Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పొగాకు అలవాటు

    పొగాకు నెమ్మదిగా పనిచేసే, మోసకరమైన, ప్రాణాంతకమైన విషం. ఏరూపంలో తీసుకున్నా అది శరీర తత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇది మరింత ప్రమాదకరం ఎందుకంటే దాని ఫలితాలు క్రమేపి కనిపిస్తాయి. మొదట అవి కనిపించవు. అది నరాల్ని ఉద్రేకపర్చి స్తంభింపజేస్తుంది. మెదడును బలహీనపర్చి మసకబార్చుతుంది. తరుచు అది మత్తు పానీయంకన్నా నరాలను ఎక్కువ శక్తిమంతంగా ప్రభావితం చేస్తుంది. అది అతి సున్నితమైనది. దాని ఫలితాల్ని దేహ వ్వవస్థ నుంచి నిర్మూలించటం కష్టం. దాని వినియోగం మద్యానికి తృష్ణను పుట్టిస్తుంది. అనేక సందార్భాల్లో అది సారా అలవాటుకి పునాది వేస్తుంది. .MHTel 279.3

    పొగాకు దాని వాడకందారుడికి అసౌకర్యంగా ఉంటుంది. అది ఖరీదైన, అశుభ్రమైన, అపవిత్రమైన అలవాటు. అది ఇతరులకు అభ్యంతరకరం. దాని భక్తులు అన్ని చోట్లా దర్శనమిస్తారు. ఓ ప్రజల గుంపును దాటుతున్నప్పుడు అందులోని పొగారాయడు మీ ముఖంలోకి విషంతో నిండిన పొగను విడిచి పెట్టకుండా దాటలేదు. సారా, పొగాకు వాసనతో నిండిన రైలు బండిలో గాని లేక ఓ గదిలో గాని ఉండటం బాధాకరం, అనారోగ్యకరం, ఈ విష పదార్థాలను వాడటానికి మనుషులు పట్టుదలగా ఉన్నప్పటికీ ఇతరులు పీల్చుకోవలసిన గాలిని అపవిత్రం చెయ్యటానికి వారికి ఏమి హక్కు ఉంది ?MHTel 280.1

    పిల్లలు, యువతలో పొగాకు వాడకం గొప్ప హానికలిగిస్తున్నది. గత తరాల ప్రజలు అనారోగ్య కర అలవాట్లు పిల్లలను యువతను ప్రభావితం చేస్తున్నాయి. మానసిక దుర్బలత, శారీరక బలహీనత, నరాల అస్తవ్యస్తత, అస్వాభావిక వాంఛలు తల్లితండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా వస్తున్నాయి. పిల్లలు కొనసాగిస్తున్న అవే అలవాట్లు ఎక్కువై ఆ దుష్పలితాలను శాశ్వతం చేస్తున్నాయి. శారీరక, మానసిక, నైతిక క్షీణతను చాలా మేరకు హేతువవుతున్న ఈ దురభ్యాసం తీవ్ర అందోళన కలిగిస్తున్నది.MHTel 280.2

    “త్రాగుబోతులును, తిండిబోతులును, దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును”. సామె 23:21MHTel 280.3

    బాలురు చాలా చిన్న వయసులోనే పొగాకు వాడటం మొదలు పెడతారు. శరీరం మనసు పొగాకు దుష్పలితాలకు సులువుగా లొంగే సమయంలో ఇలా ఏర్పడ్డ అలవాటు శారీరక శక్తిని దెబ్బతీసి శరారాన్ని మరుగుజ్జు చేసి మనసుసు సొమ్ముసిలజేసి, నైతకితను నాశనం చేస్తుంది.MHTel 280.4

    తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, బోధకులు తమ ఆదర్శం ద్వారా పిల్లలకు యువతకు నేర్పుతున్న చెడు అలవాట్లు కలిగిస్తున్న చేటు గురించి పిల్లలకు ఉపదేశించటానికి మనం ఏమి చెయ్యగలం? చిన్న బాలురు పసితనం నుంచి సరిగా బయటపడని బాలలు సిగరెట్లు తాగుతూ కనిపించవచ్చు. దాన్ని గురించి ఎవరైనా వారితో మాట్లాడితే వారంటారు. “మా నాన్న పొగాకు వాడతాడు”. వారు బోధకుడిని లేక ఆది వార బడి నాయకుణ్ణి వేలెత్తి చూపిస్తూ” అలాంటి వ్యక్తే పొగ పీల్చుతాడు. నేను పీల్చటంలో తప్పేముంది? అంటాడు. మితానుభవ సేవలోని కార్యకర్తల నేకులు పొగాకు వాడటానికి బాగా అలవాటుపడ్డారు. అమితానుభవాన్ని నిరోధించటలో అలాంటి వ్యక్తులకు ఏ పాటి శక్తి ఉంటుంది?MHTel 280.5

    దేవుని వాక్యాన్ని నమ్మి ఆచరిస్తున్నట్లు చెప్పుకునే వారికి నా విజ్ఞప్తి ఇది. మీ మానసిక శక్తులను స్తంభింపచేసి నిత్య వాస్తవాలను సరిగా అంచనా వెయ్యలేకుండేటట్లు మీ తెలివిని దోచుకునే అలవాటును క్రైస్తవులుగా మీరు కలిగి ఉండగలరా? మీరు అనుదినం దేవునికి చెయ్యాల్సి ఉన్న సేవను చెయ్యకుండా మీ సేవ విషయంలోను మీ ఆదర్శ శక్తి విషయంలోను దేవున్ని మీ సోదర మానవుల్ని దోచుకోవటానికి అనుమ తించగలరా?MHTel 281.1

    దేవుని గృహ నిర్వాహకులుగా మీ చేతుల్లో ఉన్న ద్రవ్యానికి మీ బాధ్యతను మీరు పరిగణించారా? మీ పొగాకు ప్రభువు ద్రవ్యంలో ఎంత ఖర్చుచేస్తున్నారు? మీ జీవిత కాలంలో మీరు ఇలా ఎంత ఖర్చు చేసి ఉంటారో లెక్క కట్టండి. ఈ భ్రష్ట వాంఛకు వ్యయం చేస్తున్న ద్రవ్యాన్ని బీదల సహాయార్ధం సువార్త వ్యాప్తి నిమిత్తం మీరు ఇస్తున్న ద్రవ్యంతో పోల్చితే ఏమాత్రం ఉంటుంది?MHTel 281.2

    ఏ మనిషికి పొగాకు అవసరం లేదు. దాని వినియోగం వల్ల వ్యర్ధమౌతున్న ద్రవ్యం లేక వేలాది ప్రజలు నశిస్తున్నారు. దేవుని సొత్తును మీరు దుర్వినియోగం చెయ్యటం లేదా? దేవున్ని మీ తోటి మానవుల్ని దోచుకోవటంలో మీరు అపరాధులు కారా? “మీ దేహము దేవుని వలన ... అనుగ్రహించబడి మీ లోనున్న పరిశుద్దాత్మకు ఆలయమైయున్నాడని మీరెరుగరా? మీరు మీ పొత్తుకారు, విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచడి”. 1 కొరి 6:19,20 MHTel 281.3

    “ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును
    మద్యము అల్లరి పుట్టించును
    దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు”
    ఎవరికి శ్రమ? ఎవరికి దు:ఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత?
    ఎవరికి హేతువు లేని గాయములు? ఎవరకి మంద దృష్టి ?
    ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా
    కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా
    ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను
    గిన్నెలో తళతళలాడుచుండగను
    త్రాగుటకు రుచిగా నుండును దాని వైపు చూడకము
    పిమ్మట అది సర్పమువలె కరచును
    MHTel 281.4

    కట్ల పామువలె కాటు వేయును” సామెతలు 20:1, 23:29-32

    “మత్తులో ముంచే మద్యపాన బానిస పతనాన్ని గూర్చి ఇతకన్నా స్పష్టమైన చిత్రికరణ ఏ మానవుడు ఇవ్వలేడు. బానిస, భ్రష్టుడు ఆయిన అతడు తన దుస్థితని గుర్తించ స్థితికి వచ్చినప్పుడు సయితం దాని ఉచ్చులో నుంచి బయటకి రావటానికి శక్తిలేనిబాడు అతడునమరల దాని వెతుకును” 35 వ వచనం.MHTel 282.1

    తాగుబోతు పై మత్తుపదార్థాల ప్రభావం ఎలాంటిదో తెలపటానికి ఎటువంటి తర్కమూ అవసరంలేదు. నిద్రలేమితో బరువెక్కి సరిగా చూడలేని కళ్ళు గల మధ్యం ప్రేమలో పిచ్చివాళ్ళయిన మానవ చిత్రాలు - ఎవరి నిమిత్తం క్రీస్తు మరణించాడో, ఎవరిని గూర్చి దేవ దూతలు దు:ఖిస్తున్నారో ఆ ఆత్మలు.. అన్నిచోట్ల ఉన్నాయి. వారు మన నాగరికత పై మాయని మచ్చ. ప్రతీ దేశానికి వారు సిగ్గు. శాపం, ప్రమాదంగా ఉంటారు.MHTel 282.2

    తాగుబోతు ఇంటిలో దాగిన దౌర్భగ్యం, హృదయ వేదన, నిరాశను ఎవరు వర్ణించగలరు? సుకుమారంగా పెరిగిన, సున్నిత మనసు సంస్కారం గల భార్యకు తాగుడు ఓ దయ్యంగా మార్చిన భర్తతో సంబంధం గురించి ఆలోచించండి. గృహ సౌకర్యాలు, విద్య శిక్షణ విషయాల్లో దోచబడి తాము ఎవరిని గూర్చి అతిశయించాలో, తమకు ఎవరు రక్షణగా ఉండాలో, అతడి గురంచి భయపడుతూ బతుకుతూ, లోకంలోకి నెట్టబడి, తాగుబోతు తాలూకు సిగ్గును భరిస్తూ తరుచు, తాగుబోతు తృష్ణ గల వారసత్వం గల పిల్లల గురించి ఆలోచించండి..MHTel 282.3

    తాగుడు వల్ల ప్రతీరోజు సంభవిస్తున్న భయంకర ప్రమాదాలను గురించి ఆలోచించండి. రైలు బండిలో పనిచేసే ఓ అధికారి ఓ సిగ్నలను నిర్లక్ష్యం చేస్తాడు. లేక ఓ ఆదేశాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటాడు. బండి వెళ్తూ ఉంటుంది. బండికి బండికి ఢీ జరుగుతుంది. అనేకమంది ప్రాణాలు కోల్పోవుతారు. లేక ఓ స్టీమరు మునిగి ప్రయాణీకులు స్టీమరు సిబ్బందినీటి సమాధి అవుతారు. దర్యాప్తు జరిగి విషయాలు వెలుగులోనికి వచ్చినప్పుడు ముఖ్యమైన బాధ్యత గల ఓ వ్యక్తి సారా అలవాటును ఎంత వరకు కొనసాగించవచ్చు? వ్యక్తి సారాను పూర్తిగా విడిచిపెడితేనే అతణ్ణి నమ్మగలం.MHTel 283.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents