Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    జీవితంలోని ఉత్తమ విషయాలు

    మనుషులు జీవిత యధార్ధ ధ్యేయాన్ని అర్ధం చేసుకోవటం మొదలు పెట్టలేదు. వారు తళుకు బెళుకి ఆడంబారానికి ఆకర్షితులవుతున్నారు. లోక సంబంధమైన ప్రాధాన్యానికి తాపత్రయపడుతున్నారు. దీనికి జీవిత యధార్ధ ధ్యేయాలను బలి చేస్తున్నారు. సామాన్యత, యధార్ధత. సత్యసంధత, పవిత్రత విశ్వసనీయత వంటి జీవితపు శ్రేష్టమైన విషయాలు కొనటానికి అమ్మటానికి సాధ్యం కానివి. అవి అజ్ఞానులకు విద్యావంతులకు దీన శ్రామికుడికి పేరుగాంచిన రాజనీతిజ్ఞుడికి అందరికీ ఉచితం . దేవుడు అందరికి ఆనందాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని గొప్పవారు పేదవారు ఒకే రీతిగా అనుభవించవచ్చు. అది పవిత్ర ఆలోచనను సాగు చెయ్యటంలో స్వార్ధం లేని క్రియలో, సానుభూతి తెలిపే మాటలు మాట్లాడటంలో, దయగల కార్యాల చేయటంలో కలిగే ఆనందం. అటువంటి సేవ చేసే వారి నుండి క్రీస్తు వెలుగు అనేక నీడల వల్ల చీకటితో నిండిన జీవితంలో ప్రకాశిస్తుంది.MHTel 162.2

    పేదలకు లౌకిక విషయాల్లో సహాయం చేస్తుండగా వారి ఆధ్యాత్మిక అవసరాల్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి. రక్షకుని కాచి కాపడే శక్తికి మీ జవితం సాక్ష్యం కానివ్వండి., అందరూ చేరటానికి సాధ్యమైన ఉన్నత ప్రమాణాన్ని మీ ప్రవర్తన వెల్లడి చేయనివ్వండి. సామాన్యమైన దృష్టాంత పాఠాలతో సువార్తను బోధించండి. మీకు సంబంధించిన ప్రతీ విషయం ప్రవర్తన నిర్మాణంలో ఓ పాఠం కానివ్వండి. MHTel 163.1

    మిక్కిలి సామాన్యమైన పనిలో అతి బలహీనుడు, జ్ఞానంలేని వ్యక్తి, దేవునికి తోటి పనివారు కావచ్చు, ఆయన సన్నిధిని కృపను కలిగి ఉండ వచ్చు. అందోళనలు,అనవసరమైన చింతలతో వారు అసలిపోకూడదు. రోజూ పనిచేసి దేవుని కృప నియమించిన పనిని వారు నమ్మకంగా చెయ్యాలి. ఆయన వారిని గూర్చిన శ్రద్ధ తీసుకుంటాడు. ఆయనంటున్నాడు;MHTel 163.2

    “దేవుని గూర్చియు చింతింపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనలచేత కృతజ్ఞతా పూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”. “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవున సమాధనము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపు లకును కావలియుండును”. ఫిలిప్పీ 4:6,7.MHTel 163.3

    తాను సృజించిన జీవులందరిపై ప్రభువు శ్రద్ధ చూపుతాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఎలాంటి తేడా చూపించడు. జీవితంలో మిక్కిలి బరువైన భారాలు మొయ్యటానికి పిలువబడ్డ వారి పట్ల మిక్కిలి దయ చూపించటం తప్ప, దేవుని పిల్లలకు కష్టాలు శ్రమలు వస్తాయి. లోకం ఇవ్వటానికి నిర్లక్ష్యం చేసిన వాటన్నింటికి ప్రతిగా తమకు దేవుడే ఉత్తమమైన వాటిని ఇస్తాడని జ్ఞాపక ముంచుకొని వారు తమ స్థితి ఎలాంటిదైనా దాన్ని సంతోషంగా అంగీకరించాలి.MHTel 163.4

    మనం కష్టమైన పరిస్తితులకు వచ్చినప్పుడు దీన ప్రార్ధనకు జవాబుగా ఆయన తన శక్తిని బయలుదపర్చుతాడు. ప్రార్ధన వినే, ప్రార్ధనకు జవాబిచ్చే దేవునిగా ఆయనలో నమ్మిక ఉంచండి. ప్రతీ అత్యవసర పరిస్థితిలో సహాయం చెయ్యగల దేవుడిగా ఆయన తనను తాను మీకు కనపర్చు కుంటున్నాడు. మనిషిని సృజించి, అతడికి తన అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్మాతిక శక్తుల్ని ఇచ్ని ఆయన తానిచ్చిన జీవాన్ని పోషించటానికి ఏది అవసరమో దాన్ని ఇవ్వకుండా అట్టి పెట్టుకోడు. తన వాక్యాన్ని - జీవ వృక్షం ఆకులను ... ఇచ్చిన ఆయన ఆహారం లేని తన పిల్లలకు ఎలా ఆహారం పెట్టాలో అన్న విషయంలో జ్ఞానాన్ని మనికివ్వకుండా నిలుపు చెయ్యడు.MHTel 163.5

    వెండి కోసం వెదకేటట్లు వెదకటం ద్వారానా? దాచబడ్డ ధనం కోసం వెదకినట్లు వెదకటం ద్వారానా? “వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ఆయన వానికి ఆ పని భోదించుచున్నాడు”.MHTel 164.1

    యెషయా 28:26 “జనులు సైన్యములకధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్దియు అనుగ్రహించువాడు ఆయనే”. యెషయా 28:29MHTel 164.2

    తోట ఎలా పెంచాలో ఏదెనులో ఆదామవ్వలకు నేర్పించిన ఆయన నేడు మనుషులకు నేర్పించాలని అభిలాషిస్తున్నాడు. పొలందున్ని విత్తనాలు విత్తే వాడికి జ్ఞానం ఉంది. విశ్వసించి ఆయనకు విధేయులయ్యే వారి ముందు దేవుడు అభివృద్ధి మార్గాలు తెరుస్తాడు.తన దయాళుత్వ ఐశ్వర్యం చొప్పున తమ అవసరాలను సరఫరా చెయ్యటానికి ఆయన యందు విశ్వాసముంచే వారు ధైర్యంగా ముందుకి సాగాలి,.MHTel 164.3

    అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలతో జన సమూహానికి ఆహారం పెట్టిన ఆయన నేడు మనకు మన శ్రమకు ఫలాన్ని ఇవ్వటానికి సమర్ధుడు. చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అన్న ఆ ప్రభువు.వారు ఆ పని చేసి నప్పుడు పిగిలేటట్టు వలలు నింపిన ఆయన. తమకు నేడు ఏమి చేస్తాడన్నా దానికి నిదర్శనాన్ని ఇందులో తన ప్రజలు చూడాలని కోరుతున్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుంచి మన్నాను. ఇచ్చిన దేవుడు ఇంకా సజీవుడై పరిపాలిస్తున్నాడు. ఆయన తన ప్రజల్ని నడిపిస్తాడు. ఏ పనికి పిలవబడ్డారో ఆ పనిలో వారికి నిపుణతను అవగాహ నను ఇస్తాడు. మనస్సాక్షికి లోబడి తమ విధిని విజ్ఞతతో నిర్వహిచేవారికి ఆయన వివేకా న్నిస్తాడు. లోకానికి సొంతదారుడైన ఆయనకు ఎనలేని వనరులున్నాయి. ఇతరులకు మేలు చేసే ప్రతీ వ్యక్తికి ఆయన మేలు చేస్తాడు.MHTel 164.4

    మనం విశ్వాసంతో పరలోకం వైపుకు చూడాలి. వైఫల్యంగా కనిపించే వాటిని చూసి నిరుత్సాహపడకూడదు. ఆలస్యాన్ని బట్టి వేదన చెందకూడదు. నమ్మకంగా పనిచేసే కార్మికుడు సమకూర్చుకోవటానికి భూమిలో బంగారం, వెండి కన్నా విలువైన నిధులున్నాయని నమ్ముతూ, మనం సంతోషంగా, నిరీక్షణతో , కృతజ్ఞతతో పనిచెయ్యాలి పర్వతాలు కొండలు మారుతున్నాయి. భూమి ఓ వస్త్రంలా పాతదౌతున్నది కాని తన ప్రజల కోసం ఆరణ్యంలో బోజన బల్లను ఏర్పాటు చేసే దేవుని దీవెనలు ఎన్నడూ అంతమొందవు.MHTel 165.1

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents