Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సూత్రాలు బోధించటం

    సువార్త సేవకులు ఆరోగ్య జీవన సూత్రాల్లో ఉపదేశమివ్వటానికి కూడా సమర్దులవ్వాలి. వ్యాధి అన్నిచోట్ల ఉన్నది. దాన్ని చాలా వరకు ఆరోగ్య చట్టాలకు విధేయంగా నివసించుటం ద్వారా నివారించవచ్చు. ఈ జీవితానికే కాకుండా రానున్న జీవితానిక కూడా క్షేమంతో ఆరోగ్య నియమాల సంబంధాన్ని ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. తన నివాస స్థలంగా తమ సృష్టికర్త నిర్మించిన మానవ శరీరాలయానికి తమ బాధ్యతను గుర్తించటానికి వారిని మేల్కొల్పటం అవసరం. దాని విషయంలో వారు తనకు నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఉండాలని ఆయన కోరుతు న్నాడు. ఈ పరిశుద్ధ లేఖన వాక్కుల్లో వ్యక్తమైన సత్యాన్ని వారు మర్చిపోకూడదు.MHTel 112.1

    “మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము. అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.. నేను వారిలో నివసింతును. నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు”. 2 కొరి 6:18MHTel 112.2

    రోగులకు చికిత్స చెయ్యటానికి సామన్య పద్దతులు... విషంతో నిండిన మందుల స్థానాన్ని ఆక్రమిస్తున్న పద్దతులను గూర్చి ఉపదేశం అవసరమైన వారు దాన్ని సంతోషంగా అందుకునేవారు వేలమంది ఉన్నారు. ఆహార సంస్కరణను గురించి ఉపదేశం చాలా అవసరం. తప్పుడు ఆహార అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటానికి అమితాను భవానికి, లోకానికి శాపంగా మారిన నేరానికి దౌర్భాగ్యానికి చాలా వరకు కారణమౌతున్నాయి.MHTel 112.3

    ఆరోగ్య నియమాలను బోధించుటలో సంస్కరణ ధ్యేయాన్ని దాని ఉద్దేశం. శరీరం, మనసు, ఆత్మ అత్యున్నత అభివృద్ధిని సాధించాలని... మనసు ముందు ఆత్మ ముందు ఉంచుకోండి. దేవుని చట్టాలైన ప్రకృతి చట్టాలు మన మేలు కోసం ఏర్పాటయ్యాయని వాటికి విధేయత ఈ జీవితంలో సంతోషాన్ని ఎంచి, రానున్న జీవితానికి సిద్ధబాటుకు తోడ్పడతాయని ప్రజలకు చూపించండి.MHTel 112.4

    ప్రకృతి కార్యాల్లో ప్రదర్శితమైన దేవుని ప్రేమను వివేకాన్ని అధ్యయనం చెయ్యటానికి ప్రజల్ని నడిపించండి. ఆ అద్భుత అంగనిర్మాణ క్రమాన్ని... మానవ వ్యవస్థను... దాన్ని పాలించే చట్టాలను అధ్యయనం చెయ్యటానికి వారిని నడిపించండి. దేవుని ప్రేమకు నిదర్శనాలకు అర్ధం చేసుకునేవారు. ఆయన చట్టాల్లోని వివేకాన్ని, ఉపకారాన్ని, విధేయత ఫలితాల్ని కొంత మేరకు అవగాహన చేసుకునేవారు తమ విధులను బాధ్యతలను ఎంతో వ్యత్యాసమైన దృక్పథం నుండి పరిగణిస్తారు. ఆరోగ్య చట్టాల అచరణను త్యాగంతోనో ఆత్మోపేక్షగానో చూసేకన్నా దాన్ని ....... అది వాస్తవంలో ఉన్నట్లు ... గొప్పదీవెనగా పరిగణిస్తారు.MHTel 113.1

    ఆరోగ్యదాయకమైన జీవనానికి ఉపదేశం ఇవ్వటం తనకు నియమించిన సేవలో భాగమని ప్రతీ సువార్త పరిచారకడూ భావించాలి. ఈ సేవ ఎంతో అవసరం. లోకం దీనికి సిద్ధంగా ఉంది.MHTel 113.2

    అన్ని చోట్ల వ్యక్తికి కృషికి సంస్థ కృషిని ప్రత్యామ్నాయం పరిగణించే ధోరణి కనిపిస్తుంది. మానవ జ్ఞానం ఏకీకరణకు, కేంద్రీకరణకు, గొప్ప దేవాలయాలు, సంస్థలు కట్టటానికి మొగ్గు చూపుతుంది. ప్రజా సమూహాలు ఉపకార కృషిని సంస్థలకు వ్యవస్థలకు విడిచి పెడతాయి. లోకంతో సంబంధం నుండి తమను తాము మినహాయించుకుంటారు. కనుక వారి హృదయాలు నిరుత్సాహంగా, నిరాసక్తంగా ఉంటాయి. స్వకార్యాల్లో మునిగి ఏమి పట్టించుకోరు. దేవుని పట్ల మానవుడి పట్ల ప్రేమ చచ్చిపోతుంది. ఆత్మ న్యూనమౌతుంది.MHTel 113.3

    క్రీస్తు తన అనుచరులకు ఓ వ్యక్తిగత సేవను అప్పగించాడు. అది ఇంకొకరు తనకు మారుగా చెయ్యలేని సేవ, జబ్బుగా ఉన్నవారికి బీదలకు పరిచర్య, నశించిన వారికి సువార్త అందజేయుట, కమిటీలకు లేక వ్యవస్థీకృత ఔదార్యానికి విడిచి పెట్టకూడదు. వ్యక్తిగత బాధ్యత, వ్యక్తిగత కృషి, వ్యక్తిగత త్యాగం సువార్త కోరుతున్న విధి.MHTel 113.4

    “నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్ళి లోపలకి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము” అన్నది క్రీస్తు ఆజ్ఞ. తాము ఎవరికి లబ్ది కూర్చాలని చూస్తున్నారో వారిని ఆ మనుషుల అందుబాటులోకి ఆయన తెస్తాడు.MHTel 113.5

    “దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుము” వస్త్ర హీనుడు నీకు కనపనడిప్పుడు వానికి వస్త్రములీయుము “రోగుల మీద చేతులుంచి నప్పుడు వారు స్వస్థత పొందుదురు”. లూకా 14: 23, యెషయా 58:7 మార్కు 16:18 ప్రత్యక్ష పరిచయం ద్వారా, వ్యక్తిగత పరిచర్య ద్వారా సువార్త దీవెనలను అందజేయ్యాలి.MHTel 114.1

    ప్రాచీన కాలంలో ప్రజలకు వెలుగు నివ్వటంలో దేవుడు ఏ ఒక్క తరగతి ప్రజల ద్వారానూ పనిచేయలేదు. దానియేలు యూదా యువరాజు, యెషయా కూడా రాజవంశీయుడే. దావీదు గొర్రెల కాపరి. ఆమోసు పశు వుల కాపరి, జెకర్యా బబులోను నుంచి చెరపట్టబడ్డ వాడు. ఏలీషా వ్యవసాయదారుడు. ప్రభువు తన ప్రతనిధులుగా ప్రవక్తలను ప్రధానులను సమున్నతులను, సామాన్యులను లోకానికి సత్యాన్ని అందించేందుకు ఎంపిక చేసుకొని వారికి సత్యాన్ని బోధించాడు.MHTel 114.2

    తన కృపలో పాలివారయ్యే ప్రతీ వారికి ఇతరులకు చెయ్యటానికి దేవుడు ఒక పనిని నియమిస్తాడు. వ్యక్తిగతంగా మనం మన స్థితిలో మన స్థలంలో నిలిచి “చిత్తగిచుంము నేనున్నాను నన్ను పంపుము” అని చెప్పాలి. యెషయా 6:8 వాక్యపరిచారకుడి పై మిషనెరీ నర్సు పై, క్రైస్తవ వైద్యుడి పై వ్యక్తిగత క్రైస్తవుడిపై అతడు వర్తకుడైనా లేక వ్యవసాయకుడైనా వృత్తి పనివాడైనా లేక మెకానిక్ అయినా బాధ్యత అందరిమీదా ఉంది. రక్షన సువార్తను మనుషులకు ప్రకటించటం మన పని, మనం చేస్తున్న ప్రతీ పనీ ఈ లక్ష్యాన్ని చేరటానికి ఓ సాధనం.MHTel 114.3

    తమకు నియమించిన పనిని చేపట్టేవారు ఇతరులకు దీవెనగా ఉండటం మాత్రమే కాదు. తాము కూడా ఆశీర్వాదం పొందుతారు. సవ్యంగా నిర్వర్తించిన విధిని గూర్చిన స్పృహ తమ సొంత ఆత్మలపై అనియంత్రిత ప్రభావం చూపుతుంది. నిస్పృహ చెందిన వారు తమ నిస్పృహను మర్చిపోతారు. బలహీనులు బలవంతులవుతారు. ఆజ్ఞానులు తెలివి గలవారవుతారు. అందరూ తమను పిలిచిన వానిలో నిత్య సహాయకుణ్ణి కనుగొంటారు.MHTel 114.4

    క్రీస్తు సంఘం సేవకు వ్యవస్తీకరించబడింది. దాని సంకేత శబ్దం పరి చర్య. దాని సభ్యులు రక్షణ సేనాపతి ఆధ్వర్యంలో యుద్ధం చేయ్యటానికి శిక్షణ పొందటానికి ఉన్న సైనికులు.MHTel 115.1

    క్రైస్తవ బోధకులు. వైద్యులు, ఉపా ధ్యాయులకు అనేకులు గుర్తిస్తున్నదాని కన్నా విస్తృతమైన పని ఉన్నది. వారు ప్రజలకు పరిచర్య చెయ్యటం మాత్రమే గాక పరిచర్య చెయ్యటం వారికి నేర్పాలి. సరియైన నియమాల్లో ఉపదేశం ఇవ్వటం మాత్రమే గాక ఈ నియామల్ని బోధించటానికి వారు తమ శ్రోతలను తర్బీతు చెయ్యాలి. ఆచరణలో పెట్టని సత్యం. ఇతరులకు బోధించన సత్యం జీవాన్నిచ్చే తన శక్తిని స్వర్గపర్చే తన ప్రభావాన్ని కోల్పోతుంది. దాన్ని పంచేకొద్దీ దాని దీవెన పెరుగుతంది. దేవునికి మనం చేసే సేవలోని ఏకరూపమును మార్చటం అవసరం. ప్రతీ సంఘ సభ్యుడు ప్రభువుకు ఏదో రకమైన సేవలో నిమగ్నుడై ఉండాలి. కొందరు ఇతరులు చేసినంత పని చెయ్యలేరు. కాని మన లోకాన్ని ముంచుతున్న వ్యాధి దు:ఖమనే వరదను వెనక్కు మళ్ళించడానికి ప్రతీ వ్యక్తి తన శక్తి మేరకు కృషి చెయ్యాలి. ఎలా ప్రారంభించాలో తమకు నేర్పితే పని చెయ్యటానిక అనేకులు సిద్ధంగా ఉంటారు. వారికి ఉపదేశం ప్రోత్సాహం అవసరం.MHTel 115.2

    క్రైస్తవ పనివారికి శిక్షణ ఇవ్వటానికి ప్రతీ సంఘం ఓ తర్బీతు పాఠశాల, బైబిలు అధ్యయనాలు ఎలా నిర్వహించాలో, సబ్బాతు బడి ఎలా నడిపిం చాలో, సబ్బాతుబడి పాఠం ఎలా బోధించాలో, బీదలకు సహాయం, జబ్బుగా ఉన్నవారికి సేవ ఎలా చెయ్యాలో, క్రీస్తును అంగీకరించని వారి కోసం ఎలా పని చెయ్యాలో సభ్యులకు ఏర్పాంచాలి. ఆరోగ్య తరగతులు నిర్వహించాలి. బోధించటం మాత్రమే గాక అనుభవశాలురైన ఉపదేశకుల ఆధ్వర్యంలో నిజమైన పని చెయ్యాలి. ప్రజల మధ్య పని చెయ్యటంలో ఉపదేశకులు ముందుండాలి. వారితో ఉన్న ఇతరులు వారి ఆదర్శం నుండి నేర్చుకుంటారు. ఒక్క ఆదర్శం అనేక బోధలకన్నా ఎక్కువ విలువ గలది.MHTel 115.3

    దేవుడు తన కృపలో ఎక్కడకు పిలిస్తే అక్కడ ఆయన సేవ చేసేందుకు అందరూ తమ శారీరక, మానసిక శక్తులను తమ శక్తి మేరకు వృద్ధిపర్చు కోవాలి. పౌలు అపోలో ఆధ్యాత్మిక ఉత్కృష్టతలకు కారణమైన అదే క్రీస్తు కృప, నేడు భక్తి అంకిత భావం గల క్రైస్తవ మిషనెరీలకు అనుగ్రహించబడు తుంది. మన లోకంలో ఆయన మహిమ స్పష్టంగాను, వక్తిమంతంగాను వెల్లడి అయ్యేటట్లు తన బిడ్డలు ప్రతిభ పాటవము కలిగి ఉండాలని దేవుడు అభిలాషస్తున్నాడు.MHTel 116.1

    తమను తాము దేవునికి సమర్పించుకున్న విద్యావంతులైన పనివారు రకరకాల మార్గాల్లో సేవ చెయ్యగలిగి వ్యిద్యలేని వారికన్నా ఎక్కువ విస్తృతమైన పని చెయ్యగలుగుతారు. తమ మానసిక క్రమశిక్షణ వారికి అనుకూల పరిస్థితిని కల్పిస్తుంది. కాని గొప్ప వరాలు గాని విశాలమైన విద్య గాని లేనివారు పరులు అంగీకరించదగిన సేవ చెయ్యవచ్చు. ఉప యోగించబడటానికి సమ్మతంగా ఉన్నవారిని దేవుడు ఉపయోగిస్తాడు,. ఉత్తమమైన దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే పని గొప్ప ప్రతిభ గలవారిది గొప్పవరాలు గలవారిదే కాదు. పరలోకం నుండి ఓ వర్తమానం విన్న పురుషులు స్త్రీలు అవసరం. “నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి” అన్న ఆహ్వానానికి ఎవరు సానుకూలంగా సప్రందిస్తారో వారు మిక్కిలి కార్యసాధక కార్యకర్తలు. మత్తయి 11:29MHTel 116.2

    సమర్పణ హృదయంగల మిషనెరీలు అవసరం. ఎవరి హృదయాన్ని దేవుడు స్పృశిస్తాడో అతడి హృదయం ఆయన ప్రేమను ఎరుగని వారి కోసం తీవ్ర అకాంక్షతో నిండుతుంది. వారి పరిస్థితి అతడికి దు:ఖం కలిగి స్తుంది. ప్రాణాలు చేతితో పట్టుకొని అతడు దేవుడు పంపిన దైవావేశంతో నిండిన, దూతగా సహకరించగల ఒక పనిని చెయ్యటానికి బయలుదేరి వెళ్తాడు.MHTel 116.3

    దేవుడు గొప్ప వరాలు మేధాశక్తి ఎవరికి ఇచ్చాడో వారు ఈ వరాల్ని స్వార్ధ ప్రయోజనాలకు వినియోగిస్తే కొంత పరీక్షా కాలం అనంతరం వారు తమ సొంత మార్గాన్ని అనుసరించటానికి వాటిని విడిచి పెడతాడు. గొప్ప వరాలు లేనట్లు కనిపించే వారిని, గొప్ప ఆత్మ విశ్వాసం లేనివారిని దేవుడు బలహీనులను బలంతో నింపుతాడు. ఎందుకంటే తాము తమకు ఏమి చేసుకోలేరో అది తమకు ఆయన చేస్తాడని ఆయనలో వారు విశ్వాసముం చుతారు. వారి హృదయపూర్వక సేవను అంగీకరించి దేవుడు వారి లోటులు ఏమైతే ఉన్నవో వాటిని భర్తీ చేస్తాడు.MHTel 116.4

    తన తోటి పనివారిగా ప్రభువు తరుచు పరిమిత పాఠశాల విద్యకు మాత్రమే అవకాశమున్న మనుషుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ మనుషులు తమకు ఉన్న శక్తుల్ని జాగ్రత్తగా ఉపయోగించారు. మరి నమ్మకమైన సేవను, వారి పరిశ్రమను జ్ఞాన సంపాదనకు వారి తృష్ణను ప్రభువు గుర్తించి ప్రతిఫలమిచ్చాడు. ఆయన వారి కన్నీళ్ళు చూసాడు. ప్రార్ధనలు విన్నాడు. బబులోను రాజాస్థానంలోని బానిసలకు ఆయన దీవెనలు ఇచ్చిన రీతిగానే ఈనాడు తన పనివారికి వివేకాన్ని,MHTel 117.1

    జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. పాఠశాలలో నేర్చుకొన్న ఆ కొంచమె విద్య, సాంఘికంగా దీనస్థితి గల మనుషులు క్రీస్తుకృప ద్వారా కొన్నిసార్లు ఆయనకు ఆత్మలను సంపాదించటంలో అద్భుతమైన విజయాలు సాధించారు. వారి విజయ రహస్యం దేవునిలో వారికున్న నమ్మకం. ఆలోచనలో ఆశ్చర్యకరుడు శక్తిలో సమున్నతడు అయిన ఆయన నుంచి వారు దిన దినం నేర్చుకున్నారు.MHTel 117.2

    అలాటి పనివారిని ప్రోత్సహించాలి. ఇతరులు విడిచి పెట్టిన ఖాళీలను పూర్తి చెయ్యటానికి ప్రభువు వారిని ఎక్కువ సామార్థ్యాలున్న వారితో సంబంధం కలిగిస్తాడు. ఏమి చెయ్యాలో చూడటంలో వారి చురుకుతనం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటానికి వారి సంసిద్ధత, ప్రయోజకత్వానికి మూసి ఉండే తలుపులు వారి దయగల మాటల మూలంగా తెరుచకుంటాయి. వారు కష్టాల్లో ఉన్న వారికి చేరువగా వస్తారు. ఒప్పింపజేసే వారి మాటల ప్రభావం అనేక ఆత్మలను దేవునివద్దకు ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. వారి పని వేలాది ఇతరులు చెయ్యాలనుకుంటే చెయ్యగల పనిని చూపిస్తుంది.MHTel 117.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents