Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దేవుడే ఏర్పాటు చేస్తాడు

    క్రీస్తు అనుచరులమని చెప్పే అనేకులు తమను తాము దేవునికి అప్పగించుకోవటానికి భయపడతారు గనకు అందోళనతో నిండి కలవర పడుతుంటారు. వారు అయనకు పూర్తిగా సమర్పించుకోరు. అటువంటి సమర్పణ కలిగించే పర్యవసానాల్ని గురించి వెనకంజ వేస్తుంటారు. ఈ సమర్పణ చేస్తే తప్ప వారికి సమాధానం ఉండదు.MHTel 423.3

    “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలలోను నిందలోను ఇబ్బందులలోను హింసలలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను”. 2 కొరింధీ 12:10MHTel 424.1

    తాము లోక ప్రమాణాన్ని చేరటానికి ప్రయత్నిస్తున్నందున వారి హృదయాలు చింతల భారంతో బాధతో మూలుగుతున్నాయి. వారు లోకానికి సేవ చెయ్యటానికి ఎంపిక చేసుకున్నారు. దాని చింతలను ఆందోళనలను స్వీకరించారు. దాని ఆచారాలను ఆనుసరిస్తున్నారు. ఇలా ప్రవర్తన చెడిపోయి వారి జీవితం ఆయాసకరంగా తయారయ్యింది. నిత్యం ఆందోళనతో నిండి ఉండటం వల్ల వారి జీవ శక్తి క్షీణిస్తుంది. ఈ బానిసత్వపు కాడిని పక్కన పెట్టాల్సిందిగా మన రక్షకుడు వారిని కోరుతున్నాడు. తన కాడిని అంగీకరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాడు. “నాకాడి సులువు గాను నా భారము తేలికగాను ఉన్నవి” అంటున్నాడు. చింత గుడ్డిది, అది భవిష్యత్తును స్పష్టంగా గ్రహించలేదు. కాని యేసు ఆది నుండి అంతం చూడగలడు. ప్రతీ కష్టంలోను సహాయాన్నందించానికి ఆయన మార్గం సిద్ధం చేసాడు. “యధార్ధముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు”. మత్తయి 11:30; కీర్తనలు 84:11MHTel 424.2

    మనకు ఏర్పాటు చెయ్యటానికి మన పరలోకపు తండ్రికి మనకు తెలియని వెయ్యి మార్గాలున్నాయి. దేవుని సేవను ప్రధానం చేసుకోనుట మన్న ఆ ఒక్క నియమాన్ని అంగీకరించే వారు తమ అందోళనలు మాయమవ్వటం, తమ పాదాల ముందు స్పష్టమైన మార్గం ఏర్పడటం చూస్తారు. నేటి విధులను నమ్మకంగా నిర్వర్తించటమే రేపటి శ్రమలకు సిద్ధబాటు. రేపటి నష్టాలు చింతలన్నిటిని పోగు చేసి వాటిని ఈనాటి భారానికి కలపకండి. ఏ నాటికీడు ఆనాటికి చాలును”. మత్తయి 6: 3,4MHTel 424.3

    నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉందాం. దేవుని సేవలో నిరుత్సాహపడటం పాపం., అహేతుకం, మన ప్రతీ అవసరం ఆయనకు తెలుసు. రాజులకు రాజు నిబంధనను పాటించే దేవుడు తన సర్వశక్తికి కాపరి సాధుత్వాన్ని శ్రద్ధను చేర్చాడు. ఆయన శక్తి తిరుగులేనిది. ఆయనయందు విశ్వాసముంచే వారందరికి అది ఆయన వాగ్దానాల నెరవేర్పుకు ప్రతిజ్ఞ. ఆయనకు సేవ చేసేవారిని ఆయన ప్రయోగించే సాధనాల్ని గౌరవించేవారిని కాపాడేందుకు ప్రతీకష్టం తొలగించటానికి ఆయనకు సాధనాలున్నాయి., ఇతర ప్రేమ కన్నా ఆయన ప్రేమ భూమి పైని ఆకాశంలా ఉన్నతమైనది. ఆయన తన పిల్లల్ని మితిలేని, నిత్యమైన ప్రేమతో కాపడతాడు.MHTel 425.1

    చీకటి దినాల్లో అంతా నిరాశజనకంగా కనిపించినప్పుడు దేవుని పై విశ్వాసముంచండి. ఆయన తన చిత్రాన్ని జరిగిస్తున్నాడు. తన ప్రజల పక్షంగా సమస్తం చక్కగా జరిగిస్తున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన సేవ చేసేవారి శక్తిని దినదినం నూతనం చేస్తాడు.MHTel 425.2

    తన సేవకులకు అవసరమైన సహాయాన్ని అందించటానికి ఆయన సమర్ధుడు, సంసిద్ధుడు, వారి వివిధ పరిస్థితులకు అవసరమైన వివేకాన్ని ఆయన వారికిస్తాడు. అపొస్తలులగు పౌలన్నాడు: “అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడు చుందును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను”. 2 కొరింథీ 12:9,10.MHTel 425.3

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents