Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    10—శోధించబడే వారికి చేయూత

    క్రీస్తు మనల్ని ప్రేమించినది ముందు ఆయిన్ని మనం ప్రేమించి నందుకు కాదు. కాని “మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను”. మనకు ఉచితమైనరీతిగా ఆయన మన పట్ల వ్యవహరించటం లేదు. మన పాపాలు శిక్షార్హమైనప్పటికి ఆయన మనల్ని శిక్షించటంలేదు. మన బలహీనతల్ని ఆజ్ఞానాన్ని మన కృతజ్ఞతను, అవిధేయతను ఆయన భరిస్తున్నాడు. మనం దారి తప్పి సంచరిస్తున్నా, కఠిన హృదయులమైనా, తన పరిశుద్ధ వ్యాక్యాన్ని ఆశ్రద్ధ చేస్తున్నా ఆయన చెయ్యి చాపి రమ్మంటూ మనల్ని ఆహ్వానిస్తున్నాడు.MHTel 128.1

    ఆయోగ్యులైన మానవుల పట్ల క్రియాశీలమయ్యే దైవ లక్షణమే కృప. దాన్ని మనం వెతకలేదు. మనల్ని వెతకటానికి తానే మన వద్దకు దేవుడు పంపాడు. దేవుడు తన కృపను మనకు ఇవ్వటానికి సంతోషిస్తాడు. మనం యోగ్యులమైనందుకు కాదు కాని మనం పూర్తిగా అయోగ్యుల మైనందుకు, మన గొప్ప అవసరమే ఆయన కృప పొందటానికి మనకుకన్న అర్హత.MHTel 128.2

    దేవుడు క్రీస్తు ద్వారా తన చెయ్యి చాపి పతనమైన పాపులకు దినమంతా ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఆయన అందరిని స్వాగతి స్తున్నాడు. ఘోరపాపులను క్షమించటం ఆయనకు మహిమ. ఆయన బలాడ్యుడి చేతిలో నుంచి కొల్ల సొమ్మును తీసుకుంటాడు. భీకరులు చెరపట్టిన వారిని విడిపిస్తాడు. మంటల్లో నుంచి కొరవిని తీస్తాడు. కృప అనే తన బంగారు గొలుసును దౌర్భగ్య స్థితి లోతుల్లో ఉన్న మానవుడికి ఆందించి పాపం పూబిలోనుంచి మానవుణ్ని పైకి లేపుతాడు.MHTel 128.3

    మానవులను తిరిగి దేవుని వద్దకు తీసుకువచ్చేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆయనకు ప్రతీ మావనడూ తన ప్రేమకు అర్హుడే. అపరాధులు నిస్సహాయులు. సాతాను ఉచ్చుల్లో నాశనమయ్యే వీలున్న ఆత్మల్ని కాపరి తన మందను కాపాడేట్లు ఆయన సంరక్షిస్తాడు.MHTel 128.4

    శోధింపబడే వారికి, తప్పిదాల్లో ఉన్నవారికి మన సేవలకు రక్షకుని ఆదర్శమే ప్రమాణం కావాలి. మనపట్ల ఆయన కనపర్చుతున్న అదే ఆసక్తిని కనికరాన్ని, దీర్ఘశాంతాన్ని వారి పట్ల మనం కనపర్చాలి. ఆయనంటున్నాడు. “నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను”. యెహాను13:34 క్రీస్తు మనలో ఉంటే మనకు ఎవరితో సంబంధాలుంటాయో వారందరికి ఆయన స్వార్ధరహిత ప్రేమను కనపర్చుతాం. సానుభూతి, సహాయం అవసరమైన వారిని చూసినప్పుడు, “వారు యోగ్యులా?” అని ప్రశ్నించకోకుండా”. వారికి నేనెలా సహాయం చెయ్యగలను” అని ఆలోచిస్తాం.MHTel 129.1

    భాగ్యవంతులు బీదవారు గొప్పవారు దీనులు స్వతంత్రులు బానిసలు లందరూ దేవుని సొత్తే. మానవుల్ని విమోచించటానికి తన ప్రాణిమిచ్చిన ఆయన పరిమిత జ్ఞానం గల మనుషుల లెక్కకు మించిన విలువను ప్రతీ మానవుడిలోను చూస్తాడు. సిలువ మర్మం మహిమలో ఆత్మకు ఆయన ఇచ్చే విలువ అంచానా ఏమిటో మనం గ్రహించాలి. మనం ఇది చేసినపుడు ఎంత దిగజారిపోయిన మానవులైన ఎంతో ఖరీదు పెట్టి కొన్నవారని వారిని నిర్లక్ష్యంగా ద్వేష భావంతో చూడరాదని భావిస్తాం. సాటి మానవుల్ని దేవుని సింహాసం వద్దకు ఎత్తేందుకు వారి కోసం పని చెయ్యటం ప్రాముఖ్యమని గుర్తిసాం. రక్షకుని ఉపమానంలో ఆ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణెం మురికలోను చెత్తలోను పడి ఉన్నా ఇది ఇంకా వెండే. అది విలువ గలది కాబట్టి ఆస్త్రీ దాని కోసం వెదకింది. అలాగే ప్రతీ ఆత్మ విషయంలోను పాపం వల్ల ఎంత నీచస్థితికి చేరినా దేవుని దృష్టిలో ఆ ఆత్మ ప్రశస్తమైనది. పరిపాలనాధికారి స్వరూపం, పైరాత ఆ నాణెం కలిగి ఉన్నట్లే. మానవుడు తన సృష్టి సమయంలో దేవుని స్వరూపాన్ని పైరాతను కలిగి ఉన్నాడు. పాపం ప్రభావం వల్ల ఇప్పుడు అవి శిధిలమై కాంతిహీనమైనా ఈ పైరాత ఆనవాళ్ళు ప్రతీ ఆత్మపైనా మిగిలి ఉన్నాయి. ఆ ఆత్మను తిరిగి సంపాదించి దాని మీద తన స్వరూపాన్ని నితీలోను పరిశుద్ధతలోను తిరిగి దిద్దాలని దేవుడు అభిలాషిస్తున్నాడు.MHTel 129.2

    క్రీస్తుకు మనకు మధ్య ఉండాల్సిన ఏకత్వ బంధం విషయంలో ఎంత తక్కువగా మనం క్రీస్తుతో సానుభూతిలో ప్రవేశిస్తుంటా... భ్రష్టులు, అపరాధులు అయిన, బాధలనుభవిస్తున్న, అతిక్రమాలు పాపాల్లో మరణి స్తున్న ఆత్మల పట్ల దయాళుత్వం విషయంలో! మానవుడి పట్ల మానవడు అమానుషత్వం మన తీవ్రమైన పాపం. దేవుని కరణను ఆయన గొప్ప ప్రేమను చూపించటంలో విఫలులౌతు తాము దేవుని న్యాయశీలతను సూచిస్తున్నామని అనేకులు భావిస్తారు. తరచు వారు ఎవరి విషయంలో కఠినంగా కర్కశంగా వ్యవహరిస్తున్నఆరో వారు శోధన ఒత్తిడి కింత సతమతమౌతున్నావారు. ఈ ఆత్మలతో సాతాను పోరాటం సాగిస్తున్నాడు. కఠోరమైన దయలేని మాటలు వారిని నిరుత్సాహపర్చి శోధకుడి శక్తికి బలి చేస్తాయి.MHTel 129.3

    మనసులతో వ్యవహరించటం సున్నితమైన విషయం. హృదయాన్ని చదవగలిగిన ఆయన మాత్రమే. మనుషులకు పశ్చాత్తాపం పుట్టించగలడు. నశించిన వారిని చేరటంలో ఆయన జ్ఞానం మాత్రమే మనకు జయాన్నివ్వ గలదు.“నీకంటే నేను పరిశుద్ధుడను” అనుకూంటా మీరు గట్టిగా నిలబడవచ్చు. మీ వాదన ఎంత నిర్దుష్టంగా ఉన్నా, లేక మీ మాటలు ఎంత వాస్తవంగా ఉన్నా, అవి మనసుల్ని కదలించలేవు. మాటల్లోను క్రియల్లోను క్రీస్తు ప్రేమ ప్రదర్శితమైతే నీతి బోధ పునరుద్ఘాటన లేక వాదన విఫలమైనప్పుడు అది ఆత్మను గెలుస్తుంది.MHTel 130.1

    మనకు క్రీస్తును పోలిన సానుభూతి ఎక్కువ అవసరం. తప్పులు లేనివారిగా కనిపించే వారికే సానుభూతి కాదు. గాని తరుచుగా తప్పిదాలు పాపాల్లో పడి పశ్చాత్తాపం పొంది శోధింపబడి, ఆధైర్యం చెందే బాధపడే పోరాడే దీనాత్మల పట్ల సానుభూతి అవసరం. కరుణామయుడైన మన ప్రధాన యాజకునిలా కనికరంతో మనం మన పొరుగువారి బలహీనతల సహానుభవం మనసులో ఉంచుకొని వారి వద్దకు వెళ్ళాలి.MHTel 130.2

    జాతుల్లోని అంటరాని వారిని సుంకరులను, పాపులను, తృణీకరించ బడ్డవారిని క్రీస్తు పిలిచి తన ప్రేమ కనికరాలవల్ల తన వద్దకు ఆకర్షించు కున్నాడు. తన ఆత్మాభిమానంలో ప్రత్యేకంగా నిలిచి ఇతరుల్ని తక్కువగా చూసే ఒక తరగతిని ఆయన అంగీకరించలేదు.MHTel 130.3

    “నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోనికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము” అన్నాడు క్రీస్తు. ఈ ఆదేశం ప్రకారం మనకు సమీపంలో ఉన్న అన్యుల దగ్గరకు దూరంలో ఉన్నవారి దగ్గరకు మనం వెళ్ళాలి. “సుంకరులు జారస్త్రీలు” రక్షకుని ఆహ్వానాన్ని వినాలి. పాపంలో లోతుగా కూరుకుపోయిన వారిని పైకిలేపటానిక ఒత్తిడి చేసే శక్తిగా ఆ ఆహ్వానం.. దానినందించే దూతల కనికరం దీర్ఘశాంతం ద్వారా... రూపొందుతుంది.MHTel 131.1

    ఏ ఆత్మల్ని నాశనం చెయ్యటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడో ఆ ఆత్మలకోసం ధృడ సంకల్పంతో, ఆసక్తితో, ఎడతెగని విజ్ఞాపనలతో పని చెయ్యాలని క్రైస్తవ ఉద్దేశం ప్రేరేపిస్తుంది. నశించిన ప్రజలు రక్షణ కోసం పాటుపడటానికి ఆతురతగా ఎదురు చూసే శక్తిని ఏదీ నిరుత్సాహపర్చ కూడదు.MHTel 131.2

    పురుషులను స్త్రీలకు క్రీస్తు వద్దకు సత్వరమే రండంటూ కోరుతూ దైవ వాక్యమంతటా ఆహ్వానం ఎలా ప్రదర్శితమయ్యిందో గమనించండి. మనుషులను రక్షకుని వద్దకు ఆకర్షించటానికి ప్రతీ వ్యక్తిగత, బహిరంగ వాదనను, నిత్యత్వ భావం గల ప్రతీ ఉద్దేశాన్ని సమర్పించటానికి మనం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలి. యేసు వంక చూసి ఆయన ఆత్మ నిరసన, ఆత్మత్యాగ జీవితాన్ని అంగీకరించి అవలంబిచాల్సిందిగా మన శక్తి అంతటితో వారితో విజ్ఞాపన చేయ్యాలి. ఆయన వరాల్లో ప్రతీదాన్ని ఆయన నామాన్ని ఘనపర్చటానికి ఉపయోగించటం ద్వారా వారు క్రీస్తు హృదయాన్ని సంతోష పెట్టాలని ఎదరు చూస్తున్నామని మనం కనపర్చాలి.MHTel 131.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents