Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆశాభంగాలు, ప్రమాదాలు

    సంస్కరించబడతారని తాము ఆశించే అనేకుల విషయంలో పతనమైనవారికోసం పనిచేసే వారు నిరాశకు లోనవుతారు అనేకులు తమ అలవాట్లు అభ్యాసాల్లో పై పై మార్పు మాత్రమే చేసుకుంటారు. భావోద్రేకాలతో చలించి సంస్కరణ వల్ల మారినట్లు కొంత కాలం కనిపించ వచ్చు, కాని వారి హృదయంలో నిజమైన మార్పు లేదు. వారు స్వార్ధాన్ని ప్రేమిస్తారు. అర్ధ: పర్ధం లేని వినోదాల కోసం అదే వాంఛను కలిగి ఉంటారు. ప్రవర్తన నిర్మణం గురించి వారికి జ్ఞానం ఉండదు. నియా మాలకు నిలబడే మనుషులుగా వారి మీద ఎవరూ ఆధారపడలేదు. ఆహార యావను ఉద్రేకాలను తృప్తిపర్చటం ద్వారా వారు తమ మానసిక శక్తులను ఆధ్యాత్మిక వక్తలను భ్రష్టం చేసుకుంటారు. ఇది వారిని బలహీనపర్చుతుంది. వారు చపలచిత్తులవుతారు. వారి ఉద్వేగాలు ఇంద్రియ సుఖాలను ప్రేరేపిస్తాయ. ఈ వ్యక్తులు తరుచు ఇతరులకు ప్రమాదకరంగా తయా రవ్వుతారు. వీరిని మారిన వ్యక్తులుగా ఎంచి బాధ్యతలిచ్చి తమ దష్ప్రభావంతో అమాయక ప్రజల్ని నాశనం చేసే స్థానాల్లో నియమించటం జరగుతుంటుంది.MHTel 143.1

    మారటానికి చిత్తశుద్ధితో ప్రయత్నించేవారు సయితం పడిపోవటానికి అవకాశం ఉంది. వారితో విజ్ఞతతోను దయా స్వభావంతోను వ్యవహరిం చడం అవసరం. దయనీయ స్థితి నుండి విమోచించనవారిని పొగడటం ప్రశంసలతో పైకెత్తటం వారిని నాశనం చేస్తుంది. తమ పాప జీవితానుభవాన్ని బహిరంగంగా చెప్పటానికి పురుషులను స్త్రీలను ఆహ్వానించే ఆచారం చెప్పే వారికి వినే ప్రజలకు ప్రమాదకరం. దుర్మార్గపు దృశ్యాలను గురించి వినటం గాని చదవటం గాని మనసును ఆత్మను భ్రష్టు చేస్తుంది. ఈ దుస్తితి నుండి విమోచించిన వారికి ప్రాధన్యమివ్వటం వారికే హానికరం. అనేకులు తమ పాప జీవితం తమకు కొంత ప్రత్యేకతనిచ్చిందని భావించటానికి అది దారి తీస్తుంది. ఇది అపఖ్యాతి పట్ల మక్కువను ఆత్మ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవి ఆత్మను నాశనం చేస్తాయి. తమను తాము నమ్ముకోకుండా క్రీస్తును నమ్ముకుని ఆయన కృప పై ఆధారపడటం ద్వారానే వారు నిలవబడగలరు.MHTel 143.2

    నిజమైన మారుమనసుకు నిదర్శనం కనపర్చేవారందరిని ఇతరుల కోసం పని చేయటానికి ప్రోత్సహించాలి. సాతాను సేవను విడిచి పెట్టి క్రీస్తుకు సేవ చెయ్యటానికి వచ్చే ఏ ఆత్మను ఎవరూ తరిమివెయ్యకూడదు. దేవుని ఆత్మ తనతో పనిచేస్తున్నాడనటానికి ఒక వ్యక్తి నిదర్శనం. కనపర్చితే దేవుని సేవలో ప్రవేశించటానికి ప్రతీ ప్రోత్సాహాన్ని అందించండి. “సందేహపడువారి మీద కనికరము చూపుడి” యూదా 22, దేవుని వివేకంతో విజ్ఞులైనవారు సహాయం అవసరమైన ఆత్మల్ని చూస్తారు. నిజంగా పశ్చాత్తాప పడ్డవారు. కాని ప్రోత్సాహం పొందనివారు నిరిక్షించటానికి సాహసించలేరు. వణుకు తున్న పశ్చాత్తాపం పొందిన ఈ ఆత్మలను తమ సహవాసం లోకి స్వాగతించ టానికి ప్రభువు తన సేవకుల హృదయాల్లో అనురాగాన్ని పెడతాడు. వారిని అవరించిన పాపాలు ఏవైనా, వారు ఎంత తీవ్రంగా పతనమైనా, వారు క్రీస్తు వద్దకు పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో వస్తే ఆయన వారిని స్వీకరిస్తాడు. అప్పుడు తనకు చెయ్యటానికి ఓ పనినిస్తాడు. ఒకప్పుడు తామే పడి ఉండి రక్షించబడ్డ నాశనకూపం నుండి ఇతరులను పైకి లేపటంలో సేవ చెయ్యాలని వారు కోరుకున్నట్లయితే వారికి అవకాశం ఇవ్వండి. వారు ఆధ్యాత్మికంగా బలోపేతులయ్యేందుకు వారిని అనుభవశాలురైన క్రైస్తవుల సహవాసంలోకి తీసుకురండి, ప్రభువు పనితో వారి మనసుల్ని చేతుల్నీ నింపండి.MHTel 144.1

    ఆత్మలో వెలుగు ప్రకాశించినప్పుడు, పూర్తిగా పాపం వశంలో ఉన్నట్లు కనిపించినవారు, ఒకప్పుడు తాము ఎలాంటి పాపులై ఉన్నారో. అటువంటి పాపుల కోసం విజయవంతంగా కృషి చేసే పనివారతవుతారు. క్రీస్తులో విశ్వాసం ద్వారా కొందరు దైవ సేవలో ఉన్నత స్థానాలకు ఎదిగి ఆత్మల రక్షణ సేవలో బాధ్యతలు నిర్వహిస్తారు. వారు తమ బలహీనత ఎక్కడన్నదో గుర్తిస్తారు. తమ స్వభావం దుర్మార్గమైనదని గుర్తిస్తారు. పాపానికి ఎంత బలం ఉన్నదో, అలవాటుకు ఎంత శక్తి ఉన్నదో వారు గుర్తిస్తారు. క్రీస్తు సహాయం లేనిదే తమకు జయించే శక్తి లేదని గుర్తిస్తారు. “నిస్సహయ మైన నా ఆత్మ భారాన్ని నీ మీద మోపుతున్నాను” అన్నది వారు దేవునికి నిత్యం పెట్టుకోవలసిన మొర.MHTel 144.2

    వీరు ఇతరులకు సహాయం చెయ్యగలరు. శోధన ద్వారా పరీక్షించడి, విశ్వాసాన్ని దాదాపు వదులుకున్న, కాని ప్రేమా వర్తమానాన్ని వినడం ద్వారా రక్షించబడ్డ వ్యక్తి మాత్రమే ఆత్మల రక్షణ శాస్త్రాన్ని గ్రహించగలడు. ఎవరిని రక్షకుడు వెదకి పట్టుకొని తిరిగి మందకు చేర్చుతాడో ఎవరి హృదయం క్రీస్తు పట్ల ప్రేమతో నిండుతుందో అలాంటి వాడు తానే కాబట్టి అతడు నశించిన ఆత్మల్ని ఎలా వెతకాలో ఎరుగును. అతడు దేవుని గొర్రె పిల్లను పాపులను చూపించగలడు. అతడు తనను తాను దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాడు. ఆయన ప్రియ కుమారినిలో అంగీకృత డయ్యాడు. బలహీనతలో సహాయం కోసం చాపిన హాస్తాన్ని దేవుడు పట్టుకుంటాడు. తప్పిపోయిన అనేకమంది అటువంటి వారి సేవ ద్వారా, తండ్రి వద్దకు వస్తారు.MHTel 145.1

    పాప జీవితం నుండి పవిత్ర జీవనానికి ఉత్థానమవ్వటానికి పోరాడు తున్న ప్రతీ ఆత్మ కోసం శక్తి అనే గొప్ప వనరు“ఆకాశము క్రింద మనుష్యు లలో ఇయ్యబడిన”ఈ నామముననేలభిస్తుంది”. ఆ.కా 4:12 విశ్రాంతి నిరీక్షణ కోసం, పాప ప్రవృత్తుల నుంచి విముక్తి కోసం “ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను” అంటు న్నాడు. క్రీస్తు. యోహాను 7:37 క్రీస్తు కృప, శక్తి మాత్రమే దుర్మార్గతకు నివారణోషదం.MHTel 145.2

    ఒక వ్యక్తి తన సొంత శక్తితో చేసుకునే తీర్మానాలు వ్యర్ధమైనవి. లోకంలో చేసే వాగ్దానాలన్నీ దురభ్యాసం శక్తిని వమ్ము చేయ్యలేదు. మనుషుల హృదయాల్ని దైవ కృప నూతనం చేసేవారకూ అన్ని విషయాల్లోనూ మితానుభవాన్ని మనుషులు ఆచరణలో పెట్టటం జరగదు. ఒక్క నిముషమైనా మనం పాపానికి దూరంగా ఉండలేం. ప్రతీ గడియా మనం దేవుని మీద ఆధారపడి ఉన్నం. వాస్తవమైన సంస్కరణ ఆత్మశు ద్ధితో ప్రారంభిస్తుంది. క్రీస్తు కృప ప్రవర్తనను తిరిగి రూపుదిద్ది ఆత్మను దేవునితో సజీవ సంబంధములో నిలిపినప్పుడే, పడిపోయిన వారి కోసం మన కృషి నిజమైన జయాన్ని సాధిస్తుంది. ధర్మశాస్త్రానికి క్రీస్తు సంపూర్ణ విధేయతతో నివసించాడు. ఇందులో ప్రతీ మనుషుడికి ఆయన ఓ ఆదర్శాన్ని నెలకొల్పాడు. ఆయన ఈ లోకంలో జీవించిన జీవితాన్ని ఆయన శక్తి ద్వారా ఆయన ఉపదేశం కింద మనం జీవించాలి.MHTel 145.3

    పతనమైన వారి కోసం మన సేవలో దేవుని ధర్మశాస్త్ర విధుల నిర్వహణ. ఆయనకు నమ్మకంగా ఉండాల్సిన అవసరం మనుసు పైన హృదయం పైన ఆయన ముద్ర వెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని సేవించేవారికి సేవించని వారికి మధ్య గొప్ప వ్యత్యాసం ఉన్నదని చూపించటం ఎన్నడూ విస్మరించకండి. దేవుడు ప్రేమ స్వరూపి కాని ఆయన తన ఆజ్ఞలపట్ల కావాలని నిర్లక్ష్యం ప్రదర్శించటాన్ని క్షమించడు. ఆయన ప్రభుత్వ శాసనాలు ఎలాంటి వంటే వాటికి అపనమ్మకంగా ఉన్న వ్యక్తులు పర్యవసానాల్ని తప్పించుకోలేరు. తనను ఎవరు గౌరవిస్తారో వారినే ఆయన గౌరవించగలడు. ఈ లోకంలో మానవుడి ప్రవర్తన అతడి నిత్య భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అతడు ఏమి విత్తుతాడో దాని పంటనే కోస్తాడు. కార్యం వెంట పర్యవసానం ఉంటుంది.MHTel 146.1

    దైవవిధుల ప్రమాణాన్ని సంపూర్ణ విధేయత మాత్రమే చేరగలుగు తుంద. ఆయన విధులు నిర్దిష్టత లేనివి కావు. తనతో సమారస్యంగా ఉండే స్థితికి మనుషుణ్ణి తేవటానికి అవసరమైనదేదీ ఆయన ఆదేశించలేదు. పాపులకు ఆయన ప్రవర్తన ఆదర్శాన్ని చూపించి ఆయన కృప ద్వారా మాత్రమే ఆ ఆదర్శాన్ని చేరగలమని మనం బోధించాలి. మావన స్వభావ బలహీనత వల్ల తాము జయించలేమన్న భయం మానుపులకు లేకుండేందుకు రక్షకుడు మానవాళి బలహీనతలను వహించి పాపరహిత జీవితం జీవించాడు. మనలను “దైవ స్వభావమునందు పోలినవారిని” చయ్యెటానికి క్రీస్తు వచ్చాడు. దేవత్వంతో ఏకమైన మానవత్వం పాపం చెయ్యదని ఆయన జీవితం ప్రకటిస్తున్నది.MHTel 146.2

    ఎలా జయించాలో మానవుడికి చూపించటానికి రక్షకుడు వచ్చాడు. సాతాను శోధనలన్నటిని క్రీస్తు దేవుని వాక్యంతో జయించాడు. దేవుని వాగ్దానాల్ని నమ్మటం ద్వారా ఆజ్ఞల నుండి శక్తిని పొందాడు. శోధకుడికి నిరాశే మిగిలింది. ప్రతీ శోధనకు “అని వ్రాయబడి ఉన్నది” అన్నది ఆయన సమాధానం. కనుక దుష్టిని ప్రతఘటించటానికి దేవుడు మనకు తన వాక్యాన్నిచ్చాడు. మనం “దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును... తప్పించుకొని దేవస్వభావమునందు పాలివర మగనట్లు” (2 పేతురు 1:4) ఈ అత్యుత్తమమైన, ప్రశస్తమైన వాగ్దానాలు మనవి.MHTel 146.3

    పరిస్థితులకు, స్వార్ధ సంబంధమైన బలహీనతలకు, లేక శోధన శక్తికీ కాక దేవుని వాక్య శక్తికి ఎదరు చూడ వలసినదిగా శోధింపబడుతున్నవారిని కోరండి. దాని శక్తి అంతా మన సొంతమౌతుంది. కీర్తనకారుడంటున్నాడు. “నీ యెదుట నేను పాపము చేయకుండనట్లు నా హృదయమలో నీ వాక్యము ఉంచుకొనియున్నాను”. ‘బల్కారుల మార్గముల తప్పించుకొను టకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను”. కీర్తనలు 119:11, 17:4MHTel 147.1

    ప్రజలకు ధైర్యం చెప్పండి. వారిని ప్రార్ధనలో దేవుని వద్దకు ఎత్తండి శోధనకు గెలవలేక పోయిన వారు తమ పరాజయం వలన పరాభవం పాలవుతారు. దేవుని వద్దకు వెళ్ళటం వృధా అని భావిస్తారు. ఈ తలంపు సాతాను చేసిన సలహా, వారు పాపం చేసి ప్రార్ధించలేమని భావించినప్పుడు ప్రార్ధించటానికి సమయం అదేనని వారికి చెప్పండి. వారు సిగ్గుపడవచ్చు. తీవ్రంగ కించపడినట్లు భావించవచ్చు. కాని వారు తమ పాపాలు ఒప్పుకుంటే నమ్మదగినవాడు న్యాయవంతుడు అయిన ఆయన వారి పాపాల్ని క్షమించి సమస్త అవినీతి నుండి వారిని శుద్ధి చేస్తాడు.MHTel 147.2

    “నన్ను బలపరచువాని యందే నేను సమస్తమను చేయగలవను” “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును”. ఫిలిప్పీ 4:13, 19.MHTel 147.3

    ఏ వ్యక్తి తాను ఏమి లేనివాడనని భావించి రక్షకుని యోగ్యతల పై ఆధారపడతాడో అతడి కన్నా నిస్సహాయుడు అయిన వాస్తవంలో అజే యుడు ఇంకొకడుండడు. ప్రార్ధన ద్వారా, ఆయన వాక్య పఠనం ద్వారా, ఆయన సన్నిధానంలో విశ్వాసం ద్వారా మిక్కిలి బలహీనులైన మానవులు సజీవుడైన క్రీస్తుతో సంబంధము కలిగి నివసించవచ్చు. ఎన్నడు విడవని తన చేతిలో ఆయన వారిని పట్టుకుంటాడు.MHTel 147.4

    క్రీస్తులో నివసించే ప్రతీ ఆత్మ ఈ ప్రశస్త వాక్కులను తనవిగా చేసుకోవచ్చు. అతడు ఇలా చెప్పుకోవచ్చు.MHTel 148.1

    “యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను, కని పెట్టియుందును నా దేవుడు నా ప్రార్ధన నాలకించును నా శత్రువా, నా మీద అతిశయ పడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును”.మీకా 7:7,8 MHTel 148.2

    “ఆయన మరల మనయందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటిని సముద్రపు ఆగాధములలో నీవు పడ వేయుదువు” మీకా 7:19 MHTel 148.3

    దేవుడు ఈ వాగ్దానం చేసాడు;”బంగారు కంటే మనుష్యులను, ఓఫీరుదేశపు సువర్ణము కంటే నదులను అరుదుగా ఉండజేసెదను’ యెషయా 13:12 MHTel 148.4

    “గొట్టెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీ కెల రెక్కలు పచ్చని బంగారముతో కప్ప బడినట్లున్నది”. కీర్తనలు 68:13 MHTel 148.5

    క్రీస్తు ఎవరిని ఎక్కువ క్షమిస్తాడో వారు ఆయనను ఎక్కువ ప్రేమి స్తాడు ఆ చివరి దినాన నీరు ఆయన సింహాసనానికి అతి సమీపంగా నిలబడతారు. ఆయన దాసులు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారినొసళ్ళయం ఉండును” ప్రటకన 22:4MHTel 148.6

    *****