Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    16—రోగుల కోసం ప్రార్ధన

    మనుషులు ‘విసుకక ప్రార్ధన చేయుచుండవలెను” (లూకా 18:1) అని లేఖనం చెబుతున్నది. తమకు ప్రార్ధన అవసరమని వారు భావించే సమయం ఉంటే అది వారి బలం తగ్గి జీవితం పైనే తమ పట్టు జారిపోతుందనుకున్నప్పుడే. మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవారు తరుచు రోజుకు రోజు సంవత్సరానికి సంవత్సరము తమకు వస్తున్న అద్భుతమైన కృపలను మర్చిపోతారు. ఆయన మేలుల నిమిత్తం దేవునికి స్తోత్రార్పణ చెయ్యరు. వ్యాధి వచ్చినప్పుడు మాత్రం దేవున్ని జ్ఞాపకం చేసుకుంటారు. మానవ శక్తి క్షీణించనప్పుడు మనుషులు దైవ సహాయ అవసరాన్ని గుర్తిస్తారు. కృపా కనికరాలు గల మన దేవుడు యదార్థ చిత్తంతో తన సహాయాన్ని అన్వేషించి ఆత్మ నుండి ఎన్నడూ వైదొలగడు. వ్యాధిలోను ఆరోగ్యంలోను ఆయనే మనకు ఆశ్రయం. MHTel 187.1

    “తండ్రి తన కుమారుని యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనను తెలిసియున్నది మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు... కీర్తనలు 103:13,14MHTel 187.2

    “బుద్దిహీనులు తమ దుష్ట ప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్దములన్నియు వారి ప్రాణమునకు అసహ్యా మగును వారు మరణ ద్వారములను సమీపించుదురు ” కీర్తనలు 107:17,18 MHTel 187.3

    “కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను”. 19,20 వచనాలు MHTel 187.4

    కీర్తన కారుడి ద్వారా పరిశుద్దాత్మ ఈ మాటలన్ని పలికినపడు దేవుడు వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యాన్ని పునరుద్దరించటానికి ఎంత సంసిద్ధముగా ఉన్నాడో నేడు కూడా అంతే సంసిద్ధముగా ఉన్నాడు. తన భూలోక సేవా కాలంలోని కరుణామయ వైద్యుడైన ఆ క్రీస్తే ఇప్పుడూ అదే దయామయుడైన క్రీస్తు. ప్రతీ వ్యాధికి స్వస్థత కూర్చే. ప్రతి బలహీనతను తీసివేసే శక్తి గల తైలం ఆయనలో ఉంది. పూర్వం ఆయన శిష్యులు చేసినట్లు ఈ కాలంలోని ఆయన శిష్యులు రోగుల కోసం ప్రార్ధన చెయ్యాలి. స్వస్థతలు సంభవిస్తాయి. “విశ్వాససహితమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును” మనకు పరిశుద్దాత్మ శక్తి ఉన్నది. దేవుని వాగ్దానాలు నెరవేర్చు పొందగల విశ్వాసం తాలూకు హామీ మనకున్నది “రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు” (మార్కు 16:18) అన్న వాగ్దానం అపొస్తలలు దినాల్లో ఎంత నమ్మదిగిందో నేడూ అంతే నమ్మదిగినది. అది దేవుని బిడ్డలకు తమ అధిక్యతను అందిస్తున్నది. దానిలో ఇమిడి ఉన్న సమస్తాన్నీ మన విశ్వాసం అందిపుచ్చుకోవాలి. క్రీస్తు తన సేవకుల ద్వారా పనిచేస్తాడు. తన స్వస్థత శక్తిని వారి ద్వారా కనపర్చాలన్నది ఆయన కోరిక. వ్యాధిగ్రస్తుల్ని బాధపడుతున్న వారిని విశ్వాస హస్తాలతో దేవునికి సమర్పించటం మన పని. ఆ మహా వైద్యునిలో నమ్మిక ఉంచవలసినదిగా మనం వారికి భోధించాలి.MHTel 187.5

    వ్యాధిగ్రస్తుల్ని నిరీక్షణ లేనివారిని బాధల్లో ఉన్నవారిని తన శక్తి మీద ఆధారపడవలసినదిగా ప్రోత్సహించాలని రక్షకుడు కోరుతున్నాడు. విశ్వాసం, ప్రార్ధన ద్వారా రోగుల గది బేతేలుగా మార్పు చెందవచ్చు. నాశనం చెయ్య టానికి కాదు రక్షించటానికి “దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు” అని వైద్యులు నర్సులు తమ మాటల ద్వారాను క్రియలద్వారాను, అపార్థం చేసుకోవటానికి తావు లేకుండా స్పష్టంగా చెప్పవచ్చు. వైద్యులు నర్సుల హృదయాలను మధురమైన తన ప్రేమతో నింపుతూ, క్రీసు రోగుల గదిలో తన సన్నిధిని ప్రదర్శించటానికి అభిలాషిస్తున్నాడు. తమతో కలసి రోగి పడక పక్కకు క్రీస్తు వెళ్ళగలిగేదిగా సహయకుల జీవితం ఉంటే, కరుణ గల రక్షకుడు అక్కడ ఉన్నాడన్న నమ్మకం రోగికి కలుగుతుంది. ఈ నమ్మకమే అతడి ఆత్మకు శరారానికి స్వస్థత కూర్చటంలో ఏంతో మేలు చేస్తుంది.MHTel 188.1

    దేవుడు ప్రార్ధన వింటాడు. క్రీస్తన్నాడు, “నా నామమున మీరు నన్నేమి అడిగనను నేను చేతును”. మళ్లీ ఆయన ఇలా అన్నాడు. “ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపర్చును”. యోహాను 14:14, 12:26 ఆయన వాక్యం ప్రకారం మనం నివసిస్తే తాను చేసిన ప్రతీ ప్రశస్త వాగ్దానాన్ని ఆయన మన పట్ల నెరవేర్చుతాడు. మనం ఆయన కృపకు అపాత్రులం. కాని మనల్ని మనం ఆయనకు సమర్పించుకునే కొద్ది ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఆయనను వెంబడించేవారి కోసం వారి ద్వారా ఆయన పనిచేస్తాడు.MHTel 189.1

    అయితే, ఆయన వాక్యానికి విధేయులమై నివసించినప్పుడే ఆయన వాగ్దానాల నెవరేర్పును మనం పొందగలం. కీర్తనకారుడు ఇలా అంటు న్నాడు. “నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును”. కీర్త 66:18 ఆయనకు మనం అంతంత మాత్రపు మనఃపూర్వకంకాని, విధేయత చూపిస్తే ఆయన వాగ్దానం మనపట్ల నెరవేరదు.MHTel 189.2

    వ్యాధిగ్రస్తుల స్వస్థత కోసం ప్రత్యేక ప్రార్ధనను గూర్చిన ఉపదేశం మనకు దేవుని వాక్యంలో ఉన్నది. అలాంటి ప్రార్ధన చెయ్యటం అతి గంభీరమైన చర్య. దాన్ని ఆచి తూచి చేపట్టాలి. వ్యాధిగ్రస్తుల స్వస్థత కోసం ప్రార్ధనను గూర్చి అనేక సందర్భాల్లో విశ్వాసంగా భావించబడేది ఊహ మాత్రమే.MHTel 189.3

    అనేకమంది తమ స్వార్ధ కోరికలను తృప్తిపర్చుకోవటం వల్ల వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారు. వారు ప్రకృతి చట్టానికి లేక ఖిచ్చతమైన పవిత్రతా నియమాలను విధేయులై నివసించలేదు. ఇతరులు తమ ఆహార పానాల అలవాట్లు, వస్త్రధారణ లేక పని అలవాట్లులో ఆరోగ్య నియమాలను బేఖాతరు చేసారు. మానసికమైన లేక శారీరకమైన బలహీనతకు తరుచు ఏదో ఒక చెడుతనం కారణమౌతుంది. ఈ వ్యక్తులు స్వస్థత పొందాలా ? ప్రార్ధనకు ప్రతిఫలంగా దేవుడు తమను స్వస్థపర్చితే వారిలో అనేకులు అనారోగ్యకరమైన తమ అలవాట్లును యధేచ్చగా కొనసాగించి అద్దు అపూ లేకుండా అనుచిత ఆహారాన్ని, పానాల్ని అనుభవించవచ్చునని వాదిస్తూ దేవుని ప్రకృతి చట్టాలను ఆధ్యాత్మిక చట్టాలను అతిక్రమిస్తూ అదే మార్గాన కొనసాగుతుంటారు. ఈ వ్యక్తులకు దేవుడు తిరిగి ఆరోగ్యాన్నిస్తే ఆయన పాపాన్ని ప్రోత్సహిస్తున్నవాడౌతాడు.MHTel 189.4

    అనారోగ్యకరమైన అలవాట్లు అభ్యాసాల్ని మానటం వారికి నేర్పించక పోతే, తమ వ్యాధులు బలహీనతల స్వస్థతకు దేవుని మీద ఆధార పడాల్సిందిగా ప్రజలకు నేర్పించడం వ్యర్ధ ప్రయత్నం. ప్రార్ధనకు జవాబుగా ఆయన దీవెనలు పొందాటినికి వారు చెడు చెయ్యటం మాని మేలు చెయ్యటం నేర్చుకోవాలి.. వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వారి అలవాట్లు సరియైనవి కావాలి. వారు దేవుని ప్రకృతి చట్టానికి ఆధ్యాత్మిక చట్టానికి విధేయులై నివసించాలి.MHTel 190.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents