Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మా మాట

    లోకం వ్యాధిగ్రస్తమయ్యింది. మనుషుల నివాసాలు వ్యాధి బాదలతో విలవిలలాడుతున్నాయి. అన్ని చోట్ల సహాయానికి అన్వేషణ సాగుతున్నది.MHTel 3.1

    మానవుడు బాధల భారంతో కుంగిపోవటం, వ్యాధి వల్ల అతడి పనిపాటలు కుంటుపడటం, అతడి బలం క్షీణించటం, వ్యాధి అతడి జీవితాన్ని తగ్గించటం సృష్టికర్త ఉద్దేశించి కాదు. అయితే మానవ జీవితాన్ని ఆరోగ్యంగా సాగించటానికి దేవుడు నియమించిన నిబంధనల్ని అతిక్రమించిటం తరుచుగా జరుగుతుంది. పాపం మానవుడి హృదయంలోకి ప్రవేశిస్తుంది. జీవానికి ఆరోగ్యానికి మూలమైన దేవుని మీద ఆధారపడటం మానవుడు విస్మరిస్తున్నాడు. దాని వెనుక అతిక్రమ పర్యావసానాలైన బాధ, వ్యాధి మరణం, సంభవిస్తాయి.MHTel 3.2

    శరీర పరిపాలనకు సంబంధంచిన చట్టాలను అవగాహన చేసుకొని జీవిత అభ్యాసాలన్నిటిని ఆ చట్టాలకు అనుగుణంగా దిద్దుకోవటం మన ప్రాముఖ్యమైన విధి. నిజమైన సంతోషానికి తోడ్పడే ఆనందదాయకమైన కుటుంబం. జీవిత చట్టాలకు విధేయత, సాటి మనుషులతో సత్సంబంధాలు వంటి అనేక అంశాల్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.MHTel 3.3

    వ్యాధి వచ్చినప్పుడు మనం వివిధ సాధనాల్ని ఉపయోగించటం అతి ముఖ్యం. అవి ప్రకృతి కృషితో సహకరంచి శరీర నిర్మాణానికి తోడ్పడి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాయి. ఓ విశాలమైన, మరింత ముఖ్యమైన విషయం మరొకటున్నది అది ఆదిలో మానవుడికి ప్రాణాన్నిచ్చి. అతడి నిత్యానందానికి ప్రతీ అవకాశాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు అతడి క్షేమాభివృద్ధిలో ఆసక్తి కలిగి ఉన్న సృష్టికర్తతో మన సంబంధాన్ని గూర్చిన విషయం . జీవిత ఆచరణాత్మక విషయాల్లో విస్తృతానుభవం, అపూర్వ అంతదృష్టి, జ్ఞానం దైవానుగ్రహం వల్ల పొందిన మహిళ అయిన రచయిత ఈ గ్రంధాన్ని ప్రతీ తండ్రి తల్లి, ప్రతీ పురుషుడు, స్త్రీ, ప్రతీ సామాన్యుడు వృత్తి పనివాడు అందరికి అందుబాటులోకి, జీవితం పైనా, చట్టల పైనా, ఆరోగ్యం దాని విధుల పైనా వ్యాధి దాని నివారణ పద్దతు పైనా ఆత్మ సంబంధమైన రుగ్మతల పైనా, గిలాదులోని గుగ్గిలం పైనా ఈ గ్రంథం ద్వారా విలువైన సమాచారాన్ని తీసుకువస్తున్నారు.MHTel 3.4

    ఈ పుస్తకం స్పష్టమైన, సామాన్యమైన, రమ్యమైన భాషలో రాయబడింది. ఇది నేర్చుకునే వ్యక్తికి ఉపదేశాన్ని, నిరుత్సాహం చెందిన వ్యక్తికి నీరీక్షణను, వ్యాధిగ్రస్తుడికి ఉత్సాహాన్ని, అలసిన వ్యక్తికి విశ్రాంతిని ఇస్తుంది. అనేక దేశాల్లో 12 ప్రధాన లోక భాషల్లో మళ్ళీ మళ్ళీ ప్రచురితమౌతున్న ఈ పుస్తకం అనేక దశాబ్దాలుగా లక్షలాది మందికి “పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ఎంతో ధన్యము” అన్న తన వర్తమానాన్ని అందిస్తున్న ఈ పుస్తకం తన కర్తవ్యాన్ని పూర్తిగా నెరవేరుతుందన్నది ప్రచురణ కర్తల ఆశాభావం. MHTel 3.5

    ఎలెన్ జి.వైట్ ప్రచురణ ధర్మకర్తలు.

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents