Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వయం పోషక మిషనరీలు

    అనేక స్థలాల్లో స్వయం పోషక మిషనెరీలు విజయవంతంగా పని చెయ్యవచ్చు. ఆ పొస్తలుడు పౌలు స్వయం పోషక మిషనెరీగా క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని లోకమంతటా విస్తరింప చెయ్యటంలో శ్రమించాడు. ఆసియా ఐరాపాల్లోని పెద్ద నగరాల్లో సువార్తను ప్రకటిస్తుండగా తనకు తన సహచరులకు పోషణ నిమిత్తం వృత్తి పనివాడిగా పనిచేసాడు. ఎఫెసు పెద్దలకు తన సేవా విధానాన్ని వివరిస్తూ పలికిన తన వీడ్కొలు మాటల్లో ప్రతీ సువార్త సేవకుడికి విలువైన పాఠాలున్నాయి.MHTel 120.3

    “ఎల్ల కాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగు దురు”... మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహింరంగ ముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచును ఎవని వెండినైను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడితివని మీకే తెలియును. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీను లను సంరక్షింపవలెననియు.. పుచ్చుకొనుటకంటే ఇచ్చట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని.”. అ.కా 20:18-35MHTel 121.1

    అదే ఆత్మత్యాగ స్పూర్తి ఉంటే అనేకులు నేడు అదే రీతిగా మంచి సేవ చెయ్యవచ్చు. సువార్త సేవకు ఇద్దరు ముగ్గురు బయలుదేరాలి. వారు ప్రజల్ని సందర్శించాలి. వారితో ప్రార్ధన చేసి పాటలు పాడి, వారికి భోధించి లేఖనాల్ని విశదం చెయ్యాలి. వ్యాధిగ్రస్తులకు పరిచర్య చెయ్యాలి. కొంతమంది పుస్తకాలు పత్రికలు అమ్మేవారిగా ఉపాధి పొందవచ్చు. ఇతరులు ఈ అపొస్తలుడిలా, ఏదో వృత్తి పని గాని మరేదైనా పని గాని చెయ్యవచ్చు. తమ ఆసహయతను గుర్తించి అణుకువతో దేవుని మీద ఆధారపడి తమ పనిలో ముందుకు సాగితే, వారికి చక్కని అనుభవం కలుగుతుంది. ప్రభువైన యేసు వారి ముందు నడుస్తాడు. ధనికులు దరిద్రుల మధ్య వారికి ఆదరణ సహాయం లభిస్తుంది.MHTel 121.2

    విదేశాల్లో వైద్య మిషనెరీ సేవకు శిక్షణ పొందినవారు సేవ చెయ్యాల్సిన స్థలానికి జాప్యం లేకుండా వెళ్ళి పనిని ప్రారంభించి, పనిచేస్తూ భాష నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. కొద్ది కాలంలోనే దైవ వాక్యంలో సామాన్య సత్యాల్ని బోధించటానికి వారు సమర్ధులవుతారు. MHTel 121.3

    లోకమంతటా కృపా దూతలు అవసరం. చీకటి లోను తప్పు దారిలోను ఉన్న సమాజాల్లోకి వెళ్ళటానికి విదేశాల్లో సేవకు వెళ్ళటానికి, సాటి మానవుల అవసరాల్ని తెలుసుకోవటానికి, దేవుని సేవా రంగంలో పని చెయ్యటానికి క్రైస్తవ కుటుంబాలకు పిలుపు ఉంది. అలాంటి కుటుంబాలు లోకంలోని చీకటి ప్రాంతల్లో ప్రజలు ఆధ్యాత్మిక చీకటిలో ఉన్న ప్రాంతాల్లో స్థిరపడి తమ ద్వారా క్రీస్తు వెలుగు ప్రకాశింపజేస్తే ఎంతో ఉదాత్తమైన కార్యసాధన జరగుతుంది.MHTel 121.4

    ఈ పనికి ఆత్మ త్యాగం అసవరం,. ప్రతీ ఆటంకం తొలగించబడ టానికి అనేకులు వేచి ఉండగా, వారు చెయ్యాల్సిన పని మిగిలి ఉంది. జనులు నిరీక్షణ లేకుండా దేవుడు లేకుండా మరణిస్తున్నారు. వాణిజ్యపపరమైన లబ్ధి కోసమో, వైజ్ఞానిక జ్ఞాన సంపాదనలో కొందరకు ఇంకా స్థిరం కాని అంశాల్ని చేపట్టి త్యాగాలు చేస్తూ ప్రజలు సంతోషంగా భరిస్తుంటారు. అయితే ఎంతమంది తోటి మానవుల కోసం సువార్త అవసరమైన ప్రాంతాలకు తమ కుటుంబాలతో తరలి వెళ్ళటానికి ఫిదంగా ఉంటారు?MHTel 122.1

    వారు ఎక్కడున్నా వారి స్థితి లేక పరిస్తితి ఏలాంటిదైనా, ప్రజల్ని చేరటం. వారికి సాధ్యమైనన్ని మార్గాల్లో సహాయం చెయ్యటం- ఇదే నిజమైనన పరిచర్య. అలాంటి కృషి ద్వారా మీరు ఆత్మల్ని సంపాదించి, నశించే ఆత్మలను చేరటానికి మార్గం తెరుస్తారు.MHTel 122.2

    మీ పని అంతటిలోను మీరు క్రీస్తు ముడిపడి ఉన్నారని రక్షణ ప్రణాళికలో అది ఓ భాగమని గుర్తుంచుకోండి. స్వస్థతను జీవాన్ని ఇచ్చే ప్రవాహం మీ ద్వారా ప్రవహించాల్సి ఉంది. ఆయన ప్రేమ పరిధిలోకి ఇతరుల్ని ఆకర్షించటానికి ప్రయత్నించేటప్పుడు మీ భాష శుద్ధత, మీ పరిచర్య నిస్వార్ధత, మీ నడవడి సౌమత్య ఆయన కృపకు సాక్ష్యం కానివ్వండి. ఆయన రాయబారులుగా మీ నడవడి ఎంత పవిత్రంగాను, నీతివంతంగాను ఉండాలంటే మనుషులు ఆయన సుందర రూపాన్ని మీలో చూడగలగాలి.MHTel 122.3

    ఇతరుల్లో మనకు తప్పుగా తోస్తున్న అలవాట్లు పై దాడి చెయ్యటం ద్వారా వాటిని సంస్కరించటానికి ప్రయత్నించటం వ్యర్ధం. అట్టి ప్రయత్నం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. సమరయ స్త్రీతో తన మాటల్లో యాకోబు బావిని గురించి చులకనగా మాట్లాడే కన్నా క్రీస్తు ఎంతో మెరుగైన విషయాన్ని ఆమెకు సమర్పించాడు. “నీవు దేవుని వరమును... నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలము నిచ్చునని”ఆమెతో చెప్పాడు. యోహాను 4:10 ఆ సంభాషణను తాను ఇవ్వ గల భాగ్యం వైపుకు తిప్పి ఆమెకున్నదానికన్నా మేలైనదాన్ని అనగా సువార్త ఆనందం, నిరీక్షణ అయిన జీవజలాన్ని ఆమెకు ఇవ్వనెంచాడు.MHTel 122.4

    మనం పని చెయ్యాల్సిన విధానానికి ఇదొక ఉదాహరణ. మనుషుల కన్నా దానికన్నా మెరుగైనదేదో దాన్ని అనగా సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానాన్ని మనం వారికివ్వాలి. దేవుని ప్రవర్తనకు నకలైన ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రం గురంచి వారికి చెప్పాలి. తాము ఆ ప్రవర్తనను కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడని చెప్పాలి. ఈ లోక సంబంధమైన క్షణిక సుఖాలు ఆనందాలకన్నా శాశ్వతమైన పరలోక మహిమ ఎంత ఉత్తమమైనదో వారికి చూపించండి. రక్షకునిలో మనకున్న స్వేచ్చను గురించి వారికి చెప్పండి. “నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పడును దప్పిగొనడు” అన్నాడు ప్రభువు 14వ వచనం.MHTel 123.1

    “ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల” అని ఎలుగెత్తి చెబుతూ యేసును పైకెత్తండి. యోహాను 1: 29 హృదయ వాంఛల్ని తీర్చగల వాడు ఆత్మకు సమాధాన్నివ్వగలవాడు ఆయనే.MHTel 123.2

    సంస్కర్తలు లోకంలోని ప్రజలందరిలోకి మిక్కిలి స్వార్ధ రహితులు, మిక్కిలి దయగలవారు, మిక్కిలి మర్యాదస్తులు కావాలి. వారి జీవితాల్లో నిజమైన మంచితనం. స్వార్ధరహిత క్రియలు కనిపించాలి. మర్యాదగా మెలగని సంస్కర్త, ఇతరుల ఆజ్ఞానం లేక అవిధేయత విషయంలో సహనం కోల్పోయే వ్యక్తి, దురుసుగా మాట్లాడే లేక దుండుడుకు పనులు చేసే వ్యక్తి ప్రజల హృదయ ద్వారాలు మూసివెయ్యవచ్చు. కనుక అతడు వారిని ఎన్నడూ చేరలేకపోవుచ్చు.MHTel 123.3

    తప్పిదాలు చేసేవారిని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నవారి మాటలు ఎండిపోతున్న మొక్కల పై పడే మంచు, వర్షంలా సున్నితంగా మృదువుగా ఉండాలి. మొదట హృదయాన్ని గెలవటం దేవుని ప్రణాళిక. జీవితాన్ని సంస్కరించటానికి ఆయన శక్తినిస్తాడని నమ్మి మనం సత్యాన్ని ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతో పలికిన మాటను అవగాహన చేసుకోవటానికి పరిశు ద్దాత్మ ఆత్మకు శక్తినిస్తాడు.MHTel 123.4

    స్వభావ సిద్ధంగా మన స్వాభిమానులం, పక్షపాత బుద్ధి గలవారం. కాని క్రీస్తు మనకు బోధించాలని ఆశిస్తున్న పాఠాల్ని నేర్చుకున్నప్పుడు ఆయన స్వభావంలో పాలివారమౌతాం. ఇక నుండి ఆయన జీవితం జీవిస్తాం. క్రీస్తు అద్భుతమైన ఆదర్శం, ఆయన ఇతరుల మనోభావాల్ని జాలితో పంచుకున్న తీరు, దు:ఖిస్తున్న వారితో దు:ఖించటం, సంతోషిస్తున్న వారితో సంతోషించటం ఆయనను యధార్ధంగా అనుసరించేవారి ప్రవర్తన పై తీవ్ర ప్రభావితం చూపాలి. దయగల మాటలు అలసిన వారి పాదాలకు మార్గాన్ని సులభతరం చేస్తాయి.MHTel 124.1

    “అలసినవానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగు నట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు”. యెషయా 50:4MHTel 124.2

    వ్యాధిగ్రస్తులై బాధపడుతున్న ఆత్మలు మన చుట్టు ఉన్నాయి. ఇక్కడ అక్కడ అన్ని చోట్లా వారు మనకు కనిపిస్తారు. బాధలు అనుభవిస్తున్న వీరిని వెదకి పట్టుకొని వారికి ఓదార్పు కలిగించే సమయానుసారమైన ఒక్క మాట చెప్పుదాం. సేద దీర్చే దయాకనికరాల జలాలు ప్రవహించే కాలువలుగా మనం ఎల్లప్పుడు ఉందాం.MHTel 124.3

    ఇతరుల అనుభవాల్లో మానవ దృష్టికి మరుగైన కొన్ని అధ్యాయాలు ఉంటాయని గుర్తుంచుకోవటం అవసరం. వింతలు వెదికే కళ్ళకు కనిపించకుండా సృృతి పుటల్లో పరిశుద్ధంగా కాపాడబడే చరిత్రలు ఉన్నాయి. బహుశా గృహజీవితంలో శ్రమలు మొదలైన కష్ట పరిస్థితులతో దినం దినం ధైర్యాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని బలహీనపర్చే పరిస్థితులతో, సల్పే పోరాటాలు అందులో దాఖలై ఉంటాయి. ఎన్నో కష్టాలతో జీవిత పోరాటం పోరాడుతున్న వారు ప్రేమతో కూడిన ఓ చిన్న ప్రయత్నం మాత్రమే అవసరమయ్యే చిన్న శ్రద్ధ ద్వారా బలాన్ని దైర్యాన్ని పొందవచ్చు. ఓ యధార్ధ స్నేహితుడు చెయ్యి పట్టుకోవటం బంగారం కన్నా వెండి కన్నా ఎక్కువ విలువైనది. దయగల మాటలు దేవ దూతల మందహాసం కన్నా ఎంతో స్వాగతించదగ్గవి.MHTel 124.4

    అవసరాల వత్తిడి వల్ల ఖనీస జీవితావసరాలకు కూడా సరిపోని జీతానికి కష్టపడి పనిచేస్తూ పేదరికంతో సతమతమౌతున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. మంచిరోజుల నిరీక్షణ లేని శారీరక శ్రమ, మోసం, వారి భారాన్ని మరింత దుర్బరం చేస్తుంది. వీటికి వ్యాధ బాధ జతపడ్డప్పుడు ఆ భారం దాదాపు భరించలేనదౌతుంది. చింతలతో చితకి ఉపశమనానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఆయోమయ స్థితిలో ఉంటారు. తమ శ్రమల్లో, తమ హృదయ వేదనలో, తమ ఆశాభంగాల్లో వారికి సానుభూతి తెలపండి. వారికి సహాయం చెయ్యటానికి ఇది మార్గం తెరుస్తుంది. దేవుని వాగ్దానాల్ని గురించి వారితో మాట్లాడండి. వారితో కలసి వారి కోసం ప్రార్ధించండి. వారిలో నిరీక్షణను నింపండి.MHTel 125.1

    ఆత్మరోగగ్రస్తమై ధైర్యం సన్నగిల్లినప్పుడు ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపటానికి చెప్పిన మాటలు తనకు చెప్పిన మాటలుగా రక్షకుడు పరిగణిస్తాడు. హృదయాలు సంతోషంతో నిండినప్పుడు పరలోక దూతలు గుర్తిస్తూ ఆనందంగా చూస్తు ఉంటారు.MHTel 125.2

    ప్రతీ తరంలోను మనుషుల ఆత్మల్లో దివ్య సూదరత్వ భావాన్ని మేల్కొల్పటానికి ప్రభువు ప్రయత్నిస్తున్నాడు. ఆయన తోటి పనివారుగా ఉండండి,. లోకాన్ని అపనకమ్మకం, విరోధభావం నింపుతుండగా. క్రీస్తు అనుచరులు పరలోకంలో రాజ్యమేలుతున్న స్వభావాన్ని కనపర్చాలి.MHTel 125.3

    ఆయన మాట్లాడినట్లు మాట్లాడండి. ఆయన చేసినట్లు పనులు చెయ్యండి. ఎల్లప్పుడు ఆయన ప్రవర్తన మాధుర్యాన్ని బయలుపర్చండి. ఆయన బోధల్ని ప్రజలతో ఆయన వ్యవహరణలన్నింటిని నింపిన ఆ ప్రేమ ఐశ్వర్యాన్ని కనపర్చండి. క్రీస్తుతో సహకరించే అతి సామాన్య పనివాడు మీటే తంతుల ప్రతి ధ్వనులు లోకం కొనలవరకూ వినిపించి నిత్య కాలయుగాలన్నిటిలో సంగీత సునాదాన్ని నింపవచ్చు.MHTel 125.4

    మానవులు ఏమి కాగలరో, దేవునితో ఏకమవ్వటం ద్వారా శించటానికి స్టింగా ఉన్న మానవుల రక్షణ విషయంలో ఏమి సాధించవచ్చో లోకానికి వెల్లడి చేసేందుకు పరలోక జ్ఞానులు మానవ సాధనాలకు సహకరించటానికి ఎదరు చూస్తున్నారు,. స్వార్ధాన్ని పక్కన పెట్టి, తన హృదయంలో పరిశుద్దాత్మ పని చెయ్యటానికి చోటు పెట్టి సంపూర్తిగా దేవునికి అంకితమైన జీవితం జీవించే వ్యక్తి ప్రయోజకత్వానికి ఎలాంటి హద్దూ లేదు. ఆయన సేవకు శరీరాత్మల్ని సమర్పించుకునే వారందరూ శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని నిత్యం నూతనంగా పొందుతుంటారు. ఎన్నడూ అంతంకాని పరలోక సరఫరాలు వారి వశంలో ఉంటాయి. వారికి క్రీస్తు తన సొంత శ్వాసలోని శ్వాసను తన సొంత జీవంలోని జీవాన్ని ఇస్తాడు పరిశుద్దాత్మ మనసులోను హృదయంలోను పని చెయ్యటానికి తన ఉన్నత శక్తుల్ని వినియోగిస్తాడు. మన తప్పుడు అభిప్రాయాలు, మనం మందే ఏర్పర్చుకున్న అభిప్రాయాలు. మన ప్రవర్తన లోపాలు, మన అల్ప విశ్వాసం కారణంగా అసాధ్యాలుగా కనిపించిన వాటి పై దేవుడిచ్చిన కృపతో మనం విజయం సాధించగలుగుతాం.MHTel 126.1

    మినహాయింపులేకుండా తనను తాను ప్రభువు సేవకు సమర్పించు కునే ప్రతీ వ్యక్తికి అసంఖ్యాకమైన ఫలితాలు సంపాదించటానికి శక్తి అనుగ్రహించబడుతుంది. వీరి కోసం దేవుడు గొప్ప కార్యాలుచేస్తాడు. ఈ లోకంలో సయితం వారి జీవితాల్లో భవ్యిత్తులోని ఉన్నత స్థితిని గూర్చిన వాగ్దాన నెరవేర్పు ప్రస్పుటంగా కనిపించేటట్లు మనుషుల హృదయాల పై ఆయన పనిచేస్తాడు ఈMHTel 126.2

    “ఆరణ్యమును ఎండిన భూమియు సంతోషించును
    అడవి ఉల్లఘించి కస్తూరి పుష్పమువలెపూయును
    అది బహుగా పూయుచూ ఉల్లసించును
    ఉల్లసించి సంగీతములు పాడును
    లెబానోను సౌందర్యము దానికి కలుగును
    కర్మలు షరోనులకున్న సొగసు దానికుండును
    అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును “సడలిన చేతులను బలపరచుడి
    తొట్రిల్లు మోకాళ్ళను ధృడపరచుడి
    తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి
    భయపడక ధైర్యముగా ఉండుడి
    ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నానడు...

    'గ్రుడ్డివారి కన్నులు ఏ తెరవడును
    చెవిటివారి చెవులు విప్పబడును
    కుంటివాడు దుప్పివలె గంతులు వేయును
    మూగవాని నాలుక పాడును
    అరణ్యములో నీళ్ళు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును
    ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును...

    “అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును
    అది పరిశుద్ధ మార్గమనబడును
    అది అపవిత్రులు పోకూడని మార్గము
    అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును
    మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు

    “అక్కడ సింహముండదు క్రూర జంతువులు దాని
    ఎక్కవు అవి అక్కడ కనపడవు
    వియోచింపబడినవారే అక్కడ నడచుదురు
    యెహోవా వియోచించినవారు పాటలు పాడుచు తిరిగి
    సీయోను వచ్చెదరువార తలల మీద నిత్యానందముండును
    వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు
    దు: ఖమును నిట్టూర్పును ఎగిరిపోవును”.
    MHTel 126.3

    యెషయా 35:1-10

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents