Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    యధార్ధ జ్ఞానానికి క్రీస్తు పునాది

    ధ్యానాన్ని ఆకర్షించే వెయ్యి అంశాలను పట్టించుకోకూడదు. సమయాన్ని హరించి విచారణకు దారి తీసి చివరికి ఏమి ఫలితమివ్వని అంశాలున్నాయి. అత్యున్నత ఆసక్తులు డిమాండు చేస్తున్న ధ్యానాన్ని శక్తుల్ని తులనాత్మకంగా ఆప్రాముఖ్య అంశాల అధ్యయనానికి వెచ్చించటం జరుగుతున్నది.MHTel 400.2

    కొత్త సిద్ధాంతాలను అంగీకరించటమే ఆత్మకు నూతన జీవాన్ని తీసుకు రాదు. వాస్తవాలు సిద్ధాంతాలు ఎంత ప్రాముఖ్యమైనా ఆచరణలో పెడితే తప్ప వాటికి విలువ ఉండదు. మన ఆత్మలు బలవర్ధక ఆహారమిచ్చి ఆద్యాత్మిక జీవితానికి ప్రేరణనిచ్చే బాధ్యతమనకున్నదని మనం గ్రహించాలి.MHTel 400.3

    ” జ్ఞానమునకు నీ చెవి యెగ్గుము” “వివేచన నభ్యసించుము”..వెండిని వెదకినట్లు దాని వెదకు”ము... దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకని యెడల యెహోవా యందు భయభక్తులు కలిగియుం డుటయెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును... అప్పుడు నీతి న్యాయములను యదార్ధతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ది నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును”దాని అవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకొను వాడందరు ధన్యులు’ సామెతలు 2:2-11 3: 18.MHTel 400.4

    అధ్యానాంశం ఏమి కావాలంటే, “సత్యం ఏమిటి.. మనసులో ఉ Oచుకోవలసిన, ప్రవేమించవలసిన, ఘనపర్చవలసిన, ఆచరణలో పెట్టవలసిన సత్యం”? దేవుని కనుగొనటానికి తమ అన్వేషణలో విజ్ఞానశాస్త్ర భక్తులు పరాజయం పొంది నిరుత్సాహంలో మిగిలిపోగలుగుతున్నారు. ఇప్పుడు వారు అన్వేహించాల్సిందేమిటంటే. “మన ఆత్మలకు రక్షణకు సంపాదించే సత్యం ఏది”? అన్నది.,MHTel 401.1

    “క్రీస్తును గురించి మీరు ఏమి తలుస్తున్నారు”? -- ఇది మిక్కిలి ప్రాముఖ్య మైన ప్రశ్న. ఆయన్ని మీరు మీ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరిస్తారా? తనను ఏ స్వీకరిస్తారా? తనను స్వీకరించే వారందరికి దేవుని కుమారులవ్వటానికి ఆయన శక్తినిస్తాడు.MHTel 401.2

    ఓ ప్రత్యేకమైన పనిని చేసేవిధ:గా క్రీస్తు తన శిష్యులకు దేవున్ని వెల్లడి చేసిన రీతిగా మన హృదయాల్లో పని చెయ్యాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. సిద్ధాంతాల గురించి అతిగా ఆలోచిస్తూ చాలామంది జీవిస్తున్న రక్షకుని ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు. సామాన్యమైన ఆత్మ త్యాగ స్పూర్తితో నిండిన కార్మికుడుగా వారు ఆయన్ని విస్మరించారు. యేసును వీక్షించటమే వారికున్న గొప్ప అవసరం. దినదినం ఆయన సమక్షాన్ని నూతనంగా వీక్షించాల్సిన అవసరం మనకున్నది. ఆత్మ పరిత్యాగంలో ఆత్మ త్యాగంలో ఆయన ఆదర్శాన్ని దగ్గరగా అనుకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.MHTel 401.3

    ఇలా అంటున్న పౌలు అనుభవం మనకు కావాలి. “నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను. ఇకను జీవించు వాడను నేను కాను; క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను”. గలతీ 2:20MHTel 401.4

    ప్రవర్తనలో వ్యక్తమైన దేవున్ని యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం భూలోకంలోను పరలోకంలోను గౌరవం పొందే ప్రతీ దానికన్నా ఘనపర్చబడుతుంది. అది అత్యున్నత విద్య. అది పరలోక పట్టణ ద్వారాలు తెరిచే తాళపు చెవి. క్రీస్తు నామం ధరించినవారందరూ అన్ని కలిగి ఉ ండాలన్నది దేవుని సంకల్పం.MHTel 402.1

    *****