Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తండ్రి బాధ్యత

    భర్త, తండ్రి కుటుంబానికి శిరస్సు. భార్య అతడి నుంచి ప్రేమ సానుభూతి, పిల్లల శిక్షణలో సహాయం కోసం ఎదరు చూస్తుంది. ఇది న్యాయమే. పిల్లలు వారిద్దరికి చెందనివారు. వారి సంక్షేమంలో అతడికి సమానమైన ఆసక్తి ఉంది. ప్లిలు పోషణకు నడుపుదలకు తండ్రి మీద ఆధారపడతారు. జీవితం గురించి అతడికి సరియైన అభిప్రాయం అవసరం. అన్నిటికన్నా ముఖ్యంగా, తన బిడ్డల పాదాలను సరియైన మార్గంలో నడిపించటానికి దేవుని ప్రేమ భయభీతి ఆయన వాక్య బోధన అతణ్ణి నియంత్రించాలి.MHTel 336.2

    తండ్రి కుటుంబ శాసనకర్త. ఆబ్రాహాము మారి అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని తన గృహ నియమం చేసుకోవాలి. అబ్రాహమును గురించి దేవుడన్నాడు: ” తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాను”. ఆదికాండము 18:19 దుష్టతను అడ్డుకోవటంలో ఎలాంటి ఆలక్ష్యం ఉండదు. బలహనతో కూడిన “తండ్రులారా, మీ పిల్లకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి”. ఎఫెసీయులకు 6:4MHTel 336.3

    అవివేకమైన పక్షపాతం ఉండదు. అపార్ధం చేసుకున్న ప్రేమకు విధి నిర్వహణను బలి చెయ్యటం ఉండదు. అబ్రాహము సరియైన ఉపదేశం ఇవ్వటమే కాదు. న్యాయమైన నీతివంతమైన చట్టాల అధికారిన్ని కూడా కొనసాగించాడు. మనకు దారి చూపటానికి దేవుడు నిబంధనలిచ్చాడు. దేవుని వాక్యంలో నిర్దేశించిన క్షేమమైన మార్గాన్ని విడిచి పెట్టి ప్రతీ పక్క పొంచి ఉన్న ప్రమాదంలోకి నడిపించే మార్గాల్లో సంచరిచంటానికి పిల్లల్ని విడిచిపట్టె కూడదు. దయగా కాని ధృడంగా, పట్టుదలతో, ప్రార్ధనపూర్వ కృషితో వారి తప్పుడు కోర్కెలను నియంత్రించాలి. వారి వాంఛలను తిరస్కరించాలి. ఈMHTel 336.4

    శక్తి, విశ్వసనీయత, నిజాయితీ, ఓర్పు, ధైర్యం శ్రద్ధ ప్రయోగాత్మక ప్రయోజకత్వం వంటి సద్గుణాల్ని తండ్రి తన కుటుంబంలో అమలుపర్చాలి. తన బిడ్ల నుంచి అతడు ఏ సద్గుణాల్ని కోరతాడో వాటిని తన ప్రవర్తనలో అతడు సాదృశ్యపర్చుతూ నివసించాలి. MHTel 337.1

    కాని, తండ్రులారా, మీ పిల్లల్ని నిరుత్సాహపర్చకండి. అధికారంతోను ధృడమైన ఆంక్షతోను ప్రేమను, దయను సానుభూతిని కలపండి,. మీ ఖాళీ సమయంలో కొంత మీ బిడ్డలక్విండి. వారితో పరిచయం పెంచుకోండి. వారి పనిలోను వారి ఆటల్లోను వారితో ఏకమై వారి విశ్వాసాన్ని పొందండి. వారితో స్నేహం పెంచుకోండి. ముఖ్యంగా మీ కుమారులతో ఈ విధంగా మీరు మంచిని పెంచే గొప్ప ప్రభావాన్ని చూపించవచ్చు.MHTel 337.2

    గృహాన్ని ఆనందదాయకం చెయ్యటంలో తండ్రి తన పాత్రను నిర్వహించాలి. అతడి చింతలు వ్యాపార సమస్యలు ఎలాంటివైనా అవి తన కుటుంబాన్ని మరుగుపర్చటానికి అతడు అనుమతించకూడదు. చిరునవ్వుతోను ఉల్లాసకరమైన మాటలతోను అతడు ఇంటిలోకి ప్రవేశించాలి.MHTel 337.3

    ఓరకంగా తండ్రి కుటుంబ బలిపీఠం మీద ఉదయ సాయంత్ర బలులును అర్పించే గృహ యాజకుడు. భార్య పిల్లలు ప్రార్ధనలో ఏకమై స్తుతి గానంలో గళం కలపాలి. ఉదయం తన అనుదిన వృత్తి పనికి వెళ్ళకముందు తండ్రి తన బిడ్డల్ని తన చుట్టు పోగు చేసి, దేవుని ముందు తలవంచి వారిని పరలోక తండ్రికి అప్పగించాలి. ఆ దిన అందోళనలు చింతలు గతించినప్పుడు కుటుంబము సమావేశమై ఆయన కాపుదలను సంరక్షణను గుర్తిస్తూ దేవునికి ప్రార్ధనతోను స్తుతి గానంతోను కృతజ్ఞతలు తెలపాలి.MHTel 337.4

    తండ్రులారా, తల్లులారా, మీ వ్యాపార భారం ఎంతటిదైనా, దేవుని బలిపీఠం చుట్టు మీ కుటుంబాన్ని పోగు చెయ్యటంలో విఫలమవ్వకండి. మీ గృహంలో పరిశుద్ధ దూతల వహరాకు దేవుని ఆర్ధించండి. ప్రియమైన మీ కుటుంబీకులు శోధనలకు గురి అయి ఉన్నారని జ్ఞాపకముంచుకోండి. రోజుకు రోజు చిన్న పిల్లలు పెద్దవారి మార్గం చికాకులు పీడలతో నిండి ఉంటుంది. సహనం. ప్రేమ, సంతోషం కలిగి నివసించాలని ఆకాంక్షిచేవారు ప్రార్ధన చెయ్యాలి. నిత్యం దేవుని సహాయం ద్వారా మాత్రమే మనం స్వార్ధ: పై జయం సాధించగలం.MHTel 338.1

    గృహం సంతోషం, మర్యాద ప్రేమ నివసించే స్థలం కావాలి. ఈ సుగుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సంతోషం సమాధానం నివసిస్తాయి. కష్టాలు బాధలు దాడి చెయ్యవచ్చు. ఇవి మావనాళి జీవిత పరిస్థితిలో భాగం. దినమంతా మబ్బు కమ్మినా ఓర్పు, కృతజ్ఞత ప్రేమ అనే సూర్యకాంతిని మీ హృదయంలో ఉంచుకోండి.. అటువంటి గృహంలో దేవుని దూతలు నివసిస్తారు.MHTel 338.2

    భర్త భార్య ఒకరికరి సంతోషాన్ని పరిగణలోనికి తీసుకొని జీవితాన్ని అనందమయం చేసే చిన్న చిన్న మర్యాదలు పరస్పరం చూపించుకోవటం, చిన్న చిన్న దయా కార్యాలు చేసుకోవటం మరవకూడదు. భర్త భార్యల మధ్య సంపూర్ణ విశ్వాసం చోటుచేసుకోవలి. తమ బాధ్యతలను వారు కలసి ఆలోచించుకుని నిర్వహించాలి. బిడ్డల ఉన్నత శ్రేయస్సుకు కలసి పని చెయ్యాలి. బిడ్డల సముఖంలో ఒకరి ప్రణాళికల్ని ఒకరు విమర్శించటం లేక ఒకరి ఆలోచనల్ని ఒకరు ప్రశ్నించటం చెయ్యకూడదు. పిల్లల విషయంలో భర్త పనిని కష్టతరం చెయ్యకుండా ఉండటంలో భార్య జాగ్రత్తగా ఉండాలి. భర్త తన భార్యకు మంచి సలహాలు ప్రేమపూర్వక ప్రోత్సాహం ఇస్తూ ఆమెకు బాసటగా నిలవాలి.MHTel 338.3

    తల్లితండ్రులు పిల్లల మధ్య ఉదాసీనత అడ్డుగోడ ఉండకూడదు. వారికి తమ పిల్లలతో పరిచయుముండాలి. వారి అభిరుచులు మనస్తత్వాలు ఎరిగి ఉండాలి. వారి మనోభవాలను, హృదయాలోచనలను తెలుసుకోవాలి.MHTel 338.4

    తల్లితండ్రులారా, తమను మీరు ప్రేమిస్తున్నారని తమను సంతో షెట్టడానికి మీరు చెయ్యగలిగినదంతా చేస్తారని మీ పిల్లలు చూడనివ్వండి. అలా చేస్తే మీరు విధించే ఆంక్షలకు వారి చిన్న మనసుల్లో విలువ ఉంటుంది. “వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడును పరలోకమందు చూచుచుందురు” అని గుర్తుంచుకొని మీ బిడ్డల్ని దయ కనికరాలతో అదుపు చెయ్యండి, మత్తయి 18:10 మీ పిల్లలకు చెయ్యటానికి దేవదూతలకు దేవుడిచ్చిన పనిని వారు చెయ్యాలిన మీరు కోరుతుంటే మీరు మీ పాత్రను నిర్వహించడం ద్వారా వారికి సహకరించండి.MHTel 339.1

    వివేకం ప్రేమ గల యదార్ధ గృహ మార్గదర్శకత్వంలో పెరిగిన పిల్లల్ని వినోదాల్ని స్నేహాల్ని వెదకుతూ సహకరించరు. వారికి దుష్టత పట్ల ఆకర్షణ ఉండదు. గృహాన్ని ఆవరించే స్వభావం వారి ప్రవర్తనలను రూపుదిద్దు కుంటుంది. వారు గృహం పరిరక్షణను విడిచి పెట్టి లోకంలో తమ స్థానాలను తీసుకున్నప్పుడు శోధనను ప్రతిఘటించటానిక తమకు రక్షణగా ఉండే అలవాటును నియమాలను ఏర్పర్చుకుంటారు.MHTel 339.2

    పిల్లలకు తల్లితండ్రులకు గృహంలో ప్రాముఖ్యమైన విధులున్నాయి. తాము గృహ వాణిజ్య సంస్థలో భాగమని వారికి నేర్పించాలి. వారికి ఆహారం, బట్టలు, ప్రేమ, సంరక్షణ ఇవ్వటం జరగుతుంది. అనేకమైన ఈ ఉ పకారాలను తమ వంతు గృహ భారాలను మోస్తూ తాము సభ్యులైన కుటుంబానికి వారు సాధ్యమైనంత సంతోషాన్ని తీసుకురావాలి. పిల్లలు కొన్నిసార్లు కట్టుబాట్ల కింద విసిగి పోతుంటారు.MHTel 339.3

    కాని అనంతర జీవితంలో తమ అనుభవరహిత సంవత్సరాల్లో తమను కాపాడి నడిపించిన తమ తల్లితండ్రులు సంరక్షణకు జాగరూకతకు వారిని కొనియాడతారు.MHTel 339.4

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents