Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    12—నిరుద్యోగులకు, నిర్వాసితులకు సహాయం

    పేదల పరిస్థితిని ఆందోళనగా పరిగణిస్తూ, వారికి సహాయం చెయ్యటానికి మార్గాల్ని ఆలోచిస్తున్న పెద్ద మనసు గల పురుషులు, స్త్రీలు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేస్తున్న దీవెనలను నిరుద్యోగులు నిర్వాసితులు పొంది ఆయన మానవుడికి ఉద్దేశించిన జీవితం జీవించటం ఎలా సాధ్యపడుతుంది అన్న జావాబు కోసం ఆసక్తిగా ప్రయత్నిస్తున్న ప్రశ్న. సమాజ ప్రస్తుత పరిస్థితికి కారణాల్ని గ్రహించినవారు విద్యావేత్తల్లో గాని రాజనీతిజ్ఞుల్లోనే గాని ఎక్కువ మంది లేరు. పరిపాలానా బాధ్యతలు చేపట్టినవారు పేదరికం, దారిద్ర్యం, పెరుగుతున్న నేరం వంటి సమస్యలను పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్నారు. వ్యాపార కార్యకలపాలను స్థిరీకరించటానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.MHTel 149.1

    మనుషులు దేవుని వాక్యంపై ఎక్కువ శ్రద్ధ పెడితే వారిని తికమక పెడుతున్న ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.MHTel 149.2

    శ్రమ సమస్య విషయంలోను, బీదలకు సహాయం విషయంలోను పాత నిబంధన నుండి ఎంతో నేర్చుకోవచ్చు.MHTel 149.3