Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అందించటం ద్వారా నేర్చుకోవటం

    జ్ఞానం సంపాదించటంలో యువతను తాము వెళ్ళగలిగినంత వేగంగా వెళ్లగలిగినంత దూరం వెళ్ళనివ్వాలి. వారి అధ్యయన క్షేత్రం వారి సామర్ధ్యాలు పోగలిగినంత విశాలంగా ఉండనివ్వండి. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని వారు ఇతరులకు అందించాలి. ఈ విధంగా వారి మనసులు క్రమశిక్షణను శక్తిని పొందుతాయి. వారి విద్య విలువను జ్ఞానాన్ని వారి వినయోగం నిర్ణయిస్తుంది. సంపాదించిన జ్ఞానాన్ని అందించటానికి కృషి చెయ్యకుండా అధ్యయనంలో దీర్ఘకాలం గడపటం వాస్తవిక అభివృద్ధికి సహాయపడేకన్నా ఓ ప్రతిబంధకమౌతుంది. గృహం పాఠశల రెండిటిలోను ఎలా అధ్యయనం చెయ్యాలో, సంపాదిచిన జ్ఞానాన్ని ఎలా అందించాలో ప్రతీ విద్యార్ధి నేర్చుకోవాలి. తన వృత్తి ఏదైనా ప్రాణం ఉన్నంతవరకు అతడు విద్యార్ధిగాను, ఉపాధ్యాయుడుగాను ఉండాలి. దేవుని మీద నమ్మకముంచి యుగయుగాలుగా మర్మాలుగా ఉన్న రహస్యాలను బయలుపర్చగల తనను విశ్వాసించేవారి సమస్యలను పరిష్కరించగల అనంత జ్ఞాని అయిన ప్రభువును గట్టిగా పట్టుకోవటం ద్వారా అతడు నిత్యం వృద్ధి చెందుతాడు.MHTel 346.3

    సంఘాల ప్రభావాన్ని గురించి, పురుషులు, స్త్రీల ప్రభావాన్ని గురించి దేవుని వాక్యం నొక్కి చెబుతున్నది. వృద్ధి చెందుతున్న పిల్లల్ని యువత మనసు ప్రవర్తన పై దాని ప్రభావం శక్తి ఇంకెంత ఎక్కువగా ఉంటుంది! వారు చేసే స్నేహాలు వారు అవలంబించే నియామాలు, వారు నేర్చుకునే అలవాట్లు ఇక్కడ వారి ప్రయోజకత్వాన్ని నిత్య జీవిత అసక్తుల్ని నిర్ణయిస్తాయి.MHTel 347.1

    మానసికాభివృద్ధికి క్రమశిక్షణకు పిల్లల్ని పంపే పాఠశాలలు, కళాశాలల్లో ప్రవర్తనను వక్రీకరించే జీవిత వాస్తవిక లక్ష్యాలనుంచి మనసును పక్కదారి పట్టంచి నైతికతను దిగజార్చే ప్రబలటం భయంకర విషయం. ఇది తల్లితండ్రుల హృదయలను భయంతో కంపింప చేయాల్సిన విషయం . మతంలేని, వినోదాల్ని ప్రేమించే, అనీతిలో నిండిన వారితో పరిచయం ద్వారా చాలా మంది యువత దేవునిలో విశ్వాస సామాన్యతను, పవిత్రతను, క్రైస్తవ తండ్రులు తల్లులు ప్రేమించి ఉపదేశం ద్వారాను, ప్రార్ధన ద్వారాను కాపాడుకొంటున్న ఆత్మ త్యాగ న్పూర్తిని పోగొట్టుకుంటున్నారు.MHTel 347.2

    స్వార్థరహిత సేవ చెయ్యాలన్న ఉద్దేశంతో పాఠశాలలో ప్రవేశించి అనేకులు లౌకికమైన అధ్యయనాల్లో తలమునకలవుతున్నారు. విద్యాపరమైన ఖ్యాతి సంపాదించి లోకంలో హోదాను ప్రతిష్టను సంపాదించాలన్న కోరిక మేల్కొంటుంది. తాము పాఠశాలలో ఎందుకు ప్రవేశించారో మర్చిపోతారు. వారి జీవితం స్వార్ధ ఐహిక మార్గాల్లో సాగుతుంది. ఈ జీవితాన్ని రానున్న నిత్య జీవితాన్ని నాశనం చేసే అలవాట్లు ఏర్పడతాయి.MHTel 347.3

    సామాన్యంగా విశాలమైన స్వార్ధ రహితమైన, అభిప్రాయాలు ఉ దాత్తకాంక్షలు గల పురుషులు స్త్రీలలో సంవత్సరాల కొద్ది తమ సహవాసం ద్వారా ఈ గుణాలు వృద్ధి చెందుతాయి. ఇశ్రాయేలుతో తన వ్యవహ రణల్నిటిలో తమ బిడ్డల స్నేహాల్ని జాగ్రత్తగా కాపాడటం ప్రాముఖ్యమని దేవుడు హెచ్చరించాడు. పౌర సంబంధమైన, మత సంబంధమైన, సాంఘిక సంబంధమైన జీవితానికి ఏర్పాట్లన్నీ హానికరమైన స్నేహాల నుండి పిల్లల్ని కాపాడటానికి తమ చిన్నతనం నుంచి వారికి దైవ ధర్మశాస్త్ర సూత్రాలతో పరిచయం ఏర్పర్చటం జరిగింది. జాతి అవిర్భావ సమంయలోని సాదృశ్య పాఠం అన్ని హృదయాలను ఆకర్షించే స్వభావం కలది. మొదటి సంతానం మరణంలో ఐగుప్త ప్రజలమీదికి తీర్పులు రాకముందు తమ బిడ్డల్ని తమ సోంత గృహాల్లోకి పోగుచెయ్యాల్సిందిగా తన జ్రల్ని దేవుడు ఆదేశించాడు.MHTel 347.4

    ప్రతీ గృహ ద్వారబంధం రక్తపు గుర్తు కలిగిన సంకేతం ద్వారా ఏర్పాటైన పరిరక్షణలో నివసించాల్సి ఉన్నరు. అలాగే నేడు దేవుని ప్రేమించి ఆయనకు భయపడే తల్లితండ్రులు తమ బిడ్డలను “నిబంధన సంబంధం”లో క్రీస్తు విమోచించే రక్తం ద్వారా సాధ్యపడిన ప్రభావాల రక్షణలో ఉంచాలి.MHTel 348.1

    తనశిష్యుల గురించి క్రీస్తిలా అన్నాడు. వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు”. యోహాను 17:14.MHTel 348.2

    “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్ణీతితోత ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు?... దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక ? మనము జీవము గల దేవుని ఆలయమైయున్నాము. అందుకీలాగు దేవుడు సెలవిచ్చున్నాడు....MHTel 348.3

    “మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని మట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు “నేను మిమ్మును చేర్చుకొందును మీకు తండ్రినై యందును మీరు నాకుకుమారులు, కుమార్తెలు నైయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు” 2 కొరి 6:14-18MHTel 348.4

    “జనులను సమకూర్చుడి”. “దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను”.యోవేలు 2:16 నిర్గమ 18:16 “వారు...... నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను”. సంఖ్యా 6:26 MHTel 349.1

    “భూ ప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు”. ద్వితి 28:10 MHTel 349.2

    “యాకోబు సంతతిలో శేశించిన వారు యెహోవా కురిపించు మంచు వలె, మనుష్య ప్రయత్నము లేకుండను నరుల యోచనలేకుండను గడ్డి మీదపడు వర్షమువలె ఆయాజనముల మధ్యనుందురు”. మీక 5:7MHTel 349.3

    మనం ఇశ్రాయేలుగా పరిగణన పొందుతున్నాం. తమ పిల్లల విద్య శిక్షణ విషయంలో పురాతన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఉపదేశం. విధేయత ద్వారా వచ్చే దీవెనల వాగ్దానాలు మనకు చెందుతాయి.MHTel 349.4

    మనకు దేవుని వాగ్దానం ఇది.“నిన్న ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు”. అది 12:2MHTel 349.5

    మొదటి శిష్యులను గురించి వారి మాటను నమ్మి తనను విశ్వసించిన వారి గురించి క్రీస్తు అంటున్నాడు. “మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేనువారికి ఇచ్చితిని. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.”యోహాను 17:22,23MHTel 349.6

    అద్భుతమైన మాటలు! విశ్వాసం కూడా దాదాపు గ్రహించలేని మాటలు! లోకాల సృష్టికర్త తన సేవకు తమను తాము అర్పించుకునే వారిని ప్రేమిస్తాడు. తన కుమారుని ప్రేమించినట్లు ప్రేమిస్తాడు. ఇక్కడ ఇప్పుడు సయితం ఆయన ప్రసన్నత అద్భుత మైన రీతిగా మన పై ఉన్నది. పరలోకానికి వెలుగు, పరలోక ప్రభువు అయిన క్రీస్తును ఆయనతో పాటు పరలోక ఐశ్వర్యమంతా ఆయన మనకు ఇచ్చాడు. రానున్న నిత్య జీవితానికి ఎంతో వాగ్దానం చేయగా ఈ జీవితంలో కూడా ఆయన మనకు గొప్ప బహుమానాలిస్తాడు. మన ప్రవర్తనలు ఘనపర్చి విస్తృత పర్చి, ఉన్నతికూర్చే ప్రతీ దాన్ని మనం ఆనందించాలని ఆయన కోరుతున్నాడు. తాను పని చేసినట్లు పని చెయ్యటానికి, ఆత్మలను సురక్షిత మార్గాల్లో నడిపించటానికి అనేకుల పాదాలను యుగయుగాల శిలపై పాదుకొల్పటానికి వారు క్రీస్తు రక్తంతో తడిసిన జెండా కింద నిలబడటానికి యువతలో స్పూర్తిని నింపటానికి ఆయన వేచి ఉన్నాడు.MHTel 349.7

    దేవుని విద్యా ప్రణాళిక ప్రకారం పనిచెయ్యటానికి ప్రయత్నిస్తున్న వారందరికి ఆయన కృప, ఆయన నిత్య సముఖం ఆయన కాపుదల ఉంటాయి ఆయన అంటున్నాడు.MHTel 350.1

    “నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులుపడకము జడియకుము... నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” నిన్ను విడవను నిన్ను ఎడబాయను”. యెహోషువా 1:9,5.MHTel 350.2

    “వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తమును భుజించు వానికి ఆహారమును కలుగటకై అది చిగిర్జి వర్దిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్పలముగా నా యొద్దకు మరల అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్లుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడదురు. మీ యెదుట పర్వతములును, మెట్టులును సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్ల చెడ్లకు బదులుగా దేవదారు వృక్షములు మెలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహావాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును”. యెషయా 55:10-13MHTel 350.3

    లోకమంతట సమాజం అస్తవ్యస్తంగా ఉన్నది. సమూలమైన మార్పు అవసరం. యువతకు ఇస్తున్న విద్య సాంఘిక నిర్మాణాన్ని రూపుదిద్దాల్సి ఉంది.MHTel 351.1

    “చాల కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి శిధిలములైయున్న పురములను బాగు చేయుదురు వారు “మా దేవుని పరిచారకులని” మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు... నిత్యానందము వారికి కలుగును ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నగు నాకిష్టము ‘. “సత్యమును బట్టి వారి క్రీయాఫలమును వారికిచ్చును వారితో నిత్య నిబంధన చేయదును” జనముల మధ్యను వారి సంతతి తెలియ బడును జనుల మధ్యను వారి సంతానము ప్రసిద్ధనొందును-వారుMHTel 351.2

    యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందు ఒప్పు కొందురు... భూమి మొలకనుమొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనములయెదుట ప్రభువగు యోహెూవా నీతిని స్తోత్ర మును ఉజ్జీవింపజేయును”MHTel 351.3

    యెషయా 61:4,6-8,61:8, 61: 9, 11MHTel 351.4

    *****

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents