Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రవర్తనా శక్తి

    బలవంతులైన మనుషులు కావాలి. తమ మార్గాన్ని ఎవరో సరళం చెయ్యటానికి ప్రతీ అవరోధాన్ని తొలగించటానికి వేచి ఉండని మనుషులు; నిరుత్సాహపడ్డ పనివారిని తాజా ఉత్సాహంతో నింపే మనుషులు క్రైస్తవ ప్రేమ వెచ్చదనంతో స్పందించే హృదయాలు గల మనుషులు; రక్షకుని పని చెయ్యటానికి బలమైన హస్తాలు గల మనుషులు.MHTel 440.2

    మిషనెరీ సేవలో నిమగ్నమైన వారిలో కొందరు బలహీనులు, ధైర్యం ఉత్సాహం లేనివారు, సులవుగా నిరుత్సాహపడేవారు. వారు భయస్థులు పనులు చెయ్యటానికి శక్తినిచ్చే సానుకూల ప్రవర్తన లక్షణాలు. ఉత్సుకతను రగిలించే స్పూర్తి శక్తి వారికి లేవు. జయాన్ని సాధించేవారు ధైర్యం కలిగి నిరీక్షణతో ఉండాలి. వారు సాత్విక సద్గుణాల్నే గాక చురుకైన క్రియాశీల సద్గుణాల్ని కూడా వృద్ధిపర్చుకోవాలి. క్రోధాన్ని చల్లార్చే మృధువైన మాట చెప్పాల్సి ఉండగా, దుర్మార్గతను ప్రతిఘ్టించటానికి వారు వీరుడి ధైర్యాన్ని కలిగి ఉండాలి. అన్నిటిని తాళుకునే ప్రేమతో పాటు వారికి తమ ప్రభావాన్ని ఓ సానుకూల శక్తిగా చేసే ప్రవర్తన శక్తి కావాలి.MHTel 440.3

    కొందరికి ధృడమైన ప్రవర్తన లేదు. వారి ప్రణాళికలు ఉద్దేశాలకు ఖచ్చితమైన రూపం, స్థిరత లేవు. ఈ లోకంలో వారి ప్రయోజకత్వం శూన్యం. ఈ బలహీనతను అనిశ్చయతను,. అసమర్ధతను జయించాలి. యధార్ధ క్రైస్తవ ప్రవర్తనలో ప్రతికూల పరిస్థితులు మూసివేయ్యలేని లేక అణిచి వెయ్యలేని ధైర్యసాహాసాలున్నాయి. మనకు నైతిక వెన్నెమక అనగా పొగడ్తకు, లంచానికి ఉగ్రవాది చర్యకు లొంగని న్యాయవర్తన ఉండాలి.MHTel 440.4

    తన సేవకు సిద్ధబాటుకు ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఆ కార్యసాధనకు మన శక్తులన్నిటిని వినియోగించాలని దాని పవిత్రతకు దాని భయంకర బాధ్యత నిర్వహణకు మన హృదయాల్ని చురుకుగా ఉంచాలని ఆయన కోరుతున్నాడు.MHTel 441.1

    ఉత్తమ సేవ చెయ్యటానికి అర్హతలు గల అనేకులు చాలా తక్కువ సాధిస్తున్నారు. ఎందుకంటే వారు తక్కువ ప్రయత్నిస్తున్నారు.జీవించటానికి తమకు గొప్ప ద్యేయం లేనట్లు చేరటానికి ఉన్నత ప్రమాణం లేనట్లు వేల ప్రజలు తమ జీవితాల్ని జీవిస్తున్నారు. దానికి ఓ కారణం వారు తమను గురించి తక్కువ అంచాన వేసుకోవటమే. మన కోసం క్రీస్తు అమ్యూలమైన వెల చెల్లించాడు. తాను చెల్లించిన ముల్యాన్ని బట్టి మన విలువను మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు.MHTel 441.2

    తక్కువ ప్రమాణాన్ని చేరటంతో తృప్తి పడవద్దు. మనం ఏమి కాగలమో లేక మనం ఏమి కావాలన్నది దేవుని చిత్తమో అది మనం కాలేదు. దేవుడు మనకు ఆలోచనా శక్తుల్నిచ్చాడు. నిష్క్రియంగా ఉండటానికి లేక వాటిని ఐహికమైన నీచమైన పనులకు ఉపయోగించటానికి ఇవ్వలేదు. కాని వాటిని వృద్ధిపర్చి శుద్ధి చేసి, పరిశుద్దీకరించి, ఉదాత్తం చేసి తన రాజ్య సంబందమైన ఆసక్తుల వృద్ధికి ఉపయోగించటానికి ఆయన ఇచ్చాడు.MHTel 441.3

    ఇతరుల మనుసులు నడిపే యంత్రాలుగా ఉండటంతో ఎవరు తృప్తి చెందకూడదు. తలంచటానికి పనులు చెయ్యటానికి దేవుడు మనకు సామర్ధ్యాన్నిచ్చాడు. జ్ఞానం కోసం ఆయన మీద ఆధారపడి జాగ్రత్తగా పనులు చెయ్యటం ద్వారా భారాలు భరించటానికి మీరు సమర్ధులవుతారు. దేవుడు మీకిచ్చిన వ్యక్తిత్వంతో నిలబడండి. ఏ ఇతర వ్యక్తికీ నీడకాకండి. దేవుడు మీలోను మీ వలనను మీ ద్వారాను పనిచెయ్యటానికి ఎదరుచూడండి.MHTel 441.4

    సరిపోయినంత నేర్చుకున్నావని, ఇప్పుడు మీ కృషిని చాలించవచ్చు నని ఎన్నడూ తలంచవద్దు. వృద్ది చెందిన మనసే మనిషి తాలూకు కొలమానం. మీ విద్య మీజీవిత కాలమంతా కొనసాగాలి. మీరు ప్రతీ దినం నేర్చుకొని గడించిన జ్ఞానాన్ని వ్యావహారికంగా ఉపయోగించాలి, మీరు మీ హోదాలో పనిచేసినా మీ లక్ష్యాన్ని వెల్లడించి వర్తతనను వృదిపర్చకుంటారని గుర్తుంచుకోండి. మీ పని ఏదైనా దాన్ని ఖచ్చితంగాను, పట్టుదలతోను చెయ్యండి. సులభమైన పనిని వెదకటానికి ఇష్టపడే తత్వాన్ని అధిగమించండి.MHTel 442.1

    ఒకరు తన దిన దిన జీవిత పనిలోకి ఏ నియమాల్ని తీసుకు వస్తాడో వాటినే తన జీవిత పని అంతటిలోకి తెస్తాడు. కొంత నిర్దిష్టమైన పనిని ఓ నిర్దిష్టమైన వేతనాన్ని కోరేవారు. సర్దుబాటు, అవసరం లేకుండా శిక్షణ లేకుండా పనికి తాము చక్కగా సరిపోతామని భావించేవారు దేవుడు తన సేవకు పిలుస్తున్నవారు కారు. తమ శారీరక మానసిక నైతిక శక్తిని ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత తక్కువ ఇవ్వటానికి ప్రయత్నించే వారు ఏ పనివారి పై తన ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసాడో ఆ పనివారు కాలేరు. వారి ఆదర్శం అంటువ్యాధి వంటిది. స్వార్ధ ప్రయోజనం వారి ప్రధాన లక్ష్యం. పర్యవేక్షణ అవసరమైన వారు, ప్రతీ విధినీ నిర్దేశిస్తేనే గాని పని చెయ్యని వారు బళా నమ్మకమైన మంచి దాసులుగా యాజమానుడు ప్రశించేవారు కారు. శక్తిని, విశ్వసనీయతను, శ్రద్ధను కనపర్చే పనివారు ఏది చెయ్యటం అవసరమో దాన్ని చెయ్యటానికి సిద్ధంగా ఉండే పనివారు అవసరం.MHTel 442.2

    “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా; ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను”.2 కొరింథీ 8:9MHTel 442.3

    విఫలమౌతున్న భయంతో బాధ్యతలను పత్పించుకోవటం ద్వారా అనేకులు అసమర్దులౌతారు. పఠనం అధ్యాయనం తద్వారా పొందిన ప్రయోజనాలివ్వలేని అనుభవం ద్వారా సంపాదించాల్సిన విద్యను వారు ఇలా పొందలేకపోతున్నారు.MHTel 442.4

    మనుషుడు పరిస్థితులను రూపు దిద్దవచ్చు. కాని పరిస్థితులు మనుషుణ్ణి రూపుదిద్దుకూడదు. పని చేసేందుకు మనం పరిస్థితుల్ని పనిముట్లుగా అందుపుచ్చుకోవాలి. మనం వాటిపై అధికారం చలాయించాలి అని మన పై అధికారం చలాయించకూడదు,.MHTel 443.1

    శక్తిమంతులైన మనుషులు ఎవరంటే వ్యతిరేకించి, పోరాడి అడ్డుకుని నిష్పలం చేసేవారు. తమ శక్తుల్ని కార్యాచరణలో వినియోగించటం ద్వారా తాము ఎదుర్కుంటున్న అడ్డంకులు వాస్తవికమైన దీవెనలుగా పరిగణి స్తాయి, వారు స్వాలాబం సాధిస్తారు. సంఘర్షణ అందోళన దేవునిలో విశ్వాసానికి శక్తిని రూపొందంచే ధృఢత్వానికి పిలుపునిస్తాయి.MHTel 443.2

    క్రీస్తు అరకొర సేవ చెయ్యలేదు. ఆయన సమయం, ఆయన హృదయం, ఆయన ఆత్మ, ఆయన శక్తి మానవుల శ్రేయానికి సేవలో గడిచాయి. అలిపోయిన దినాల్లో కూడా ఆయన శ్రమించాడు. దీర్ఘరాత్రులు తాను మరింత పని చ్యెటానికి కృప కోసం సహన శక్తి కోసం ప్రార్ధనలో వంగి ఉండేవాడు. మానవాళిని ఉద్దరించే తన సేవా దీక్షలో తాను బలో పేతడయ్యేందుకు తన మానవ స్వభావం బలం పొందేందకు , మోసకారి అయిన తన శత్రువు మోసాల్ని ఎదుర్కొనేందుకు శక్తి కోసం, వేదన తోను, కన్నీటితోను తన మానువల్ని పరలోకానికి పంపేవాడు. తన పనివారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటున్నాడు “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని”. యోహాను 13:15MHTel 443.3

    “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది”అన్నాడు పౌలు 2 కొరింథీ 5:14 ఇదే అతడి ప్రవర్తనకు ప్రేరణ నిచ్చిన నియమం ; అదే అతడి చోదక శక్తి. విధి నిర్వహణ మార్గంలో ఒక్క క్షణం ప్రేమ చల్లారితే సిలువ వంక ఒక్క చూపు మనసును స్థిరపర్చుకునేటట్లు ఆత్మత్యాగ మార్గంలో కొనసాగేటట్లు చేసింది. సహోదరుల నిమిత్తం అతడి కృషిలో క్రీస్తు త్యాగంలో వెల్లడైన వశపర్చుకునే బలవంతం చేసే అనంత ప్రేమ మీద అతడు ఎక్కువ ఆధారపడ్డాడు. ఇది ఎంత చిత్తశుద్ధి గల మనసుకు తాకే విజ్ఞప్తి : “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారి ద్రవ్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను”. 2 కొరింథీ 8:9 ఆయన ఎంత ఎత్తు నుంచి వంగాడో, ఎంత పేద స్థితికి దిగివచ్చాడో మీరు ఎరుగుదురు. త్యాగ మార్గంలో ప్రవేశించిన ఆయన పాదాలు ఆయన తన ప్రాణాన్ని అర్పించేవరకు పక్కకు తొలగలేదు. పరలోక సింహాసనానికి సిలువకు మధ్య ఆయనకు విశ్రాంతి లేదు. మానవులు పట్ల తనకున్ను ప్రేమ ప్రతీ అవమానాన్ని సహించటానికి ప్రతీ దుష్కార్యాన్ని భరించటానికి ఆయన్ని నడిపించింది.MHTel 443.4

    “మీలో ప్రతివాడును తన సొంత కార్యములకు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను” అని పౌలు హితవు పలుకుతున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు. “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగియున్నవాడైయుండి, దేవునితో సమానముగానుండుట విడిచి పెట్ట కూడదని భాగ్యమని యెంచుకొనలేదు. గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు ఆయన అకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందుతనంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను”. ఫిలిప్పీ 2:4-8MHTel 444.1

    క్రీస్తు అవమనాన్ని మనం చూసి గుర్తించాలని పౌలు ఆతురపడుతున్నాడు. పరలోక ప్రభువు చేసిన త్యాగాన్ని చూడటానికి మనుషుల్ని నడిపించ గలిగితే వారి హృదయాల్లో నుంచి స్వార్ధం బహిష్కరించ బడుతుందని అతడు గట్టిగా నమ్మాడు. పాపుల పక్షంగా రక్షకుడు తన్ను తాను తగ్గించుకున్న అద్భుతాన్ని మనం కొంత మేరకు అవగాహన చేసుకొనేందుకు అపొస్తలుడు ఒకవిషయం తరువాత ఒక విషయాన్ని సావధానంగా వివరిస్తున్నాడు. పరలోకంలో తండ్రి రొమ్మున క్రీస్తు ఆక్రమించిన స్థానం పై మొదటగా మన మనసును నిలుపుతు ఆన్నడు.MHTel 444.2

    తరువాత తన మహిమను పక్కన పెట్టి మానవుడి ఈ జీవిత దీన పరిస్థితు లకు తనను తాను స్వచ్చందంగా అప్పగించుకొని, సేవకుడి బాధ్యతలను చేపట్ట మరణం పొందేతంగా విధేయుడై మిక్కిలి సిగ్గుకరమైన, మిక్కిలి భాధాకరమైన మరణాన్ని సిలువ మరణాన్ని పొందినవానిగా ఆయన్ని పౌలు బయలుపర్చుతున్నాడు. కృతజ్ఞత, ప్రేమ లేకుండా, మనం మన సొత్తు కామన్న స్పృహ లేకుండా, అద్భుతమైన ఈ దైవ ప్రేమ ప్రత్యతక్షతను మనం ధ్యానించగలమా? అలాంటి ప్రభువు సేవను గొణుగుకుంటూ లేక స్వార్ధ ప్రయోజనాల దృష్టితో చెయ్యకూడదు.MHTel 445.1

    “వెండి బంగారములవంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు|| అంటున్నాడు పేతురు 1 పేతురు 1:18 అయ్యో మానవుడి రక్షణ కొనటానికి ఇవి సరిపోతే, “వెండినాది బంగారం నాది” (హగ్గయి 2:8) అంటున్న ఆయన దీన్ని ఎంత సులువుగా సాధించేవాడు.! కాని పాపికి దేవుని కుమారుని రక్తం ద్వారా మాత్రమే రక్షణ లభించగలదు. మహాద్భుతమైన ఈ త్యాగాన్ని అభినందించని వారు క్రీస్తు సేవకు దూరంగా ఉంటారు. తమ స్వార్ధంలో నశించిపోతారు.MHTel 445.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents