Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నిరీక్షణ ద్వారా రక్షించబబడ్డాం

    “మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితిమి”. రోమా 8:24 పడిపోయినవారు తాము మనుషులమని భావించటానికి ఎక్కువ ఆలస్యం కాలేదని భావించాలి, క్రీస్తు తన నమ్మకంతో మానవుణ్ణి గౌరవించాడు. కనుక అతణ్ణి తన గౌరవంతో గౌరవించాడు. అట్టడుగున పడినవారిని సయితం ఆయన గౌరవంగా చూసాడు. వైరం, దుర్మార్గత, అపవిత్రతలతో సంబంధం కలగటం విషయంలో ఆయనకు నిత్యం బాధగా ఉండేది. కాని తన నైతిక భావానికి అఘాతం కలిగినట్లు మాట్లడటం గాని లేక తన సున్నిత అభిరుచులు అభ్యంతర పడినట్లు కనపర్చటం గాని ఆయన చెయ్యలేదు. మనుషుల దురభ్యాసాలు, పక్షపాతాలు, అహంకారపూరిత ఉద్వేగాలు ఎలాంటివైనా, వారందరితో ఆయన కరుణా కటాక్షాలతో వ్యవహరించాడు. ఆయన స్వభావంలో పాలివారమైనప్పుడు మనం అందరిని సహోదరులుగా, మనలాంటి శోధనలు శ్రమలు కలవారిగా తరచుగా పడుతూ లేవటానికి అపసోపాలు పడుతూ, ఆశాభంగాలతోను కష్టాలతోను పెనుగులాడుతూ, సానునభూతి కోసం సహాయం కోసం ఆశిస్తూ ఉన్నవారిగా పరిగణిస్తాం. అప్పుడు వారిని నిరుత్సాహపర్చే విధంగానో లేక నెట్టివేసే విధంగానో కాక వారి హృదయాల్లో నిరీక్షణను మేల్కొల్పేరీతిగా వారిని కలుస్తాం. అలా ప్రోత్సాహం పొంది వారు ధైర్యంగా ఇలాMHTel 131.4

    “గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యెప్పగించవలెను. కాగా మన మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము., ఇదియుగాక సహోదరుని అడ్డమైనను అటంకమైనను కలుగజేయుకుంమని మీరు నిశ్చయుంచులొనుడి రోమా 14: 12,13MHTel 132.1

    చెప్పగలుగుతారు. “నా శత్రువా, నా మీద అతియింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును,” “ఆయన నా పక్షమున వ్యాజ్యెము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతి నేను చూచెదను”. మీకా 7:8,9MHTel 132.2

    “భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు”. కీర్తనలు 33:14, 15MHTel 132.3

    శోధనకు గురై తప్పిదాల్లో ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు ఆయన మనల్ని ఇలా ఆదేశిస్తున్నాడు.“ప్రతివాడును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనవలెను. గలతీ 6:1 మన బలహీనతల గుర్తింపుతో ఇతరుల బలహీనతల విషయంలో దయ కలిగి ఉండాలి.MHTel 132.4

    “నీకు ఆధిక్యము కలుజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది”? “ఒక్కడే మీ బోధకుడు మీరందరు సహోదరులు” ” అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల?” “కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను అటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి”. 1 కొరి 4:7 మత్తయి 23:8, రోమా 14:10, 13.MHTel 132.5

    ఒకరి తప్పుల్ని వేలెత్తి చూపించటం అతడికి అవమానకరం. అవసర గద్దింపుల ద్వారా ఆ అనుభవాన్ని ఎవరు మరింత చేదు చెయ్యకూడదు. నిందించటం ద్వారా ఎవరిని దారిలో పెట్టలేం.అలా చెయ్యటం అనేక మంది తిరస్కారానికి గురియై తమ నమ్మకానికి వ్యతిరేకంగా తమ హృదయాల్ని రాయి చేసుకోవటానికి దారి తీస్తుంది. దయాగుణం, సాధువైన సౌమ్యమైన ప్రవర్తనర దుర్మార్గులను సరిచేసి అనేక పాపాలను నివారించవచ్చు.MHTel 133.1

    అపొస్తలుడు పౌలు తప్పును గద్దించటం అవసరమని తెలుసు కున్నాడు. కాని తప్పులో ఉన్న వారికి తను మిత్రుణ్ణ్న అభిప్రాయం ఇవ్వటానికి ఎంత జాగ్రత్తగా ప్రయత్నించాడు. తమకు నొప్పి కలిగించడం తనకు ఎతో బాధకలిగించిందన్న అవగాహన వారికి కలిగించాడు. తప్పుల్ని సవరించుకోవటానికి ప్రయత్నిస్తున్నవారి పట్ల తన నమ్మకాన్ని సానుభూతిని ప్రదర్శించాడు.MHTel 133.2

    “మీకు దు:ఖము కలగువలెనని కాదు గాని, మీ యెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసినితి” అన్నాడు. “నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దు:ఖ పెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము ముట్టుకే దు:ఖ పెట్టెనని తెలిసికొనియున్నాను. మీరు దు:ఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దు:ఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను... మీరు దేవుని చిత్త ప్రకారము పొందన యీ దు:ఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోషనివారణకైన ప్రతివాద మును, ఎట్టి అగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని,ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించేనో చూడుడి... అందుచేత మేము ఆదరింపబడితిమి.” 2 కొరి 7:8-13.MHTel 133.3

    “మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైయుండుట చూచి మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచు న్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రధానలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్ధన చేయుచు, ఏను మిమ్మును జ్ఞాపకము చేసికొని నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను”. “కావున నేన పేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై యున్న నీ ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులైయుండుడి”. మీర ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్లే”. ఫిలిప్పీ 1:3-6, 4:1, 1 థెస్స 3:8MHTel 134.1

    “క్రీస్తు యేసులో పరిశుద్ధులు”గా పౌలు ఈ సహోదరులకు రాశాడు గాని ప్రవర్తనలో పరిపూర్ణులైన వారికి అతడు రాయటం లేదు. శోధనను ప్రతిఘటిస్తున్న, శోధనలో పడే అవకాశమున్న పురుషులు, స్త్రీలుగా వారికి పౌలు రాశాడు. “గొర్రెల గొప్ప కాపరి, మన ప్రభువు అయిన యేసును మృతుల్లోనుండి మళ్లి తీసుకువచ్చిన సమధాన కర్త అయిన దేవున్ని” అతడు వారికి చూపించాడు.“నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ” ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును” అని వారికి హామీ ఇచ్చాడు. హెబ్రీ 13:20,21MHTel 134.2

    తప్పులో ఉన్న వ్యక్తి తన తప్పును గూర్చిన స్పృహ కలిగి ఉన్నప్పుడు అతడి ఆత్మ గౌరవాన్ని నాశనం చెయ్యకుండా జాగ్రత్తపడండి. నిర్లక్ష్యం ద్వారా లేక ఆవిశ్వాసం ద్వారా అతణ్ణి నిరుత్సాహపర్చకండి. అతడిపై పూర్తి నమ్మకం ఉంచకముందు అతడు ఎలా ప్రవర్తిస్తాడో వేచి చూద్దాం”. అనుకోవద్దు. ఈ అపనమ్మకమే శోధించబడుతున్న అతడు తొట్రిల్లి పడటా నికి కారణమౌంతుంది.MHTel 134.3

    ఇతరుల బలహీనతను గ్రహించటానికి మనం ప్రయత్నించాలి. చీకటి బంధకాల్లో ఉండి మనోబలం నైతిక శక్తి కొరవడ్డ వారి హృదయ భారాలు మనకు తెలియవు. పశ్చత్తాపంతో కుమిలిపోతున్న వ్యక్తి పరిస్థితి మిక్కిలి దయనీయం. స్మృతి తప్పి తూలుతూ మట్టిలోకి కూలిపోతున్న వ్యక్తిలాంటి పరిస్థితి అతడిది., అతడు దేన్నీ స్పష్టంగా చూడలేడు. మనసు మసకబారు తుంది. ఎక్కడ అడుగు వెయ్యాలో ఎరగడు. తమను అపార్ధం చేసుకోవటం, అభినందించకపోవటం అనేకమందికి జరుగుతుంటుంది. వారిది దు:ఖ మంతో వేదనతో నిండిన జీవితం. తప్పిపోయి సంచరిస్తున్న గొర్రె లాంటిది వారి స్థితి. అతడు దేవున్ని కనుగోలేడు. అయినా క్షమాపణ కోసం సమాధానం కోసం తీవ్ర వాంఛ కలిగి ఉంటాడు. అతడి చెయ్యి పట్టుకోండి. పైకి లేవదియ్యండి. ధైర్యాన్ని నిరీక్షణకు నింపే మాటలు మాట్లడండి. రక్షకుని చెయ్యి పట్టుకోవటానికి అతడికి సహాయం చెయ్యండి.MHTel 134.4

    మన ప్రయత్నాలకు స్పందించి ఆత్మల విషయంలో సులభంగా నిరుత్సాహపడతాం. ఒక్క ఆశాకిరణం ఉన్నంత సేపు ఒక్క ఆత్మ కోసం పని చెయ్యటం మనం ఎన్నడూ మానకూడదు. ఏ ప్రశస్త ఆత్మల కోసం శోధకుడి శక్తికి విడిచి పెట్టకూడదు.MHTel 135.1

    శోధించబడుతున్న వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకోవటం అవసరం. వంశపారంపర్య శక్తిని, దుష్ట సాంగత్యాలు పరిసరాల ప్రభావాన్ని దురభ్యాసాల శక్తిని పరిగణించండి. అలాంటి ప్రభావాలకు లోనై అనేకులు భ్రష్టులవ్వటంలో ఆశ్చర్యమేమైనా ఉందా? తమ ఉద్దరణ కృషికి స్పందిచటంలో వారు మందకోడిగా ఉన్నందుకు మనం ఆశ్చర్య పడగలమా?MHTel 135.2

    మొరటుగా, ఏమంత ఉపయోగపడని వారిగా కనిపించే వారు సువార్తను అంగీకరించినప్పుడు చలా నమ్మకమైన విశ్వాసులుగా, సువార్త ప్రబోధకులుగా ఉంటారు. వారు పూర్తిగా చెడ్డవారు కారు. సమ్మతం కాని వారి వెలపలి ఆకారం కింద స్పందించగల మంచి ఉద్వేగాలున్నాయి. సహాయం లేకుండా అనేకులు తమంతట తాము బాగుపడరు. కాని ఓర్పు పట్టుదలతో కూడిన కృషి ద్వారా వారిని సంస్కరించవచ్చు. అలాంటి వారికి దయగల మాటలు, దయతో కూడిన పరిగణిత, గణనీయమైన సహాయం అసవరం. ఆత్మలో మిణుకు మిణకు మంటున్న ధైర్యాన్ని ఏ సలహా ఏ హితవు అర్పివెయ్యదో అది వారికి అవసరం. వారిని కలవటానికి వచ్చే సువార్త పనివారు దీన్ని పరిగణలోనికి తీసుకోవాలి. కొందరు తమ మనసు దీర్ఘకాలంలగా భ్రష్టమైనందు వల్ల అనుకూల పరిస్థితుల్లో తాము ఏమి కాగలిగివుండేవారో అది ఈ జీవితంలో సాధించటం ఎన్నడూ సాధ్యం కాదు. అయితే నీతి సూర్యుని కాంతివంతమైన కిరణం ఆత్మలో ప్రకాశించ వచ్చు. తమ జీవితం దేవుని జీవితంలా ఉండేటట్లు దిద్దుకోవటానికి వారి కవకాశం ఉన్నది. వారి మనసుల్లో ఉన్నతమైన, ఉదాత్తమైన ఆలోచనలు ప్రవేశపెట్టండి. చెడుకు పవిత్రతకు, వెలుగుకు చీకటికి మధ్య తేడాను మీ జీవితం వారికి చూపించనివ్వండి. క్రైస్తవుడంటే ఏమిటో మీ ఆదర్శాన్ని చదివి వారిని నేర్చుకోనివ్వండి. క్రీస్తు ఘోర పాపులను పైకిలేపి వారిని దేవుని పిల్లలుగాను అమర్త్య వారసత్వానికి తనతో తోటి వారసులుగా గుర్తింపు పొందేటట్లు చెయ్యటానికి సమర్ధుడు.MHTel 135.3

    దైవ కృప ఆనే అద్భుత కార్యం ద్వారా ప్రయోజనకరమైన జీవితాలు జీవించటానికి అనేకుల్ని తీర్చిదిద్దవచ్చు. తృణీకరించబడి విడిచి పెట్టబడ్డ వారు నిరాశ చెందుతున్నారు. వారు సుఖదు:ఖాల పట్ల నిరాసక్తంగా, నిర్జీవంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కాని పరిశుద్దాత్మ పరిచర్య ద్వారా వారి ఉద్దరణను బుద్దిహీనంగా కనిపించేటట్లు చేసేది మాయమౌతుంది. మసకబారి నిస్తేజంగా ఉన్న మనసు మేల్కొంటుంది. పాప దాసుడు స్వతంత్రుడౌతాడు. దుష్టత పోతుంది. అజ్ఞానం పై జయం కలుగుతుంది. ప్రేమ మూలంగా పనిచేసే విశ్వాసం ద్వారా హృదయం పవిత్రమౌతుంది. మనసు విజ్ఞానమంతమౌతుంది.MHTel 136.1

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents