Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వస్తత వాగ్దానాలు

    “యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును ఆపరాధులుగా ఎంచబడరు”. కీర్తనలు 34:22 MHTel 212.1

    “యెహోవా యందు భయభక్తులు కలిగియుండు బహు ధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు”. కీర్తనలు 14:26MHTel 212.2

    “అయితే సీయోను, యెహోవా నన్ను విడిచి పెట్టియున్నాడు ప్రభువు నన్ను విడిచి పెట్టి యున్నాడని అనుకొనుచున్నది స్త్రీతన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండ తనచంటి పిల్లను మరుచునా? వారైన మరుచుదురుగాని నేను నిన్ను మరవును చూడుము నా యరచేతిమీదనే నిన్ను చెక్కియున్నాను” యెషయా 49:14-16MHTel 212.3

    “భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడును నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను అదుకొందును. యోషయా 41:10 MHTel 212.4

    “గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడినవారలరా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని నవారలరా, నా మాట ఆలకించుడి ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనవ వాడను నేనే తలవెండ్రకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే” యెషయా 46:34MHTel 212.5

    కృతజ్ఞతా స్వభావర, స్తుతి స్వభావం కాన్న శరీరాత్మల ఆరోగ్యాన్ని ఎక్కువగా వృద్ధిపర్చేది మరేది లేదు. విచారం, అంసతృప్తితో కూడిన ఆలోచనలు మనోభావాల్ని ప్రతిఘటించటం ఓ ఖచ్చితమైన నిది--- ప్రార్ధించటం వంటి విధి, మనం పరోలోక ప్రయాణికులమైతే మన తండ్రి గృహానికి వెళ్ళే మార్గమంతా మూలుగుతూ, ఫిర్యాదులు చేస్తూ విలపించే ప్రజలుగా ఎలా వెళ్ళగలం? |MHTel 213.1

    క్రైస్తవులుగా చెప్పుకుంటూ, నిత్యమూ ఫిర్యాదులు చేస్తూ ఉత్సాహ, ఉల్లాస స్పూర్తి పాపమని భావిస్తున్నట్లు కనిపించే వారిది నిజమైన మతం కాదు. స్వాభావిక ప్రపపంచంలో దు:ఖ సంబంధిత విషయాల్లో ఇష్టం చూపేవారు.అందమైన పుష్పాల్ని పోగుచేసుకునే బదులు చచ్చి ఎండిన ఆకులను చూసేవారు. చక్కని పర్వ శిఖరాల్లో పచ్చదనంతో సజీవంగా కనిపించే లోయల్లో ఎలాంటి రమ్యతనూ చూడలేని వారు. ప్రకృతిలో తమకు మాట్లాడే. వినే చెవికి విందు గొలిపే మధురానంద స్వరానికి తమ పంచేద్రియాల్ని మూసివేసుకునే వారు.. వీరు క్రీస్తులోని వారు కానే కారు. వెలుగుకలిగి ఉన్నా, తన కిరణాల్లో స్వస్థతతతో నీతి సూర్యని ప్రకాశాన్ని సహితం పొందగలిగి ఉన్నా. వారు విచారనాన్ని చీకటిని పోగుచేసు కుంటున్నారు.MHTel 213.2

    తరుచు బాధవల్ల మీ మనసు మబ్బుకమ్మి ఉండవచ్చు. అప్పుడు ఆలోచించటానికి ప్రయల్నించదవద్దు మిమ్మల్ని క్రీస్తు ప్రేమిస్తున్నట్లు మీకు విశ్రాంతి తీసుకోవటం ద్వారా మీరు ఆయన చిత్తాన్ని జరిగించవచ్చు.MHTel 213.3

    మన ఆలోచనలను మనోభావలను వ్యక్తం చేసినప్పుడు వాటికి ప్రోత్సాహాన్ని శక్తిని ఇస్తాం. అది ప్రకృతి చట్టం. మాటలు ఆలోచనలను వ్యక్తం చేస్తుంటే ఆలోచనలు మాటలను అనుసరించటం కూడా వాస్తవమే. మన విశ్వాసాన్ని గురించి మనం ఎక్కవ చెప్పితే మనకున్నవన్ని మనం ఎరిగిన దీవెనలను గూర్చి ఎక్కువ ఆనందిస్తే ... దేవుని కృప అయిన ప్రేమ మనకు ఇంకా ఎక్కువ విశ్వాసం ఎక్కువ సంతోషం ఉంటుంది. దేవుని మంచితనాన్ని ప్రేమను అభినందించటం వల్లకలిగే దీవెనలను ఏ భాష వ్యక్తం చెయ్యలేదు ఏ మనసు ఊహించలేదు. దేవుని సింహాసనం నుంచి ప్రవహిస్తున్న నదుల సరఫరా గల ఎన్నడూ ఎండిపోని ఊట వంటి ఆనందాన్ని ఈ లోకంలో సయితం మనం పొందవచ్చు.MHTel 213.4

    కాబట్టి తన సాటిలేని ప్రేమ నిమిత్తం ఆయనకు స్తుతి సమర్పించ టానికి మన హృదయాల్ని పెదవుల్ని తర్బీతు చేసుకుందాం. నిరీక్షణ కలిగి ఉండటానికి కల్వరి సిలువ నుంచి ప్రకాశిస్తున్న వెలుగులో నివసించటానికి మన మనుసుల్ని తర్బీతు చేసుకుందాం. మనం పరలోక రాజు బిడ్డలమని, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కుమారులమూ కుమార్తెలమూ అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవునిలో ప్రశాంతతమైన విశ్రాంతి పోంటం మన ప్రత్యేక హక్కు.MHTel 214.1

    “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియ్యుడి. మరియు కృతజ్ఞులై యుండుడి”. కొలస్స 3:15 మన సొంత కష్టాలు శ్రమలను మర్చిపోయి తన నామ మహిమ కోసం నివసించే తరుణం నిమిత్తం దేవుని స్తుతిద్దాం. మన విషయంలో ఆయన శ్రద్ధను ప్రేమను గురించి ప్రతీరోజు ఆయన కుమ్మరిస్తున్న తాజా దీవెనలు మన మనసుల్లో స్తోత్రాన్ని మేల్కొల్పనివ్వండి.MHTel 214.2

    ఉదయాన్నే నిద్రలేచినప్పుడు రాత్రంంతా మిమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ హృదయంలో ఆయన ఉంచిన సమాధానికి ఆయనకు వందనాలు సమర్పించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హృదయరంజకమైన సువాసనలా కృతజ్ఞత పరలోకానికి ఎగసిపోనివ్వండి.MHTel 214.3

    ఎవరైనా మీకెలాగున్నదని అడిగినప్పుడు సానుభూతిని పొందటానికి దు:ఖకరమైన విషయాన్ని గురించి తలంచటానికి ప్రయత్నించకండి. మీకు విశ్వాసం లేకపోవటాన్ని గురించి, మీ దు:ఖలు బాధల గురించి నాట్లాడకండి శోధకుడు అలాంటి మాటలు వినటానికి సంబరపడతాడు. విచారం కలిగించే అంశాలపై మాట్లాడేటప్పుడు, మీరు అతణ్ణి మహిమపర్చుతున్నారు. మనల్ని జయించటానికి సాతానుకున్న గొప్ప శక్తిని గూర్చి మనం మాట్లాడకూడదు. అతడి శక్తిని గురించి మాట్లాడటం ద్వారా తరుచు మనల్ని మనం అతడి చేతులకు అప్పగించుకుంటున్నాం. దానికి బదులు మన ఆశక్తుల్ని తన ఆసక్తులతో జతపర్చటానికి దేవుని కున్న గొప్ప శక్తిని గురించి మాట్లాడదాం. క్రీస్తుకు ఉన్న అనన్యసాధ్యమైన శక్తిని గురించి ఆయన మహిమను గురించి చెప్పుదాం. మన రక్షణ యందు పరలోకమంతా ఆసక్తి కలిగియున్నది. రక్షణకు వారసులు కాబోతున్న వారికి పరిచర్య చెయ్యటానికి వేలు లక్షల కొద్ది దేవదూతలు ఆదేశించబడ్డారు. వారు మనల్ని దుష్టత నుంచి కాపాడి, మన నాశనాన్ని అన్వేషిస్తున్న శక్తుల్ని వెనక్కి నెట్టివేస్తారు. ప్రతీ నిమిషం మన మార్గంలో కష్టాలున్నట్లు కనిపించినప్పుడు సయితం కృతజ్ఞత తెలపటానికి మనకు హేతువులేదా? MHTel 214.4

    పాటల ద్వారా స్తుతి వందనాలు చెల్లించండి. శోధింపపడ్డాడు మనం మనోభావాలకు తెలియజేసే బదులు పాటద్వారా దేవునికి స్తుతిగానం చేద్దాంMHTel 215.1

    నీ ప్రియ కుమారుడు యేసును అర్పించినందు, ఓ దేవా నీకు సోత్రం. ఆయన మరణించాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. MHTel 215.2

    ఓ దేవా నీ ఆత్మ వెలుగుకై నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం ఆయన మాకు మా రక్షకుణ్ణి బయలుపర్చి మా చీకటినిపారదోలాడు MHTel 215.3

    వధించ బడ్డ గొర్రె పిల్లకు స్తుతి మహిమలు చెల్లును గాక ఆయన మా పాపాల్ని భరించి ప్రతీ డాగును కడిగివేసాడుMHTel 215.4

    కృపా సంపూర్ణుడైన దేవునికి సకలస్తుతి మహిం కలుగునుగాక ఆయన మమ్మల్ని కొని వెదకి, మాకు మార్గంచూపిస్తున్నాడు MHTel 215.5

    మళ్లీ మమ్మల్ని ఉజ్జీవింప చేయు, నీ ప్రేమతో ప్రతీ హృదయాన్ని నింపు ప్రతీ ఆత్మను పరలో కాగ్నితో తిరిగి రగిలించు MHTel 215.6

    పల్లవి MHTel 215.7

    :హల్లెలూయ! నీకే మహిమ! హల్లెలూయ! ఆమెన్ హల్లెలూయ! నీకే మహిమ,మమ్మల్ని పునరుజ్జీవింజేయి.MHTel 215.8

    పాటను మనం నిరాశను జయించటానికి ఓ ఆయుదంగా ఉప యోగించవచ్చ. ఇలా రక్షకుని సముఖానికి సూర్యరశ్మికి మనం మన హృదయాన్ని తెరిస్తే మనకు ఆరోగ్యం. ఆయన దీవెన ఉంటాయిMHTel 216.1

    “శాంతిని మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి”. యోహాను 14:27MHTel 216.2

    ” యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు
    చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
    యెహోవా విమోచించువారు ఆ మాట పలుకుదురు గాక”.
    “ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి
    ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి
    ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి.
    యెహోవాను వెదకువారు హృదయమందు
    సంతోషించుదురు గాక”

    ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి
    పరిచియున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో
    నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మ సూన్నతుని
    తీర్మానము తృణీకరించినందున
    బాధచేతను ఇనుపకట్ల చేతను బంధింపబడినవారై
    చీకటిలోను మరణాంధకారములోను
    నివాసముచేయువారి హృదయమును
    ఆయన అయాసముచేత క్రుంగజేసెను.
    వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
    కష్టకాలమందువారు యెహోవాకు మొట్ట పెట్టరి
    ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను
    వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియు
    మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను
    ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు
    కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదురుగాక,
    నాప్రాణమా నీవెల క్రుంగియున్నావు?
    నాలో నీవలే తొందర పడుచున్నావా?
    దేవుని యందు నిరీక్షణయుంచుము,
    ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు
    ఇంకనకు నేనాయనను స్తుతించదెను”.
    MHTel 216.3

    కీర్తనలు 107:1,2, 105:2,3, 107:9-15, 42:11

    “ప్రతి విషయమందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము”. 1 థెస్స 5:18 మనకు వ్యతిరేకంగా కనిపించే విషయాలు కూడా మన మేలుకు పనిచేస్తాయని ఈ ఆదేశం భరోసా ఇస్తున్నది. మనకు హాని సేసేదాని నిమిత్తం మన కృతజ్ఞులమై ఉండాలని దేవుడు ఆదేశించాడు.MHTel 217.1

    ” యెహోవా నాకు వెలుగును రక్షనయునైయున్నాడు,
    నేను ఎవరికి భయపడుదును ?”
    “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును
    తన గుడారపు మాటున నన్ను దాచును
    ఆశ్రయ దర్గము మీద ఆయన నన్ను ఎక్కించును.
    ఇప్పుడు నన్ను చుట్టు కొనియున్న నా శత్రువుల
    కంటె ఎత్తుగా నా తల యెత్తబడును”. “యెహోవా కొరకు నేను సహనముతో కని పెట్టుకొంటిని
    ఆయన నాకు చెవి యెగ్గి నా మొట్ట ఆలకించెను.
    నాశనకరమైన గుంటలో నుండియు
    జిగటగల దొంగ ఊబిలో నుండియు
    ఆయన నన్ను పైకెత్తెను
    నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరంచెను.
    తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు
    నా నోటనుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి
    యెహోవా యందు నమ్మిక యుంచెదరు”
    “యెహోవానా ఆశ్రయము, నాకేడము
    నా హృదయము ఆయనయందు నమ్మిక యుంచెనుగనుక
    నాకు సహాయము కలిగెను
    కావున నా హృదయము ప్రవర్షించుచున్నది
    కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను”
    MHTel 217.2

    కీర్తనలు 27:1, 27:5:6, 40:1-3, 28:7

    వ్యాధిగ్రస్తుల స్వస్థతకు నిస్సందేహమైన ఆటంకాల్లో ఒకటి రోగులు తమ పైనే గమనాన్ని కేంద్రీకరిచటం. గమనం తమ పై నుండి మళ్ళించుకొని ఇతరుల్ని గురించి తలంచటానికి ఇతరులకు సహాయం చెయ్యడానిక తమకు అవసరమయి ఉండగా, అనేకమంది వికాలంగులు ప్రతీవారు తమ పట్ల సానభూతి చూపించాలని తమకు సహాయం చెయ్యాలని భావిస్తుంటారు.MHTel 218.1

    తరుచు వ్యాధిగ్రస్తుల గురించి దు:ఖిస్తున్నవారి గురించి నిరాశ చెందినవారి గురించి ప్రార్ధనకు మనవులు చెయ్యటం కద్దు ఇది సరియైన కార్యమే. చీకటిగా ఉన్న మనసులో వెలుగు ప్రకాశింపజెయ్యవలసినదిగాను దు:ఖిస్తున్న హృదయానికి ఓదార్పు కలిగించవలసినదిగాను మనం ఆర్ధించాలి కాని తన దీవెనల మార్గంలో తమను తాము ఉంచుకున్న వారి పక్షంగానే దేవుడు ప్రార్ధనకు జవాబిస్తాడు. దు:ఖాల్లో ఉన్న వీరి కోసం ప్రార్ధన చేస్తూ తమకన్నా ఎక్కులేమిలో ఉన్నవారికి తోడ్పడటనాకి వారిని ప్రోత్సహించాలి. ఇతరులకు సహాయం చెయ్యటానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడుగ వారి హృదయాల్లో నుండి చీకటి తొలగిపోతుంది. మనకు లభించిన ఆదరణతో మనం ఇతరులను ఆదరిచటానికి ప్రయత్నిస్తే ఆ దీవెన తిరగి మనకు వస్తుంది.MHTel 218.2

    యెషయా ఏభై ఎనిమిదో అధ్యాయంన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన రుగ్మతలకు పరమౌషధం. ఆరోగ్యాన్ని జీవితంలోని ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే ఈ లేఖనంలో ఉన్న విషయాలను మనం ఆచరణలో పెట్టాలి. తనకు అంగీకారమైన సేవను గురించి దాని దీవెనల్లిన గురించి ప్రభువంటున్నాడు.MHTel 218.3

    “నీ ఆహారము ఆకలిగొనినవారిని పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు దిక్కుమాలిన బదలన నీ ఇంటి చేర్చుకొనుటయను వస్త్ర హీనుడు నీకు కనపడినప్పుడవానికి వస్త్రము లిచ్చుటయు ఇదియేగదా నాకిష్టమైన ఉపవాసము? అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి ముందర నడుచుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనుయున్నాననను. ఇతరులకు బాధించటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు చూచి ఆశించిన దానిని ఆకలి గొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపర్చి నీ యెముకలను బలపర్చును. నీవు నీరు పెట్టిన తోటవలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలె ఉండెదవు”. యోషయా 58:7-11MHTel 219.1

    మంచి పనులు రెండింతలు దీవెన గలవి. ఇచ్చేవానికి ఆ దయను అందుకునేవానికి అది మేలు చేస్తుంది. న్యాయం చేసాను అన్న స్పృహ వ్యాధిగ్రస్తమైన శరీరాలకు ఆత్మలకు ఉత్తమౌషదం. ఓ విధిని చక్కగా నిర్వర్తించానన్న గుర్తింపుతోను మనసు స్వేచ్ఛగాను సంతోషంగాను, ఇతరులకు సంతోషం చేకూర్చిన తృప్తితోను ఉన్ననప్పుడు ఉత్సాహాన్నిచ్చి ఉద్దరించే ప్రభావం శరీరమంతటికి నూతన జీవాన్ని తెస్తుంది.MHTel 219.2

    వికలాంగుడు నిత్యం సానుభూతిని అన్వేషించేబదులు దాన్ని ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నించనివ్వండి. మీ బలహీనత, దు:ఖం బాద భారాన్ని కృప కనికరాలు గల రక్షకుని మీద వెయ్యండి మీ హృదయాన్ని ఆయన ప్రేమకు తెరిచి దాన్ని ఇతరులకు ప్రవహించనివ్వండి, భరించటం కష్టమైన శ్రమలు, ప్రతిఘటించటం కష్టమైన శోధనలు అందరికి ఉన్నాయని ఈ భారాల్ని తేలిక చెయ్యటానికి మీరు కొంత చెయ్యవచ్చునిన జ్ఞాపకముంచుకోండి. మీకున్న దీవెనలన్ని గురించి కృతజ్ఞత తెలపండి. మీరు పొందుతున్న శ్రద్ధాసక్తులను అభినందిస్తున్నట్లు కనపర్చండి. ఇతరులకు ఆదరణను బలాన్ని ఇచ్చే మాటలు చెప్పేందుకు దేవుని ప్రశస్త వాక్య నిధుల నుండి విలువైన వాగ్దానాలతో మీ హృదయాల్ని నింపుకోండి, ఇది మీకు సహాయన్నిచ్చి మిమ్మల్ని పైకిలేపే వాతావరణాన్ని మీ చుట్టు నింపుతుంది. మీ చుట్టు ఉన్నవారికి దీవెనగా ఉండటం మీ గురి కానివ్వండి అప్పుడు మీ కుటుంబీకులు ఇతరలకు ఆసరగా ఉండే మార్గాల్ని మీరు కనుగొంటారు.MHTel 219.3

    అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇతరుల పట్ల తమ ఆశక్తిలో తమను గురించి తాము మర్చిపోతే, తమకన్నా ఎక్కువ అవసరాలున్నవారికి పరిచర్య చెయ్యాల్సిందిగా ప్రభువిచ్చిన ఆజ్ఞను నెవరేర్చటానికి సిద్ధంగా ఉంటే వారు ఈ ప్రవచన వాగ్దానంలోని సత్యాన్ని గుర్తిస్తారు: “నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును.MHTel 220.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents