Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    శిశువుల సంరక్షణ

    బిడ్డ జీవితం ఎంత ప్రశాంతంగా సామన్యంగా ఉంటే శారీరక మానసికత వృద్ధిక అది ఎంత అనుకూలంగా ఉంటుంది. తల్లి అన్ని వేళల్లోను ప్రశాంతంగా, నెమ్మదిగా, నిగ్రహం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. కొందరు శిశువులు నరాల ఉద్రేకానికి లోనవుతుంటారు. తల్లి సావధాన, తొందరలేని వైఖరి శాంతపర్చే ప్రభావం చూపిస్తుంది. అది శిశువుకు గొప్ప మేలు చేస్తుంది.MHTel 327.1

    బిడ్డలకు వెచ్చదనం అవసరం. కాని తరుచు ఎక్కువ వేడిగా ఉ 0చిన గదుల్లో ఉంచి తాజా గాలి లేకుండా చెయ్యటం ద్వారా తీవ్రమైన తప్పిదం జరుగుతుంది. నిద్ర పోతున్నప్పుడు శిశువు ముఖం కప్పటం స్వేచ్చగా గాలి పీల్చుకోవటానికి అంటంకం కలిగిస్తుంది గనుక ప్రమాదకరం.MHTel 327.2

    దేహ వ్యవస్థను బలహీనపర్చటా ఆనికి లేక విషకలితం చెయ్యటానికి తోడ్పడే ప్రతీ ప్రభావం నుంచి శిశువును దూరంగా ఉంచాలి. శిశువు చుట్టూ ఉన్న ప్రతీదాన్ని చక్కగాను పరిశభ్రంగాను ఉంచటానికి శ్రద్ధ తీసుకోవాలి. పసివాళ్ళని ఆకస్మాత్తు లేక మెళుకవగా ఉన్నా, అది రాత్రయినా, పగలైనా, వారు స్వచ్ఛమైన శక్తినిచ్చే గాలిని పీల్చుకునేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.MHTel 327.3

    శిశువుకు వేసే బట్టలను సిద్ధం చేసేటప్పుడు ఫ్యాషన్ ని ఇతరుల మెచ్చుకోలును పరిగణించే ముందు శిశువు సౌకర్యం, సుఖం, ఆరోగ్యాలను పరిగణించాలి. పసిబిడ్డ బట్టలకు అందాలు దిద్దటానికి తల్లి ఎంబ్రాయిడరీ మొదలైన కుట్టుపని చేస్తూ ఎక్కువ పనిభారం భుజానికెత్తుకుని తన ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి హాని చేసుకోకూడదు. తనకు ఎక్కవ విశ్రాంతి ఆహ్లాదకరమైన వ్యాయామం అసవరమైన సమయంలో ఆమెకంటికి నరాలకు హాని కలిగించే కుట్టుపని పై వంగి ఉండకూడదు. తన పై ఉన్న బాధ్యతలను విధులను నిర్వర్తించటానికి ఆమె తన శక్తిని కాపాడుకోవటం తన విధి అని గుర్తించాలి. బిడ్డ దుస్తులు వెచ్చదనం, కాపుదల సౌఖ్యం ఇస్తుంటే కోపానికి అశాంతికి ముఖ్య కారణాలు తొలగిపోతాయి. బిడ్డకు మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. శక్తిపరంగాను సమయం పంరగాను తల్లికి బిడ్డ సంరక్షణ అంత భారంగా ఉండదు.MHTel 327.4

    బిగువైన పట్టీలు గుండె చర్యకు ఊపిరితిత్తులు చర్యకు ఆటంకం కలిగిస్తాయి. గనుక వాటిని వాడకుండటం మంచిది ఏ అవయున్నాయినా నొక్క ఏ లేక అదిమిపట్టే లేక దాని కదలికను పరిమితం చేసే వస్త్రధారణ వలన శరీరంలోని ఏ భాగానికి ఎన్నడూ అసౌకర్యం కలిగించకూడదు. శ్వాస క్రియ స్వేచ్చగా సంపూర్తిగా సాగేందుకు చిన్న పిల్లలంరది బట్టలు వాటి బరువును భుజాలు భరించే విధంగా ఏర్పాటై తగినంతవదులుగా ఉండాలి.MHTel 328.1

    కొన్ని దేశాల్లో చిన్న పిల్ల భుజాలు చేతులు కాళ్ళను కప్పకుండా విడిచి పెట్టే అలవాటు ఇంకా కొనసాగుతుంది. ఈ అలవాటును ఇంతకన్నా ఎక్కువగా ఖండించలేం. రక్తప్రసరణ కేంద్రానికి కాళ్ళూ చేతులూ దూరంగా ఉండటంతో శరీర ఇరత భాగాలకన్నా వీటికి ఎక్కువ పరిరక్షణ అవసరమౌతుంది. శరీరం కొనలకు రక్తాన్ని మోసుకువెళ్ళే ధమనులు ఆ భాగాలకు చాలినంత వేడిని పోషక పదార్ధాల్ని అందించటానికి తగినట్లు పెద్దవి కాని చేతులు కాళ్ళకు రక్షణ లేనప్పుడు లేక అవి చాలినంతగా కప్పబడనప్పుడు, దమనులు రక్తనాళాలు ముడుచుకుపోతాయి. శరీరంలోని సున్నితమైన భాగాలు చల్లబడి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది.MHTel 328.2

    పెరిగే పిల్లల్లో భౌతిక ఆకారాన్ని పరిపూర్ణం చేసేందుకు ప్రకృతి శక్తులన్నీ సమర్ధమవ్వటానికి ప్రతీ ఉపకారమూ అవసరమౌతుంది. కాళ్ళు చేతులకు చాలినంత రక్షణ లేకపోతే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని వాతావరణం బాగుంటే తప్ప ఆరు బటయకు తీసుకువెళ్ళదు. చలిగా ఉంటుందేమోనన్న భయంతో వారిని ఇంటిలోనే ఉంచుతారు. బట్టలు బాగా ధరిస్తే ఎండాకాలంలోని చలికాలంలో గాని పిల్లలకు ఆరుబయట స్వేచ్ఛా వ్యాయామం చాలా ఉపకరిస్తుంది.MHTel 328.3

    తమ కుమారులకు, కుమార్తెలకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకునే తల్లులు వారికి సరిగా బట్టలు ధరింపజేసి వాతవారణం బాగా ఉన్నప్పుడు వారిని ఆరుబయట ఎక్కువ ఉండటానికి ప్రోత్సహించాలి. ఆచార చట్రం నుంచి బయటి పడి పల్లలకు ఆరోగ్యవంతంగా బట్టలు ధరింపజేసి శిక్షణనివ్వటానికి కృషి జరగటం అవసరం. కాని ఆ కృషి ఫలితం ఎంతో మేలు చేస్తుంది.MHTel 329.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents