Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    చిన్న అవకాశాలు

    పెద్దవానికి ఎదరు చూసేందుకు చిన్న అవకాశాల్ని ఎవరూదాటి పోకూడదు. మీరు చిన్న పనిని విజయవంతంగా చెయ్యవచ్చు కాని పెద్ద పని చెయ్యటానికి ప్రయత్నించటంలో విఫలమై నిరుత్సాహలో కూరుకు పోవచ్చు. మీకు దొరికిన పనిని మీ శక్తి అంతటితోను చెయ్యటం ద్వారా పెద్దపనికి అభిరుచిని పెంచకుంటారు. దగ్గరగా ఉన్న చిన్న చిన్న పనుల్ని నిర్లక్ష్యం చెయ్యటం. దిన దినం వచ్చే అవకాశాల్ని తృణీకరించటం వల్ల అనేక మంది నిష్పలులై ఎండి పోతున్నారు.MHTel 119.5

    మానవ సహాయాన్ని నమ్ముకోవద్దు. మానవులకు పైగా చూసి మన దు:ఖాలు చింతలు భరించటానికి, మన అవసరాల్ని సరఫరా చెయ్యటానికి నియమించబడ్డ ఆయన పై దృష్టి ఉంచండి. దేవుని వాగ్దానాన్ని నమ్మి మీకు పని ఎక్కడ దొరుకుతుందో అక్కడ ప్రారంభించి అచంచల విశ్వాసం తో ముందుకు సాగండి. క్రీస్తు సన్నిధి, విశ్వాసం, శక్తిని ధృడత్వాన్ని ఇస్తుంది. స్వార్ధంలేని ఆసక్తితో, శ్రమతో కూడిన కృషితో, స్థిరతగల శక్తితో పనిచెయ్యండి.MHTel 120.1

    పరిస్థితులు అభ్యంతకరంగాను నిరుత్సాహంగాను ఉండటంతో అనేకులు వెళ్ళటానికి సమ్మతంగా లేని సేవా రంగాల్లో ఆత్మ త్యాగాలు చేస్తున్న పనివారి కృషి వల్ల గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓర్పుతోను పట్టుదలతోను వారు పని చేసారు. వారు మానవ శక్తి పై కాక దేవుని శక్తి పై ఆధారపడ్డారు. ఆయన కృప వారిని సంరక్షించింది. అలా సాధించిన మేలు ఎంత గొప్పదో ఈ లోకంలో ఎన్నటికి తెలియదు. కాని ఆ శుభప్రదమైన ఫలితాలు ఆ నిత్యకాలంలో వెల్లడవుతాయి.MHTel 120.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents