Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    11—అతి బోగులకు సహాయం చెయ్యటం

    సువార్త సేవలో వాస్తవికమైన ప్రతీ సంస్కరణకు దాని స్థానం ఉంది. అది ఆత్మను ఓ నూతనమైన, ఉదాత్తమైన జీవితానికి లేవటానికి దోహద పడుతుంది. ముఖ్యంగా మితానుభవ సంస్కరణ క్రైస్తవ పనివారి మద్దతును అడుగుతుంది. వారు ఈ పనిమీదికి దృష్టిని మళ్ళించి దాన్ని సజీవ సమస్య చేయాలి. నిజమైన మితానుభవ సూత్రాలను ప్రతీ చోటా ప్రజలకు బోధించి మితానుభవ వాగ్దానం పై సంతకము చెయ్యటానికి పిలుపునివ్వాలి. దురభ్యాసాలకు బానిసలైనవారి విషయంలో మన:పూర్వకమైన కృషి చేయాలి.MHTel 137.1

    అమితానుభవం ద్వారా పతనమైన వారి కోసం చెయ్యాల్సిన పని ప్రతీ చోటా ఉంది. సంఘాలు, మత సంస్థలు, క్రైస్తవులుగా చెప్పుకునే గృహాల నడుమ అనేక మంది యువతీ యువకులు నాశన మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అ మితానుభవం అలవాట్లు ద్వారా వారు వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. పాప వ్యసనాలకు డబ్బు సంపాదించాలన్న దురాశ వలన వారు అపనమ్మకపు అభ్యాసాలకు అలవాటు పడతారు. ఆరోగ్యం ప్రవర్తన రెండూ నాశనమౌతాయి. దేవుని దూరస్థులు, సమాజం నుండి బహిష్కృతులు అయిన ఈ ఆత్మలు ఈ జీవితానికి గాని రానున్న జీవితానికి గాని తమకు ఎలాంటి పరీక్షణా లేదనా భావిస్తారు. కాని దేవుడు వారిని అలా పరిగణించడు. వారిని తమ ప్రస్తుత స్థితికి తీసుకువచ్చిన పరిస్థితులు అర్ధం చేసుకుంటాడు. వారి పట్ల కనికరం కలిగి ఉంటాడు. ఇది సహాయం డిమెండు చేసే ఓ తరగతి. “నా ఆత్మను ఎవరూ లెక్క చెయ్యటంలేదు” అనటానికి వారికి అవకాశం ఇవ్వకండి.MHTel 137.2

    అమితానుభవ బాధితులు అన్ని తరగతుల్లోను అన్ని వృత్తుల్లోను ఉన్నారు. ఉన్నత స్థాయి మనుషులు, ప్రఖ్యాత ప్రతిభావంతులు, గొప్ప కార్యాలు సాధించిన మనుషులు ఆహార పానాల శోధనను ప్రతిఘటించ లేనంత నిస్సహయులయ్యారు. వారిలో ఒకప్పుడు ధనవంతులైన కొందరు ఇల్లు లేకుండా, మిత్రులు లేకుండా, బాధ, దు:ఖం వ్యాధితో, హీన స్థితిలో ఉన్నారు. ఆత్మ నిగ్రహం కోల్పోయారు,. ఎవరైనా సహాయం హస్త చాపితేనే తప్ప వారింకా ఆదోగతికి దిగజారిపోతారు. వీరితో ఆహారపానాల యావనైతిక పాపమే కాదు. శారీరక వ్యాధి కూడా.MHTel 137.3

    అమిత భోగులకు సహాయం చెయ్యటంలో మనం, క్రీస్తు చేసినట్లు, ముందు వారి వారి శారీరక స్థితి పై దృష్టి పెట్టాలి. వారికి ఆరోగ్యవంతమైన ఉత్తేజపరచిన, ఆహార పానాలు, పరిశుభ్రమైన దుస్తులు, దేహ పరిశు భ్రతకు అవకాశం అవసరం. వారి చుట్టు సహయకరమైన, ఉన్నతమైన క్రైస్తవ వాతవరణం, ప్రభావం ఉండాలి. ప్రతీ నగరంలోన దురభ్యాసాల బానిసలు తమను బంధించిన గొలుసులను తెంచుకోవటానికి సహాయ మందించే స్థలం ఒకటి ఏర్పాటు చెయ్యాలి. కష్టంలోను బాధలోను ఉ న్నప్పుడు ఉపశమనాన్నిచ్చేది మత్తు పానీయమొక్కటే అన్నది అనేకుల భావన. యాజకుడు లేనీయుడి పాత్ర పోషించే బదులు క్రైస్తవులుగా పిలుచుకునే వారు మంచి సమరయుడి ఆదర్శాన్ని అనుసరించి వ్యవహరిస్తే ఇది అవసరంలేదు.MHTel 138.1

    అమితానుభవ బాధితులతో వ్యవహించేటప్పుడు మనం తెలివున్న మననుషులతో వ్యవహరించటం లేదని కాని, ప్రస్తుతం ఓ దయ్యం వశంలో ఉన్న వ్యక్తితో వ్యవహరిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఓర్పు సహనం కలిగి ఉండండి,. విరోధించే, నిషేధించే వాలకం గురించి ఆలోచించక విమో చించటానికి క్రీస్తు మరణించిన విలువైన ఆత్మను గురించి ఆలో చించండి. ఆ తాగుబోతు మేల్కొని తన నీచ స్థితిని గుర్తించినప్పుడు మీరు అతడి మిత్రుడు అని చూపించటానికి చెయ్యగలిగినదంతా చెయ్యండి. నిందించే ఒక్క మాట పలకకండి. నిందను లేక ద్వేషాన్ని వ్యక్తం చేసే చేత గాని చూపు గాని చోటు చేసుకోకూడదు. అతడు తనను తాను శపించుకోవచ్చు. అతడు లేవటానికి సహాయం చెయ్యండి. విశ్వాసాన్ని ప్రోత్సహించే మాటలు మాట్లడండి. అతడి ప్రవర్తనలో మంచి గుణాల్ని బలపర్చటానికి ప్రయత్నించండి. పైకి చేరటం ఎలాగో అతడికి నేర్పించండి. సాటి మనుషుల గౌరవాదరాలను పొందే విధంగా తాను నివసించటం సాధ్యమేనని అతడికి చూపించండి. దేవుడు తనకిచ్చిన, కాని తాను వృద్ధిపర్చుకోవటం ఆశ్రద్ధ చేరసిన వరాల విలువను చూసేటట్లు అతడికి సహాయం చెయ్యండి.MHTel 138.2

    అతడి చిత్తం భ్రష్టమైన బలహీనపడినా, క్రీస్తులో అతడికి నిరీక్షణ ఉన్నది. హృదయ ఉన్నతు ఉద్వేగాలు పరిశుద్ద కోరికల విషయంలో అతడు మేల్కొంటాడు. సువార్తలో తన ముందుంచబడ్డ నిరీక్షణను స్వీకరించటానికి అతణ్ణి ప్రోత్సహించండి. శోధనను ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్న వ్యక్తి ముందు బైబిలు తెరిచి దేవుని వాగ్దానాల్ని మళ్లీ మళ్లీ చదివి అతడికి వినిపించండి. అతడికి ఈ వాగ్దానాలు జీవ వృక్షపు ఆకుల్లా ఉంటాయి. వణుకుతున్న హస్తం క్రీస్తు ద్వారా విమోచనను నిరీక్షణను స్వీకరించే వరకూ మీ కృషిని సహనంతో కొనసాగించండి.MHTel 139.1

    ఎవరికి సహాయం చెయ్యటానికి మీరు కృషి చేస్తున్నారో వారిని గట్టిగా పట్టుకోండి. లేదంటే మీరు జయం సాధించలేరు. వారు దుర్మార్గాన్ని అనుసరించటానికి నిత్యం శోధించబడతారు. మద్యపానానికి మళ్లీ మళ్లీ పుట్టే వాంఛకు దాదాపు లొంగిపోతారు. వారు మళ్లీ మళ్లీ పడిపోవచ్చు. అయినా, మీ కృషిని అపవద్దు.MHTel 139.2

    క్రీస్తు కోసం జీవించటానికి వారు తీర్మానించుకున్నారు కాని వారి సంకల్ప శక్తి బలహీనమయ్యింది. లెక్క అప్పగించాల్సిన వారిగా ఆత్మల విషయమై మెళకువగా ఉండాల్సినవారు వారిని జాగ్రత్తగా కాపాడాలి. వారు తమ పురుషార్గాన్ని కోల్పోయారు. దాన్ని వారు తిరిగి సంపాదించాలి. అనేక మంది దుష్టత్వానికి పారంపర్యంగా వస్తున్న ప్రవృత్తులతో పోరాడలి. అసహజ వాంఛలు ఇంద్రియసుఖ ప్రేరణలు పుట్టుక నుంచి వారికి వారసత్వంగా వచ్చినవి. వీటికి తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. లోపల బయట మంచి చెడల మధ్య అధిపత్యానికి పోరు జరుగుతున్నది. అలాంటి అనుభవాల్ని ఎన్నడూ పొందనివారు ఆహార పానాల వాంఛకున్న వశీకరణ శక్తిని లేక వ్యసనానికి అన్ని విషయల్లో మితానుభవం కలిగి ఉండాలని చేసుకున్న తీర్మానానికి మధ్య ఉన్న సంఘర్షణ తీవ్రతను తెలుసుకోలేరు. ఈ పోరాటాన్ని మళ్లీ మళ్లీ పోరాడాలి.MHTel 139.3

    క్రీస్తుకి ఆకర్షితులైన అనేకులకు ఆహారపానాల వాంఛకు భావోద్రేకానికి వ్యతిరేకంగా పోరాడటానికి నైతకి ధైర్యం ఉండదు. దీని వల్ల సంస్కరణ పనివాడు నిరుత్సాహ చెందకూడదు. వెనక్కు తిరిగేవారు తుచ్చ స్తితి నుంచి విమోచించబడ్డవారు మాత్రమేనా?MHTel 140.1

    మీరు ఒంటరిగా పనిచెయ్యటం లేదని గుర్తించుకోండి. యధార్ధ హృదయం గల ప్రతీ దైవ కుమార్తెతో పని చెయ్యటానికి పరిచర్య చేసే దేవదూతలే ఏకమౌతారు. క్రీస్తు పునరుద్ధరిస్తాడు.ఆమహా వైద్యుడే నమ్మ కమైన తన పనివారి పక్క నిలబడి పశ్చాత్తాపం పొందిన ఆత్మతో ‘కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నవి అంటాడు”. మార్కు 2:5MHTel 140.2

    గొప్ప అవకాశాలు గొప్ప వెలుగు ఉన్నవారు కాని వాటిని సద్వినియోగం చేసుకోనివారు బయట చీకటిలో విడువబడగా, సమాజం తృణీకరించే అనేకులు, సువార్తలో తమ ముందుంచబడ్డ నిరీక్షణను అందిపుచ్చుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.MHTel 140.3

    దురభ్యాసాల బాధితులు తమ నిమిత్తం కృషి చేయ్యాల్సిన అవసరాన్ని గుర్తించటానికి వారిని మేల్కొలపాలి. వారిని పైకి లేపటానికి ఇతరులు మన:పూర్వక కృషి చేయ్యవచ్చు. దేవుని కృప ధారాళంగా ఉండవచ్చు. ఆయన దూతలు పరిచర్య చెయ్యచ్చు. కాని వారు తమ పక్షంగా తమ సొంత పోరాటాలు పోరాడకపోతే ఇవన్నీ వ్యర్ధమే.MHTel 140.4

    అప్పుడు యువకుడుగా ఉన్న, కొద్ది కాలంలో ఇశ్రాయేలు రాజ్య కిరీటాన్ని అందుకోనున్న సొలొమోనుతో దావీదు చివరి మాటలు ఇవి”. నీవు దైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి” ఉండుము 1 రాజులు 2:2 నిత్య జీవ కిరిటానికి అభ్యర్ధి అయిన ప్రతీ వ్యక్తికీ ఈ ఆవేశపూరిత వాక్కులు ఉద్దేశించబడ్డవి.MHTel 140.5

    తిండికి బానిసలైనవారు తాము పురుషత్వం కలిగి ఉండాలంటే తమకు నైతిక నవీకరణ అవసరమని గుర్తించాలి. పాప వ్యసనాలవల్ల తాము పోగొట్టుకున్న పురుషత్వాన్ని క్రీస్తు శక్తితో తిరిగి పొందాలి.MHTel 140.6

    శోదన భయంకర శక్తిని, అమితానుభవానికి దారి తీసే వాంఛ ఆకర్షణనను అనుభవించిన వ్యక్తులు నిస్పృహతో “ఛెడును ప్రతిఘటిం చలేను” అంటున్నారు. ప్రతిఘటించగలరు. ప్రతిఘటించాలి అని అతడితో చెప్పండి. అది మళ్లీ మళ్లీ అతడిని జయించి ఉండవచ్చు. కాని అది ఎల్లప్పుడూ జయించాల్సిన అవసరం లేదు. నైతిక శక్తిలో అతడు బలహీనుడు పాప జీవిత అభ్యాసాలు అతణ్ణి అదుపు చేసాయి. అతడి వాగ్దానాలు, తీర్మానాలు నీటిపై రాతలాంటివి. తన భగ్న వాగ్దానాలు తాను నిలుపుకో లేకపోయిన ప్రతిజ్ఞల గుర్తింపు తన నిజాయితీ పై తన నమ్మకాన్ని బలహీనపర్చి దేవుడు తనను అంగీకరించలేడని లేక తన కృషిలో తనతో పనిచెయ్యలేదని భావించటానికి నడిపించవచ్చు. కాని అతడు నిరాశ చెందనవసరంలేదు.MHTel 141.1

    ఎవరు తమ నమ్మకాన్ని క్రీస్తు పై ఉంచుతారో వారు వంశ పారంపర్యంగా వచ్చే బలహీనకు లేక నేర్చుకున్న అలవాటుకు లేక ప్రవృత్తికి బానిస కానక్కరలేదు. క్షుద్ర స్వభావానికి బందీ అయివుండే బదులు వారు ప్రతీ రుచిని భావోద్రేకాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. మన పరిమిత శక్తితో దుర్మార్గతతో పోరాడటానికి దేవుడు మనల్ని విడిచి పెట్టలేదు. చెడు చెయ్యటానికి మన అనువంశిక ప్రవృత్తులు లేక నేర్చుకున్న అలవాట్లు ఏవైనా ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా న్న శక్తి ద్వారా వాటిని జయించగలం.MHTel 141.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents