణమును తప్పించి యున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాద ములను తప్పించి యున్నావు” నేను నీకు యాగామును నర్పించెదను మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతిMHTel 73.6

    “నా దేవా,నేను కూడా నీ సత్యమనుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ద దేవా, సితారతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిననా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయు ను నాకు కీడు చేయు జూచువారు సిగ్గుపడియున్నారు. వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును”.MHTel 74.1

    “బాల్యము నుండి నా ఆయము నీవే... నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును”.“తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండు నట్లు నేను చేయు దును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞ తాతస్తుతలు చెల్లించెదరు”.MHTel 74.2

    కీర్తనలు 116:12-14, 104:33,34, 106:2, 105:1,2,3, 63:3-7, 56:11-13, 71:22-24, 5,6:45:17MHTel 74.3