Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    7. అత్యవసర జ్ఞానం

    35—అత్యవసర జ్ఞానం

    దేవుని గూర్చిన యధార్ధ జ్ఞానం

    మన రక్షకునిలా మనం దేవునికి సేవ చెయ్యటానికి ఈ లోకంలో ఉన్నాం. ప్రవర్తనలో దేవునిలా ఉండటానికి మనం ఇక్కడ ఉన్నాం. సేవా జీవితం ద్వారా ఆయన్ని లోకానికి వెల్లడి చేయ్యాల్సి ఉన్నాం. దేవుని తోటి పనివార్వటానికి, ఆయనలా ఉండి ఆయన ప్రవర్తనను వెల్లడి చెయ్యటానికి మనం ఆయన్ని సరిగా ఎరిగి ఉండాలి. ఆయన తనను తాను ప్రత్యక్షపర్చుకున్నట్లు ఆయన్ని మనం ఎరిగి ఉండాలి.MHTel 352.1

    వాస్తవిక విద్యకు వాస్తవిక సేవకు దేవుని గూర్చిన జ్ఞానం పునాది. శోధననుంచి అదొక్కటే నిజమైన రక్షణ. అది మాత్రమే మనల్ని ప్రవర్తనలో దేవునిలా చేస్తుంది.MHTel 352.2

    సాటి మనుషుల సముద్ధరణ కోసం పనిచేసేవారికి అవసరమైన జ్ఞానం ఇది. ప్రవర్తన మార్పు, పవిత్ర జీవితం, సేవలో సమర్ధత, యాదార్ధ నియమాల ఆచరణ అంతా దేవునిగూర్చిన యధార్ధ జ్ఞానం పై ఆధారపడి ఉంటుంది. ఈ జీవితానికి, రానున్న నిత్య జీవితానికి సిద్ధపడటానికి ఈ జ్ఞానం అత్యవసరం.MHTel 352.3

    యెహోవా యందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము.” సామెతలు 9:10.MHTel 352.4

    ఆయనను గూర్చిన జ్ఞానం ద్వారా “జీవమునకును భక్తి కిని కావలసిన” వన్నీ మనకు అనుగ్రహించబడతాయి. 2 పేతురు 1:3.MHTel 352.5

    “అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము” అన్నాడు యేసు, యోహాను 17:3.MHTel 352.6

    ” యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు -- జ్ఞాని తన జ్ఞానము నుబట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించవాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటకు బట్టియే అతిశయింపవలెను. అట్టివాటిలో నేనానందించువడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”MHTel 352.7

    తననుగూర్చి దేవుడిచ్చిన ప్రత్యక్షతలను మనం అధ్యయనం చెయ్యటం అవసరం.MHTel 353.1

    “ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అంగీకరించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తునివైపు నీవు తిరిగియెడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీవు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆయనకు ప్రార్ధనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గములమీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. నియమముగలవానిని ఆయన రక్షించును.” యోబు 22:21-29.MHTel 353.2

    “ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలగుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుతున్నవిగనుక వారు నిరుత్తరులై యున్నారు.” రోమా 1:20MHTel 353.3

    ఇప్పుడు మనం చూసే ప్రకృతి విషయాలు ఏదెను మహిమ ఛాయ మాత్రమే, పాపం భూమి మీది సౌందర్యాన్ని పాడుచేసింది. అన్నిటి పై పాపం చేసిన చేస్తున్న పని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయినా దాని అందం చాల మట్టుకు మిగిలి ఉన్నది. అనంత శక్తి, మంచితనం, కృప, ప్రేమ గల ఓ మహానుభావుడు భూమిని సృజించి జీవంతోను ఆనందంతోను నింపాడని ప్రకృతి సాక్షం ఇస్తున్నది. చేడిపోయిన స్థితిలో ఉన్నా, మన చూట్టూ ఉ న్నవన్నీ ఓ మహ కళాకారుని చేతిపని అని ప్రకటిస్తున్నాయి. మనం ఏ పక్కకు తిరిగినా దేవుని స్వరం వినగలం. ఆయన మంచితనానికి నిదర్శనాల్ని చూడగలం.MHTel 353.4

    గంభీర ద్వనిగల ఉరుమునుంచి, సముద్ర అవిశ్రాంత ఘోషనుంచి, అడవుల్ని నింపే ఉత్సాహగానం మధుర స్వరం వరకు ప్రకృతి పదివేల గళాలు ఆయన స్తోత్రాన్ని ఆలపిస్తున్నాయి భువిలో, సముద్రంలో, ఆకాశ విశాలంలోని రకరకాల రంగుల్లో లేక వాటి మనోహరమైన కలయకలో ఆయన మహిమను వీక్షించగలం. పడమటి సంధ్యారాగంలో కొండలు ఆయన శక్తిని వర్ణిస్తున్నాయి. లేలేత సూర్య కాంతిలో తమ పచ్చని బువుటాలను ఎగరవేస్తున్న చేట్లు, సున్నితమైన తమ సొగసులు విరజిమ్మే కుసుమాలు తమ సృష్టికర్తను చూపిస్తున్నాయి. ఎర్రటి నేలను పచ్చదనంతో నిగనిగలాడే తివాచీతో కప్పే గడ్డి దేవుడు తన సృష్టిలోని అత్యల్ప జీవినికూడా సంరక్షిస్తాడని చెబుతున్నది. సముద్ర గుహలు, భూగర్భ కుహురాలు ఆయన ధన నిధుల్ని ప్రకటిస్తున్నాయి. మహ సముద్రంలో ముత్యాలుంచిన ఆయన రాళ్లలో రత్నాలుంచిన ఆయన అందాన్ని ప్రేమించేవాడు. ఆకాశంలో ఉ దయించే సూర్యుడు, తాను చేసిన సామస్తానికి ఎవరు జీవమూ వెలుగో ఆ సృష్టి కర్త ప్రతినిధి. భూగోళాన్ని అలంకరించి ఇచ్చి ఆకాశ మండలాల్ని వెలుగుతో నింపే ప్రకాశం అందం దేవున్ని గురించి చెబుతున్నాయి. MHTel 354.1

    “ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి MHTel 354.2

    ఆయన ప్రభావముతో నిండియున్నది”.” పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదివాటికి భాష లేదు మాటలులేవు వాటి సర్వము వినబడదు వాటి కొలనూలు భూమియందందంతట వ్యాపించి యున్నది.” హబక్కూకు 33:3; కీర్త 19:2-4. MHTel 354.3

    ఇవన్నీ తండ్రివంటి దయగల ఆయన సంరక్షణ గురించి తన బిడ్డల్ని సంతోష పెట్టటానికి ఆయన ఆకాంక్షను గురించి చెబుతున్నాయి.MHTel 354.4

    ప్రకృతి ద్వారా పని చేస్తూ సమస్తాన్నీ నిలిపి ఉంచే మహత్తర శక్తి కొంతమంది శాస్త్రవేత్తలు సూచించే విధంగా అంతా వ్యాపించే నియమం, చలనం కలిగించే శక్తి మాత్రమే కాదు. దేవుడు ఆత్మ, అయినా ఆయన వ్యక్తి గల వ్యక్తి, ఆయన తనను తాను అలాగే ప్రత్యక్షపర్చుకున్నాడు.MHTel 355.1

    “యెహోవా యే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు సదాకాలము ఆయనే రాజు.... ఆకాశమును భూమిని సృష్టించని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశము క్రింద నుండకుడను నశించును”MHTel 355.2

    “యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు”“ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను ఆన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశలపరచెను.” యిర్మీ యా 10:10, 11, 16, 12.MHTel 355.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents