Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “మీకు అధికారము అనుగ్రహించియున్నాను”

    పన్నెండు మంది అపొస్తలుల్లా క్రీస్తు పంపిన డెబ్బయి మంది శిస్యులు తమ పరిచర్యకు ముద్రగా మానవాతీత శక్తులు పొందారు. తమ పని పూర్తి అయిన తరువాత తిరిగి వచ్చి సంతోషంతో ఇలా అన్నారు. “ప్రభువా, దయ్యములు కూడ నీ నామము వలన మాకు లోబడుచున్నవి”. యేసన్నాడు. “సాతాను మెరుపువలె ఆకాశము నుండి పడుగట చూచితిని”. లూకా 10:17, 18MHTel 66.3

    క్రీస్తు అనుచరలు ఇక నుంచి సాతానును జయించబడ్డ శత్రువుగా పరిగణించాల్సి ఉంది. వారి పక్షంగా క్రీస్తు సిలవు మీద విజయం సాధిం చనున్నాడు. ఆ విజయాన్ని వారు తమ విజయంగా అంగీకరించా ల్సిందిగా ఆయన కోరాడు. “ఇదిగో పాములను తేళ్ళను తొక్కుటకను శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు”. 19వ వచనం.MHTel 66.4

    సర్వశక్తి గల పరిశుద్ధాత్మ విరిగి నలిగిన ప్రతీ ఆత్మకు రక్షణ. పశ్చాత్తాపంతోను విశ్వాసంతోను తన సంరక్షణను అపేక్షించేవారిని శత్రువు ఆధీనంలోకి వెళ్ళటానికి క్రీస్తు సమ్మతించడు. సాతాను శక్తిమంతుడన్న విషయంలో సందేహంలో లేదు. అయితే మనకు శక్తిమంతుడైన రక్షకుడు న్నందుకు దేవునికి కృతజ్ఞతలు., ఆ దుష్టుణ్ని ఆయన పరలోకం నుండి నెట్టివేశాడు. అతడి శక్తిని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు అతడికి సంతోషం కలుగుతుంది. మనం క్రీస్తు గురించి ఎందుకు మాట్లడకూడదు? ఆయన శక్తిని గూర్చి ప్రేమను ఎందుకు ఎక్కువగా మాట్లాడకూడదు?MHTel 66.5

    దేవుని సింహాసనం చుట్టు ఉన్న వాగ్దాన ధనస్సు “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక సత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అంటూ నిత్యం సాక్ష్యమిస్తున్నది. యెహాను 3:16 దుర్మార్గతతో పోరాటంలో తన బిడ్డలను దేవుడు ఎన్నడూ విడనాడడని అది విశ్వాసానికి సాక్ష్యమిస్తున్నది. ఆ సింహాసంన ఎంత కాలము ఉంటే అంతకాలం బలం పరిరక్షణ ఉంటాయంటూ మనకు వస్తున్న హామీ అది.MHTel 67.1

    *****