Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పేదల పట్ల పరిగణన

    ఈ ఏర్పాట్లు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేదు. పేదరికం పూర్తిగా పోవటం దేవుని ఉద్దేశం కాదు. ప్రవర్తనాభివృద్ధికి అది ఓ సాధనమని అయన అంటున్నాడు;“బీదలు దేశములో ఉండకమానరు అందుచేత నేను నీ దేశములో నున్న నీ సూదరులగు దీనులకును, బీదలకును అవ శ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నానను. “ద్వితి 15:11..MHTel 151.1

    “నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయము కఠినపర్చుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యచాచి వాని అక్కర చొప్పున ఆయక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్య వలెను.” 7,8 వచనలు.MHTel 151.2

    “పరవావసియైనను, అతిధియైనను, నీ సహోదరుడొకడు బీదవాడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీ వలన బ్రదుకవలెను”. లేవీయ 25:35MHTel 151.3

    “మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు.” “నీ పొలములో నీపంట కోయుచు న్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిగిపోకూడదు.. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు.. నీ ద్రాక్షపండ్లను కోసికొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. ఆది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఉండవలెను. “లేవియ 19:9; ద్వితి 24:19-21.MHTel 151.4

    తమ ఔదార్యం తమను లేమికి తెస్తుందని ఎవరూ భయపడనవసరం లేదు. దేవుని ఆజ్ఞలకు విధేయులవ్వటం తప్పక సౌభాగ్యాన్నిస్తుంది. “నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారింప కూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.” “నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పుచేయవు.; అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు” ద్వితి 15:10,6MHTel 152.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents