Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వల్ప మత్తు పదార్థాలు

    అస్వాభావిక ఉత్తేజకాలకు వాంఛ గలవారు వైన్, బీరు, ఏపిల్ రసం తాగకూడదు. అవి వారి అందుబాటులో ఉండకూడదు. అవి వారికి నిత్యం ఓ శోధనగా ఉంటాయి. తియ్యని ఏపిల్ రసం హానికరం కాదన్న నియమానికొస్తే అనేకులు దాన్ని విచ్చలవిడిగా కొంటారు. కాని అది కొద్ది సేపు మాత్రమే తియ్యగా ఉంటుంది. అంతట అది పులవటం మొదలవుతుంది. తర్వాత దానికి వచ్చే రుచి అనేక జిహ్వాలకు నచ్చుతుంది. దాన్ని ఉపయోగించేవారు అది పులిసిందని ఒప్పుకోవటానికి ఇష్టపడరు.MHTel 283.2

    సాధారణంగా తయారు చేసే తియ్యని ఏపిల్ రసాన్ని ఉపయో గించటంలో కూడా ఆరోగ్యానికి హని ఉంది. తాము కొనే ఏపిల్ రసంలో ఏముందో సూక్ష్మదర్శినిలో చూడగలిగితే దాన్ని తాగేవారు ఎక్కువ మంది ఉండరు. తరుచు మార్కెట్టుకి ఏపిల్ రసాన్ని తయారు చేసేవారు. తాము పయోగించే పండ్లు ఎలాంటివో చూడరు. పురుగులున్న కుళ్ళిన పండ్లనుండి రసం తీస్తారు. ఏరకంగాను విషమయవమైన, కుళ్ళిన ఏపిల్ లను ఉప యోగించనివారు వాటి నుండి తయారు చేసిన రసాన్ని తాగుతారు. అది ఓ విలాస పానీయం అంటారు. కాని రసం తీసే యంత్రం నుంచి తాజాగా వచ్చినప్పుడు సయితం ఈ పానీయం తాగటానికి పనికి రాదు.MHTel 283.3

    వైన్.బిరు, ఏపిల్ రసం కలిగించే మత్తు మధ్యం కలిగించే మత్తంత వాస్తవమైనది. ఈ పానీయల వాడకం ఇంకా ఘాటైన పానీయాలకు వాంఛను పుట్టిస్తుంది. ఇలా సారా అలవాటు స్థాపితమౌతుంది. మితిగా తాగటమన్న బడిలో మనుషులు తాగుడు వృత్తికి విద్యనభ్యసిస్తారు. అయినా స్వల్ప ఉత్తేజకాలు చేసే పని లోలోపల సాగి ప్రమాదాన్ని గుర్తించకముందే బాధితుడు తాగుబోతు బాటన పడతాడు.MHTel 283.4

    “ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించుచు.. ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను, గిన్నెలో తళతళలాడు చుండగను. త్రాగుకుట రుచిగా నుండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పము వలె కరచును కట్ల పామువలె కాటువేయును”. సామెతలు 20:1, 23:31,32MHTel 284.1

    నిజంగా తాగిన వారిగా పరిగణించబడని కొందరు స్వల్ప ఉత్తేజకాల ప్రభావం కింద నిత్యం ఉంటారు. వారు వేడిగా, మానసికంగా అసమర్ధంగా సమతుల్యం లేకుండా ఉంటారు. ప్రతీ అడ్డంకి విరిగి పడేవరకు, ప్రతీ నియమం భగ్నమయ్యేవరకు తాము భద్రంగా ఉన్నామని భావిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వారి ధృఢ తీర్మానాలు బలహీనమౌతాయి. వారి సముప్నత ఆలోచనలు తమ తుచ్ఛ వాంఛలను సుబద్ది అదుపులో ఉంచటంలో విఫలమౌతాయి.MHTel 284.2

    మత్తు పుట్టించే ద్రాక్షారసాన్ని సేవించమని బైబిలు ఎక్కడా చెప్పటంలేదు. కాని వివాహ విందులో క్రీస్తు నీళ్ళ నుండి చేసిన ద్రాక్షారసం ద్రాక్షపండ్ల స్వచ్చమైన రసం. ఇది “ద్రాక్ష గెలలో క్రొత్త రసము” అది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము” అని లేఖనం దాన్ని గురించి చెబుతున్నది,. యెషయా 65:8MHTel 284.3

    “ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మధ్యము అల్లరి పుట్టించును. దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు” అంటూ పాత నిబంధనలో క్రీస్తు హెచ్చరిస్తున్నాడు. సామతెలు 20:1 ఆయన అలాంటి పానీయాన్ని ఇవ్వలేదు. మనసుసు మసకబార్చి ఆద్యాత్మిక అవగాహనను మొద్దుబార్చే కార్యాలు చెయ్యటానికి మనుషుల్ని సాతాను శోధిస్తాడు. కాని క్షుద్ర స్వభావాన్ని అదుపులో ఉంచాలని క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. మానవులకు శోధనగా పరిణమించేదాన్ని ఆయన వారి ముందు ఎన్నడూ పెట్టడు. ఆయన జీవితం మొత్తం ఆత్మ త్యాగానికి అద్దం పట్టింది. ఆహార వాంఛ శక్తిన నిర్వీర్యం చెయ్యటానికే ఆయన నలభై దినాలు అరణ్యంలో ఉపమాసముండి మన పక్షంగా బాధననుభవించి మానవుడికి రాగల అతి తీవ్రమైన పరీక్ష ఎదుర్కున్నాడు. ద్రాక్షారసాన్ని గాని మాద్యాన్ని గాని తాగవద్దని స్నానకుడైన యోహానును అదేశించింది క్రీస్తే. అలాంటి ఆంక్షనే మనోహ భార్యపై విధించిందీ ఆయనే. క్రీస్తు తాను స్వయంగా బోధించిన బోధనను ఆయనే ఖండించటంలేదు. వివాహ విందు అతిధులకు ఆయన సరఫరా చేసిన పులియని ద్రాక్షారసం ఆరోగ్యకరమైన సేదదీర్చే పానీయం. ప్రభురాత్రి భోజన సంస్కారపు బల్ల మీద ఉండాల్సిన ద్రాక్షారసం ఇదే. ఈ సంస్కార సంబంధిత ఆచారం ఆత్మకు తాజతనాన్ని జీవాన్ని ఇవ్వటానికి ఉద్దేశించబడింది. దుష్టతకు సంబంధించిన దేన్నీ దేనితో జతపర్చకూడదు. లేఖనాలు, ప్రకృతి,MHTel 284.4

    జ్ఞానం మత్తు పదార్థాల్ని గురించి మనకు భోదిస్తున్న వెలుగులో బీర్ ని మార్కెట్టుకు తయారు చెయ్యటానికి లేక ద్రాక్షారసం లేక ఏపిల్ రసం తయారు చెయ్యటంలో ఆశలు రేకెత్తించటంలో క్రైస్తవులు ఎలా పాటుపడగలరు? వారు తమవలె తమ పొరుగువానిని ప్రేమిస్తుంటే అతడి మార్గంలో ఓ ఉచ్చుగా ఉండే దాన్ని పెట్టడంలో ఎలా సహాయపడగలడు?MHTel 285.1

    తరచు అమితానుభవం గృహంలోనే ప్రారంభమౌతుంది. అనారోగ్య కరమైన ఆహారం తినటం వల్ల జీర్ణావయవాలు బలహీన పడుతాయి. మరింత ఉత్తేజకమైన ఆహారానికి వాంఛ పుడుతుంది. ఈ రకంగా నిత్యం ఇంకా బలమైన దాని కోసం ఆకలి తర్బీతవుతుంది. ఉత్తేజాల కోసం డిమాండ్ అధికమౌతుంది. దాన్ని ప్రతిఘటించటం కష్టమౌతుంది. శరీర వ్యవస్థ ఇంచుమించు విషంతో నిండుతుంది. అది ఎక్కువ బలహీనమయ్యే కొద్ది వీటి కోసం ఇంకా బలమైన కోరిక పుడుతుంది. తప్పుదిశలో ఒక తప్పటడుగుమరోదానికి మార్గం సుగమం చేస్తుంది. వైన్ గాని సారా గాని తమ భోజన బల్ల మీద పెట్టని అనేకులు మద్యానికి తృష్ణ పుట్టించే ఆహారంతో తమ భోజన బల్లల్ని నింపుతారు. తాగుడుకు శోధనను ప్రతిఘటించటం ఆసాధ్యమౌతుంది. తినటం తాగటం తప్పుడు అలవాట్లకు ఆరోగ్యాన్ని నాశనం చేసి తాగుబోతుతనానికి బాటులు పరుస్తుంది.MHTel 285.2

    సమాజాన్ని రూపుదిద్దే యువతలో సరియైన మితానుభవ సూత్రాలను పాదుకొలిపితే మితానుభవ దండయాత్రలు జరపాల్సిన అవసరం ఉండదు. తల్లితండ్రులు తమ చలిమంటల వద్ద, తమ పిల్లలకు చిన్ననాటి నుండి వారు నేర్పే నియమాల్లో అమితానుభవానికి వ్యతిరేకంగా దండయాత్రను నిర్వహించనివ్వండి. అప్పుడు వారు జయానికి ఎదురు చూడవచ్చు.MHTel 286.1

    తమ బిడ్డలు సరియై అలవాట్లు మంచి అభిరుచులు ఏర్పర్చు కోవటానికి వారికి తోడ్పడటం అనే పని తల్లులకు నియమించబడింది. వారి ఆకలిని తర్బీతు చెయ్యండి. ఉత్తేజకాల్ని అసహ్యహించుకోవటానికి పిల్లలకు నేర్పించండి. తమ చుట్టు ఉన్న దుర్మార్గతను ప్రతిఘటించేటట్లు మీ పిల్లల్ని పెంచండి. ఇతరులను అనుసరించి పోకూడదని, బలమైన ప్రభావాలకు లొంగకూడదని ఇతరుల్ని మంచికి ప్రభావితం చెయ్యలని వారికి నేర్పించండి.MHTel 286.2

    అమితానుభవాన్ని అంతం చెయ్యటానికి చాలా కృషి జరిగింది గాని అది సరియైన అంశముపై కేంద్రీకృతం కాలేదు. మితానుభవ ప్రబోధకులు అనారోగ్యకరమైన ఆహారం. మసాలాలు, టీ, కాఫీ వలన కలిగే దుష్పలితాలను గుర్తించాలి. మితానుభవపనివారిని దేవుడు దీవించును గాక కాని వారు పోరాడుతున్న కీడులకు కారణాల్ని మరింత లోతుగా పరిశీలించాల్సిందని సంస్కరణలో నిలకడగా ఉండాల్సిందని వారిని ఆహ్వానిస్తున్నాం.MHTel 286.3

    మానసిక నైతిక శక్తుల సమతుల్యల చాలా మేరకు శారీరక వ్యవస్థ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని ప్రజల మందు ఉంచాలి. భౌతిక స్వభావాన్ని బలహీనపర్చి దిగజార్చే అన్ని మత్తు పదార్థాలు ఆస్వాభావిక ఉత్తేజాకాలు మేధ స్థాయిని నీతి నియామాలను తగ్గించటానికి దోహద పడుతాయి. లోకం నైతిక పతనానికి అమితానుభవం పునాది. వక్రమైన ఆహార వాంఛ వలన మానవుడు శోధనను ప్రతిఘటించే శక్తిని కోల్పోతాడు.MHTel 286.4

    మితానుభవ సంస్కర్తలు ప్రజల్ని ఈ విషయాలపై చైతన్యపర్చాలి. అలసిపోయిన శక్తుల్ని అసహజ, క్షణిక చర్యకు ప్రోత్సహించే ఉత్తేజకాల వాడకం వల్ల ఆరోగ్యం, ప్రవర్తన జీవితం ప్రమాదంలో పడతాయిని వారికి బోధించండి.MHTel 287.1

    టీ, కాఫీ, పొగాకు, సారాలకు సంబంధించినంత వరకు క్షేమమైన ఒకే ఒక మార్గం వాటిని ముట్టకుండటం, రుచి చూడకుండటం, చేతితో తాకకుండటం. టీ, కాఫీ, ఇంకా అలాంటి పానీయాలు సారా,పొగాకు దిశలోనే పోయే స్వభావం గలవి. కొన్ని సందర్భాల్లో ఈ అలవాటును మానటం తాగుబోతు తాగుడు మానటం ఎంత కష్టమో అంతకష్టమౌతుంది. ఈ ప్రేరకాలను మానటానికి ప్రయత్నించేవారు. కొంత కాలం ఏదో పోగుట్టుకున్న మనోభావన కలిగి ఉంటారు. అవి లేనందుకు బాధపడతారు. ఎడతెగని ప్రయత్నం ద్వారా వారు ఆ వాంఛను అధిగమిస్తారు. తాన గురి అయిన దుర్వినియోగం నుంచి కోలుకోవటానికి ప్రకృతికి కొంత సమయం పడుతుంది. కాని దానికి ఓ తరణం ఇవ్వండి. అది మళ్లీ పుంజుకొని దాని పనిని అది చక్కగా చేసుకుంటుంది.MHTel 287.2

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents