Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    30—గృహ ఎంపిక సిద్ధబాటు

    సువార్త జీవిత సమస్యలను సులభతరం చేస్తుంది. దాని ఉపదేశాన్ని ఆచరణలో పెడితే అనేక అందోళనలు స్పష్టమౌతాయి. అనేక తప్పిదాలు నివారణ అవుతాయి. విషయాల వాస్తవిక విలువను బట్టి అంచాన వెయ్యటం అది మనకు బోధించి మిక్కిలి విలువైన వాటిని స్థిరమైన వాటిని సాధించటానికి ఎక్కువ కృషి చెయ్యాలని మనకు ఉపదేశిస్తుంది. గృహాన్ని ఎంపిక చేసే బాధ్యత ఎవరి మీద ఉన్నదో వారికి ఈ పాఠం అవసరం. అత్యుతన్నతమైన గురి నుండి తమను ఏది మళ్ళించటానికి వారు అనుమతించకూడదు. లోకంలోని గృహం పరలోకలం లోని గృహానికి ఓ చిహ్నము. దానికి అది సిద్ధబాటు అని గుర్తుంచుకోవాలి. జీవితం ఓ శిక్షణ పాఠశాల, తల్లితండ్రులు పిల్లలు దేవుని నివాసాల్లోని ఉన్నత పాఠశాలకు వెల్లటానికి దాని నుంచి ఉత్తీర్ణం కావలసియున్నారు. గృహానికి స్థలం చూసుకునేటప్పుడు ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని స్థలం ఎంపిక చెయ్యాలి. ధనం పట్ల కోరిక, ఫ్యాషన్ ఆదేశాలు లేక సమాజ ఆచారాలు మీ ఎంపికను శాసించకూడదు. సామాన్యతకు, పవిత్రతకు ఆరోగ్యానికి నిజమైన విలువకు దోహదపడేదాన్ని పరిగణించండి.MHTel 312.1

    లోకమంతటా నగరాలు దుర్మాగర్గతకు నిలయాలవుతున్నాయి. ప్రతీచోట దుష్టత దృశ్యాలు దర్శనిమిస్తాయి. ప్రతీ చోట శరీర్చేలు దుర్వ్యయాలను ప్రోత్సహించే వినోదాలున్నాయి. అవినీతి నేరం నిత్యం పెరగుతున్నాయి. ప్రతీరోజు దౌర్జన్యాలు, దోపిడీలు హత్యలు ఆత్మహత్యలు, నేరాల రికార్డులు పెరుగుతున్నాయి,MHTel 312.2

    నగరాల్లోని జీవితం అవాస్తవికంగా కృత్రిమంగా తయారవుతున్నది. డబ్బు సంపాదనకు తీవ్రమైన వాంఛ, అమితోద్రేకం వినోదాన్వేషణ ప్రదర్శన పట్ల తృష్ణ, విలాసంపై వ్యా మోహం, దుబారా ఇవన్నీ జీవిత వాస్తవ ఉద్దేశం నుంచి సామాన్య ప్రజానికం మనసుల్ని తిప్పే శక్తులు. అవి దుష్టత్వానికి వెయ్యి తలుపును తెరుస్తున్నాయి. యువత పై వాటి శక్తి ప్రతిఘటించలేనిది.MHTel 312.3

    నగరాల్లోని పిల్లలు యువత పై దాడిచేసే మిక్కిలి కుటిలమైన ప్రమాధకరమైన శోధనాల్లో ఒకటి వినోదప్రీతి. సెలవులు చాలా ఎక్కువ. ఆటలు గుర్రపు పందేలు వేల ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి, ఉద్రేకం వినోదం వారిని అవసర జీవిత విధుల నుంచి మళ్ళిస్తున్నాయి. మెరుగైన ప్రయోజనకరమైన కార్యాలకు వినియోగించాల్సిన ద్రవ్యం వినోదాల పై వ్యర్ధం చెయ్యటం జరగుతుంది.MHTel 313.1

    ట్రస్టుల పని ద్వారా శ్రామిక సంఘాల చర్యలు సమ్మెల ద్వారా నాగరాల్లోని జీవన పరిస్థితులు నిత్యం కష్టతరమౌతున్నాయి. మన ముందు తీవ్ర శ్రమలున్నాయి. అనేక కుటుంబాలకు నగరాలను విడిచి పెట్టటం తప్పనిసరి అవుతున్నది.MHTel 313.2

    నగరాల్లోని భౌతిక పరిసరాలు ఆరోగ్యానికి ప్రమాదకరం, వ్యాదితో సంబంధము ఏర్పడే అవకాశం నిత్యం ఉండటం, కలుషిత వాయువు ఉనికి, కిక్కిరిసిన, చీకటి మయమైన, అనారోగ్యకర నివాసాలు అక్కడ గూడుకట్టకున్న కీడుల్లో కొన్ని.MHTel 313.3

    ప్రజలు నగరాల్లోని పై అంతస్తులు అద్దె గదుల్లో కిక్కిరిసి నివసించాలని దేవుడు ఉద్దేశించలేదు. ఆయన ఆదిలో మన మొదటి తల్లితండ్రులను నేడు మనం నివసించాలని ఆయన కోరుతున్న సుందర దృశ్యాలు శబ్దాల నడుమ ఉంచాడు. మనం దేవుని ఆదిమ ప్రాణాళికకు అనుగుణంగా ఎంత దగ్గరగా రాగలిగితే అంత అనుకూలమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం లభిస్తుంది,.MHTel 313.4

    ఖరీదైన ఇల్లు, విస్తారమైన సామాగ్రి,ఆడంబరం, సుఖ భోగాలు ఆనంద మయమైన ప్రయోజకరమైన జీవితానికి అవసరమైన పరిస్థితులను సృష్టించలేవు, మానవుల మధ్య ఎన్నడూ జరిగి ఉండని ఓ పనిని సాధించటానికి యేసు లోకంలోకి వచ్చాడు. జీవిత ఉత్తమ పలితాలు ఎలా సాధించాలో చూపించటానికి ఆయన వచ్చాడు. నిత్యుడైన తండ్రి తన కుమారునికి ఎంపిక చేసిన పరిస్థితులు ఏమిటి ? గలిలయ కొండల ప్రాంతంలో ఓ ఒంటరి గృహం, నమ్మకమైన, ఆత్మాభిమానం గల కాయకష్టంతో బతికే ఓ కటుంబం కష్టం, శ్రమ, ఆత్మ, త్యాగం, పొదుపు ఓర్పుతో దినం పోరాడుతూ సంతోషంగా నిర్వర్తించే విధులు, తల్లి పక్కన కూర్చుని గ్రంథపు చుట్టలు పఠించే సమయం, పచ్చదనంతో నిండిన లోయలోని ప్రశాంతమైన ఉదయం లేక సాయంత్రం పరిశుద్ధమైన ప్రకృతి పరిచరర్య సృష్టి అధ్యయనం కృపలు దేవునితో ఆత్మ సహవాసం ఇవి యేసు జీవితం ఆరంభం సంతవ్సరాల్లోని పరిస్థితులు, అవకాశాలుMHTel 313.5

    అన్ని యుగాల్లోని ఉత్తములు ఘనులు అయిన వ్యక్తుల్లో అధిక సంఖ్యాకులు అలగే నివసించారు. అబ్రాహము, యాకోబు, యోసేపు, మోషే, దావీదు ఎలీషా చరిత్ర చదవండి అత్యుత్తమంగా మనస్థానాల్లో తన బాధ్యతలు నిర్వహించి లోక శ్రేయాన్ని ఉద్దరణను ప్రభావితం చేసిన అనంతర కాలపు వ్యక్తుల జీవితాల్ని అధ్యయనం చెయ్యండి.MHTel 314.1

    వీరిలో ఎంతమంది సామన్య పల్లె ప్రాంత గృహంలో పెరిగారు. వారికి భోగమంటే ఏమిటో తెలియదు. తమ యౌవనాన్ని వారు వినోదాల్ని ఆనందించటలో గడపలేదు. అనేకమంది పేదరికంతో కష్టాలు శ్రమలతో పోరాడవలసి వచ్చింది. చిన్నతనంలోనే పనిచెయ్యటం వారు నేర్చుకున్నారు. ఆరుబటయ కష్టపడి పనిచెయ్యటం ద్వారా శక్తి పొందారు. ఆరుబయట శ్రమ వారి శక్తులన్నిటికి చురుకుతనాన్ని సాగే సమర్ధతను ఇచ్చింది. తమ సొంత వనరులపై ఆధారపడటం తప్పనిసరి కావటంతో వారు కస్టాల్ని ప్రతిఘటించటం ప్రతిబంధకాల్ని అదిగమించటం నేర్చుకొని ధైర్యాన్ని పట్టుదలను అలవర్చుకున్నారు. ఆత్మ సమృద్ధత ఆత్మ నిగ్రహా పాఠాలు నేర్చుకున్నారు.MHTel 314.2

    దుష్ట స్నేహాలకు చాలా మేరకు దూరంగా ఉండి, సహజ వినోదాలతోను ఆరోగ్యవంతమైన స్నేహాలతోను తృప్తి చెందారు. వారు రుచుల విషయంలో సామన్యంగాను, అలవాట్ల విషయంలో మితంగాను ఉన్నారు. నియమ బద్దులై నివసించారు. కనుక పవిత్రంగా బలంగా నిజాయితీ కలిగి పెరిగారు. తమ జీవిత కర్తవ్య నిర్వహణకు పిలుపు పొందినప్పుడు తమను లోకానికి మేలు కలిగించే ప్రజల శక్తిగా చేసిన శారీరక, మానసిక శక్తిని ఉత్సాహ స్వభావాన్ని ప్రణాళికలు రచించి అమలుపర్చే సామర్ధ్యాన్ని దుష్టతను ప్రతిఘటిచంటంలో స్థిరమనస్సును వారు తమ పనిలో ప్రదర్శించారు.MHTel 314.3

    మీరు మీ బిడ్డలకు ఇవ్వగల ఏ ఇతర వారసత్వపు ఆస్తికన్నా మేలైన వరం అరోగ్యవంతమైన శరీరాలు, ఆరోగ్య కరమైన మనసు ఉత్తమైన ప్రవర్తన,. జీవితంలో యధా విజయాన్ని రూపుదిదేవేమిటో అవగాహన చేసుకునే వారు పెందలకడనే వివేకవంతులవుతారు. తమ గృహాల ఎంపికలో వారు జీవిత ఉత్తమ విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటారు.MHTel 315.1

    మనుషుల పనులు మాత్రము ఎక్కడ కనిపిస్తాయో, ఎక్కడ దుర్మా రపు తలంపులు పుట్టించే దృశ్యాలు కనిపిస్తాయో శబ్దాలు వినిపిస్తాయో ఎక్కడ అల్లరి గందరగోళం ఆయాసాన్ని అశాంతిని కలిగిస్తాయో అక్కడ నుండి దేవుని కార్యాలు చూడగల ప్రకృతిలోకి వెళ్లండి. ప్రకృతి సౌందర్యం ప్రశాంతత శాంతిలో మీ ఆత్మకు విశ్రాంతిని కనుగొండి. మీ దృష్టిని పచ్చని పొలాలపై చెట్లపై కొండలపై నిలపండి నగరంలోని ధూలి పొగ వల్ల నల్లబడని నీలి ఆకాశంలోకి చూడండి శక్తిని నింపే గాలిని పీల్చుకోండి. మీ బిడ్డలకు మీ సహవాసాన్ని ఎక్కడ ఇవ్వగలరో ఆయన సృష్టికార్యాల ద్వారా దేవుని గూర్చి వారికి బోధించి నిజాయితీగాను ప్రయోజనకరంగాను జీవించటం వారికి ఎక్కడ నేర్పించగలరో అక్కడ ధ్యాన భంగం దుర్వ్యయం ఉండే నగారాల నుండి ప్రత్యేకంగా వెళ్ళండి, .MHTel 315.2