Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

స్వస్థత పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మిషనెరీ కుటుంబాలు

    వ్యర్ధంగా ఉన్న స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పర్చుకోవటానిక మెషనెరీ కుటుంబాలు అసవరం. వ్యవసాయదారులు, పెట్టుబడిదారులు, ఇళ్లు నిర్మించేవారు, వివిధ కళలు, హస్త కళల్లో నిపుణత గలవారు, నేలను సారవంతం చెయ్యటానికి, పరిశ్రమలు స్థాపించటానికి, తమ కోసం సామన్య గృహాలు నిర్మించుకోవాటానికి, తమ పొరుగున ఉన్నవారికి సహాయం చెయ్యటానికి నిర్లక్ష్యానికి గురి అయిన ప్రాంతాలకు వలస వెళ్ళాలి.MHTel 158.1

    ఆకర్షణ లేనివాటి నడుమ అందమైన వాటిని పెట్టడం ద్వార ప్రకృతిలోని కఠినమైన స్థలాల్ని అటవిక స్థలాల్ని దేవుడు ఆకర్షణీయం చేసాడు. ఈ పని చెయ్యటానికే మనకు పిలుపు వస్తుంది. చూపుకు ఇంపుగా లేని ఆరణ్య ప్రదేశాల్ని సయితం దేవుని ఉధ్యాన వనంలా తయారవ్వవచ్చు.MHTel 158.2

    “ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధ కారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడివారు కన్నులార చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు అనందించెదరు”. యెషయా 29:18, 19MHTel 158.3

    ప్రయోగాత్మక విషయాల్లో ఉపదేశం ఇవ్వటానికి మనం పేదవారికి తరుచు మెరుగుగా సహాయం చెయ్యగలుగుతాం. సాధారణంగా పని చెయ్యటానికి శిక్షణ పొందనివారికి కష్టపడి పనిచేసే అలవాటు, పట్టుదల, పొదుపు, ఆత్మోపేక్ష ఉండవు. ఉన్న వాటిని ఎలా పొదుపుగా ఉ పయోగించుకోవాలో వారికి తెలియదు. తమకున్న వాటిని జాగ్రత్తగాను పొదుపుగాను ఉపయోగించుకొని ఉంటే., జాగ్రత్త లేనందు వల్ల సరియైన ఆలోచన చెయ్యనందు వల్ల తరుచు జరిగే వ్యర్ధం తమ కుటుంబాలను చక్కగా, సుఖంగా పోషించుకోవటానికి సరిపోతుంది. “బీదలు సేద్యపర్చు క్రొత్త భూమి విస్తారంగా పండును. అన్యాయం వలన నశించువారు కలరు”. సామెతలు 13:23.MHTel 158.4

    బీదలకు ఉచితంగా ఇచ్చి ఇతరులపై ఆధారపడటం నేర్పించటం ద్వారా వారికి హానీ చేస్తాం. అలా ఇవ్వటం స్వార్ధాన్ని అసహాయతను ప్రోత్సహిస్తుంది. తరుచు అది సోమరితనన్ని దుబరాను, అమితానుభవాన్ని ప్రోత్సహిస్తుంది. పనిచేసుకొని బతకగల ఏ వ్యక్తికీ ఇతరులపై ఆధారపడే హక్కులేదు. “నన్ను పోషించే బాధ్యత లోకానిదే” అన్న సామెతలో అబద్దం, మోసం, దొంగతనాల సారంశం ఉంది. పనిచేసుకొని తనంతట తాను నివసించగల ఏ వ్యక్తినీ పోషించే బాధ్యత లోకానికి లేదు.MHTel 159.1

    యదార్ధమైన దానశీలత మనుషులు తమకు తాము సహాయం చేసుకోవటానిక సహాయం చేస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆహారం పెట్టమని అడిగితే అతణ్ణి ఆకలితో పంపివెయ్యకూడదు. అతడి పేదరికం దురదృష్ట ఫలితం కావచ్చు. కాని నిజమైన ఉపకారం కేవలం దానం చెయ్యటమే కాదు. అందులో ఇంకా ఉంది. దాని అర్ధం ఇతరుల సంక్షేమంలో వాస్తవిక ఆసక్తి చూపించటం, పేదలు, దు:ఖిస్తున్న వారి అవసరాల్ని అవగాహన చేసుకోవాటానికి ప్రయత్నించి, వారికి ఎక్కువ మేలు చేసే సహాయాన్ని ఇవ్వాలి. ఆలోచన, సమయం, వ్యక్తిగత ప్రయత్నం కేవలం డబ్బువ్వటం కన్నా ఎక్కువ ఖరీదైనవి. అదే అసలు సిసలు దానశీలత.MHTel 159.2

    తాము పొందే దానిని సంపాదించటం నేర్పబడ్డ వారు దాన్ని సరియైన రీతిగా ఉపయోగించుకోవటం సులువుగా నేర్చుకుంటారు. స్వయం సహాయకతను నేర్చుకోవటంలో వారు తమను ఏది స్వయం సహాయకు లుగా చేస్తుందో దాన్నే గాక ఇతరులకు సహాయం చెయ్యటానికి సమర్ధతను కూడా సంపాదిస్తారు. తమ అవకాశాల్ని వ్యర్ధం చేస్తున్న వారికి జీవిత విధుల ప్రాముఖ్యాన్ని గురించి నేర్పండి. బైబిలు మతం మనుషుల్ని సోమరుల్ని చెయ్యదని వారికి చూపించండి. కష్టపడి పని చెయ్యటానికి క్రీస్తు ప్రోత్సహించాడు. “ఇక్కడ దినమంత మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు? ఆని సోమరులను ప్రశ్నించాడు. “వ గలున్నంత వరకు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పనిచేయలేడు”. మత్తయి 20:6; యోహాను 9:4MHTel 159.3

    సువార్తకు విధేయులైన వారందరికి తమ గృహజీవితంలో తమ అచారాలు, అలవాట్లు క్రమంలో సువార్త తమకు ఏమి చేసిందో ప్రపంచానికి నిదర్శన్నివ్వడం ఓ ఆధిక్యత. మనం ఏమి అవ్వగలమో అన్న దానికి ఓ దృష్టాంత్వాన్నివ్వటానికి క్రీస్తు మన లోకానికి వచ్చాడు. తన అనుచరులు మానవ జీవిత సంబంధాలన్నంటిలో నిర్దుష్టతకు ఆదర్శాలు కావాలని ఆయన ఆశిస్తున్నాడు. బయటి విషయాల పై దైవ స్పర్శ కనిపిచాలని ఆయన అభిలషిస్తున్నాడు.MHTel 160.1

    సోమరితనం, అపరిశభ్రత, ముతకతనం, క్రమరాహిత్యం స్థానంలో, పరిశ్రమను, పరిశభ్రతను, అభిరుచుని, సంస్కారాన్ని మన సొంత గృహాలు మన పరిసరాలు అభివృద్ధి మార్గాల్ని బోధించే దృష్టాంత పాఠాలు కావాలి. వారిపట్ల మనం ఆసక్తి ప్రదర్శించే కొద్ది వారు తమ శక్తులను ఉత్తమరీతిలో ఎలా ఉపయోగించాలో వారికి నేర్పటానికి మనకు అవకాశం కలుగుతుంది.MHTel 160.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents