Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    1. యధార్ధ వైద్య మిషనరీ

    1—మన ఆదర్శం

    మన ప్రభువు యేసుక్రీస్తు మానవ అవసరాన్ని తీర్చటానికి అలు పెరగని సేవకుడుగా మన లోకానికి వచ్చాడు. మానవుల ప్రతీ అవసరంలో పరిచర్య చేసేందుకు ఆయన “మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను” మత్తయి 8:17 వ్యాధి భారాన్ని దయనీతయతను, పాపాన్ని తొలగించటానికి ఆయన వచ్చాడు.మానవులకు సంపూర్ణ పునద్దరణను తేవటం ఆయన లక్ష్యం. వారికి ఆరోగ్యాన్ని సమాధానాన్ని ప్రవర్తనసంపూర్ణతను ఇవ్వటానికి ఆయన వచ్చాడు.MHTel 6.1

    ఆయన సహాయాన్ని ఆర్ధించిన వారి పరిస్థితులు అవసరాలు పలురకాలు. ఆయన వద్దకు వచ్చిన వారిలో ఎవరూ సహాయం పొందకుండా వెళ్ళిపోలేదు. ఆయన మంచి స్వస్థత శక్తి ప్రవాహంలో ప్రవహించింది. మనుషుల శరీరం, మనసు ఆత్మ స్వస్థత పొందాయి.MHTel 6.2

    రక్షకుని సేవ ఓ సమయానికి లేక స్థలానికి పరిమితం కాలేదు. ఆయన దయకు కూడా పరిమితి లేదు. ఆయన స్వస్థత బోధ ఎంత విశాల ప్రాతిపదికన సాగిందంటే ఆయన మాటల్ని వినటానికి వచ్చిన జనసమూహాలకు సరిపోయిన భనవం పాలస్తీనాలో ఎక్కడా లేదు. గలిలియ పచ్చటి కొండల మీద ప్రయాణ బహిరంగ మార్గాల్లో సముద్రం పక్క సునగోగుల్లో ఆయన వద్దకు రోగుల్ని తీసుకురాగల ఇతర స్థలాల్లో ఆయన ఆసుపత్రిని కనుగొవచ్చు. ఆయన నడిచి వెళ్ళిన ప్రతీ నగరం పట్టణం గ్రామంలో వ్యాధిగ్రస్తుల్ని ముట్టి స్వస్థపర్చాడు. తన వర్తమానాన్ని స్వీకరించ టానికి మనుషులు ఎక్కడ సిద్ధంగా ఉంటారో వారికి తమ పరమ తండ్రి ప్రేమను గూర్చిన బరోసా అందిచేంవాడు. తన దగ్గరకు వచ్చే వారికి దిన మంతా పరిచర్య చేసేశాడు.తమ కుటుంబాల పోషణ కోసం రోజంతా అతి స్వల్పమైనకూలికి పనికి చేసేవారి పైకి సాయంత్రం తన గమనాన్ని తిప్పేవాడు.MHTel 6.3

    మానవుల రక్షణ కోసం యేసు బరువైన బాధ్యతను మోశాడు. మానవజాతి నియమాలు ఉద్దేశాల విషయంలో ఖచ్చితమైన మార్పు సంభవిస్తే తప్ప సర్వ నాశనమౌతుందని ఆయనకు తెలుసు. ఇది ఆయన హృదయ భారం. తనపై ఉన్న బరువును గుర్తించిన వారు ఎవరూ లేరు. బాల్యంలో, యౌవనంలో పెద్దవాడైన దినాల్లో ఆయన ఒంటరిగా నడిచాడు. అయినా ఆయన సముఖంలో ఉండటం పరలోకంలో ఉన్నట్లు అనిపించింది. రోజు రోజు ఆయన శ్రమలు శోధనల్ని ఎదుర్కొన్నాడు. తన దినవారి జీవితంలో ఆయనకు దుర్మార్గత దుష్టత ఎదురయ్యింది. ఆయన ఎవరిని దీవించి రక్షించాలని ఆశిస్తున్నాడో ఆ మనుషుల పై ఆ దుర్మార్గత దుష్టత శక్తి ఎంత ప్రబలంగా ఉన్నదో ఆయన కళ్ళారా చూసాడు. ఆయినా ఆయన విఫలుడవ్వలేదు, నిరుత్సాహాపడలేదు.MHTel 6.4

    అన్ని విషయాల్లో తమ మిషను సాధనలో తన సొంత కోరికల్ని అడ్డురానివ్వలేదు. తన జీవితంలోని ప్రతి విషయాన్ని తన తండ్రి చిత్రానికి లోపర్చటం ద్వారా ఆయన తన జీవితాన్ని మహిమపర్చాడు. కౌమర్య దశలో ఉన్నప్పుడు తనతల్లి ఆయన్ని రబ్బీల బడిలో ఉన్నట్లు కనుగొని “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితి?”. అన్నప్పుడు -- ఆయన జవాబు ఆయన జీవత సేవ ప్రధాన లక్ష్యం-- “మీరేల నన్ను వెదుకు చుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా?” అని బదులు పలికాడు లూకా 2:48,49MHTel 7.1

    ఆయనది నిత్యం ఆత్మ త్యాగంతో సాగిన జీవితం. తనదంటూ ఆయనకో గృహంలేదు.. బాటసారిగా దయతో మిత్రులు ఆయనకు ఏర్పాటు చేసిన వసతి తప్ప. మన తరుపున పేదగా జీవించటానికి లేములు బాధలు అనుభవిస్తున్నవారి మధ్య నడవటానికి పనిచెయ్యటానికి ఆయనవచ్చాడు. తాను ఏ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడ్డాడో ఆ ప్రజల మధ్య గుర్తింపు మన్నన లేని వ్యక్తిగా ఆయన వస్తూ వెళ్తు ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడు సహనాన్ని ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. బాధితులు పీడితులు ఆయన్ని జీవానికి శాంతికి దూతగా పరిగణించారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, యువతీ, యువకుల అవసరాన్ని ఆయన గుర్తించాడు. అందరికి “నా వద్దకు రండి” అన్న ఆహ్వానాన్ని అందించాడు.MHTel 7.2

    యేసు తన పరిచర్యలో బోధించటంలో కన్నా రోగులను బాగు చెయ్యటంలో ఎక్కువ సమయంలో గడిపాడు. తాను నాశనం చేయటానికి కాదు రక్షించటానికి వచ్చానని ఆయన అన్న మాటల సత్యానికి ఆయన అద్భుత కార్యాలే నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కరుణా కటాక్షాల వార్త తనకన్నా ముందే చేరేది. ఆయన ఎక్కడకు వెళ్లే అక్కడ ఆయన దయను పొందిన ప్రజలు ఆరోగ్యం కలిగి తమకు లభించిన నూతన శక్తుల్ని వినియోగిస్తూ వృద్ధి చెందుతూ ఆనందించారు. ప్రభువు చేసిన కార్యాలన్ని గురించి వినటానికి వారి చుట్టు గుంపులు గుంపులుగా మూగేవారు. అనేకులు మొట్టమొదటిగా విన్న స్వరం ఆయనదే. మొట్ట మొదటగా ఉచ్చరించిన నామం ఆయనదే. మొట్టమొదటా చూసిన ముఖం ఆయనదే. వారు యేసును ఎందుకు మొట్టమొదటా చూసిన ముఖం ఆయనదే. వారు యేసును ఎందుకు ప్రేమించి స్తుతించికూడదు, నగరాలు పట్టణాల నుంచి వెళ్తుండగా ఆయన జీవాన్ని ఆనందాన్ని విస్తరింపజేస్తున్న విద్యుత్తలా ఉన్నాడు. MHTel 8.1

    “జెబులూను దేశమును, నప్తాలి దేశమును, యోయోనకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయును చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశ ములోను మరణ చ్చాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. మత్తయి 4:15, 16 MHTel 8.2

    స్వస్థత కూర్చిన ప్రతి సందర్భాన్ని మనుషుల మనసులోను ఆత్మలోను దైవ సూత్రాలను పాదుకొల్పటానికి ఓ తరుణంగా రక్షకుడు వినియోగించు కున్నాడు. ఇదే ఆయన సేవ పరమార్ధం. మనుషులు తనకృపా సువార్త మానాన్ని స్వీకరించటానికి ఆసక్తి చూ పేందుకు వారికి ఆయన లోక సంబంధమైన దీవెనలిచ్చాడు.MHTel 8.3

    క్రీస్తు యూదు జాతి బోధకుల్లో అత్యున్నత స్థానాన్ని అక్రమించేవాడే కాని పేదలకు సువార్త అందించటానికి ఆయన ఎంచుకున్నాడు. రాజమార్గములోను కంచెల్లోను ఉన్నవారు సత్యంతో నిండిన మాటలు వినేందుకు ఒక స్థలం నుండి మరొక స్థలానికి ఆయన వెళ్ళాడు. సముద్రం పక్క, కొండ పక్క, నగర వీధుల్లో, సునగోగుల్లో లేఖనాల్ని విశదీకరిస్తూ ఆయన స్వరం వినిపించేది. అన్యులకు తన స్వరం వినిపించేందుకు తరుచు దేవాలయం ఆవరణలో బోధించేవాడు.MHTel 8.4

    గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుగొనియున్నాను. నిన్న కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను ఆన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను.... వారెరుగని మార్గమును గ్రుడ్డివారిని తీసుకొని చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదను”. యెషయా 42:6-20MHTel 9.1

    శాస్త్రులు పరిసయ్యులు లేఖనాలికిచ్చే విశదీకరణకు భిన్నంగా క్రీస్తు బోద ఉండటంతో అది ప్రజల దృష్టిని ఆకర్షించింది. రబ్బీలు సాంప్ర దాయాల్ని మానవ సిద్ధాంతాల్ని, ఊహాగానాల్ని బోధించారు. లేఖనాల్ని గురించి మనుషులు ఏమి తలంచారో ఏమి రాశారో దాన్ని తరుచు లేఖనాల స్థానంలో ఉంచడం జరగుతుండేది. క్రీస్తు బోధనాంశం అయితే దేవుని వాక్యం , ప్రశ్నించిన వారికి “అని రాయబడియున్నది”. “లేఖనాలు ఏమి చెప్పుతున్నాయి? మీరు ఎలా చదువుతున్నారు అని సమాధానం ఇచ్చాడు. మిత్రుల నుంచి గాని శత్రువుల నుంచి గాని ఆసక్తి కనిపించిన ప్రతీ తరుణంలో ఆయన వాక్యాన్ని అందించాడు. సువార్తను స్పష్టతతోను శక్తిమంతంగాను సమర్పించాడు. ఆయన మాటలు పితరులు ప్రవక్తల బోధనల పై విస్తారమైన వెలుగు వెదజల్లటంతో ప్రజలకు లేఖనాలు నూతన ప్రత్యక్షతలా వచ్చాయి. ఆయన శ్రోతలు దైవ వాక్యంలో అంత లోతైన భావాన్ని మున్నెన్నడూ కనుగోలేదు.MHTel 9.2

    క్రీస్తు వంటి సువార్త బోధకుడు నభూతో సభవిష్యతి. ఆయన పరలోక సార్వభౌముడు. అయినా మనుషులను తామున్న స్థలంలో కలిసేందుకు తనను తాను తగ్గించుకొని మన స్వభావాన్ని ధరించాడు. ప్రజలందరికి, ధనికులు, దరిద్రులు, స్వతంత్రులు, బానిసలు, నిబందన దూత అయిన క్రీస్తు రక్షణ వర్తమానాన్ని తెచ్చాడు. గొప్ప సహాయకారిగా ఆయన ఖ్యాతి పాలస్తీనాదేశమంతటా వ్యాపించింది.ఆయన ఏ స్థలాల గుండా వెళ్తున్నాడో ఆయన సహాయం అర్ధించాలని వ్యాధిగ్రస్తులు ఆ స్థలాలకు వెళ్ళేవారు. ఆయన మాటలు వినటానికి ఆయన చేతి స్పర్శను పొందాలని కూడా అనేకులు అక్కడికి వెళ్ళేవారు. కాబట్టి సామాన్య మానవడు రూపంలో ఉ న్న ఆ మహిమగల రాజు ఓ నగరాన్నుంచి మరో నగరానికి, ఓ పట్టణం నుండి ఇంకో పట్టణానికి వెళ్ళి బోధించడం రోగుల్ని స్వస్థపర్చడం చేసాడు.MHTel 9.3

    ఏటేటా జరిగే ఆ జాతి పండుగలకు హాజరై, బాహ్య ఆచారాల్లో తలమునకలయ్యే జన సమూహాలతో పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడి నిత్యత్వాన్ని వారి దృష్టిలో నిలిపేవాడు. ఆయన అందరికి జ్ఞాన ధనాగారం నుండి నిధులు పంచేవాడు. అందరికి అర్ధమయ్యే రీతిగా వారితో సులభ భాషతో మాట్లాడేవాడు. దు:ఖంలోను బాధల్లోను ఉన్న వారికి తన విలక్షణమైన పద్ధతుల్లో సహాయం అందించేవాడు. సున్నితమైన మర్యాదతతో కూడిన దయతో, పాప రోగంతో బాధపడుతున్న ఆత్మలకు సేవ చేసి స్వస్థతను బలాన్ని చేకూర్చేవాడు,..MHTel 10.1

    బోధకుల్లో రారాజైన ఆయన ప్రజలకు బాగా పరిచయమైన సాంగత్యాల ద్వారా వారిని కలవటానికి ప్రయత్నించేవాడు. ఆయన సత్యాన్ని ఎలా సమర్పించేవాడంటే, ఆ తరువాత అది ఎప్పటికి తన శ్రోతల పవిత్ర జ్ఞాపకాలు సానుభూతితో అంర్లీనమైపోయేది. ఆయన ఎలా బోధించాడంటే వారి ఆసక్తులు అనందం తనవిగి భావించుకొని బోధించినట్లు వారు భావించేవారు. ఆయన ఉపదేశం సూటిగా, ఆయన సాదృశ్యాలు ఉచి త్తంగా, ఆయన మాటలు దయగా ఆనందదాయకంగా ఉన్నందువల్ల ఆయన శ్రోతలు మంత్రముగ్ధులయ్యేవారు. లేమిలో ఉన్న వారితో ఆయన మాటలాడిన మాటల సామాన్యత యదార్ధత ఆయన ప్రతీ మాటను పవిత్రం చేసాయి.MHTel 10.2

    ఆయన జీవితం తీరికలేని పనిలో గడిచిన జీవితం. లేములు దు:ఖాలు ఉన్న దీనుల ఇల్వల్లోకి ప్రవేశించి పీడిత ప్రజలకు నిరీక్షణను నిరాశ చెందిన వారికి సమధానాన్ని అందించే మాటలు ఆయన మాట్లాడటం రోజు జరుగుతుండేది. దయ, జాలి, హృదయం,కనికరం గల ఆయన, కృంగి కృషిస్తున్న వారిని పైకెత్తేవాడు. దు:ఖాల్లో మునిగిన వారిని ఓదార్చాడు. ఎక్కడకు వెళ్తే అక్కడ ప్రజల్ని దీవించాడు.MHTel 10.3

    బీదలకు పరిచర్య చేస్తుండగా యేసు ధనవంతులని చేరటానికి మార్గాల్ని వెదుకుతుండేవాడు. ధనవంతుల సంస్కారవంతులు యూదుల్లో ఉన్నత కుటుంబీకులు అయిన పరిసయ్యులు రోమా అధికారుల పరిచ యాన్ని అన్వేషించాడు. వారి ఆహ్వానాన్ని అంగీకరించి వారి విందులకు హాజరయ్యాడు. వారి ఆసక్తులు వృత్తులను గురించి మరెక్కువ తెలుసుకున్నాడు.MHTel 11.1

    “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగల వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దు:ఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దు:ఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దు:ఖమునకు ప్రతిగా ఆనందతైలమును భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్నుమహిమపర్చుకొనునట్లు నీతి అను మసక్తి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును”. యెషయా 61:1-3.MHTel 11.2

    పై నుండి శక్తి పొందుటం ద్వారా మానవుడు పవిత్ర జీవితం జీవింవచ్చునని చూపించటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలుపెరగని సహనం, సానుభూతితో కూడిన సహాయ కారిత్వంతో అవసరాల్లో ఉన్న మనుషుల్ని ఆయన కలిసాడు. సున్నితమైన కృపా స్పర్శ ద్వారా ఆత్మలో నుండి ఆశాంతిని సందేహాన్ని తొలగించి వైరాన్ని ప్రేమగాను అపనమ్మకాన్ని విశ్వాసంగాను మార్చాడు.MHTel 11.3

    తాను ఎవరిని ఎంచుకుంటే వారిని “నన్ను వెంబడిచు” అంటే ఆయన ఉద్దేశించిన వ్యక్తి లేచి ఆయన్ని వెంబడిచాడు. అతడిపై లోకానికున్న వశీకరణ శక్తి భగ్నమైంది. ఆయన స్వరం వినిపించగానే హృదయంలో నుంచి దురాశ మాయమయ్యింది. విముక్తి పొందిన మనుషులు రక్షకుణ్ని వెంబడించడానికి లేచి వచ్చారు.MHTel 11.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents