Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విశాల జీవితం

    ఇతరుల కోసం పని చెయ్యటం మేల్కొల్పే ఆత్మార్పణోత్సాహం. ప్రవర్తనను విశాలపర్చి బలపర్చటానికి అది సమకూర్చే శక్తి మరి దేని వల్లా సాధ్యం కాదు. సంఘ సంబంధ బాంధవ్యాలకు ఎదురు చూసే అనేక నామ మాత్రపు క్రైస్తవులు తమను గురించి మాత్రమే ఆలోచిస్తారు. సంఘ సహవాసాన్ని పాదిరి సేవలను ఆనందిస్తారు. వృద్ధిలో ఉన్న పెద్ద సంఘాల సభ్యులయ్యి ఇతరులకు ఏమి చెయ్యకుండా తృప్తిగా ఉంటారు. ఇలా వారు తమకు రావలసిన అతి ప్రశస్తమైన దీవెనల్ని పోగొట్టుకుంటున్నారు. అనేకులు తమ ఆనందదాయకమైన సుఖ సంతోషాల్నిచ్చే స్నేహాల్ని త్యాగం చెయ్యటం ద్వారా గొప్ప దీవెన పొందుతారు. తమ శక్తులు క్రైస్తవ సేవలో వినియుక్తమయ్యే స్థలానికి వారు వెళ్లాలి. బాధ్యతలు వహించం నేర్చుకుంటారు. MHTel 118.1

    “ఒకని భారముల నొకడు భరించి, యిలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి”. గలతీ 6:2MHTel 118.2

    దగ్గర దగ్గరగా నాటిని చెట్లు ఆరోగ్యవంతంగా బలంగా పెరగవు. బాగా పెరిగేందుకు తోటమాలి వాటిని తిరిగి విశాలంగా పాతుతాడు. పెద్ద సంఘాల్లోని అనేక సభ్యుల విషయంలో ఇలాంటి పని జరగటం ప్రయోజన కరం. వారి శక్తులు ఎక్కడ క్రియాశీలమైన క్రైస్తవ సేవలో ఉపయుక్తమౌ తాయో అక్కడ వారిని ఉంచాలి. ఇతరుల నిమిత్తం ఆత్మ త్యాగపూరిత కృషి లేనందు వల్ల వారు మరుగుజ్జులు, అసమర్ధులు అయి తమ ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నారు. మరో మిషనరీ సేవా రంగంలోకి మార్పిడి జరిగితే, వారు ఆరోగ్యవంతంగాను బలంగాను పెరుగుతాయి.MHTel 118.3

    కాగా ఇతరులకు సహాయం చెయ్యటం మొదలు పెట్టటానికి దూరంలో ఉన్న ఏదో సేవా రంగానికి పిలిచేవరకూ ఆగనక్కరలేదు. సేవకు అన్ని చోట్లా తలుపులు తెరిచే ఉన్నాయి. మన సహాయం అసవరమైన వారు మన చుట్టు ఉన్నారు. ఆ విధవరాలు, ఆ ఆనాధ, ఆ రోగి, మరణిస్తున్న ఆ వ్యక్తి, ఆ అంటరాని వాడు ప్రతీ చోటా ఉన్నారు.MHTel 118.4

    మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కోసం పని చెయ్యటం మన ప్రత్యేక విధిగా భావించాలి. మీ స్నేహితులను ఇరుగుపొరుగు వారినీ సందర్శించేటప్పుడు, వారి ఆధ్మాత్మికమైన ఇహలోక సంబంధమైన సంక్షేమంలో ఆసక్తి కనపర్చండి. పాపాల్ని క్షమించే రక్షకుడుగా క్రీస్తును గురించి వారితో మాట్లాడండి. మీ పోరుగున ఉన్నవారిని మీ ఇంటికి ఆహ్వానించి వారితో కలసి బైబిలు నుంచి అందులోని సత్యాల్ని విశదీకరించే పుస్తకాల నుండిచదవండి. మీతో కలసి పాటలు పాడటంలోను ప్రార్ధన చెయ్యటంలోను పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానించండి. తాను వాగ్దానం చేసినట్లు ఈ చిన్న సమావేశాల్లో క్రీస్తు ఉంటాడు. ఆయన కృప హృదయాల్ని స్పృశిస్తుంది.MHTel 119.1

    “నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను ” లుకా 19:10MHTel 119.2

    సంఘ సభ్యులు ఈ పనిని చెయ్యటం స్వయంగా నేర్చుకోవాలి. విదేశాల్లో చీకటిలో ఉన్న ఆత్మల్ని రక్షించటం ఎంత ముఖ్యమో ఇది అంత ముఖ్యం. దూర దేశాల్లో ఉన్న ఆత్మలకోసం కొందరు హృదయం భారం కలిగి ఉండగా స్వదేశంలో ఉన్న అనేకులు తమ చుట్టూ ఉన్న ప్రశస్త ఆత్మల విషయంలో భారం కలిగి వారి రక్షణ కోసం అంతే ఆసక్తితో పనిచెయ్యాలి.MHTel 119.3

    అనేకులు తాము సంకుచిత జీవితం జీవిస్తున్నామంటూ విచారిస్తు ంటారు. తాము కోరుకున్నట్లయితే వారే తమ జీవితాన్ని విశాలంగాను ప్రభావంతంగాను జీవించవచ్చు. క్రీస్తును హృదయం మనసు ఆత్మలతోను తమ పొరుగువారిని తమ వలెనే ప్రేమిస్తున్నవారు తమ సామర్ధ్యాన్ని ప్రభావాన్ని ఉపయోగించటానిక విశాల రంగం ఉన్నది.MHTel 119.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents