Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆదర్శానికున్న శక్తి

    పొగాకు, మత్తు పానీయాల వాడకం వల్ల శరీరాత్మలను నాశనం చేసుకొని అనేకులు వైద్యుడి సేవలు పొందటానికి వస్తారు. తన బాధ్యతల నిర్వహణలో నిజాయితీ గల వైద్యుడు ఈ రోగులకు తమ వ్యాధి బాధలకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయ్యాలి. కాని అతడే పొగాకు లేక మత్తు పానీయాల్ని వాడుతుంటే అతడి మాటలకు ఏ పాటి విలువ ఉంటుంది? తన సొంత వ్యసనం తన కళ్ళ ముందే ఉన్న అతడు తన రోగి వ్యాధికి కారణాన్ని వివరించటానికి వెనకాడడా? వీటిని తానే ఉపయోగిస్తున్న వైద్యుడు వాటి హానికరమైన ఫలితాలు గురించి యువజనులకు ఎలా నమ్మకం పుట్టించగలడు?MHTel 102.2

    ఓ వైద్యుడు సమాజంలో పవిత్రాత్మక ఆత్మ నిగ్రహానికి ఆదర్శంగా ఎలా ఉండగలడు? తానే దురలవాటును కొనసాగిస్తూ మితానుభవ ఉద్యమంలో ఫలభరితమైన కార్యకర్త ఎలా కాగలడు ? తన శ్వాస పొగాకు లేక సారా వాసనతో నిండి అభ్యంతరకరంగా ఉన్నప్పుడు జబ్బుగా ఉన్న వారు మరణిస్తున్న వారి పడక పక్క ఉండి అంగీకృతమైన సేవ ఎలా చెయ్యగలడు? మత్తు పదర్ధాల విషం వల్ల సామరస్యాన్ని కోల్పోయిన నరాలు మసకబారిన మెదుడుతో ఉన్న వ్యక్తి నిపుణత గల వైద్యుడుగా ప్రజలు అతడిలో ఉంచిని నమ్మకాన్ని ఎలా నిలుపుకోగలడు? అతడు సూక్ష్మ బుద్ధితో గ్రహించటం, కచ్చితత్వంతో కార్యాన్ని నిర్వహించడం ఎంత దుర్లభం! తన శరీరాన్ని పాలించే చట్టాలను అతడు ఆచరించకపోతే మనసు శరీరం ఆరోగ్యం కన్నా స్వార్ధాశల తృప్తిని అతడు ఎంపిక చేసుకుంటే తాను మానవ జీవితాలకు బాధ్యత చేపట్టటానికి అర్హుణ్ణి కానని ఆ రీతిగా అతడు ప్రకటించుకోవటం లేదా?MHTel 102.3

    ఆ వైద్యుడు ఎంత నిపుణుడయినా, ఎంత నమ్మకంగా ఉన్నా, అతడి అనుభవంలో చాలా నిరాశ పరాజయం ఉన్నట్లు కనిపిస్తుంది. తాను సాధించాలని ఆశించిన పనిని సాధించుటంలో తరచు విఫలుడౌతాడు. తన రోగులకు ఆరోగ్యం తిరిగి వచ్చినా అది వారికి గాని లోకానికి గాని ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చకపోవచ్చు. అనేక మందికి ఆరోగ్యం తిరిగి రావచ్చు. కాని ఆ జబ్బుకు కారణమైన వ్యసనాల్ని వారు తిరిగి మొదలు పెట్టటానికే అది దోహదపడవచ్చు. ముందటి ఆత్రుతతోనే వారు మళ్ళీ తమ దురభ్యాసాల్ని మొదలు పెడతారు. వారి విషయంలో వైద్యుడు చేసిన పని బూడిదలో పోసిన పన్నీరులా ఉంటుంది.MHTel 103.1

    క్రీస్తుకీ ఇదే అనుభవం కలిగింది. అయినా బాధపడుతున్న ఒక్క ఆత్మ కోసం తన కృషిని ఆయన మానలేదు. స్వస్థత పొందిన పదిమంది అతడు యూదుడు కాదు సమరయుడు. అతడి కోసమే క్రీస్తు ఆ పదిమందిని స్వస్థపర్చాడు. రక్షకునికి వచ్చిన జయంకన్నా వైద్యుడికి ఎక్కవ జయం రాకపోతే ప్రధాన వైద్యుడైన యేసు నుంచి అతడు ఓ పాఠం నేర్చుకోవాలి. క్రీస్తును గురించి ఇలా ఉంది. “భూలోకమున న్యాయము స్థాపించుటకు అతడు మందగిలడు నలుగుడుపడడు”.“అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును”. యెషయా 42:4, 53:11MHTel 103.2

    ఆయన కృపాసువార్తను ఒక్క ఆత్మ స్వీకరించి ఉంటే ఆ ఆత్మను రక్షించటానికి శ్రమలు పరాభవం, సిగ్గుతోను మరణంతోను కూడిన ఆ జీవితాన్నే క్రీస్తు ఎంచుకునేవాడు. మన కృషి ద్వారా ఒక మనుషుడు ప్రభువు రాజ్యంలో ప్రకాశించటానికి అర్హుడైతే ఆనందించటానికి మనకు హేతువ ఉండదా?MHTel 103.3

    వైద్యుడి విధులు తీవ్ర శ్రమ ప్రయాసలతో కూడినవి. వాటని జయ ప్రదంగా నిర్వర్తించటానికి అతడికి దృఢమైన దేహతత్వం, మంచి ఆరోగ్యం అవసరం. బలహీనుడు లేక వ్యాధి బాధితుడు అయిన వ్యక్తి వైద్య వృత్తికి ఆగత్మకమైన కఠిన శ్రమను తట్టుకోలేడు. ఆత్మ నిగ్రహం లేని వ్యక్తి అన్ని రకాల వ్యాధులను పరిష్కరించటానికి అర్హత గలవాడు కాడు.MHTel 104.1

    తరుచు నిద్రకోల్పోయే, ఆహారాన్ని కూడా నిర్లక్ష్యం చేసే చాలా మేరకు సాంఘిక ఆనందాన్ని మతపరమైన వారితో అతడి పరిచయం మనసును కలవరపర్చి మానవత్వంలో నమ్మకాన్ని నాశనం చేస్తుంది.MHTel 104.2

    వ్యాధితోను మరణంతోను జరిగే సమరంలో ప్రతీ శక్తి సహింపు చివరి దాకా శ్రమపడుతుంది. ఈ తీవ్ర ప్రయాసకు ప్రతిస్పందన ప్రవర్తనను కఠినంగా పరీక్షిస్తుంది. అప్పుడే శోధనకు అత్యున్నత శక్తి లభిస్తుంది. ఏ వృత్తిలో పనిచేసే మనుషులకన్నా వైద్యుడికి ఎక్కువ సంయమనం,. పవిత్ర స్వభావం, దేవున్ని గట్టిగా పట్టుకునే విశ్వాసం అవసరం. ఇతరుల కోసం తన కోసం అతడు భౌతిక చట్టాన్ని ఆలక్ష్యం చేయ్యకూడదు. శరీర సంబంధమైన అలవాట్లు విషయంలో లెక్కలేనితనం నైతికత విషయంలో కూడా లెక్కలేనితనంగా ఉండటానికి నడుపుతుంది.MHTel 104.3

    వైద్యుడికి క్షేమమైన మార్గం ఒక్కటి మాత్రమే ఉన్నది. దేవునిలో మాత్రమే మనం కనుగోగల ధృడ, పటిష్ట సంకల్పంతో బలపడిన నియమ బద్దతతో అన్ని పరిస్థితుల్లోను చర్యలు తీసుకోవటం ఆయన ప్రవరర్తన వంటి శ్రేష్టమైన ప్రవర్తనతో అతడు నిలబడాలి. దినం దినం. గడియ, గడియ క్షణం క్షణం అదృశ్య ప్రపంచం దృష్టిలో నివసిస్తున్నట్లు అతడు జీవించలి. మో షేలా “అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు” నివసించాలి.MHTel 104.4

    నీతి దైవ భక్తిలో వేరు పారి ఉంటుంది. తన జీవం క్రీస్తుతో దేవునిలో దాచబడి ఉంటేనే గాని ఏ మనుషుడూ తోటి మనుషుల ఎదుట పవిత్రమైన, శక్తిమంతమైన జీవితాన్ని కొనసాగించలేడు. మనుషులు నడుమ కార్యకలపాలు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా హృదయం దేవునితో సహవాసం,పంచుకోలు కలగి ఉండాలి.MHTel 104.5

    తన విధులు ఎంత అత్యవసరమైనవి తన బాధ్యతలు ఎంత భారమైనవి అయితే అంత ఎక్కువగా దేవుని శక్తి వైద్యుడికి అవసరమౌ తుంది. నిత్యపారలౌకిక విషయాలపై ధ్యానానికి ఐహకి విషయాల చెర నుండి సమాయాన్ని విడిపించాలి. తనను శక్తికి మూలమైన దేవుని నుంచి వేరు చెయ్యటానికి అక్రమణకు పాల్పడే లోకాన్ని అతడు ప్రతిఘటించాలి. అందరికన్నా ఎక్కువగా ప్రార్ధన ద్వారాను. లేఖన పఠనం ద్వారాను అతడు రక్షణ నిచ్చే దేవుని డాలు కింద ఉండి తనను తాను కాపాడుకోవాలి, ఆత్మలోని దైవ గుణ లక్షణాల్ని వెల్లడి చేసే సత్యం, నీతి, కృప నియామాలతో సంబంధము పంచుకోలు కలిగే ప్రతీ గడియలోను అతడు నివసించాలి.MHTel 105.1

    దైవ వాక్యాన్ని అందుకొని దానికి విధేయంగా జీవించేంత మేరకు దాని శక్తి దాని స్పర్శతో ప్రతీ చర్యను, ప్రవర్తనలో ప్రతీ దశను ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యంపై ఎవరు నమ్మకముంచుతారో వారు బలోపేతులైన మనుషులుగా ఉంటారు. తుచ్చమైన విషయాలకు అతీతంగా లేచి అపవిత్రత లేని వాతావరణంలో ఉంటారు.MHTel 105.2

    మానవుడు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు అన్య రాజుల ఆస్థానాల్లోని దుర్నీతి నడుమ యోసేపుని, దానియేలుని కాపాడిన ఆ ఆచంచల సకల్పం అతడి జీవితాన్ని మచ్చలేని పవిత్ర జీవితంగా తీర్చి దిద్దుతుంది. అతడి జీవితంలో క్రీస్తు వెలుగు ప్రకాశమానంగా వెలుగుతుంది. ప్రకాశమానమైన వేకువ చుక్క ఉదయించి మార్పులేని మహిమతో అతడిపై నిశ్చలంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది..MHTel 105.3

    అలాంటి జీవితం సమాజంలో గొప్ప బలంగా ఉంటుంది. దుర్మార్గతకు అడ్డు బండగా శోధింపబడే వారికి రక్షణగా, కష్టాలు ఆశాబంగాల నడుమ సరియైన మార్గాన్ని అన్వేషిస్తున్న వారికి మార్గం చూ.MHTel 105.4

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents