Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వ్యాపార నియమాలు

    ఓ తరగతిని బాధించి శ్రముల పెట్టి మరో తరగతిని ధనికుల్ని చేసే ఏ విధానాన్ని దేవుని వాక్యం ఆమోదించదు. మన వ్యాపార వ్యవహారాలన్నిటి లోను మనం ఎవరితో వ్యవహరిస్తామో వారి స్థలంలో మనల్ని మనం ఊహించకుని మనల్ని మాత్రమే మనం చూసుకోకుండా ఇతరుల్ని గురించి కూడా పరిగణించాలని అది భోదిస్తున్నది. ఇంకొకరి దురద్రుష్టాన్ని సొమ్ము చేసుకోనే వ్యక్తి లేక ఇంకొకరి బలహీనతల్ని ఆసరా చేసుకొని లబ్ది పొందాలనుకునే వ్యక్తి దైవ వాక్య నియమాలు బోధలు రెండింటిని అతిక్ర మిస్తున్నాడు.MHTel 152.2

    “పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు”. “నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన యెడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవెలను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు తస్తువును తెచ్చియిచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన యెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు”.“నీవు ఎప్పుడైనను నీ పొరుగు వాని వస్త్రమును కుదువగా తీసుకొనిన యెడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనునది అదే... వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను వాడు. నాకు మొఱ పెట్టిన యెడల నేను విందును”. ద్వితి 24:17, 10-12; నిర్గమ 22:26,27; లేవీయ 25:14MHTel 152.3

    “తీర్పు తీర్చునప్పుడు కొలతలతో గాని తూనికెలలో గాని పరిమాణ ములో గాని మీరు అన్యాయము చేయకూడదు.” “హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికె రాళ్ళు సంచిలో నుంచుకొన కూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు”. “న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను”. లేవీయ 19:35 ద్వితీ 25:13,14 లేవీయ 19:36MHTel 153.1

    “నిన్ను అడగువానికిమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ “ముఖము త్రిప్పుకొనవద్దు”. భక్తి హీనులు అప్పు చేసి తీర్చకయందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు”. మత్తయి 5:42 కీర్త 37:21 ‘ఆలోచన చెప్పుము విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యము చెదిరిన వారిని దాచి పెట్టుము పారిపో యని వారిని పట్టియ్యకుము”. “నేను వెలివేసిన వారిని నీతో నివసింపి నమ్ము.. దోచుకొనేవారు వారి మీదికి రాకుండునట్లు ... ఆన్యాయముగా ఉండుము”. యెషయా 16:3,4.MHTel 153.2

    దేవుడు ఇశ్రాయేలుకిచ్చిన జీవిత ప్రణాళిక యావత్ మానవాళికి మాదిరి పాఠగా ఉద్దేశించబడింది. ఈనాడు ఈ సత్రాలను అనుసరించి జీవిస్తే ఈ ప్రపంచం ఎంత వ్యాత్యాసమమైన స్థలంగా ఉండేది? MHTel 153.3

    బాధల్లోను లేమిలోను ఉన్నవారు సువిశాల ప్రకృతి సరిహద్దుల్లో తమ గృహాన్ని ఏర్పాటుచేసుకోవటానికి ఇంకా స్థలం ఉంది. వారికి ఆహారం సమకూర్చటానికి ప్రకృతి వడిలో బోలెడు వనరులున్నాయి. దాని ఐశ్వర్యాన్ని పోగు చేసుకోవటానికి ధైర్యం సంకల్ప బలం పట్టుదల ఉన్నవారికి భూగర్భంలో ఎన్నో దీవెనలు దాచబడి ఉన్నాయి.MHTel 153.4

    ఏదెనులో దేవుడు మానవుడికి ఏర్పాటు చేసిన భూమిని సేద్యం చేసే ఉపాధి వేలాద ప్రజలకు బ్రతుకుతెరువు సమకూర్చే విశాల రంగాన్ని ఆవిష్కరిస్తుంది.MHTel 153.5

    ” యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము”. కీర్తనలు 37:3MHTel 153.6

    నగరాల్లోకి వలస వెళ్లి కొద్దిపాటి వేనతం సంపాదించటానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వేలు లక్షల ప్రజలు భూమిని సేద్యం చెయ్యటంలో పనిచెయ్యవచ్చు. అనేకుల విషయంలో ఈ కొద్దిపాటి వేతనం ఆహరానికి ఖర్చవ్వదు, కాని ఆత్మను శరీరాన్ని నాశనం చేసే సారా విక్రయదారుడి గళాలోకి వెళ్తుంది.MHTel 154.1

    అనేకులు శారీరక శ్రమను ఓ భారంగా పరిగణిస్తారు. వారు కష్టపడి చేసే పని ద్వారాగాక ఉపాయం ద్వారా జీవనోపాధి సంపాదించటానికి ప్రయత్నిస్తారు. పని చెయ్యకుండా బతకాలన్న ఈ కోరిక అంతులేని దౌర్బా గ్యానికి, దుష్టత్వానికి, నేరానికి తలుపు తెరుస్తుంది.MHTel 154.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents