Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సారా అమ్మేవాడి పని

    మత్తెక్కించే సారా ఉత్పత్తి చేసేవారి అమ్మేవారి పనిని లేఖనం చిత్రిస్తున్నది. వారి వ్యాపారం దోపడి చేసేది. తాము పొందే ద్రవ్యానికి తగిన విలువ గల దాన్ని వారు కొనుగోలుదారుడికి ఇవ్వరు. వారు తమ లాభానికి కలుపుకునే ప్రతి రూపాయి దాన్ని వ్యయం చేసేవాడికి శాపాన్ని తెస్తుంది.MHTel 288.2

    దేవుడు తన దీవెనలను మానవుడి పై ఉదారంగా కుమ్మరిస్తున్నాడు. ఆయన వరాలను తెలివిగా ఉపయోగించుకుంటే కుమ్మరిస్తున్నాడు. ఆయన వరాలను తెలివిగా ఉయోగించుకుంటే లోకంలో ఎంత తక్కువ పేదరికం లేక దు:ఖం ఉండేది! దేవుని దీవెనలను శాపంగా మార్చుతున్నది. మనుషుల దుష్టత్వమే. మానవుడి లాభాపేక్ష ఆహార వాంఛలే మన పోషణ కోసం దేవుడిచ్చిన గింజలు పండ్లను దు:ఖం నాశనాన్ని తెచ్చే విషాలుగా మార్చుతున్నాయి.MHTel 288.3

    ప్రతీ ఏటా మిలియన్ల గేలన్ల కొద్ది మత్తు కలిగించే సారా దిగమింగటం జరుగుతున్నది. దౌర్భాగ్యత, పేదరికం, వ్యాధి భ్రష్టత, కామం, నేరం మరణాల్ని కొనటానికి మిలియన్ల కొద్ది రూపాయలు వ్యయం చెయ్యటం జరుగుతున్నది. సారా విక్రయదారుడు లాభార్జన కోసం తన బాధితుల మనసును శరీరాన్ని భ్రష్టపర్చి నానశం చేసే పదార్థాలను ఇస్తున్నాడు. తాగుబోతు కటుంబాన్ని పేదరికంలో దౌర్భాగ్యంలోకి నెట్టుతున్నాడు. తన బాధితుడు మరణించటంతో సారా విక్రయాదారుడి అన్యాయపు వసూళ్ళు ఆగవు. అతడు విధవరాలిని కూడా దోచుకొని పిల్లల్ని అడుక్కునే వారిని చెయ్యటానికి సందేహించడు. భర్త గడు ఖాతా చెల్లింపుకు ఆ ఆనాధ కుటుంబపు జీవితావసరాల్ని సయితం తీసుకోవటానికి వెనకాడడు. బాధలనుభవిస్తున్న పిల్లల ఏడ్పు గుండెకోత అనుభవిస్తున్న తల్లి కన్నీళ్ళు అతడికి కనికరం కాదు. కోపం పుట్టిస్తాయి. బాధల్లో ఉన్న వీరు ఆకలిగా ఉంటే అతడికేమిటి? వాళ్ళు కూడా భ్రష్టతకు నాశనానికి అహుతి అయితే అతడికేమిటి? తను ఎవరిని నాశనానికి నడుపుతున్నాడో వారి నుంచి వచ్చే స్వల్ప అదాయంతో అతడు ధనికుడువుతున్నాడు.MHTel 288.4

    వేశ్యాగృహాలు, అవినీతి స్థావరాలు, నేరగాళ్ళ న్యాయస్థానాలు చెరసాలలు, ముష్టి గృహాలు, మానసిక వికాలంగుల ఆశ్రమాలు, అసుపత్రులు ఇవన్ని సారా విక్రయదారుల పని ఫలితంగాని చాలా మేరకు నిండిపోతున్నాయి. చివరి దినాల మార్మిక బబులోను వలె అతడు “మానవ బానిసలు ఆత్మల” వ్యాపారం చేస్తున్నాడు. సారా వర్తకుడి వెనుక ఆత్మలను నాశనం చేసే సాతాను ఉన్నాడు. లోకంగాని నరకంగాని రూపొందించగల ప్రతీ సాధనాన్ని అతడు ఉపయోగిస్తాడు. మానవుల్ని తన వశంలోకి తీసుకోవటానికి నగరంలో గ్రామీణ ప్రాంతాలలో, రైలు, బళ్ళల్లో స్టీమర్లలో, వ్యాపార స్థలాల్లో వినోద మందిరాల్లో, వైద్య శాలల్లో క్రైస్తవ గుడుల్లో సయితం, పవిత్ర ప్రభురాత్రి భోజన బల్లమీద అతడి ఉచ్చులు అమర్చబడి ఉన్నాయి. మత్తు పదార్థాలకు కోరికను సృష్టించి పోషించటానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. దాదాపు ప్రతీ వీధి మూలలో తేజస్సుతో వెలుగుతున్న దీపాలు, స్వాగత ,చిహ్నాలలో పనిచేసేవారిని, పనిలేని ధనికుణ్ణి అమాయక యువతను ఆహ్వానిస్తూ ఓ పానాశాల ఉంటుంది.MHTel 289.1

    ప్రత్యేక భోజన శాలల్లో, ఫ్యాషనబుల్ రిసార్టుల్లో వాస్తవంలో మత్తు పానీయాల్ని అందమైన పేర్లతో పేరు గాంచిన పానీయాల్ని స్త్రీలకు ఇవ్వటం జరుగుతుంటుంది. వ్యాధిగ్రస్తులకు, అలసినవారికి చాలా మేరకు సారాతో కూడిన చేదు పానీయాలుగా బహుళ ప్రచారంలో ఉన్న పానీయాలిస్తారు.MHTel 289.2

    పిల్లల్లో సారా రుచి సృష్టించటానికి తీపి వస్తువులు తయారు చేసే కర్మాగారంలో సారాసు ప్రవేవ పెడతారు. అలాంటి తీపి వస్తువులు షాపుల్లో అమ్ముతారు. ఈ తీపి వస్తువుల ద్వారా సారా వర్తకుడు పిల్లల్ని పానశాలల్లోకి ఆకర్షిస్తాడు.MHTel 290.1

    రోజు రోజు నెల, నెల సంవత్సరము, సంవత్సరము ఈ పని సాగుతుంది. జాతికి గర్వ కారణాలైన తండ్రులు భర్తలు సహోదరులు క్రమంగా చితికి పోయి, నశించి తిరిగి ఇళ్ళకు వెళ్ళటానికి సారా వ్యాపారుల స్థావరాలకు వెళతారు.MHTel 290.2

    ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే గృహానికి గుండెనే శాపం మొత్తటం. ఎక్కువ సంఖ్యలో స్త్రీలు సారాకు అలవాటు పడుతున్నారు. అనేక గృహాల్లో బాల్యపు అమాయకత్వం నిస్సహాయత ఇంకా పోని చిన్న పిల్లలు సయితం రోజుకు రోజు తాగుబోతు తల్లుల నిర్లక్ష్యం, దుర్వినియోగం, దుష్టత కారణంగా సారా అలవాటు ఏర్పర్చుకుంటున్నారు. ఈ భయంకర దుష్టత పడగ నీడలో కుమారులు కుమార్తెలు పెరుగుతున్నాయి. తమ తండ్రుల కన్నా ఇంకా లోతుగా మునగటం కన్నా వారికి ఇంకేమి భవిష్యత్తు ఉంటుంది?MHTel 290.3

    క్రైస్తవ దేశాలుగా పిలువబడే దేశాల నుండి ఈ శాపం విగ్రహారాధక భూభాగాలకు వెళ్తునున్నది. పేదలు, ఆజ్ఞానులు అయిన అనాగరికులకు సారా అలవాటు నేర్పటం జరుగుతున్నది. అన్యుల్లో విజ్ఞునలైనవారు సయితం దీన్ని ప్రాణాంతక విషంగా గుర్తించి ప్రతిఘటిస్తున్నారు. కాని తమ దేశాల్ని దాని కీడుల నుంచి కాపాడటానికి వారి కృషి వ్యర్ధమౌతున్నది.. నాగరికతల ప్రజల పొగాకు, సారా, నల్లమందును అన్య జాతులపై రుద్దుతున్నారు. తాగుడు వల్ల ఉత్తేజితుడైన అనాగరికుడి అదుపులేని ఉద్రేకాలు అతణ్ణి కని విని ఎరగని నీచత్వానికి దిగజార్చుతున్నాయి. ఈ దేశాలకు మిషనెరీలను పంపటం దాదాపు నిష్ఫల యత్నమౌతున్నది.MHTel 290.4

    వారికి దేవుని గూర్చిన జ్ఞానాన్ని అందించాల్సిన ప్రజల పరిచయం ద్వారా అన్యులు తమ జాతులను ప్రజలను నాశనం చేస్తున్న దురభ్యాసాలు దుర్గణాలకు నడిపించబడుతున్నారు. భూగోళపు చీకటి దేశాలల్లోని ప్రజలు నాగరిక దేశాల మనుషుల్ని దీన్ని బట్టి ద్వేషిస్తున్నారు.,MHTel 290.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents