Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంతోషం

    “సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.” సామెతలు 17:22 కృతజ్ఞత, సంతోషం, పరోపకార, దేవుని ప్రేమలోను శ్రద్ధాసక్తుల్లోను విశ్వాసం ఇవి ఆరోగ్యానికి గొప్ప కాపుదల. ఇశ్రాయేలీయులకు అవి జీవిత ప్రధాన సూత్రాలు కావలసియున్నాయి.MHTel 238.6

    యెరూషలేములో సాంవత్సరిక పండుగలకు సంవత్సరములో మూడుసార్లు ప్రయాణం పర్ణశాలల పండుగలో వారం రోజులు పర్ణశాలలు సందర్శనం, ఇవి ఆరుబయట వినోదానికి, సాంఘిక జీవితానికి వారికి తరుణాలు. ఈ పండుగలు ఆనంద సమయాలు. పరదేశికి, లేవీయుడికి, పేదలకు అతిథ్యం ఇచ్చే తరుణం ఈ పండగల్లో మరింత సంతోషాన్ని సమకూర్చింది.MHTel 239.1

    “నీదేవుడైన యెహోవా సన్నిధిని దాన పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి,నీకును నీ ఇంటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషించవలెను”. ద్వితియోపదేశకాండము 26:11MHTel 239.2

    కనుక, అనంతర సంవత్సరాల్లో బబులోను నుంచి తిరిగి వచ్చిన బందీలకు యెరూషలేములో దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ప్రజలు తమ అతిక్రమాల విషయంలో దు:ఖించగా ఈ చక్కని మాటలు మాట లాటం జరిగింది. “మీరు దు:ఖపడద్దు...పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసికొనినవారికి వంతులు పంపించుడి,. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టతమాయెను. మీరు దు:ఖపడకుడి యెహోవా యందు ఆనందించట వలన మీరు బలమొందుదురు”. నెహమ్యా 8:9,10MHTel 239.3

    “వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయ ఓలీన చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈ తచెట్ల కొమ్మలను గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆప్రకారమ జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్ళలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు సమూహమును పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలలో నుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను”. 15-17 వచనాలు.MHTel 239.4

    శారీరక, మానసిక ఆరోగ్యానికి అతి ముఖ్యమైన విషయాల పై దేవుడు ఇశ్రాయేలీయులకు ఉపదేశమిచ్చాడు. ఈ నియమాల గురించి నైతిక ధర్మశాస్త్ర నియమాల గురించి ఆయన ఇలా ఆదేశిస్తున్నాడు.MHTel 240.1

    నేను నేడు నీకాజ్ఞాపించు ఈ మాటలు నీహృదయములో ఉండ వలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజసి నీ యింట కూర్చుండు నప్పుడును త్రోవను నడుచుచున్నప్పుడును పండుకొను నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలెను. అవి నీకన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వారబంధములమీదాను గవును లమీదను వాటిని వ్రాయ వలెను.” ద్వితియోపదేశకాండము 6:6-9.MHTel 240.2

    “ఇకమీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకాజ్ఞా పించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనముమ. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడనలన్నింటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను”. 20-24 వచనాలుMHTel 240.3

    ఇశ్రాయేలీలయులు తమకు వచ్చిన ఉపదేశానికి విధేయులై దాని వలన లభించే మేలును పొంది ఉంటే, ఆరోగ్యం అభివృద్ధి విషయాల్లో వారు లోకానికి ఓ మాదిరి పాఠంగా ఉండేవారు. ఓ జనులుగా వారు దేవుని ప్రణాళిక ప్రకారం నివసంచి ఉంటే, ఇతర జాతులకు వచ్చిన వ్యాధులు వారికి వచ్చేవి కావు. ఏ జాతి ప్రజలకన్నా వారు అధిక శారీరక శక్తి మేధస్సును కలిగి ఉండేవారు. వారులోకంలో అతి శక్తిమంతమైన ప్రజలుగా ఉండేవారు. దేవుడిలా ఉన్నాడు. “మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆలన్నిటిని గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనములకంటే నీకు కీర్త ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను”. ద్వితీయో 26:18, 19.MHTel 240.4

    “నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టములో దీవింపబదువు. పొలములలో దీవింపబడదువు. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశు వుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొట్టె మేకల మందలు దీవించబ డును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదవు. వెలుపలకి వెళ్ళునప్పుడు దీవింప బడుదువు” ద్వితియోపదేశకాండము 28:2-6MHTel 241.1

    “నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నిములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచు కొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తన ప్రతిష్టత జనముగానన్ను స్థాపించును.MHTel 241.2

    భూజనులందరు యెహోవా నామమున నీవు పిలువడుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశము యెహోవా నీ గర్భఫల విషయములలోను నీ పశువు విషయములలోను నీ నేల పంట విషయములలోన నీకు సమృద్ధిగా మేలు కలుగజేయునను.MHTel 241.3

    యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరచును.. నేను నీకాజ్ఞపించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందు వుగాని క్రిందివాడవుగా ఉండవు”. 8-14.MHTel 241.4

    ఇశ్రాయేలీయులను దీవించేటప్పుడు ఈ మాటలతో దీవించాలి. ” యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యెహోవా నీ మీత తన సన్నిధికాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజే యునుగాక అట్లు వారు ఇశ్రాయేలీయులు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను”.MHTel 242.1

    “నీకమ్ములు ఇనుపవియు ఇత్తడి వియునైయుండును నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యోషూరూనే, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశ వాహనుడై వచ్చును. మ హెన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును.......MHTel 242.2

    ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యూకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధ్యాన ద్రాక్షారసములు గల దేశములో నుండును అతని పై ఆకాశము మంచును కురిపించును ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సాయకరమైన కేడెము నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము!’ సంఖ్యా 6:23, 6:24-27, ద్వితీయో 33:25-29MHTel 242.3

    ఇశ్రాయేలీయులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలులయ్యారు. గనుక తాము పొందాల్సినదీవెనల్ని పొందలేకపోయారు. కాని యోసేపు దానియేలుల్లో మోషే ఏలీషా ఇంకా అనేకుల్లో జీవన యదార్ధ ప్రణాళిక ఫలితాలకు మనకు ఆదర్శం ఉంది. అటువంటి నమ్మకం చూపిస్తే నేడూ అటువంటి ఫలితాలు కలుగుతాయి. మనకు ఇది రాయబడింది.MHTel 242.4

    “అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్దజనమును,దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు” 1 పేతురు 2:9MHTel 243.1

    ” యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును” “నీతిమంతులు ఖర్జూరవక్షమువలెన మొవ్వువే యుదురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురుMHTel 243.2

    యెహోవా మందిరములో నాటబడినవారెవారు మన దేవుని ఆవరణ ములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదరమైన యెహోవా యధార్ధ వంతుడనియు ఆయనయందు ఏ చెడు తనమును లేదనియు ప్రసిద్ది చయుటకై వారు ముసలితనమందు ఇంకచిగురు పెట్టుకుందురు”.MHTel 243.3

    “సారము కలిగి పచ్చగా నుందురు” నా ఆజ్ఞలను హృదయ పూర్వ కముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడచు సంవత్స రములను శాంతిని నీకు కలుగజేయును”MHTel 243.4

    అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడచెదవు నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు పండుకొనుననప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు ఆకస్మికంగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దుMHTel 243.5

    యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కు బడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును” యిర్మీయా 17:7 కీర్తనలు 92:12-14, 92:15 సామెతలు 3:1, 23-26MHTel 243.6

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents